Search This Blog

Monday 4 January, 2010

తెలుసుకొనవె యువతీ...అలా నడుచుకొనవె యువతీ..!!


తెలుసుకొనవె యువతీ...అలా నడుచుకొనవె యువతీ..!!
సాధింపులు బెదిరింపులు ముదితలకిక కూడవని...
హృదయమిచ్చి పుచ్చుకొనే...చదువేదో నేర్పాలని..
తెలుసుకొనవె యువతీ..అలా నడుచుకొనవె యువతీ..!!

మూతిబిగింపులు అలకలు పాతబడిన విద్యలని...
మగువలెపుడు మగవారిని చిరునవ్వుల గెలవాలని..
తెలుసుకొనవె యువతీ..అలా నడుచుకొనవె యువతీ..!!

******************************************************

"ఏంటి బాసు...మార్నింగ్ నుంచి చూస్తున్నా చాలా డల్ గా ఉన్నావ్...కొత్త సంసారివి అంతగా ఏం మునిగిపోయిందోయ్ ??" అడిగాను అప్పికట్ల అనంతరావుని ఆఫీసు లంచ్ టైములో...
"ఏమిలేదులే...." పరధ్యానంగానే చెప్పాడు అప్పికట్ల..
"ఎహే చెప్పు...నేనేదైనా సలహా ఇవ్వగలనేమో కదా..." అడిగాను తెలుసుకోవాలనే ఉత్సాహంతో...
"ఏముంది కృష్ణ...నిన్న మా ఆవిడ పుట్టిన రోజు...ఆ విషయం నాకు గుర్తులేదు...నేను తనకు విష్ చెయ్యలేదని, తన మీద నాకు ప్రేమలేదని,  అప్పుడే తను
నాకు పాతపడిపోయింది అని, ఆఫీసులో ఇంకెవరో అమ్మాయి పరిచయం అయ్యి ఉంటుంది అంటూ ...ఏవేవో అంటుందయ్యా..ఎం చెప్పమంటావ్ నా మనసేమీ బాగోలేదు..." చెప్పాడు అప్పికట్ల అపరిమితమైన బాధతో..
"అయ్యో..అలా సొంత భార్య పుట్టిన రోజు మర్చిపోతే ఎలాగండీ బాబూ...పాపం మీరు విష్ చేస్తారని ఎన్ని ఆశలు పెట్టుకుందో.." అన్నాను సొంత భార్య అనే పద ప్రయోగం ఎంత వరకు సముచితం అని ఆలోచిస్తూ...
"నాకు అంతకముందు రోజు కూడా గుర్తుంది...ఏం గిఫ్ట్ కొనాలా అని కూడా ఆలోచించాను..కాని సరిగ్గా ఆ రోజు ఆఫీసులో డెలివరీ టైం(సాఫ్ట్ వేర్ డెలివరీ), బాస్ గాడు పైనుంచి ఒత్తిడి..ఆఫీసులోనే చాలా లేట్ అయ్యింది..ఇంటికివేళ్లే సరికే అర్థరాత్రి దాటింది..ఫుల్ హెడ్ ఏక్..రాగానే మంచం మీద వాలిపోయాను...అసలా విషయమే మర్చిపోయాను.." వృత్తాంతం చెప్పాడు అనంతరావు..
"ఓహ్ అవునా...సరేలే ఆమె ఏదో కోపంలో అనుంటుంది..ఆడువారికి ఈ అలకలు మామూలేకదా..." అన్నాను అనంతరావు మూడ్ మార్చుదామని...ఇంతలోపల....

"........సారీ డియర్......నో...నో.....అలా అని కాదు బంగారం....అయ్యో కాదు రా...హలో...హలో...హలో..." అలా సడన్ గా కట్ అయిన ఫోన్ వైపు దీనంగా చూసి..మరు నిముషం అగ్గిపిడుగులో రామారావులా దాని వైపు ఎర్రగా చూసి నేలకేసి కొట్టబోయేటైంకి " ఓయ్ కిరణ్ ఆగు..." అంటూనేనూ అనంత్ ఇద్దరం ఒకేసారి అరిచాం....
"తెలంగాణా రాలేదన్న కోపాన్ని ఆర్టీసి బస్సుల మీద చూపించినట్లు, నీ కోపాన్ని సెల్ మీద చూపిస్తే ఎలా బాబూ కిరణ్..." అడిగాను నేను అతని చేతులో ఉన్న సెల్ ని మెల్లిగా తీసుకుంటూ..
"ఏమైంది కిరణ్?.." అడిగాడు అనంత్...
"ఛా జీవితం మీద విరక్తి వేస్తుంది అనంత్....ఆ హిమాలయాలకు వెళ్లి సన్యాసం తీసుకోడం బెటర్ ఏమో?? " అన్నాడు వేదాంతిలా...
"ఏంటి లవ్ ప్రాబ్లెమా??" అడిగాను నేను ఆసక్తిగా...ఇలాంటి విషయాలలో అవతలి వాడి బాధకంటే, మనకి ఉండే అత్యుత్సాహం ఎక్కువ...
"కాదు...లవరే ప్రాబ్లం..."
"అసలు మేటర్ ఏంటి..." అడిగాను
"ఇది ఒకరోజు మేటర్ కాదులే...దాదాపు రెండు మూడు రోజులకి ఓ సారి ఉండేదే...కలుద్దాం అని చెప్పి ఆ రోజు ఏదైనా పనివల్ల కుదరక కలవకపోతే ఒక వారం మాట్లాడదు...ప్రతి గంటకీ ఓ సారి కాల్ చేసి కనీసం హలో అయినా చెప్పాలి, లేదా ఎస్సెమ్మెస్ అయినా ఇవ్వాలి అలా చెయ్యకపోతే ఒక రెండు రోజులు మాట్లాడదు ప్లస్ తిట్లు....పోనీ వర్క్ లో మర్చిపోయి కాల్ చెయ్యలేదు నువ్వే ఒక మిస్ కాల్ ఇచ్చి గుర్తుచెయ్యొచ్చుగా అంటే అలా కాదు నాకు నేనుగా గుర్తుపెట్టుకొని చెయ్యాలంటుంది...తనని కలిసిన రోజు తను మొదట చేసే పనేంటో తెలుసా, నా మొబైల్ లాక్కొని అందులో మెసేజెస్ చూస్తుంది..కాంటాక్ట్స్ లో ఎంత మంది అమ్మాయిలు ఉన్నారో చూస్తుంది...అసలు ఒక్క అమ్మాయి మెసేజ్ కూడా లేకపోతే, ఏంటి వచ్చేప్పుడు డిలీట్ చేసి వచ్చావా అంటుంది....కొద్దిసేపు అయ్యాక తనే మళ్ళీ అలా అన్నందుకు సారీ చెప్తుంది...ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే నాకు కోపం వచ్చినప్పుడు కూడా చివరికి నేనే సారీ చెప్పి తనని బ్రతిమిలాడలి..నాకు కూడా అలగాలని ఉంటుంది..ఒక వారం మాట్లాడకుండా ఉండాలని ఉంటుంది...కాని అలా చెయ్యలేని పరిస్థితి..చేస్తే ఏమవుతుందో నాకు తెలుసు కాబట్టి...ఇక నైట్ ఆఫీసు నుంచి వచ్చిన దగ్గరనుంచి కనీసం ఒంటిగంట దాకా తనతోనే ఫోనులో మాట్లాడాలి,కనీసం రూంమేట్స్ తో కాసేపు సరదాగా స్పెండ్ చెయ్యడానికి లేదు..వాళ్ళేమో ఏంటి బాబు మీ ప్రియురాలుతో తప్ప మాతో మాట్లాడవా అంటూ సెటైర్ లు వేసి చంపుతారు....తానంటే నాకు చాలా చాలా ఇష్టం కానీ నా పర్సనల్ స్పేస్ నాకు ఉండాలిగా...." అంటూ ఆపేసిన కిరణ్ వైపు ఇద్దరం అలానే చూస్తున్నాం...
ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అని అప్పటిదాకా అనుకున్న నాకు వెన్ను నుంచి వణుకు మొదలైంది....అటువంటి ఆలోచనను తక్షణమే విరమించుకోవాలని తీర్మానించుకున్నాను....అనంత్ మాత్రం తన బాధలు కిరణ్ తో చెప్పుకోవచ్చు అని కొంచెం ఊరట పడ్డట్టున్నాడు...ఒక భార్య పీడితుడి వ్యధ మరొక ప్రియురాలి పీడితుడు అర్థంచేసుకుంటాడు అనే నమ్మకం కాబోలు.....

ముగ్గురం కాంటీన్ లో లంచ్ కి వచ్చాం...."ఛా ఈ అరవ తిండి తినలేక సచ్చిపోతున్నా..." అంటూ విరక్తిగా ముఖం పెట్టాను సంబార్ రైస్ వైపు చూసి...
"పెళ్లి చేసుకో మీ ఆవిడ నీకోసం రోజూ ఒక వెరైటీ రుచిగా వండిపెడుతుంది...." అన్నాడు అనంత్...
నాకు చిర్రెతుకోచ్చింది...ఇంత తెలిసియుండి ఈ గుణమేలరా?..అనే పాట కూడా గుర్తుకొచ్చింది..."ఆహా...ఇపుడు మీ ఆవిడ పెడుతున్న రుచికరమైన తిండి చూస్తున్నాం కదా...మాకెందుకులే ఆ భాగ్యం.." అన్నాను వెటకారంగా...దెబ్బకి ముఖం మాడ్చాడు అనంతరావు...వెంటనే జాలేసింది...పాపం అసలే బాధలో ఉన్నాడు అనోసరంగా అన్ననేమో అనిపించింది...మరి లేకపోతే ఒకవైపు అన్నీ తెలిసి నన్ను పెళ్లి చేసుకోమంటాడా??...
"ఏమయినా నువ్వు కొంతవరకు అదృష్టవంతుడివేనోయ్ కిరణ్..." అన్నాడు అనంతరావు సంబార్ రైస్ మహదానందంగా తింటూ...బహుశా వాళ్ళ ఆవిడ అంతకన్నా దారుణంగా చేస్తుందేమో వంట...
"ఏం అదృష్టం నా మొహం..." అన్నాడు కిరణ్ పదే పదే సెల్ వైపు చూస్తూ ఎప్పుడు తన ప్రియురాలు మిస్సేడ్ కాల్ కానీ మెసేజ్ కానీ ఇస్తుందా అనుకుంటూ...
"ఎందుకంటే నువ్వు ప్రేమించి కొంతవరకు మంచి పనే చేసావ్...నీకు పెళ్లికిముందే ఇవన్నీ అనుభవం అవుతున్నాయి కదా...సో రేపు పెళ్ళయాకా ఇలాంటివన్నీ లైట్ గా తీసుకొని పెద్దగా బాధపడవ్ నాలాగా...." అన్నాడు అనంత్..
నాకు వెంటనే 'దున్నపోతు మీద వాన కురిసిన చందాన' అన్న సామెత గుర్తొచ్చింది...
"ఏమో అనంత్...తను నన్ను అర్థం చేసుకోడం లేదో..లేక నేనే తనని అర్థం చేసుకోలేకపోతున్నానో నాకు అర్థంకావడం లేదు....కానీ ఒకటి మాత్రం నిజం తను లేకుండా ఉండలేను...తనతో మాట్లాడకపోతే నాకు పిచ్చి ఎక్కినట్లు ఉంటుంది.." అన్నాడు కిరణ్...
"ప్రేమలో అలాగే ఉంటుంది...రేపు పెళ్ళయాక అదనపు బాధ్యతలు ఉంటాయి, అపుడు తను అర్థం చేసుకొనేలా ఉండాలి కదా..." అన్నాను నేను
"నిజమే..చూద్దాం.. పెళ్ళయ్యాక బాధ్యతలు తెలుసుకున్నాక తన వైఖరి మార్చుకుంటుందేమో..." అన్నాడు కిరణ్...
"కావచ్చు...ఇప్పుడైతే ఒకరికి ఒకరు దూరంగా ఉంటున్నారు కనుక మాగ్జిమం టైం నీ అటెన్షను కోరుకుంటుంది...పెళ్ళయాక ఇద్దరు కలిసే ఉంటారు కాబట్టి అంత ప్రాబ్లం ఉండదేమో..." అన్నాను నేను కొంచెం రిసెర్చ్ చేసిన వాడిలా ఫీల్ అయిపోతూ..
"అప్పుడు వేరే గోల మొదలవుతుందిలే...." అన్నాడు అనంత్ కర్డు రైస్ లో సంబార్ కలుపుకుంటూ...ఈ అనంత్ కి ఈ అరవ బుద్ధులు ఎప్పుడోచ్చాయో...
"ఎంటవి ??" అడిగాడు కిరణ్ కొంచెం ఆందోళనగా..
"ఇవీ అని చెప్పలేనివి...చెప్పుకోలేనివి చాలా ఉంటాయి...ఇదిగో నాలా పుట్టిన రోజు మర్చిపోవడమో...లేక ఎక్కడికన్నా తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్ళకపోవడమో...ఆమె తరుపు బంధువులు ఇంటికి వస్తే సరిగ్గా పలకరించలేదనో..చాలా చాలా ఉంటాయి బాబూ..." అన్నాడు తన అనుభవాలు మాకు పాఠాలుగా ఉపయోగపడుతున్నాయి అనే లెవెల్ ఫీలింగ్ కొడుతూ...
"అమ్మాయిలను అర్థం చేసుకోవడం చాలా కష్టమేమో కదా...అందుకే అన్నారు 'A woman's heart is a deep ocean of secrets' అని..." అన్నాను టైటానిక్ డైలాగ్ వాడుకొని...
"కష్టమేమి కాదు కృష్ణ...కాకపోతే అమ్మాయిలకు ఎప్పుడూ వాళ్ళ గురుంచే మన ధ్యాస ఉండాలి అని కోరుకుంటారు...కానీ మనకి చాలావరకు అది కుదరదు...అలా అని వారి మీద ప్రేమ లేదనీ కాదు..మనం వేరే ఎన్నో రకాల విషయాల మీద దృష్టి పెట్టాల్సివస్తుంది...కానీ అమ్మాయిలు ఈ విష్యంలో గొడవ చేస్తారు...అంటే ఇలా మనకి ఎన్నో వేరే పనులు ఉంటాయి అని
వాళ్లకి తెలియక కాదు..తెలిసీ గొడవ పెట్టుకుంటారు...అలుగుతారు...అలా అయినా మన దృష్టిని ఆకర్షించాలనే ఒక తాపత్రయం అంతే...కానీ వాళ్ళు ఇలా చేసే గొడవ..అలగటం..మొదట్లో సరదాగా ఉన్నా...తర్వాత తలనొప్పిగా మారుతుంది...ఇలా గొడవ చేసి..అలిగి..మాట్లాడటం మానేసే బదులు...ఒక చిన్న చిరునవ్వి నవ్వి 'నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు మాత్రం తెలియదా' అని ఒక చూపు విసిరితే దాసోహం అవ్వని మొగవాడు ఉన్నాడా...ఆ విధంగా మొగవారిని గెలిచే ఆడువారు ఉంటె ఎంత అందంగా ఉంటాయి కాపురాలు...అలాంటి వాళ్ళూ ఉన్నారు, కానీ చాలా తక్కువ..." అంటూ తన థియరీ మొత్తం వివరించాడు అనంత్...అతను చెప్పింది నిజమే అనిపించింది...మరి ఇంత తెలిసీ ప్రొద్దున నుంచి ఏబ్రాసి మొహం వేసుకొని ఆఫీసులో ఎందుకు బాధపడుతూ కూర్చున్నాడో...అడగాలనిపించింది...కానీ అడగలేదు...కారణం అతనికి కూడా తెలిసి ఉండదు...After all he is a human being and couldn't control his emotions...

"అనంత్...మన స్టేట్ లో ఏ ప్రాంతపు అమ్మాయి అయితే బెటర్ అంటావ్ పెళ్లి చేసుకోడానికి....ఐ మీన్, ఇందాక నువ్ చెప్పిన తక్కువ మంది ఏ ప్రాంతంలో ఎక్కువ మంది ఉంటారని నీ అభిప్రాయం...నాకు తెలిసి గోదావరి ప్రాంతం అమ్మాయి అలా ఉంటుందేమో..." అన్నాను...
"గోదావరి...కృష్ణ...కావేరి...ఏ ప్రాంతం అయినా కావచ్చు...అలా ఎలా చెప్పగలం...అది ఆమె వైఖరి మీద ఆధార పడి ఉంటుంది.." అన్నాడు అనంత్...
"నిజమే..కానీ ఆ వైఖరి చుట్టూ ఉన్న ప్రజలు, ఎన్విరాన్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది...ఆ విధంగా వైఖరికి ప్రాంతానికి సంబంధం ఉందని అనిపిస్తుంది..." అన్నాను
"కొంతవరకు ఉండొచ్చు...కానీ పూర్తిగా చెప్పలేము..." అన్నాడు అనంత్...నేను కూడా నిజమే అన్నట్లు తలూపాను...ఇంతలో షాక్...కిరణ్ కళ్ళ వెంబడి నీళ్ళు...
"ఏయ్ కిరణ్...ఏంటిది...ఏమైంది..."అడిగాం ఇద్దరం ఒకేసారి...
సెల్ ఫోన్ లో ఎస్సెమ్మెస్ చూపించాడు ...."Dont Call me from tomorrow...You've really changed a lot and dont love me anymore...i know.." అని ఉంది...పాపం కిరణ్ 
ని చూడగానే జాలేసింది...

***************************************

"నాతో మాట్లాడకు...రేపటి నుంచి కాల్ చెయ్యకు...ఛీ అందరు అబ్బాయిలు ఒకటే..." ఏడుస్తున్నట్లుంది ఆమె స్వరం...
"నేనేమి చేశాను బంగారం....నాకు కుదరలేదు...ఆఫీసులో బోలెడు పని.." అన్నాను నేను..
"నాకేం చెప్పకు...మొదట్లో రోజూ వద్దన్నా కాల్ చేసి దుంపతెంచేవాడివి..ప్రపంచంలో ఉన్న సుత్తి మొత్తం చెప్పేవాడివి...ఎప్పుడైతే నీకు లైన్ క్లియర్ అయిందో అప్పటినుంచి నేను అలుసైపోయాను నీకు..ఇదేక్కడికి పోతుందిలే అన్న ధైర్యం..రిజర్వేషన్ చేసుకున్నట్లు ఫీల్ అయిపోకు..." అంది ఆవేశంగా...
"చా చా ఏంటి ఆ మాటలు..." అన్నాను
"నా పుట్టిన రోజే మర్చిపోయావ్...ఇంకేమనాలి నిన్ను...అదొక్కటేనా ఆ రోజు ఐనాక్స్ కి టికెట్లు బుక్ చేశాను వెళ్దాం అన్నావ్...అసలు కనిపించావా వారం దాకా!!...నాకు టెడ్డీ బేర్ లంటే ఇష్టమని చాలా సార్లు చెప్పాను నీకు...ఒక్కసారి అయినా surprise గా టెడ్డీ బేర్ గిఫ్ట్ ఇచ్చావా??..ఏ రోజైనా లంచ్ కి బైటకి తీసుకెళ్ళావా??..ఇలా చెప్తే పెద్ద లిస్టే ఉంది...ఐ లవ్ యు అని చెప్పడం కాదు...ఎంత లవ్ ఉందో చూపించడం కూడా తెలియాలి..." అంది అదే ఆవేశం మైంటైన్ చేస్తూ..
"అంటే ఇవన్నీ చేస్తేనే లవ్ ఉన్నట్లా...అసలు .." అంటూ ఇంకా చెప్పబోతుండగా "Dont Call me from tomorrow...You've really changed a lot and dont love me anymore...i know.." అంటూ ఫోన్ కట్ చేసింది...ఎక్కడో విన్నట్లు ఉంది ఆమె చెప్పింది...విన్నట్లు కాదు చూసినట్లు...అవును...అక్షరాలా ఆమె చెప్పిన మాటలు...ఆ రోజూ కిరణ్ కి వచ్చిన ఎస్సెమ్మెస్ ఒక్కటే...నా కళ్ళ వెంబడి నీళ్ళు...ఎందుకు లవ్ చేసాను, ఇలా బాధపడటానికా...దేవుడా ఇదంతా కల అయితే ఎంత బాగుండు...
  
***************************************

ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాను...నిజమే ఇదంతా కలే...నేను ఎవరినీ ప్రేమించలేదు...నిజం..ఎస్...గ్రేట్...ఒక్కసారిగా ఎగిరి గంతేయ్యాలనిపించింది....పక్క రూంలోని టీవీ లోంచి మిస్సమ్మలో పాట మంద్రంగా వినిపిస్తుంది...

తెలుసుకొనవె యువతీ...అలా నడుచుకొనవె యువతీ..!!
సాధింపులు బెదిరింపులు ముదితలకిక కూడవని...
హృదయమిచ్చి పుచ్చుకొనే...చదువేదో నేర్పాలని..
తెలుసుకొనవె యువతీ..అలా నడుచుకొనవె యువతీ..!!

మూతిబిగింపులు అలకలు పాతబడిన విద్యలని...
మగువలెపుడు మగవారిని చిరునవ్వుల గెలవాలని..
తెలుసుకొనవె యువతీ..అలా నడుచుకొనవె యువతీ..!!

[This post is completely a fictional work, it doesn't refer to any personal experiences - Kishen Reddy]

11 comments:

Nrahamthulla said...

మరి ఈ వార్తా చూడండి
http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=400353&Categoryid=1&subcatid=31

నాగప్రసాద్ said...

మీ టపా బాగుంది. బాగా రాశారు. గర్ల్‌ఫ్రెండ్స్ తోనూ, అర్ధాంగులతోనూ కష్టాలు పడని మగాడు బహుశా ఈ భూమి మీద ఉండడనుకుంటా. :)

>>"పెళ్లి చేసుకో మీ ఆవిడ నీకోసం రోజూ ఒక వెరైటీ రుచిగా వండిపెడుతుంది...."

పెళ్ళి కాని అబ్బాయిలు హోటల్ తిండి భరించలేకున్నాము అంటే కామన్‌గా వినిపించేది ఈ డైలాగే. ;) అఫ్‌కోర్స్, నేను కూడా మా ఫ్రెండ్స్ ఎవ్వరైనా తిండి బాగాలేదంటే అదే డైలాగు చెప్తాననుకోండి అది వేరే విషయం. :)

హిందూ వివాహ వ్యవస్థ ఉన్నంత కాలం, ఆ డైలాగు చిరకాలము వర్ధిల్లుతూనే ఉంటుంది. :) :)

mahipal said...

హాయ్ కృష్ణ , చాలా బాగా రాసారు,కాని నేను మీతో ఎకిభావించలేను.
ఎందుకంటే నేను పెల్లైనవాన్నే , కానీ నాకింత వరకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు.సో మీరు కూడా దేర్యం గా పెళ్లి చేసుకోవచ్చు... నా మాట వినండి..

మాలా కుమార్ said...

bagundi . baagaa raasaaru .

Anonymous said...

మీరు చెప్పే ప్రోబ్లమ్స్ క్రియేట్ చేసే పిచ్చి మారాణులు వాటికి అందంగా ప్రేమ అని ముద్దు పేరు కూడా తగిలించి మన చుట్టూ కుప్పలు తెప్పలుగా ఉంటారు.
దీనికి కారణం ఇంట్లో పనీ పాట లేక తిని తొంగోటం ఒక్కటే ఉంటే లైఫ్లో బోర్ కొట్టి ఇలా వేధించుకుతింటారు. అందరు అమ్మాయిలు అలా ఉండరు. నేను చెప్పేది పిచ్చి మారాణులు గురించి.

అనుభవంతో..
-ఓ ప్రేమ పిపాసి

priya.... said...

aha...chepakane chebutunnaru yuvatulu ela undalani kadu...but i liked it. kasta madyalo confusion ga unna bt last lo artamindi..nijanga papam anipistundi manchi yuvakula badhalu..vala vala wifes r loves valla...bt chudam ala chese valu me blog chadivina...vala attitudes marchukuntaremo...(only 4 those women who dont understand their hus r lover)...anyways nice blog ram...go on...

Ram Krish Reddy Kotla said...

@Nrahamthulla, I have seen that link, well that may be correct to an extent but everyone opposes that theory in india even men, though they wanna do it like that, hmm quite common..rite?

Nagaprasad garu, u said it right. Thanks for liking my post

Ram Krish Reddy Kotla said...

మహిపాల్ గారు, మీరు ఏకీభవించాల్సిన పని లేదు...నేను చెప్పింది అందరికీ వర్తించదు కనుక...ఈ మధ్య చూస్తున్న అమ్మాయిల వైఖరి చాలా వరకు ఈ విధంగా కనిపించడం వలన అలా సరదాగా రాసాను...మీరు చెప్పకపోయినా నేను తప్పకుండ పెళ్లి చేసుకుంటాను...అదనమాట...

Malakumar, Thaks a lot...

Ram Krish Reddy Kotla said...

@Anonymous, మీరే చెప్పే పిచ్చిమారణులు ఉండొచ్చు, కానీ నా పోస్ట్ అటువంటి అమ్మాయిని ఉద్దేశించింది కాదు...మాములుగా ఒక సగటు అమ్మాయి కొంత వరకు possessive గాను,కొంత వరకు jealous గాను ఉంటుంది...నేను కేవలం ఆ అంశాలనే ఎక్కువ స్త్రెస్స్ చేసాను అంతే...

Priya,nice to see ur comment.

మురళి said...

మీరు మా జిల్లా (గోదావరి) అమ్మాయితో ప్రేమలో పడి ఉంటారని అనిపిస్తోందండీ :):)
టపా బాగుంది..నాలుగైదు లైన్లు చదవగానే కొంత నిజం, కొంత ఫిక్షన్ అనిపించింది.. కొంచం తరచూ రాస్తూ ఉండండి..

Ram Krish Reddy Kotla said...

మురళీ గారు మీకు అలా ఎందుకు అనిపించిందో కాని, నేను ఇంకా ఎవరితో ప్రేమలో పడలేదండి....గోదావరీ అమ్మాయంటే ఎందుకో తెలీదు ఒక ప్రత్యేకమైన అభిమానం అనమాట...నా టపా మీకు నచ్చినందుకు ధన్యవాదాలు... :)