Search This Blog

Sunday, 29 March, 2015

అవ్యక్తం

                     

                   రాజమండ్రికి గంట ఆలస్యంగా వచ్చిన గోదావరి ఎక్సు ప్రెస్ ని యాభై నిముషాల ఆలస్యంగా స్టేషన్ కి చేరిన నేను క్యాచ్ చెయ్యగలిగాను ... అంత లేట్ అయ్యాక కూడా ఏ ఆశతో స్టేషన్ కి వచ్చాననేగా మీ డౌట్ ... ఒక్కోసారంతే అలా కలిసోచ్చేస్తాయి ... వెయ్యి రూపాయలు బొక్క పడకుండా ట్రైన్ దొరికినందుకు కొంచెం ఆనందంగానూ .. ప్రొద్దున్నే ఆఫీస్ అని తలచుకోగానే  కొంచెం నీరసంగానూ అనిపించింది .... నా సీట్ చూసుకొని సెటిల్ అయిపోయి కిటికీ లో నుండి వెనక్కి వెళ్తున్న చెట్లని చూస్తూ ముందుకెళ్తున్న  జీవితం గురుంచి ఏదో ఆలోచిస్తూ ఉన్నాను ....


                       నా ముందు సీట్లో కూర్చున్న అమ్మాయి చేతన్ భగత్ రాసిన "half girlfriend" చదువుతుంది. గర్ల్ ఫ్రెండ్ అనే పదం చూడగానే నా మనసు ఆకాంక్ష గురుంచి ఆలోచించసాగింది.... అసలు తనని నేనెలా మరచిపోగలను ... నా మనసుకు సాధ్యమేనా అది... ఇన్నేళ్ళు గడచినా తన ఊహ నా మనసులో ప్రతి రోజూ మెదుల్తూనే ఉంది ....
"హలో ..." అన్న ఆ అమ్మాయి మాటతో ఊహల్లోంచి రైల్లోకి వచ్చాను  ....
ఏమిటన్నట్లు ఆమె వైపు చూసాను .. అప్పుడర్థమైంది నేను ఆకాంక్ష గురుంచే ఆలోచిస్తూ ఆ పుస్తకం వైపే చూస్తున్నానని ... అది ఆమె తప్పుగా అర్థం చేసుకుంటుందేమో అని వెంటనే  "సారీ .." అన్నాను ..
"అయ్యో సారి ఎందుకండీ ... మీరు బుక్ వైపు చూస్తున్నారు గానీ నా వైపు కాదుగా .. అంటే నాకన్నా బుక్కే బాగుందనమాట " అంది మెల్లిగా నవ్వుతూ ..
ఈ అమ్మాయిలు  ఎక్కడికెళ్ళినా ఈ అందం కంపేరిజన్ మాత్రం వదలరు ... మరీ బుక్కుతో కూడానా ...  "అది ఎదో ఆలోచిస్తూ ...." అన్నాను నేను కూడా మెల్లిగా నవ్వేస్తూ ...
"మీరు సాఫ్ట్ వేర్ ఇంజినీరా ..." అంది ఆ పిల్ల వెంటనే ..
"అవును... ఎందుకలా అడిగారు .." అన్నాను అర్థంకాక ..
"మీ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు అంతా ఆబ్సెంట్  మైండెడ్  ప్రొఫెసెర్స్  లా ఏదో ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారులెండి ... ఎమాలోచిస్తారు అంతగా ... ఆఫీస్ లో రాయబోయే కోడ్ గురించా లేక క్యాబ్ లో ఎక్కే అమ్మాయి గురించా లేక అప్రైసల్ రేటింగ్ గురించా ..." అందాపిల్ల కళ్ళు గుడ్రంగా తిప్పుతూ ... అబ్బో ఈ పిల్ల పెద్ద జిడ్డులా ఉందే  అనుకుంటూ  .."అబ్బే అదేం  లేదండీ ..."అన్నాను ఆ టాపిక్ కట్ చేస్తూ "మీరు ఏం  చేస్తుంటారు " అడిగాను ఆమెని ... ఇక స్టార్ట్ చేసింది నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్  లా ....
"నా పేరు పల్లవి... MBBS అయిపొయింది ... ఇప్పుడు హౌస్ సర్జన్ గా చేస్తున్నాను ... హైదరాబాద్ లో నారాయణగూడలో  వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో ఉంటున్నాను .. మా నేటివ్ కర్నూల్ ... మా నాన్న గారు రేటైర్డ్ ప్రభుత్వోద్యోగి .. అమ్మ హొమ్ మేకర్ ... చెల్లి బీ టెక్ ... అన్నయ్య మీలాగే ఐ.టీ  ఎంప్లాయ్ .. వాడు కూడా మీలాగే ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూనే ఉంటాడు ... ఇక పోతే మా ఇంటి పక్కన ఆంటీ ..." అంటూ ఆ పిల్ల హౌరా ఎక్ష్ప్రెస్స్ లా దూసుకుపోతుంటే ఇక లాభం లేదు చైన్  లగాల్సిందే అనుకోని వెంటనే నేను అందుకుంటూ .."ఆ ... ఆ ... మీరు ఇలా టూ మచ్ ఇన్ఫర్మేషన్  ఇచ్చేసారనుకోండి వేరే అబ్బాయి అయితే రేపటి నుండి మీ హాస్టల్ ముందే నిల్చొని రోజూ మీకు బీట్ వేస్తాడు జాగ్రత్త .." అన్నాను మెల్లిగా నవ్వుతూ ...
"అబ్బో ... మరి మీరు మాత్రం బీట్ వెయ్యరని ఏంటి గ్యారంటీ ..." అంది కళ్లెగరేస్తూ ..
"నాకు ఆ చాన్స్ లేదులెండి ... నాకు పెళ్ళైపోయింది ..."
"గ్రేట్ ... మీ ఆవిడ ఏం  చేస్తుంటారు ..."
"తను బ్యాంక్ ఎంప్లాయ్ ... ప్రస్తుతం పిల్లల్ని కనే ప్రోగ్రాం మీద వాళ్ళ అమ్మ వాళ్ళింట్లో ఉంది ..."
"వావ్  ఆల్ ది బెస్ట్ ....  మీరు బుక్స్ చదువుతారా ..."
"లెదు... రాస్తాను ..."
"వావ్ అవునా.. " అంది కళ్ళింత చేస్తూ ... ఈ అమ్మాయికి ప్రతిదీ విచిత్రమేనేమో  అనుకోని "అవును .." అన్నాను
"ఎలాంటి బుక్స్ రాస్తారు ..."
"లవ్ స్టోరీస్ .." అన్నాను మరొక 'వావ్' ఎక్ష్పెక్ట్  చేస్తూ .. ఆ పిల్ల నన్ను నిరాశ పరచలేదు ... "వావ్ ఐ లవ్ లవ్-స్టోరీస్ అంది ..."
"హం ... ఐ కెన్  సి దట్ .." అన్నాను ఆమె చేతుల్లో ఉన్న చేతన్ భగత్ నవల  వైపు చూస్తూ  ...
"నేను మీకొక మంచి లవ్ స్టోరీ చెప్పనా ... నేను MBBS ఫస్ట్ ఇయర్ లో ఉండగా నా రూమ్మేట్ ది .." అంది 
నేను ఆగమన్నా ఆగేలా లేవుగా కానివ్వు అనుకుంటూ "చెప్పండి .." అన్నాను 
"నేను MBBS ఫస్ట్ ఇయర్ లో ఉండగా హాస్టల్ లో నా రూమ్మేట్ తను... తను కూడా మీ ఇ.టీ  జాబే ...  అసలు ఎంత చక్కగా ఉంటుందంటే, నేనే అబ్బాయినైతే అస్సలు వదిలే వాడ్ని కాదు ... తను రిచ్ అయినా చాలా సింపుల్ గా ఉండేది .... చాలా వెల్  మానెర్డ్ ...  అసలు అలాంటి అమ్మాయి అంత పీకల లోతు ప్రేమలో పడిపోతుంది అని నేను అస్సలు ఊహించలేదు.. విశేషం ఏంటో తెల్సా అంత అందమైన అమ్మాయిది కూడా వన్ సైడ్ లవ్ .."
అప్పటిదాకా ఏదో పరధ్యానంగా వింటున్న నేను తలెత్తి ఆమె వైపు చూసి "వన్ సైడా ??.."అన్నాను 
"అవును ..."
"అమ్మాయిలకు కూడా వన్ సైడ్ లవ్ స్టోరీస్ ఉంటాయా ... " అన్నాను ఆశ్చయపోతూ ... ఇంకోవైపు నా వన్ సైడ్ లవ్ తలచుకుంటూ ....  
"అంటే ఈ అమ్మాయి తను ప్రేమించిన విషయం  ఆ అబ్బాయికి చెప్పలేదు ... జస్ట్ ఆ అబ్బాయిని  రోజూ చూస్తూ ఆనందించేది ... ఆ విషయాలన్నీ రాత్రి మాకు చెప్పి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదో ... ప్రేమించిన విషయం ఆ అబ్బాయికి చెప్పెయ్యొచ్చు కదా అంటే .. దానికి ఇంకా టైం ఉంది .. అతనే తనని తానుగా నాకు ప్రపోస్ చెయ్యలి.. అప్పటిదాకా ఆగుతాను అనేది ...  "
చిన్న షాక్ కొట్టినట్లు అయ్యింది నాకు ... ఏంటి ఈ స్టోరీ అచ్చం నా లవ్ స్టోరీ కి రివర్స్ లా ఉంది ... అంటే ఆ అమ్మాయి ప్లేస్ లో నేను ఉంటే , అది నా లవ్ స్టోరీ అవుతుంది ... 
"ఆ తరువాత ..." అన్నాను నేను కొంచెం ఇంటరెస్టింగ్ గా ... 
"ఏముంది అలా చాలా కాలం గడిచింది ... ఒక రోజు ఆ అబ్బాయి తనని చూసి నవ్వాడు అని వచ్చి మా అందరికీ పెద్ద పార్టీ కూడా ఇచ్చింది ... జస్ట్ చూసి నవ్వితేనే ఇంత సంబర పడిపోతుందే, ఇక ఆ అబ్బాయి ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని చెప్తే ... అసలు భూమ్మీద నిలుస్తుందా ... ఆ అబ్బాయిని తన ప్రేమతో ఉక్కిరిబిక్కిరి చేసెయ్యదూ అనిపించింది ... అంత ప్రేమని పొందడం కూడా అదృష్టమే కదా ... "
"మరి ఏమైంది?" అడిగాను ఆత్రంగా 
"ఒక రోజు చాలా సంతోషంగా వచ్చింది ... నా లవ్ సక్సెస్స్ అనుకుంటూ ... మేమంతా ఏమైంది అని అడిగాము ... తనేమో జస్ట్ రేపటి దాకా ఆగండి .. రేపు సాయంత్రం మొత్తం చెప్తాను అని చెప్పింది ... మీకు పెద్ద ట్రీట్ కూడా ఇస్తాను అంది .. "
"మరి ఏమైంది?"
"హ్మ్మ్ ... తనని అదే చివరి సారి చూడటం ... ఆ తర్వాత రోజు హాస్టల్ కి వచ్చేసరికి తను లేదు..., వెకేట్ చేసి వెళ్ళిపోయింది ... వార్డెన్ ని అడిగితే, ఏదో ఫ్యామిలీ ఎమర్జన్సీ అని చెప్పి లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయిందట ..."
"అవునా ... మరి తన గురుంచి తర్వాత ఏమైనా తెల్సిందా ..."
"హా ... చాలా నెలల తర్వాత వాళ్ళ ఊరికి  వెళ్ళాము ఏమైందో తెల్సుకుందామని ... బట్ తనకి పెళ్ళైపోయి అమెరికా లో ఉంటుందని చెప్పారు ..."
"ఓహ్ ... హుమ్మ్ ... " అని ఒక పెద్ద నిట్టూర్పు వదిలాను 
"మీకు కూడా లవ్ స్టోరీ ఉండే ఉండాలి ... ప్లీజ్ నాకు చెప్పారూ ..." అంది 
"చెప్పడానికి ఏమీ లేదు ... నాది కూడా వన్ సైడ్ లవ్ ... ఆ అమ్మాయిని చూసేవాడ్ని కాని చెప్పే ధైర్యం లేదు ... అలా చివరికి ఆ అమ్మాయిని పోగొట్టుకున్నాను ... కానీ ప్రేమ మాత్రం అలాగే ఉంది ..."
"ఓహో ... లవ్ లో ఫెయిల్ అయిన వాళ్ళందరూ కవులు అవుతారని ఎవరో  చెప్పా రు... నిజమే అనమాట.." అంది నవ్వేస్తూ .. నేను కూడా ఆమె నవ్వుతో చిన్న నవ్వు కలిపాను .... 

    ***************

ఉదయం ఆరు దాటింది లేచేసరికి .. ట్రైన్ అప్పటికే సికింద్రాబాద్ స్టేషన్ లో ఆగి ఉంది ... కళ్ళు నులుముకొని బద్దకంగా వళ్ళు  విరుచుకుంటూ బెర్త్ దిగి నా బ్యాగ్ తీసుకున్నాను ... కింద బెర్త్ లో రాత్రి మాట్లాడిన అమ్మాయి లేదు ... బహుశా దిగి వెళ్లిపోయిందేమో ... నేను నా బాగ్ తీసుకొని వెళ్ళిపోబోతుండగా గమనించాను ఆ డైరీని ... నా బెర్త్ లో నే ఉంది ఆ డైరీ ... ఆ డైరీ క్రింద ఒక పేపర్ ఉంది .. ఆ పేపర్ తీసి చదివాను "సారీ అండి... మీకు బాయ్ చెప్పకుండానే దిగిపోతున్నా .. అందుకే ఆ స్లిప్ ... ఈ డైరీ నేను రాత్రి మీకు లవ్ స్టోరీ చెప్పిన అమ్మాయిది ... తన లవ్ ఫీలింగ్స్ అన్ని ఇందులో రాసుకుంది ... తానిప్పుడు ఎక్కడుందో తెలెదు.. సో ఈ డైరీ మీ నవలకి ఏమైనా పనికి వస్తుందేమో చూడండి ... ఎంతైనా రియల్ ఎమోషన్స్ కదా ... నాకు ఈ డైరీలో తను రాసుకున్న ఫీలింగ్స్ చాలా బాగా నచ్చాయి అందుకే క్యారీ చేస్తాను ఎప్పుడూ (సారీ డైరీ చదవడం తప్పే ... మీకు తప్పనిపిస్తే చదవకండి ... ఈ క్రింద రాసిన నా అడ్రెస్స్ కి ఈ డైరీ ని మెయిల్ చేసెయ్యండి ... ) ఉంటాను ...బాయ్ ...."

నేను ఆ డైరీ నా బ్యాగ్ లో వేసుకొని ఇంటికి చేరుకున్నాను .... 
ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళాలనిపించకపోయినా తప్పక ఆఫీస్ కి వెళ్లి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి రాత్రి ఎనిమిది అయ్యింది.. 
ఐస్ క్యూబ్స్ వేసిన గ్లాస్ లో కొంచెం విస్కీ వంపుకొని సిప్ చేస్తూ వీల్ చైర్ లో అలా రిలాక్స్ అవుతూ ఏదో ఆలోచిస్తున్న నాకు సడన్ గా నిన్న రాత్రి ట్రైన్ లో ఆ అమ్మాయి ఇచ్చిన డైరీ గుర్తుకొచ్చింది ... 

వెంటనే బ్యాగ్ ఓపెన్ చేసి ... డైరీ తీసి మొదటి పేజీ ఓపెన్ చేసిన నేను ఒక్కసారిగా స్థాణువు అయిపోయాను ... గుండె వేగం హెచ్చించింది ఆ పదాలు చదవగానె... "నా ఆశా నవ్వే ... ఆకాంక్షా నువ్వె... ఈ ఆకాంక్ష నీదె... 
నా మదిలో మెదిలే ఎన్నో అనుభూతుల రూపం నువ్వే ... 
నా ఊహల ఊసుల ఉనికి నువ్వే ... నా ఆశల పల్లకి మోసే సైన్యం నువ్వే ...  

ఇంకెన్ని రోజులు నీకోసం ఈ విరహం ... నా మనసు పరదా తొలగించాను .... నీ మసుతో నన్ను చూసి నీ ప్రేమని కానుక ఇస్తావా ... "

"ఆ.... కాం ... క్ష ...."నా పెదాలు అదురుతున్నాయి  ... నా చెయ్యి ఆ డైరీ లోపలి పేజిలో ఉన్న ఆకాంక్ష ఫోటో మీద కదులుతుంది ... 


                                                          ---- Rest of the story is the second and final part.
                                                                            Yours - Ramakrishna Reddy Kotla

3 comments:

Padmarpita said...

waiting for next part.

bhanu said...

బాగుంది.. చాలా రోజుల తరువాత పొస్ట్ వ్రాసారు!!!
మిగతా కథలు కూడా పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను

bhanu said...
This comment has been removed by a blog administrator.