Search This Blog

Monday, 20 September, 2010

ద.కో.బ్లా.స సభ్యులు

ద.కో.బ్లా.స కి వచ్చిన అనూహ్యమయిన స్పందనకి చాలా ఆనందంగా ఉంది...ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు..ముఖ్యంగా ఒంగోలు శీనుగారి సహకారం, సపోర్ట్ అభినందనీయం. ఇకపోతే ఈ సంఘంలో సభ్యులు ఎవరెవరు అన్నది తేట తెల్లం చెయ్యడానికే ఈ టపా.

మునుపు రాసిన టపా ప్రకారం ఈ క్రింది లిస్టులో ఉన్నా బ్లాగర్లు  ద.కో.బ్లా.స కి చెందినట్లుగా భావిస్తున్నాం.

1. కోట్ల రామకృష్ణ రెడ్డి. (పల్నాడు - మాచెర్ల) 
2. ఒంగోలు శీను (ఒంగోలు)
3. అను (గుంటూరు జిల్లా)
4. తార (మీ పదవి గ్యారెంటీ లెండి ;-) ) (ప్రకాశం)
5. భాస్కరరామి రెడ్డి (ప్రకాశం)
6. మలక్ పేట రౌడీ (వీరు సభ్యత్వాన్ని అంగీకరించాల్సి ఉంది :-) ) (ప్రకాశం)
7. దుర్గేశ్వర (వినుకొండ...గుంటూరు జిల్లా)
8. సుజాత (నరసరావు పేట, గుంటూరు జిల్లా)
9. సిరిసిరి మువ్వ (ఏవండీ మీ చెప్పండీ..) (గుంటూరు జిల్లా)
10. సునీత (గుంటూరు)
జయదేవ్ చల్లా)
21. వేణూ శ్రీకాంత్ (వీరు సభ్యత్వాన్ని అంగీకరించాల్సి ఉంది ) (గుంటూరు జిల్లా )
22. తాడేపల్లి  (బాపట్ల..గుంటూరు జిల్లా)
23. వీకెండు పొలిటీషియన్ (బాపట్ల...గుంటూరు జిల్లా)
24. కౌటిల్య (ప్రకాశం)
25. కొండముది సాయికిరణ్ కుమార్ (గుంటూరు)

ఇది ఇప్పటిదాకా తేలిన లిస్టు (మునుపటి టపా ప్రకారం). ఈ లిస్టు ఇంకా చాలా పెద్దది అని నాకు తెలుసు. మన ద.కో.బ్లా.స బ్లాగర్లు ఇంకా చాలా మందే ఉండి ఉంటారు. పై లిస్టులోని బ్లాగర్లలో జిల్లాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి:
గుంటూరు జిల్లా : 18
ప్రకాశం జిల్లా     :  5
నెల్లూరు జిల్లా    :  2  

ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి ఇంకా చాలా మంది బ్లాగర్లకి ఈ సంఘం గురుంచి తెలియకపోయి ఉండొచ్చు, కనుక వారి పేర్లు మీకు తెలిసినట్లయితే ఇక్కడ పేర్కొనవచ్చు. ఈ టపా తో ఈ లిస్టు మాలీ డబల్ అవుతుందని ఆశాభావంతో ఉన్నాను. పై లిస్టులో పేర్కొన్న సభ్యులు ఇంకా తమకి తెలిసిన దక్షిణ కోస్తా బ్లాగర్ల వివరాలు అందిస్తారని ఆశిస్తున్నాను.

Note: The above list will be updated regularly as and when new members join the association.

Thursday, 16 September, 2010

దక్షిణ కోస్తా బ్లాగర్ల సంఘం (ద.కో.బ్లా.స)

ఈ మధ్య ఆఫీసులో నా కొలీగ్ ఒకడికి తెలుగు బ్లాగులని పరిచయం చేశాను... వాడు వాటికి బాగా అలవాటు అయ్యాడు..రోజూ తెగ చదువుతాడు, స్వతహాగా బద్ధకస్తుడు కాబట్టి కామెంట్ పెట్టడు...మొన్నో రోజు నా దెగ్గరికి వచ్చి...

"ఈ బ్లాగుల వల్ల నాకు బాగా టైం పాస్ అవుతుంది...పైగా పెద్దగా వర్క్ కూడా లేదిప్పుడు.." అన్నాడు
నేనొక స్మైల్ ఇచ్చాను అంతే...
"ఈ మధ్య చూసిన బ్లాగుల్లో చాల మంది ఈష్టు గోదావరి..వెష్టు గోదావరి వాళ్ళవే ఎక్కువ... వాళ్ళు చాలా బాగా రాస్తున్నారు..."
నేను సైలెంట్....
"మీ సైడ్ వాళ్ళు..అదే గుంటూరు..ప్రకాశం..నెల్లూరు సైడ్... పెద్దగా లేరేమో కదా బ్లాగుల్లో...ఎక్కువ కనిపించలేదు నాకు..." అన్నాడు..
"ఉన్నారు..మా వాళ్ళు కూడా ఉన్నారు..." కొద్దిగా రోషం నాలో...
"ఉన్నారేమోలే...చాలా తక్కువ వీళ్ళతో పోల్చుకుంటే...వీళ్ళు చాలా చక్కగా రాస్తున్నారు కూడా.."
"రాస్తున్నారు...మా వాళ్ళు కూడా చాలా చక్కగా రాస్తున్నారు..." తగ్గకూడదు నేను..
"ఏమో...ఓ పది బ్లాగులు చెప్పు మీ వాళ్ళవి..."
"ఆ...అదీ...ఇప్పుడంటే ఇప్పుడు ఎలా చెప్పగలం...సడన్ గా మాస్టర్ క్లాస్ లో పిల్లాడిని లేపి ఫిజిక్స్ బుక్కులో పదో పేజీలో పదో లైన్లో ఏముందో చెప్పమన్నట్లుంది నువ్వడిగేది.." అన్నాను నేను నన్ను సమర్ధించుకుంటూ..
"నేను చెప్పనా వాళ్ల బ్లాగులో ఓ పది.." అన్నాడు నన్ను ఉడికిస్తూ...
ఇకనాకు తిక్కరేగి "ఏ ఊరు మీది?" అన్నాను
"విజయవాడ.." అన్నాడు
"మరి...గోదావరి వాళ్ళు ఎన్ని రాస్తే నేకేందుకు...పొయ్యి పని చూసుకో.." అన్నాను...

అలా అన్నానే కానీ...అతను అన్న మాటలు నన్ను కొంచెం ఆలోచింపజేసాయి...అసలు దక్షిణ కోస్తా బ్లాగర్లు ఎంత మంది ఉన్నారు?..ఎన్ని బ్లాగులు ఉన్నాయి?..మనం మైనారిటీ బ్లాగర్ల లెక్కలో ఉన్నామా?..ఇలాంటి ప్రశ్నలు నా మైండులో డ్యాన్స్ చేశాయి..
అప్పుడే ఒకటి నిర్ణయించుకున్నాను...మెజారిటీ బ్లాగర్లుగా వెలుగొందుతున్న ఈ గోదావరి బ్లాగర్ల ముందు మన ఉనికి తెలియాలంటే, మనం ఏకం అవ్వాలి..అందుకో బ్లాగర్ల సంఘం ఏర్పడాలి...అలాంటి అలోచానా ఫలితమే ఈ "దక్షిణ కోస్తా బ్లాగర్ల సంఘం"(ద.కో.బ్లా.స)

దక్షిణ కోస్తా జిల్లాలు అయిన గుంటూరు, ప్రకాశం, నెల్లూరుకి చెందినా బ్లాగర్లు ఈ సంఘంలో చేరవచ్చు. మన మూడు జిల్లాల బ్లాగర్లు అందరూ ఏకమయ్యి మన ఉనికిని చాటుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఇప్పుడు..కనుకనే గుంటూరు, ప్రకాశం, నెల్లూరుకి చెందినా బ్లాగర్లకి ఇదే నా పిలుపు, మీరంతా వచ్చి మన "దక్షిణ కోస్తా బ్లాగర్ల సంఘం"లో చేరండి. అప్పుడు మన దక్షిణ కోస్తా బ్లాగర్లు అసలు ఎంత మంది ఉన్నారో తెలుస్తుంది. మనం మైనారిటీ కాదని నిరూపించాలి. మన బ్లాగర్ల సంఘం ఇంకా అభివృద్ధి కావడానికి, ఎక్కువమంది దక్షిణ కోస్తా బ్లాగర్లు తయారవ్వడానికి మీ అమూల్యమైన సలహాలు కూడా ఇవ్వండి. ఎవరైనా దక్షిణ కోస్తా యువకుడు కానీ యువతీ కనీ బ్లాగు మొదలెట్టి టపా వెయ్యగానే, మనం వారిని బాగా ఎంకరేజ్ చేసి మెరికల్లా తయారుచెయ్యాలి..ఆవిధంగా మన సంఘాన్ని అభివృద్ధి చెయ్యవచ్చని నాకు అనిపిస్తుంది. ఏమంటారు??. ఇంకా దీనికి సంబంధించిన విధి విధానాలకై మీ సలహాలు కోరుతున్నాను.

Sunday, 5 September, 2010

కిట్టిగాడు loves ఎదురింటి అమ్మాయి - 4


జన్మభూమి ఎక్స్ ప్రెస్ కిట్టిగాడి జన్మభూమిని దాటి వైజాగ్ వైపు పరుగులు తీస్తుంది...
కిట్టిగాడు మూతిబిగించి మూడంకె వేసి ఓ మూలాన కుర్చుని కిటికీలోంచి వెనక్కి పరుగులు తీసే చెట్టూచేమలను చూస్తూ ఏవో ఆలోచనలలో మునిగిపోయాడు...

"ఎస్...కిరణ్ అంటే నాకిష్టం...హీ ఈజ్ జెమ్ ఆఫ్ ఎ గై..."
"అంటే...నువ్వతన్ని లవ్ చేస్తున్నావా?"
"అనుకుంటా....ఏమో...నాకే తెలిదు...కానీ, తను నన్ను లవ్ చేస్తున్నాడు..అది నాకు తెలుసు.."
".........."
"ఏంటో...ఆ ఫీలింగ్ కొత్తగా ఉంది...తను నాకు ఒక వారం పది రోజుల్లో ఖచ్చితంగా ప్రపోస్ చేస్తాడు.."
"........."
"సారీ...సుత్తి చెప్తున్నానా?...ఏంటి సైలెంట్ గా ఉన్నారు??..."
"ఏం లేదు....తలనొప్పిగా ఉంది...మళ్ళీ వస్తాను ..."
"జావా లాజిక్స్ ఎప్పుడు చెప్తారు నాకు ??"
కిట్టిగాడికి ఏడుపు తన్నుకుంటూ వస్తుంది లోపలి నుంచి...జావా రాకపోయినా ఎంత కష్టపడి మేనేజ్ చేశాను..అంతా సుస్మీ కోసమే కదా...ఇప్పుడు ఇంకెవరి కోసం జావాలాంటి జావా చదవాలి...
"రేపు చెప్తాను..." అంటూ వచ్చేశాడు...

ఆలోచనల్లోంచి బైటకి వచ్చి కిటికీ బైటకి చూశాడు ...ట్రైన్ అనకాపల్లి స్టేషన్ లో ఆగింది...
ఎవరో  అమ్మాయి ఎక్కి తన ఎదురుగా కూర్చుంది..ఎక్కీ ఎక్కడంతోనే బ్యాగ్ లోంచి "జావా కంప్లీట్ రిఫరెన్స్" బుక్ తీసి చదివేస్తుంది...ఆ బుక్ చూడగానే ఇవి అని చెప్పలేని ఎన్నో ఫీలింగ్స్ కలిగాయి కిట్టిగాడికి....జావా పుస్తకం కవర్ పేజ్ మీద సుస్మీ ముఖమే కనిపిస్తుంది ...

"ఏంట్రా సడన్ గా ఊరి ప్రయాణం ..ఇంకా వారం రోజులు సెలవులు ఉన్నాయిగా.." అడిగింది కిట్టూ వాళ్ళమ్మ..
"వెళ్ళాలమ్మా...సప్లీ రాసే వాళ్ళకి జావా క్లాసులు మొదలెట్టారంట...ఈ సారైనా గట్టెక్కాలిగా..."
"ఏంటో ఎర్రి నాగన్న...పాపం నీకు ఈ జావా కష్టాలెంటో?..సరే వెళ్ళు...అయినా జావా రానివాడివి ఆ పిల్లకేం చెప్పావురా?"
"తెలిసింది చెప్పాలేమ్మా...ఊరికే ఆ అమ్మాయి వచ్చినప్పుడు, నాకు జావా రాదనీ...అరియర్స్ ఉన్నాయని చెప్పకు...ప్లీజ్.."
"హుమ్...వీటికేం తక్కువ లేదులే....వెళ్లి బట్టలు సర్దుకో..."

ఆలోచనల్లో ఉండగానే ట్రైన్ వైజాగ్ స్టేషన్ చేరింది...కిట్టు ఎదో పరధ్యానంలో ఉన్నట్లుగా హాస్టల్ రూమ్ కి చేరాడు...వచ్చీ రావడంతోనే బెడ్ మీద వాలాడు..హాస్టల్ మొత్తం ఖాళీగా ఉంది...ఇంకా ఎవరూ ఊర్ల నుంచి రాలేదు....మనసంతా అదేదో విధంగా...పరాగ్గా..చిరాగ్గా ఉంది కిట్టిగాడికి..రాజు గాడికి డైల్ చేసాడు ...

"హలో కిట్టిగా...ఏట్రా సంగతి..."
"ఏంలేదు...హాస్టల్ కి వచ్చాను ఇందాకే...ఈవెనింగ్ భీమిలి రోడ్ దెగ్గరికిరా...నీతో మాట్లాడాలి ..." 
"హాస్టల్ కి వచ్చావా...అదేంట్రా సడన్ గా...ఏమైంది...సుస్మీకి సంగతి చెప్పవా...?"
ఫోన్ కట్ చేసిన శబ్దం....

సముద్రం ప్రక్కగా సాగే భీమిలి రోడ్ ఆహ్లాదంగా..ప్రశాంతంగా ఉంది...
ఇద్దరూ సముద్రపు ఒడ్డున చెరొక రాయి మీద కూర్చున్నారు...నిముష నిముషానికి తాకి వెళ్ళే అలలు..ముఖానికి చల్లగా తాకుతూ పలుకరించే చిరుగాలులు...ఎంతో ప్రశాంతమైన వాతావరణం...కాని కిట్టిగాడి మనసులో మాత్రం అందుకు పూర్తి విరుద్ధమైన వాతావరణం...

"సో...అయితే...ఆ అమ్మాయి ఆల్రడీ ఇంకొక అబ్బాయిని లవ్ చేస్తుందనమాట..."
"........"
"హుమ్...ఈ అమ్మాయిలు ఇంతేరా..వంటి మీదకి వయసు వచ్చిందని తెలిసేలోపే, ప్రక్కన బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అనుకుంటారు...మనలాగా లేట్ గా ప్రేమించే వాళ్ళకి ఆప్షన్స్ తక్కువ...ఈ కాలంలో టెన్త్ క్లాస్ నుంచే ఉంటున్నారు అమ్మాయిలకు బాయ్ ఫ్రెండ్స్...మరి, అసలు లవ్ చెయ్యడానికి సరైన వయసేంటో..కాలమే డిసైడ్ చెయ్యాలి...టెన్త్ క్లాస్ లో లవ్ చేస్తే, ఆ వయసులో లవ్ అంటేనే ఏంటో తెలీదు..అదంతా అట్రాక్షన్ అంటారు...సరే అని సెటిల్ అయ్యాక లవ్ చేద్దామంటే, ఒక్కటంటే ఒక్క అమ్మాయి ఫ్రీగా ఉంటే ఒట్టు...ఏమంటావు ?"
"......."
"ఒరేయ్...నేనే వాగుతున్నాను...నువ్వేంటి మౌన ముని వేషం వేసావు...సరేలేరా, బాధపడకు.. సుస్మీ కాకపోతే...రాష్మీ..అది కాకపోతే దాని అక్క నూకాలమ్మ..."
చిరాగ్గా చూశాడు కిట్టిగాడు రాజు గాడి వైపు ....
"ఏంటి అలా చూస్తున్నావ్..పేరేంటి అలా ఉందనా?...ఆ పిల్ల నూకాలమ్మ తల్లి దయ వల్ల పుట్టిందని పాపం దాని పేరు, రాయబోయే పరిణామాలు కూడా ఆలోచించకుండా నూకలమ్మా అని ఎట్టేసారు...దాని చెల్లి కేమో రాష్మి...ఎమన్నా పొంతనుందా అసలు...పాపం ఆ పిల్ల నూకాలమ్మ అనే పేరుతో ఎన్ని కష్టాలు పడిందో నాకు తెలుసురా..అందరూ ఎగతాళి చెయ్యడమే..అందుకే కాలేజీకి వచ్చాక, ఆ పిల్లని ఎవరన్నా పేరు అడిగితే "అయాం నూకల్ అని చెప్తుంది..."..ఈ నాకోడుకులేమో అదేదో నార్త్ పెరనుకని "వావ్ వాట్ ఏ స్వీట్ నేమ్ యు హావ్" అని దాని ముందు కటింగు..."


"ఒరేయ్...ఏంట్రా నీ సుత్తి..అసలే మనసు అదోలా ఉంటే ..."
"సుత్తి కాదురా...అంచేత నేను చెప్పొచ్చేది ఏమిటంటే, మనకేదో లేదని ఫీల్ అయ్యే కన్నా..ఉన్న దాన్నే మనకి అనుగుణంగా మార్చుకుంటే సరి...నూకాలమ్మ నుండి మిస్.నూకల్ లాగా..."
"అర్థం కాలేదు..."
"ఓరినీ...ఇదేమన్నా జావా ప్రోగ్రామా...అది కాదురా...సుస్మీ దక్కలేదు అని బాధపడేకన్నా..మనకి అందుబాటులో ఉన్న నూకాలమ్మనో..నాంచారమ్మనో లైన్ లో పెట్టుకోవచ్చు...నువ్వేం దిగులు పడకు...సెట్ చేద్దాంలే..."
"ఏంట్రా సెట్ చేసేది...నువ్వు తేలిగ్గానే చెప్తావ్...నీకేంటి...మూడు రోజుల్లోనే ఆ పిల్లతో ఎన్నెన్నో ఊహలు...ఎంత కష్టపడి నేనెంటే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసానో తెలుసా...ఈష్టు గోదావరి కేట్ విన్ స్లెట్ రా ఆ పిల్ల...అసలు ఆ నవ్వు ఉంటుంది..వెన్నెల్లో మల్లెపూల జల్లులు కురిసినట్లుగా ఉంటుందిరా..."
"వెన్నెల్లో మల్లెపూలు కురిసినా...అమావస్యలో అరిటాకులు రాలినా...ఆ పిల్లని నువ్విప్పుడు మరచిపోవాలి..You have to get over her and keep going..."
"..............."

                                               **********
"కిట్టూ ఊరెళ్ళాడమ్మా...." చెప్పింది కిట్టూ వాళ్ళమ్మ ఆ మరునాడు సుస్మీ కిట్టూ కోసం రాగానే...
"అవునా...ఎప్పుడు వెళ్లాడు ఆంటీ...కనీసం నాకు మాట కూడా చెప్పలేదు..."
"నిన్నే వెళ్లాడు...ఏవో క్లాసెస్ ఉన్నాయని అర్జెంటుగా వెళ్లాడు...చెప్పకుండా వెళ్ళాడని ఏమీ అనుకోమాకమ్మ...ఆడో తింగరోడు..ఏ ధ్యాస పడితే ఆ ధ్యాసే..."
"అబ్బే అదేం లేదంటీ....సరే వెళ్ళొస్తాను..."
"అలాగేనమ్మా..."
                                              ***********

రోజులు గడుస్తున్నాయి...కిట్టూకి తరచూ సుస్మీ గుర్తొస్తున్నా, కావాలనే తనని తను వేరే వ్యాపకాల్లో బిజీగా ఉంచుకుంటూ, క్రమంగా తన ఆలోచనలను సాధ్యమైనంత వరకు తగ్గించేశాడు...సెలవులు వస్తున్నా ఇంటికి వెళ్ళడం మానేసాడు..ఇంటికి వెళ్తే మళ్ళీ పరిస్థితి ఎక్కడ మొదటికి వస్తుందో అని భయం....
ఎప్పటికప్పుడు వాళ్ళమ్మ ఫోన్ చేస్తూ అడుగుతూనే ఉంది, ఏంట్రా ఇంటికి రావడమే మానేసావు అని...కిట్టిగాడు అప్పటికప్పుడు ఎదో ఒక వంక చెప్పి కుదరడం లేదు అని చెప్పెసేవాడు...
వాళ్ళమ్మ ఫోన్ చేసిన ప్రతీసారీ సుస్మీ ఎలా ఉంది అనే మాట గొంతుదాకా వచ్చి ఆగిపోయేది...ఎందుకో పాపం అప్పుడు వాడికే ఏడుపు వచ్చేది....

                                          *************

రోజులు గిర్రున తిరిగాయి...సంవత్సరం గడించింది...కిట్టిగాడు ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమ్ లో ఉన్నాడు...వెనకేసుకున్న పద్నాలుగు రాళ్ళు ఒక్కొక్కటీ ఏరి వేసే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు...అన్నిఅరియర్స్ చివరి సెమ్ అయ్యేలోగా పూర్తి చెయ్యాలని ధృడంగా అనుకున్నాడు...మరొక విశేషమేమిటంటే, మనోడు జావాలో పాస్ అయ్యాడు...సెవెంత్ అటెంప్ట్ లో...కిట్టిగాడి దృష్టిలో అటెంప్ట్ ఎన్నోది అనేది కాదు ముఖ్యం, పాస్ అయ్యామా లేదా...అంతే...

ఈ సంవత్సర కాలంలో ఇంటికి వాడు ఒక్కసారి కూడా వెళ్లలేదు...పాపం కుర్రోడు ఎంత ఇరగ పొడుస్తున్నాడో ఇంటికి కూడా రావడం మానేసాడు అని...కిట్టిగాడి అమ్మగారే ఓ రెండు సార్లు వచ్చి వెళ్లారు వాడి దెగ్గరికి...ఆమె వచ్చినప్పుడు సుస్మీ గురుంచీ వాడూ అడగలేదు...ఆమె కూడా చెప్పలేదు...

ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ లో మళ్ళీ బిజీ అయ్యాడు కిట్టిగాడు...ఒక నెలరోజులు ఏవేవో కుస్తీలు పడి, చివరికి వల్లకాక ఒక మూడువేలు పెట్టి బైట మార్కెట్ లో రడీగా చేసిపెట్టిన ప్రాజెక్టు కొనేసి...సబ్మిట్ చేసేసి...వైవా ఎదో అలా కానిచ్చేసాం అనిపించేసుకొని ఊపిరిపీల్చుకున్నాడు...

తరువాత మళ్ళీ పద్నాలుగు సబ్జెక్టుల మీద దండయాత్ర కొనసాగించాడు...ఎలాగైనా అన్ని అరియర్స్ క్లీన్ స్వీప్ చెయ్యాలని అనుకున్నాడని ప్రతి సబ్జెక్టు నీతి నిజాయితీగా రాయడానికి మన కిట్టిగాదేమైనా హరిశ్చంద్రుడా? ధర్మరాజా??...అందుకనే అప్పటిదాకా అమలుచేయ్యని నానా విధానాలు అమలు చేసాడు....ఎగ్జాంకి ముందు ఆ సబ్జెక్టుకి సంబంధించిన హై-టెక్ సిరీస్ గైడ్..స్పెక్ట్రం సిరీస్ గైడ్..రెండిటినీ మొత్తం జంబో జిరాక్స్ తీయిస్తాడు...ఎగ్జాం రోజున, ఆ సబ్జెక్ట్ జంబో జిరాక్స్ గైడ్ రాజు గాడికి ఇచ్చి బాత్రూంలో ఒక అరగంట వెయిట్ చెయ్యమని చెప్తాడు...వీడు ఎగ్జాంకి వెళ్లి..పేపర్ లో ఉన్న ప్రశ్నలు ఒక యాభై మార్కులకి సరిపడా చేతి మీద రాసుకొని, అర్జెంట్ అని చెప్పి బాత్రూంకి వస్తాడు...ఆ కంపులో అప్పటికే పాపం అరగంట వెయిట్ చేసిన రాజుగాడు..వీడి రాకకి సంతోషించి, ఆ వచ్చిన ప్రశ్నలకి సంబంధించిన ఆన్సర్లు ఆ జంబో జిరాక్స్ గైడ్ లో నుంచి చించి వాడికి ఇస్తాడు...వాడి అది షర్ట్ స్లీవ్స్ లో పెట్టుకొని ఎగ్జాం హాల్లోకి వెళ్తాడు...

హాల్లోకి వెళ్ళాక ఆ స్లిప్స్ లాఘవంగా తీసి ఆన్సర్ పేపర్ మీద ఎక్కిస్తాడు...ఆ టాలెంట్ అంత ఈజీగా రాలేదు కిట్టిగాడికి..అసలు స్లిప్స్ ఎలా రాయాలి...ఇన్విజిలేటర్ చూడకుండా స్లిప్స్ ఎలా తియ్యాలి అనే దాని మీద ఒక మూడు నెలల కఠోర శిక్షణ పొందాడు సీనియర్స్ దెగ్గర నుంచి...

మొత్తానికి పద్నాలుగు ఎగ్జామ్స్ తన జూనియర్స్, సబ్ జూనియర్స్ తో కూడా కలిసి రాసి...దిగ్విజయంగా ముగించాడు...అన్నీ క్లియర్ అవుతాయి అనే ధీమా తోణకిసలాడింది కిట్టిగాడిలో...ఫేర్-వెల్ పార్టీ అయిపొయింది...అందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోతున్నారు...కిట్టిగాడు కూడా ఇక ఇంటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాడు...తను దాదాపుగా సుస్మీ ఆలోచనల నుంచి బయట పడ్డాడు...ఒక వేళ ఇప్పుడు తను ఎదురుపడినా ఇంతకుముందులా తను ఫీల్ అవ్వడు...రియాక్ట్ కాదు...ఆ నమ్మకం తనకి కలిగింది...

                                            *******
దాదాపు సంవత్సరంన్నర తరువాత మళ్ళీ రాజమండ్రిలో అడుగుపెట్టాడు....
సుస్మీ తనకి ఎదురుపడుతుంది...తను సుస్మీని కలవబోతున్నాడు అన్న ఉద్వేగం ఏమాత్రం లేదతనిలో...నెమ్మదిగా ఇంటికి చేరాడు....
అలసటగా అనిపించడంతో కాసేపు పడుకొని లేచి...భోజనం చేసి...అలా బయటకి వచ్చాడు...
ఎదురు ఇంట్లో ఎదో సందడిగా ఉంది...తను ఇప్పటిదాకా గమనించలేదు...బయట షామియాన వేసి ఉంది..కుర్చీలు వేసి ఉన్నాయి...చాలా మంది బంధువులు ఉన్నారు...మెల్లిగా సన్నాయి కూడా వినిపిస్తుంది....

వెంటనే లోపలికి వచ్చి "అమ్మా...ఏంటి ఎదురింట్లో ఎదో సందడిగా ఉంది ..." అన్నాడు
"అదా...వాళ్ళ అమ్మాయి పెళ్లి...ఎల్లుండే...ఈ రోజు పెళ్లి కూతురిని చేసినట్లున్నారు..."
"పెళ్ళా...ఆ అమ్మాయికి అప్పుడే పెళ్ళా...ఇంకా ఇంజినీరింగ్ కూడా పూర్తి కాలేదు కదా...పైగా ఆ అమ్మాయి..." అంటూ ఆగిపోయి..."అవునూ... ఆ అమ్మాయి చేసుకోబోయేది కిరణ్ అనే అబ్బాయినే కదా ..." అన్నాడు
"కిరణా??...కాదే..ఆ అబ్బాయి పేరు కిషెన్ అని చెప్పినట్లు గుర్తు...చెన్నైలో జాబ్ చేస్తున్నాడట ..."
"అవునా..." ఒక్కసారిగా ఆశ్చర్యం..బాధ..కోపం..అన్ని ఎమోషన్స్ వచ్చాయి..."కిరణ్ ని లవ్ చేసి...కిషెన్ ని ఎలా పెళ్లి చేసుకుంటుంది....ఈ అమ్మాయిలంతా ఇంతేనా..." అంటూ మనసులోది బయటకి వెళ్ళగక్కాడు...
వాళ్ళమ్మ విస్తుపోయి..."ఒరేయ్...కిట్టిగా...అయినా ఈ పిల్ల గురుంచి నీకెలా తెలుసురా??..కిరణ్ అంటావ్..లవ్ అంటావ్..."
"ఎలా తెలిసేది ఏంటమ్మా!!...ఒక సంవత్సరం ఇంటికి రాకపోయేసరికి...ఎదురింటి సుస్మీని ఎలా మరచిపోతాను..." అన్నాడు ఆవేశంగా...
"ఓరినీ...ఏడ్చినట్లే ఉంది నీ తెలివి...అయినా నేను కూడా నీకు చెప్పడం మరచిపోయానులే..." అందామె
"ఏంటది..." అడిగాడు ఆత్రుతగా 
"సుస్మీ వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి ఆరునెలలు కావస్తుంది...వాళ్ళ తాతగారికి వొంట్లో బాగుండటం లేదట..చివరి రోజుల్లో మనవరాలు కూతురు తన దెగ్గర ఉండాలని ఆయన కోరికట...అందుకే వాళ్ళు కాకినాడ షిఫ్ట్ అయిపోయారు...తరువాత వీళ్లోచ్చారు...వాళ్ళ అమ్మాయిదే ఇప్పుడు పెళ్లి...ఈ అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసి జాబ్ కూడా చేస్తుంది..."
"అవునా...సుస్మీ వాళ్ళు వెళ్లిపోయినట్లు కనీసం నువ్వు ఒక్క మాటైనా చెప్పలేదేంటమ్మా..."ఎదో చిన్న దిగులు కిట్టిగాడిలో...
"ఏంటో సమయానికి గుర్తురాలేదురా..నువ్వా హాస్టల్ నుంచి కదలకపోతివి...నీకు ఫోన్ చేసినప్పుడు కూడా నువ్వెలా వున్నావో అన్న దిగులుతో మిగతా విషయాలు ఏమీ గుర్తుకురాలేదు... నువ్వెళ్ళిన మరుసటి రోజు నీకోసం వచ్చింది..కనీసం నువ్వు తనకి మాటైనా చెప్పకుండా వెళ్లిపోయినందుకు నొచ్చుకుంది...పాపం..మంచి పిల్లరా..."
ఆ మాటలు వింటుంటే కిట్టిగాడికి ఎందుకో మళ్ళీ సుస్మీ మీద కొంచెం మనసు లాగడం స్టార్ట్ చేసింది...కానీ అలాంటి ఆలోచనని వెంటనే తుడిచేసాడు....
"నేను ఒక వారంలో హైదరాబాద్ వెళ్తున్నానమ్మా...జాబ్స్ కి ట్రై చెయ్యాలి...."

                          ****** (రెండు సంవత్సరాల తరువాత)********
ఇన్ఫోసిస్ క్యాంపస్, హై-టెక్ సిటీ, హైదరాబాద్...

"వేర్ ఈజ్ చైతూ...." అప్పటికి నాలుగోసారి అడిగాడు మేనేజర్ కందసామి....
"ఇంకా రాలేదు సర్..." చెప్పింది శ్వేత 
"అయ్యయ్యో కడవులే...ఇంద చైతూతో పెట్టుకుంటే..మన పని తిరుప్పతి బాలాజీ నామమే...ఎంగాప్పా ఇంద పయ్యన్..."
"కాల్ చేశాను సార్...లిఫ్ట్ చెయ్యడం లేదు...."
"ఎందుకు చేస్తాడు...చెయ్యడు...డెలివెరీ దా ఉండాది...గమ్మున రమ్మని నిన్న సిలక్కి సొల్లినట్లు కదా సొల్లాను..."
"మీరు టెన్షన్ పడకండి సర్...మేమంతా ఉన్నాం కదా..." అన్నాడు రమేష్ మధ్యలో కలుగజేసుకుంటూ...
"ఎందప్పా ఉండేది మీరు...డెలివరీ టైంకి ఏదన్నా ప్రాబ్లం వస్తే...పైకి కిందకీ సూస్తారు..చైతూ ఉంటేనే కదా,సాఫీగా డెలివరీ అయ్యేది..."..అందరూ ముసి ముసి నవ్వులు..."అదేనప్పా ప్రాజెక్ట్ డెలివరీ...జావాలో కింగ్ అంటే చైతూనే నప్పా...అందుకే చైతూ ఏంత లేట్ గా వచ్చినా...చెప్పకుండా సెలవు పెట్టినా నేనేమి అనను...అంద పయ్యన్ కి జావా మీద గ్రిప్ అట్టాంటిది..కింగ్ ఆఫ్ జావా అప్పా..."

పల్సర్ 180CC బండి ఒక్కసారిగా దూసుకు వచ్చింది పార్కింగ్ లాట్ లోకి...ఒక్క ఉదుటున దిగి...లిఫ్ట్ లాబీకి వచ్చి, ఆఫీస్ లో అడిగుపెట్టాడు...కృష్ణ చైతన్య...అలియాస్ చైతూ...అలియాస్ మన కిట్టిగాడు...

కిట్టిగాడికి చూడగానే, మేనేజర్ ముఖం వెలిగిపోయింది..."ఎన్నప్పా చైతూ....ఇంత లేట్ గా వస్తే ఎలా...డెలివరీ ఎవరు సేస్తారు...నువ్వుదా సేయ్యాలి..."
"డెలివరీ గురుంచి మీరు మర్చిపోండి...నొప్పులు లేకుండా..సారీ బగ్గులు లేకుండా సాఫీగా చేస్తాను...చైతూ ఈజ్ హియర్..జావా అయినా దాని అబ్బ అయినా మన ముందు సలాం చెయ్యాల్సిందే మిస్టర్ కందాజి..."
"గుడ్...గుడ్...నాకు తెలుసప్పా చైతూ నీ గురుంచి..."
"తెలుసు కదా...ఇక మీరు కాబిన్ కెళ్ళి రిలాక్స్ అవ్వండి..." అంటూ సీట్ లో కూర్చున్నాడు....
కందసామి వాడి కాబిన్ లోకి వెళ్ళాక...
"అరవోడు చంపేస్తున్నాడు...రమేష్...శ్వేతా...పదండి అలా కాంటీన్ కెళ్ళి కాఫీ తాగుదాం..." అన్నాడు కిట్టూ లేస్తూ...
"చైతూ...రిలీజ్ అయ్యేదాకా మనం సీట్ నుంచి లేస్తే..శివతాండవం చేసేలా ఉన్నాడు కందసామి..."
"వాడి బొంద...డెలివరీకి ఇంకా అయిదు గంటల టైం ఉంది...దానికి నాకు గంట చాలు...పదండి..."

"చైతూ...జస్ట్ రెండేళ్ళ అనుభవంతో జావాలో ఇంత ప్రోఫిషియన్సీ ఎలా సాధ్యం అయింది...ఒక ఏడు ఎనిమిదేళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు చెయ్యలేని ప్రోగ్రామ్స్ మీరు అవలీలగా చేసేస్తున్నారు..." అడిగింది శ్వేత
"కసి...జావా మీద కసి...అది నాతో ఎంత ఆడుకుందో...దానితో ఇప్పుడు నేను డబుల్ ఆడుకుంటున్నాను...ఒకప్పుడు జావా అంటే అదొక గొరిల్లా...ఇప్పుడు అదొక గండు చీమ...తొక్కి అవతల పడేస్తా...దీని వల్ల లైఫ్ లో ఒకటి నేర్చుకున్నా...దేన్నయినా చూసి దడుచుకోకూడదు...దాన్ని జయించాలి...వీలు అయితే మన ముందు తోకలేపకుండా తొక్కి పడెయ్యాలి అని..." అన్నాడు ధీమాగా...
"వావ్...వే టు గో చైతూ..." అంది అభిమానపూర్వకంగా..
"చైతూ..రేపు మన టీమ్ లో ఒక ఫ్రెషర్ జాయిన్ అవ్వబోతుంది...బాస్ చెప్పాడు..." అన్నాడు రాజేష్...
"అవునా...ఎవరు?"
"ఏమో...ఆ అమ్మాయికి జావాలో నువ్వే ట్రైనింగ్ ఇవ్వాలంట..."
"హుమ్....చూద్దాం..."

                                              ************
"చైతూ వీ హావ్ గాట్ ఎ న్యూ జయినీ ఇన్ అవర్ టీం...."
"ఓహ్...హూ ఈజ్ దట్ కందాజీ..." అన్నాడు చైతూ
"ఎ ఫ్రెషర్....నీకు పరిచయం చేస్తానప్పా..ఆమెని మన టీమ్ కి అసైన్ చేసారు కాబట్టి, నువ్వే ఆమెని జావాలో ట్రైన్ చెయ్యాలి..." అన్నాడు కందసామి...
"ఐ విల్ డూ మై బెస్ట్ కందాజీ..."
కందసామి ఫోన్ తీసి డైల్ చేసి..."శ్వేతా...న్యూ జయినీ వచ్చిందా...."
"ఓ.కె...గుడ్...ఆస్క్ హర్ టు కం టు మై కాబిన్.."

ఒక రెండు నిముషాల్లో ఒక అమ్మాయి లోపలి వచ్చింది...కిట్టు వెనుకగా నిల్చుని ఉంది...
"హలో యంగ్ గర్ల్....వాట్స్ యువర్ నేమ్...."
"సుస్మితా...."
ఆ పేరు వినగానే చివాలున తల వెనక్కి తిప్పి చూశాడు.... తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు...కొయ్యబొమ్మలా ఆ అమ్మాయినే చూస్తూ ఉండి పోయాడు...ఒక్కసారిగా కిట్టూ మెదడు మొత్తం మొద్దుబారినట్లు అయింది...అప్రయత్నంగా అతని నోటి నుంచి వచ్చింది ..."సు..స్మీ..." అని...

                                       --- To be continued in the 5th part.

[ఆలస్యంగా మీ ముందుకు వచ్చినందుకు క్షమించాలి...కొన్ని పర్సనల్..కొన్ని ప్రొఫెషనల్ పనుల్లో బిజీగా ఉండి ఒక మూడు వారాలుగా బ్లాగు జోలికి రాలేదు...ఇక నుండి టపాలు త్వరగానే అందిస్తాను...మీ అభిమానం ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తాను....ఇట్లు మీ --- కిషెన్ రెడ్డి ]