Search This Blog

Tuesday, 29 June, 2010

కిట్టిగాడు loves ఎదురింటి అమ్మాయి - 1


"ఎవరూ?..." అన్నాడు కిట్టిగాడు గుమ్మం బయట నిల్చున్న ఆ అమ్మాయినే తదేకంగా చూస్తూ....
"ఆంటీ లేరా?.."అంది అమ్మాయి వాడి చూపులకు ఇబ్బంది పడినట్లుగా....
"మీరూ?...."అంటూ ఆలోచనలో పడ్డాడు ఎవరయి ఉంటుందీ అమ్మాయి అని.. 
"కొంచెం ఆంటీని పిలుస్తారా?..."అంది గుమ్మం కి అడ్డంగా నిల్చున్న కిట్టిగాడికి పక్కగా జరిగి లోపలికి చూస్తూ...
"అమ్మా....అమ్మా..." అరిచాడు కిట్టిగాడు... "ఎంట్రా..ఏదో మునిగిపోయినట్లు.."అంటూ వచ్చిందావిడ...వస్తూనే గుమ్మంలో అమ్మాయిని చూసి " సుస్మితానా...రామ్మా లోపలికి..."అంటూ వాడి వైపు తిరిగి "ఏరా అమ్మాయిని లోపలికి పిలవాలనే జ్ఞానం లేదా?" అంటూ చీవాట్లు పెట్టింది... 

వాడు నల్ల మొహం వేసాడు.... "ఎమ్మా?...కాఫీ తాగుతావా" అడిగిందావిడ.. "లేదాంటీ...వెళ్ళాలి....ఇంటికి బంధువులోచ్చారు...పాలు నిండుకున్నాయి...మీ ఇంట్లో పాలు ఉన్నాయేమో అమ్మ తీసుకురమ్మంది...వాళ్ళకి టీ పెట్టాలి.."అంది అమ్మాయి అమాయకంగా... "దానికేం భాగ్యం తల్లి...ఇదుగో ఇప్పుడే తెస్తా ఉండు.."అంటూ లోపలి వెళ్ళింది...
"మీ ఇల్లెక్కడ?...మిమ్మల్ని ఎప్పుడూ నేను చూడలేదే...??" అన్నాడు కిట్టిగాడు, ఇంత బ్యూటీని ఎలా మిస్ అయ్యనబ్బా అనే లెవెల్లో... "కొత్తగా వచ్చాం...మీ ఎదురింట్లోకి.." అంది అమ్మాయి నేల చూపులు చూస్తూ ....వాడు మాత్రం తినేసేలా చూస్తున్నాడు అమ్మాయిని..
"..అలాగా..నేను హాస్టల్లో కదా ఉండేది అందుకే తెలీదు....అయినా నేను వచ్చి వారం అయింది...ఒక్కసారి కూడా కనిపించలేదే ... ఇంట్లోంచి బయటకే రావా?...ఏం చదువుతున్నావు?" అన్నాడు .. 
వాడు వెంటనే ఏకవచనంలోకి మారిపోయే సరికి కొంచెం ఇబ్బంది పడుతూ "సెకండ్ బిటెక్.." అంది.
"అంటే... రెండో సారి బీ-టెక్ చదువుతున్నావా ..??"
ఆ అమ్మాయి షాక్ తిని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ .."బీ-టెక్ రెండో సంవత్సరం చదువుతున్నాను ..." అంది...

"ఓహో...నేనేమి చదువుతున్నానో అడగవేంటి....అన్ని నేనే అడగాలా?" అన్నాడు అమ్మాయి వైపు చూసి.... అమ్మాయి ఒక్కసారిగా ఖంగుతింది..వీడెక్కడ దొరికాడురా దేవుడా అనుకుంటుండగా, వాళ్ళమ్మ వచ్చి దేవతలా రక్షించింది... పాలు తీసుకొని తుర్రుమంది...
"పాలు నిండుగున్నాయి అని చెప్పి మళ్లీ పాలు పట్టుకువెళ్తుంది..మెంటలా పిల్లకి.."అన్నాడు వాళ్ళ అమ్మతో.. "ఓరి నీ తెలివి సంతకెళ్ళ...నిండుగున్నాయి కాదురా...నిండుకున్నాయి అంది అమ్మాయి...అంటే ఖాళీ అని అర్థం...ఏం చదువులో ఏంటో" గొణుక్కుంటూ వెళ్ళింది.... 

ఆ రోజు సాయంత్రం టీవీలో వస్తున్న "టైటానిక్" సినిమాలో కేట్ ని చూస్తుంటే ప్రొద్దున పాల కోసం వచ్చిన సుస్మిత గుర్తొచ్చింది మనోడికి...ఎంత కాదనుకున్న కేట్ లో కొన్ని పోలికలు సుస్మితలో కనిపించాయి కిట్టిగాడికి..ముఖ్యంగా ఆ కళ్ళు...ఆ పెదవులు .. ఈష్టు గోదావరి కేట్ విన్నుస్లెట్ అంటే సుస్మితేనని తీర్మానించుకున్నాడు .. ఇంకో పది రోజుల్లో మళ్ళీ కాలేజీ మొదలువుతుంది..ఈ లోపు ఆ అమ్మాయిని లైన్ లో పెట్టాలి,అసలే నాకు ఇంకా గర్ల్ ఫ్రెండ్ లేదని నా స్నేహితులు ఎగతాళి చేస్తున్నారు అని ఫుల్ గా డిసైడ్ అయ్యాడు కిట్టిగాడు.. అనుకున్నదే తడవుగా మెదడుకు మాల్టోవా పెట్టడం మొదలెట్టాడు.. ఒక మహత్తరమైన ఐడియా తట్టి... వెంటనే వంటింట్లోకి వాళ్ళ అమ్మ లేని టైంలో వెళ్లి, డబ్బాలో నిండుగా ఉన్న మూడు కీజీల పంచదారని ఇంటిప్రక్కన ఉన్న మురికికాలవలో గుమ్మరించి మళ్ళీ ఆ డబ్బాని యథాస్థానంలో ఉంచి, వాళ్ళ అమ్మ దెగ్గరికి వెళ్లి.." అమ్మా... తలనొప్పిగా ఉంది ఒక మాంచి స్ట్రాంగ్ కాఫీ పెట్టవే.." అన్నాడు తల మీద రుద్దుకుంటూ...

"లేచిన దెగ్గరనుంచి ఆ దిక్కుమాలిన టీవీ చూడకురా అని చెప్తుంటే విన్నవూ.. వచ్చి వారం అయింది ఒక్క రోజన్నా పుస్తకం తీసిన పాపాన పోలేదు, మొన్న సెమిస్టర్ లో వచ్చిన నీ మార్కులు మీ నాన్నగారు చూసుంటే ఇంక నిన్ను చదివించడం సుద్ద దండగ అని డిసైడ్ చేసి నిన్ను ....."
"అమ్మా....తలనొప్పి బాగా ఎక్కువగా ఉందమ్మా... ప్లీజ్ అమ్మా వెళ్లి కాఫీ పెట్టమ్మా.." అన్నాడు తల పట్టుకొని ఊగిపోతూ...
'ఎందుకు పనికోస్తావురా నువ్వు...' అనే ఓ భయంకరమైన లుక్ విసిరి వాళ్ళ అమ్మ వంటింట్లో కెళ్ళింది...

"ఒరేయ్ కిట్టిగా...." గట్టిగా పిలిచింది వాళ్ళమ్మ ...
"ఏంటమ్మా ....హబ్బా ఒకటే తలనొప్పి..." అని తల పట్టుకుంటూ లోపలికి వెళ్లాడు ...
"ఒరేయ్...మొన్ననే మూడు కీజీల పంచదార తెచ్చి ఈ డబ్బాలో పోశానురా... ఇప్పుడు చూస్తే మొత్తం ఖాళీ... ఏంటో ఏదో మాయలా మాయమయిందేంటిరా ..." అందామె తెల్లబోతూ ...
"హబ్బా అమ్మా...నువ్వు నిజంగా తెచ్చి ఆ డబ్బాలో పోస్తే ఏమవుతుంది చెప్పు... అంతా నీ భ్రమ..." 
"డబ్బా అట్టుకొని మొహాన కొట్టానంటే తలనొప్పి కాస్తా ఎగిరిపొద్ది ఎధవా... భ్రమ అంట భ్రమ ... నిజంగా తెచ్చి పోశానురా అంటుంటే ..." అందామె ..
"అమ్మా...పోనీ మనింట్లో పిల్లులు ఎలుకలు రాత్రి స్వైర విహారం చేస్తాయి కదా...అవి తినేశాయేమో...ఇప్పుడెలాగమ్మా నాకిప్పుడు కాఫీ కావలి ..."
"పిల్లులు తినడం ఏవిట్రా నీ మొహం...హమ్...సరే రోడ్డు మీదికెళ్ళి ఇప్పటికి ఓ అరకిలో పంచదార అట్రా..."
"తలనొప్పితో రోడ్డు దాకా ఎలా వెళ్లనమ్మా... ఎదురింటి సుస్మితా వాళ్ళింటికి వెళ్లి ఓ గ్లాసెడు తీసుకురానా? " అన్నాడు కళ్ళింత చేస్తూ...
"సుస్మితా వాళ్ళింటికా...వద్దులేరా..ప్రొద్దునే కదా ఆ అమ్మాయి వచ్చి మన ఇంట్లో పాలు తీసుకువెళ్ళింది... ఇప్పుడు మనం వెళ్లి పంచదార అడిగితే, పాలకి పంచదార బదులేమో అనుకుంటారు ...బాగోదు..."
"నువ్వూరుకోమ్మా...ఊరికే తొక్కలో మొహమాటాలూనూ...నే వెళ్లి తీసుకువస్తా ఉండు ..." అంటూ ఓ గ్లాస్ పట్టుకొని బైల్దేరాడు వాళ్ళమ్మ వద్దన్నా వినకుండా....

సుస్మిత వాళ్ళింట్లో అడుగెట్టాడు కిట్టిగాడు అలియాస్ కృష్ణ చైతన్య...
హాలులో సుస్మిత వాళ్ళ అమ్మగారు అనుకుంటా జెమినీలో సీరియల్ చూస్తూ అందులో ఉన్న రాధిక ఏడుస్తుంటే ఈవిడ అంతకన్నా ఎక్కువగా కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది ముక్కు తుడుచుకుంటూ...
ఎలా మొదలెట్టాలో అనుకుంటూ ..చిన్నగా దగ్గి "ఆంటీ ..." అన్నాడు ..
ఆమె వినిపించుకునే పరిస్థితుల్లో లేదు.. టీవీకి ఆమెకి ఆరడుగు గ్యాప్ కూడా లేదు...మళ్ళీ పిలిచాడు...ఊహూ .. తన స్పందనకి ఆమె ప్రతిస్పందన లేకపోయేసరికి పిచ్చెక్కినట్లు అటూ ఇటూ చూసి... వాళ్ళింటి గడప దెగ్గర గ్లాస్ పట్టుకొని నిల్చున్న వాడి వాలకాన్ని వాడు చూసుకొని థూ ఎదవ జీవితం .. కానీ తప్పట్లేదు అనుకొని ..డోర్ పైన కొడదాం అనుకొనే లోపే సుస్మిత హాల్లోకి వచ్చింది... గడప దెగ్గర ఉన్న వాడిని చూసి మైల్డ్ గా షాక్ కొట్టిన దానిలా ఫేస్ పెట్టి...వెంటనే తేరుకొని ..."మమ్మీ...మమ్మీ...ఆ అబ్బాయి వచ్చాడు..." అంటూ వాళ్ళమ్మని కుదిపి ఈలోకంలోకి తీసుకొచ్చింది... మనోడు 'ఛా అనోసరంగా వాళ్ళమ్మని పిలిచింది...ఈ పిల్లే వచ్చి ఏం కావాలని అడగోచ్చుగా...' అనుకొంటుండగా సుస్మిత వాళ్ళమ్మ కిట్టూని అదోరకంగా చూస్తూ వస్తూ .."నువ్వు ఎదురింటి రాజ్యలక్షీగారి అబ్బాయివి కదా...రా బాబు వచ్చిలా కూర్చో ...కృష్ణ చైతన్య కదా నీ పేరు " అందామె ... దొరికిందే చాన్స్ అనుకొని కుర్చీ లాక్కొని కూర్చొని "అవునండీ.."అన్నాడు..

"ఏం బాబూ ఎలా ఉన్నావు ..ఇదే కదా మా ఇంటికి రావడం.." అందామె
"ఆ బాగున్నాను ఆంటీ...అది.. కొంచెం పంచదార ఉంటే ఇస్తారేమో అని అమ్మ పంపిస్తే వచ్చానండి..." అన్నాడు గ్లాస్ టీపాయ్ మీద పెడుతూ...
"సుస్మీ... వెళ్లి ఈ గ్లాస్ నిండా పంచదార తీసుకొనిరా ..." అంటూ సుస్మీకి గ్లాస్ ఇచ్చి .."ఎక్కడ చదువుతున్నావు బాబూ..." అందామె..
"నేను వైజాగ్ గీతంలో ఇంజినీరింగ్ ..." అన్నాడు గ్లాస్ తీసుకొని లోపలి వెళ్తున్న సుస్మీనే చూస్తూ...ఆ పిల్ల వంటింటి గుమ్మం దాకా వెళ్లి వీడి వైపు తిరిగి.. ఏ మగ పుంగవుడూ అర్థం చేసుకోలేని...నిర్వచించలేని ఒక చూపు విసిరి లోపలికి వెళ్ళింది... 

మనోడు ఆ చూపుని డీకోడ్ చేసేలోపే ..ఆంటీ గారు .."అలాగా... ఏ ఇయర్?" అంది...
"నేను థర్డ్ ఇయర్... కంప్యూటర్స్ .."
"అలాగా...మా సుస్మీ ఇక్కడే గోదావరి కాలేజీలో చదువుతుంది...తను కూడా కంప్యూటర్స్..ఇప్పుడు సెకండ్ ఇయర్.. తను మొదట్లో హాస్టల్లో ఉండేది..కానీ తనకు హాస్టల్ పడకపోయేసరికి..మేము కాకినాడ నుంచి ఇక్కడకి షిఫ్ట్ అయిపోయాం... ఒక్కతే కూతురాయే దాని కన్నా మాకు ఎక్కువేంటి..." అందావిడ..
'అబ్బో...పర్లేదు ఆంటీ కోపరేటివ్ గానే ఉంది..ఇక రోజూ కాసేపు ఇలా వచ్చి సుస్మీకి బీట్ వెయ్యొచు....పైగా ఒక్కతే కూతురంటా.. ఆస్తి మొత్తం అమ్మాయిదే అనమాట...పైగా విలన్.. అదే... బ్రదర్ కూడా లేడు..లక్కంటే ఇలా కలిసి రావాలిరా కిట్టిగా ...' అనుకొని లోపల సంబరపడుతూ కేరింతలు కొట్టడంమొదలెట్టాడు కిట్టిగాడు...
ఈ లోపు సుస్మీ పంచదార తెచ్చి టీ-పాయ్ మీద పెట్టి లోపలికి వెళ్లబోతుండగా..."సుస్మీ...ఇలా రా...ఈ అబ్బాయి కృష్ణ చైతన్య ఎదురింటి రాజ్యలక్ష్మి ఆంటీ వాళ్ళబ్బాయి..గీతంలో కంప్యూటర్స్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడట.." అంటూ పిలిచింది...
"హలో..." అంటూ వచ్చి వాళ్ళమ్మ ప్రక్కన నిల్చుంది...
కిట్టిగాడు ఆ పిల్లని పైనుంచి క్రింది దాక ఎగాదిగా చూస్తూ "హలో ..." అన్నాడు... పింక్ కలర్ టీ-షర్ట్ లో మెరిసి పోతుంది సుస్మితా...ఛా వైజాగ్ లో కూడా ఇట్టాంటి పిల్ల కనిపించలేదే...
"తను నీకు సీనియర్..ఎమన్నా డౌట్స్ ఉంటే తనని అడుగు..." అందామె... కిట్టిగాడికి గొంతులో వెలక్కాయ పడింది.. అసలైతే ఆంటీ అన్నదానికి ఎగిరి గంతెయ్యొచ్చు.. కానీ ఎక్కడ??...కిట్టి గాడికి ఇంకా మొదటి సంవత్సరం సుబ్జేక్టులే నాలుగు ఉన్నాయ్.. అలా ప్రతి సెమిష్టరులో క్రమం తప్పకుండా ఓ నాలుగు రాళ్ళు వెనకేసుకొస్తున్నాడు...అదే నాలుగు సబ్జెక్టులు...

ఆ పిల్ల లైట్ గా తల ఊపి మొదటిసారిగా కిట్టిగాడిని ఓ రెండు సెకండ్లు చూసింది.. కుర్రాడు బాగానే ఉన్నాడు కానీ ఎర్రితనం కొట్టొచ్చినట్లు కనిపించింది వాడిలో ఆ పిల్లకి...
"మీకు జావా బాగా వచ్చా..." మొదటి సారి నోరు తెరిచి అడిగింది ఆ పిల్ల ...
మనోడికి రానిదే అది ... జావా మీద ఇప్పటికే మూడవ దండయాత్ర కూడా మొన్నే ముగిసింది...
"వై నాట్...జావాలో ప్రోగ్రాం ఎడం చేత్తో రాసి...కుడి చేత్తి కంపైల్ చేసి.. కను చూపుతో అవుట్ పుట్టు తీస్తా..."
"నాకు రెండు మూడు జావా ప్రోగ్రాములు రావడం లేదు...లాజిక్ చెప్తారా?"
"అ....లా....గే...రేపు చెప్తాను... అన్నట్లు మీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్నడగండి ఎదురిల్లే కదా..." అన్నాడు..
చిన్నగా తలూపింది ...
"సరే...ఇక నేను వెళ్తాను..." అంటూ లేచాడు కిట్టిగాడు...
"ఒక్క నిముషం..." అంటూ లోపలికి వెళ్లి ఒక మడిచిన పేపర్ తీసుకువచ్చింది సుస్మిత...

కిట్టిగాడు గుండె వేగం హెచ్చించింది... మై గాడ్ అప్పుడే లవ్వు లెటర్ ఇచ్చేస్తుంది.. ఏంట్రా కిట్టిగా అమ్మాయిలు పెద్దగా పట్టించుకోని నీ సుడి ఈ రోజు ఇన్ని వంకరలు తిరుగుతుంది...అనుకున్నాడు...
సుస్మిత ఆ కాగితం కిట్టిగాడికి అందివ్వగా... మనోడు సిగ్గు పడుతూ సుస్మీ కళ్ళలోకి ఆరాధనగా చూస్తూ అందుకున్నాడు ఆ శ్వేత పత్రం... ఆత్రుత ఆపుకోలేక కొంచెం మడత విప్పి చూస్తే ఏదో ఇంగ్లీష్ లో రాసుంది... అబ్బో ఇంగ్లీష్ లవ్ లెటరేమో అనుకోని చూడగా మధ్యలో కొన్ని బ్రాకెట్లు..*&^%...ఇలాంటి సింబల్స్ కనిపించేసరికి, లవ్ లెటర్ ఇలాక్కూడా ఉంటుందా అని కళ్ళు చిట్లించి చూడగా...దానిలో కంటెంట్ చూసిన మనోడుకి బ్రెయిన్ బ్రేక్ డౌన్ అయ్యి.. షట్ డౌన్ అయ్యి..ఇంకేదో అయ్యి... అలా షాక్ కొట్టి కాకిపిల్లలా ఓ క్షణం ఆ పిల్ల వైపే చూశాడు... సెగ రేగిన ఆశల మీద కూల్ డ్రింక్ చల్లడం తట్టుకోలేక పోయాడు...
"ఆ పేపర్ లో నాకు లాజిక్ అర్థం కాని జావా ప్రోగ్రామ్స్ ఏవేవో రాసిచ్చాను... వాటి లాజిక్ మీరు నాకు రేపు చెప్తారా ..." అంది
"దా...ని...కేం.. భా...గ్యం...అలగలగే..." అంటూ వెళ్లాడు ఏదో ట్రాన్స్ లో ఉన్నవాడిలా...
గుమ్మం దాకా సుస్మీ కూడా వచ్చింది...
"సరే మరి... వెళ్ళొస్తా .." అంటూ కదలబోతుండగా...
"ఇందాక చూశాను...మీరు మీ ఇంటి పక్కన ఉన్న మురికి కాలవలో ఒక డబ్బాలో నిండుగా ఉన్నది ఏదో పారబాసారు... ఏంటో నాకది చెక్కెరలా కనిపించింది ...." అంది సందేహంగా...
కిట్టిగాడికి కత్తి వేటుకి నెత్తురు చుక్క లేదు...
వెంటనే తేరుకొని..."అబ్బే కాదు...కాదు ...చెక్కెర కాదు... భలేదానివే చెక్కెర పారబోసుకుంటారా ఎవరైనా...అదీ..మా అమ్మ పురుగులు పట్టాయిరా అంటే ఉప్మా రవ్వ నేనే పారబోసాను అనమాట..అదీ సంగతి..." అంటూ నీళ్ళు నమిలాడు కిట్టిగాడు ...
"ఉప్మా రవ్వకి పురుగు పడితే పారబోసుకుంటారా ఎవరైనా...దానికి ఓ మంచి చిట్కా ఉంది...రేపు నేను ఆంటీకి చెప్తాలే..ఓ కె బాయ్..." అంటూ లోపకికి తుర్రుమంది ఆ పిల్ల...
మనోడికి అంత చలి లోనూ చెమటలు పట్టడం మొదలెట్టాయి... తొక్కలో ఐడియా వేసినందుకు వాడిని వాడే బండ బూతులు తిట్టుకుంటూ... ఈడ్చుకుంటూ ఇంటికి చేరాడు...[కిట్టి గాడి ఇంట్లో ఏమయిందో వచ్చేఎపిసోడ్ లో తెలుసుకుందాం...అందాకా...విరామం మరి - కోట్ల రామకృష్ణా రెడ్డి.]

Thursday, 24 June, 2010

నేడే... ఈనాడే ....నా బ్లాగు పుట్టినరోజు...కావాలి మీ ఆశీస్సులు


మన బ్లాగ్లోకంలో బ్లాగు పెట్టిన సంవత్సరానికి ఇలా బ్లాగు పుట్టిన రోజు టపా రాయడం ఈ మధ్య సంప్రదాయంగా వస్తున్న దృష్ట్యా నేను కూడా ఇలా నా బ్లాగు పుట్టిన రోజు టపాని మీ ముందుకు తీసుకు వస్తున్నా ...

సరిగ్గా సంవత్సరం క్రితం తెలుగులో బ్లాగులు ఉన్నాయనే విషయం నాకు నిజ్జంగా తెలియదు.. కానీ కేవలం బ్లాగులు ఉండటమే కాదు... ఎన్నో బ్లా.స లు రూపుదిద్దుకోవడాలు .. ఒక బ్లా.స ని తొక్కడానికి మరొక బ్లా.స లు పుట్టడాలు.. ఎన్నో బ్లాగు పరిచయాలు.. ఎందరో మేధావుల గొప్ప టపాలు .. అదొక ప్రపంచంగా కలిగియున్నదని తెలిసి... ఔరా ఏమి నా వెనకబాటుతనము అని చింతించితిని...

కనుక  నేను బ్లాగు మొదలెట్టిన విధంబెట్టిదనిన అంటూ నేను నా బ్లాగు ప్రస్తానం చెప్పాల్సిందే మీరు వినాల్సిందే...

ఓ రోజు ఆఫీసు లో పనిచేస్తున్నట్లు నటిస్తూ సీరియస్ గా  జీ-టాక్ చాట్ చేస్తుండగా.. సందీప్ ఆన్లయిన్ వచ్చాడు .. ఏవో కాసేపు కష్టసుఖాలు మాట్లడుకుంటూ "లైఫ్ చాలా బోర్ గా ఉందిరా ..." అన్నాను ... 
"నువ్వు స్టోరీస్ అవీ రాసి మాకు చుపించేవాడివి వాడివి కదా, అవి ఒక బ్లాగు పెట్టి వాటిలో రాయి సరదాగా.. చాలా మంది చూస్తారు .. నీకు కామెంట్స్ ఇస్తారు ..." అన్నాడు 
"నేను తెలుగు స్టోరీస్ కదరా రాసింది ... అవి బ్లాగులో ఎలా రాస్తాం .." అన్నాను..
"తెలుగులో కూడా రాయచ్చు బ్లాగ్... తెలుగులో చాలా బ్లాగులు ఉన్నాయి ...కూడలి.ఆర్గ్ లో చూడు కావాలంటే" అన్నాడు ...
"అవునా... అయితే నేను కూడా రాసేస్తా ...కొంచెం ప్రాసెస్ చెప్పి పుణ్యం కట్టుకో .."
"చెప్తాలే కాని ...కొన్ని బ్లాగులు చూడు ముందు ..." అని ఒక బ్లాగు లింక్ ఇచ్చాడు ...
ఆ లింక్ పేరు చూసి ... "ఈ బ్లాగేదో పూల బ్లాగులా ఉంది ... పూల గురుంచి పండ్ల గురుంచి ఏం చదవమంటావు ... ఏదన్నా మాంఛి ఇంటరెస్టింగ్ బ్లాగు ఇవ్వు.." అన్నాను 
"నీ మొహం ..ఆవిడేదో పాపం ఇష్టమైన పూలు కాబోలు ఆ పేరు పెట్టుకుంది ... లేకపోతే ఆడువారికి జనరల్ గా పూలంటే ఇష్టం కాబట్టి అలా పెట్టుకుందేమో ...అంతమాత్రాన ఆమె పూల గురుంచి వాటి పుట్టు పూర్వోత్తరాల గురుంచి రాస్తుందనుకున్నావా .. ఈమె చాలా బాగా రాస్తుందిరా ...అందుకే ఈ లింక్ ఇచ్చా ... చదువు .." అన్నాడు 
"సరేలే ...రూంకి వెళ్లి నింపాదిగా చదువుతా ..." అన్నాను 

సాయంత్రం రూంకి వెళ్లి తీరిగ్గా బ్లాగు ఓపెన్ చేశాను... ఆమె రాసిన టపాలు ఒక్కోటీ చదువుతుంటే నాకు ఏంటో తెలియని ఆనందం కలిగింది .. అప్పటికి ఆమె రాసిన ఇరవై నాలుగు టపాలు చదివేశా ఏకబిగిన .. అప్పటి ఆమె లేటెస్ట్ టపాకి కామెంట్ పెట్టి ఆమె రిప్లై ఎప్పుడు ఇస్తుందా అని గంటకి ఓ సారీ ఆమె బ్లాగు చూడటం చేసేవాడిని ... తరువాతి రోజు ఆమె రిప్లై చూసి చాలా చాలా ఆనందం వేసింది ... నేను బ్లాగ్ మొదలెట్టడానికి నాకు చాలా స్ఫూర్తిని కలిగించారు ఆవిడ ...ఆవిడే మన నేస్తం... జాజిపూల నేస్తం :-)...నా మొదటి బ్లాగు నేస్తం... అప్పటినుంచి నేను రాసిన ప్రతి టపాకి ఆమె కామెంట్ ఉంటుంది, నేస్తం అందించిన ప్రోత్సాహం మరువలేనిది...

ఇంకా నా బ్లాగు ప్రస్తానంలో నాకు ఎందరో మంచి ప్రోత్సాహం అందించిన స్నేహితులు ఉన్నారు  ... శివరంజని - నా ప్రతి టపాలో మంచి ప్రోత్సాహం అందించే స్నేహితురాలు, అలాగే స్పురిత, సౌమ్య, భాస్కర రామిరెడ్డి, పద్మార్పిత, సుభద్ర, మధురవాణి, మోహన్ (అమ్మాయికళలు), ప్రణీత, మానస, ప్రియ, దివ్యవాణి, నరేష్, రిషి  ఇలా ఇంకా చాలా మంది... అందరికి పేరు పేరునా నా ధన్యవాదాలు ...నన్ను ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను.

బ్లాగు మొదలెట్టాక మొదటి టపా ఏమి రాయాలా అని అందరి లాగానే చాలా ఆలోచించాను ... ఆలోచించగా చించగా నా ఇంటర్ అనుభవాలు రాయాలనిపించి రాసేశాను .. రెండు భాగాలుగా రాసిన నా ఇంటర్ అనుభవాల టపా "కళాశాలలో ...కళాశాలలో ...ఓ ఓ ఓ " కి మంచి స్పందన వచ్చింది బ్లాగ్మిత్రుల దెగ్గరినుంచి ...  ఇంక అంతే రెచ్చిపోయా... జూలైలో  ఏడు టపాలు రాశాను ... ఆ తరువాత జోరు కొంచెం తగ్గినా అడపాదడపా రాస్తూనే ఉన్నాను, ఆ ఏడాది(2009) చివరికల్లా పదిహేను టపాలు మాత్రమే రాయగలిగాను ... ఆ సంవత్సరంలో నా పదిహేను టపాలలో స్క్రిప్ట్ పరంగా నాకు చాలా సంతృప్తిని కలిగించిన టపాలు "నిను వీడని నీదని నేనే", "ఊహలు నిజమైన వేళ", "ఆఖరి మజిలీ", "A క్యూట్ లవ్ స్టోరీ with బటర్ స్కాచ్ topping...", "పిచ్చికాక లవ్ స్టోరీ..నగాదేవిలో నువ్వునాకునచ్చావ్..డ్రైవర్ అన్నయ్యకు యాభై..".

2010లో ఇప్పటిదాకా రాసినవి పదహారు టపాలు..వీటిలో తొమ్మిది టపాలు ఎపిసోడ్స్ గా రాసిన నా మొదటి సీరియల్ ప్రయత్నం "హృదయంప్రేమిస్తానంటే..విధి విడదీస్తానంటే!!" లోనివే .. ఈ సీరియల్ ని నేను అనుకున్న దాని కన్నా బాగానే రిసీవ్ చేసుకున్నారు.. అందుకు నాకు చాలా సంతోషం కలిగింది.. ఈ సీరియల్ లో నేను చేసిన చిన్న చిన్న తప్పిదాలని నాకు ఓపికగా వివరించి చెప్పిన నేస్తం గారు నాకు నిజమైన క్రిటిక్ ... ఆమె క్రిటిక్స్ నన్ను నేను ఉన్నతంగా నిలుపుకోవడానికి ఎప్పుడూ ఉపయోగపడతాయి... ఇంకా ఈ సీరియల్ లో రంజని ప్రోత్సాహాన్ని మరువలేను..తన కామెంట్స్ నాకు పాజిటివ్ ఎనర్జీ అందించేవి.... ఇంకా నా ఇంటర్ స్నేహితురాలు కవిత కూడా నాకు మంచి సపోర్ట్ మరియు క్రిటిక్...

2010లో నేను నా శైలిలో చాలా మార్పులు తీసుకొచ్చాను... కొంచెం కొత్తగా రాయడానికి కొన్ని ప్రయోగాలు చేశాను.. కొన్ని బాగున్నాయి... మరి కొన్ని బెడిసికొట్టాయి.. "షార్టుకట్ టు గోపాలపురం" నేను చేసిన శైలి ప్రయోగంలో ఒకటి...నాకు మాత్రం పూర్తి సంతృప్తిని మిగిల్చింది ఈ కథ... అలాగే "ఆపరేషన్ ఆరువేల కోట్లు వయా నడిమంత్రపు సిరి పాలసీ"..ఇది కూడా శైలిలో కొద్ది మార్పులు చేసి వ్రాసిన కథే...

ఇలా  సంవత్సరం పూర్తి చేసుకుంది నా "ఆకాశవీధిలో..." బ్లాగు...ఈ ప్రయాణంలో నన్ను ఆదరించి, అభిమానం చూపించి, స్ఫూర్తిని అందించి, ప్రోత్సాహం కలిగించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు... ఈ కిషన్ ఎప్పుడూ మిమ్మల్ని మరచిపోడు....

"ఆకాశవీధిలో..." బ్లాగులో త్వరలో మరొక చిన్న సీరియల్ ప్లాన్ చేస్తున్నా... పూర్తి లవ్ స్టోరీ... చూద్దాం అదెలా వర్కవుట్ అవుద్దో... 

అదీ మరి సంగతి... ఒక సంవత్సరం ఎంత ఫాస్టుగా గిర్రున తిరిగిపోయిందో... సరే నా బ్లాగు రెండో సంవత్సరంలో అడుగుపెట్టేసింది.. ఈ సంవత్సరంలో నా బ్లాగు మిమ్మల్ని ఇంకా ఎంతో అలరించాలని...నాకు ఎందరో మంచి స్నేహితులు దొరకాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను... నాకు తెలుసు నివ్విస్తావ్..ఖచ్చితంగా ఇస్తావ్..బికాస్ యు ఆర్ బెసికల్లీ గాడ్...ఎ వెరీ గుడ్ గాడ్ .. :-)


Have a wonderful day ----------------------------------  Yours  K R K Reddy

Saturday, 19 June, 2010

హృదయం ప్రేమిస్తానంటే...విధి విడదీస్తానంటే !! - 9 [Final Part]


ఫోన్ మోగింది..
"హలో ...." అంది సంహిత
"సంహిత గారు ...నేను కార్తీక్ ని "
"కార్తీక్ మీరా??...చెప్పండి ...మీ కాల్ కోసమే రోజూ చూస్తున్నాను ... నేను మిమ్మల్ని ఓ సాయం అడిగాను అది మీరు మరచిపోయారు కదా! "
"లేదు సంహితా ... మీతో నేను కొన్ని విషయాలు చెప్పాలి ...  మనం కలుద్దామా?"
"అలాగే ...ఎక్కడ?"
"రేపు ఉదయం గీతం కాంపస్ దెగ్గర ...పదింటికి ..."
"అలాగే ..."
                                             
                                                   ****
గీతం  కాంపస్ దెగ్గర వెయిట్ చేస్తున్నాడు కార్తీక్ సంహిత కోసం ... కొద్దిసేపు అయ్యాక సంహిత వచ్చింది ...
"కార్తీక్ .. సారీ మిమ్మల్ని వెయిట్ చేయించానా?" అంది కార్తీక్ దెగ్గరికి వస్తూ
"లేదు ... సంహిత నేను నీకు కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాలి ..అవి నీ జీవితానికి సంబంధించినవి.. ఇవి నీకు తెలియాల్సిన పరిస్థితి వచ్చింది ..." అన్నాడు
అర్థం కానట్లు చూసింది కార్తీక్ వైపు ...కార్తీక్ సంహితని కాంటీన్ కి తీసుకువెళ్ళాడు...అలాగే దివ్యకి కూడా కాల్ చేసి కాంటీన్ కి రమ్మన్నాడు ... సంహితా,కార్తీక్ లు కాంటీన్ కి చేరగానే, దివ్య కూడా వాళ్ళతో వచ్చి కలిసింది.

"హాయ్ సంహిత..." అంది దివ్య వస్తూనే
"హాయ్ ..." అంది దివ్యని చూస్తూ ... బాగా పరిచయం ఉన్న అమ్మాయిలా అనిపించింది దివ్యని చూడగానే సంహితకి.
"సంహిత...షీ ఈజ్ దివ్య..మై వైఫ్...ఇక్కడే ఇప్పుడు లెక్చరర్ గా చేస్తుంది .." అన్నాడు కార్తీక్ ...
మళ్ళీ తనే మాట్లాడుతూ ..."ఎలా మొదలెట్టాలో నాకు తెలియడం లేదు ... నేను చెప్పబోయేది నీకు చాలా షాకింగ్ గా అనిపించొచ్చు..కానీ ..." అంటూ చెప్పబోతుండగా
"ప్లీజ్... అదేంటో త్వరగా చెప్పండి ... మీరు ఇలా చెప్తుంటే నాకు భయమేస్తుంది .." అంది సంహిత
"ఆ రోజు నన్ను హాస్పిటల్ లో చంటీ అన్నావు గుర్తుందా ..." అడిగాడు కార్తీక్
"అవును..." అంది సంహిత
"నువ్వు నన్ను అలాగే పిలిచే దానివి...."
అర్థంకానట్లు చూస్తుంది సంహిత..
"దాదాపు ఆర్నెల్ల క్రితం ఆక్సిడెంట్ లో సుధీర్ చనిపోవడం వల్ల, నీలో మానసికంగా చాలా మార్పులు వచ్చాయి.. నువ్వు సుధీర్ ని, అతనికి సంబంధించిన వ్యక్తులని, పరిసరాలను పూర్తిగా మర్చిపోయావు.. అందుకే నీకు అసలు మేము ఎవరమో కూడా తెలీదు.. బట్ వీ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్.. ఇదే కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకున్నాం మనం.. ఆ టైంలోనే సుధీర్ మనకు పరిచయం అయ్యాడు ...."
"ఏంటి కార్తీక్...నాకేమీ అర్థంకావడం లేదు...సుధీర్ నాకు ఈ మధ్యే పరిచయం... తను మొన్న ఆక్సిడెంట్ లో చనిపోయాడు..ఆ విషయం నీకు కూడా తెలుసు..." అంది అతని మాటలు పూర్తికాకుండానే ...
"సంహితా...నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలీదు... అతను నిన్ను కలవడం...మీ మధ్య పరిచయం..నువ్వతన్ని ఇష్టపడటం..అతను చనిపోవడం...ఇదంతా నిజంగా జరగలేదు..అవి నీ హాలుసినేషన్స్ అని డాక్టర్ చెప్పాడు..."
"నాకేమన్నా పిచ్చా...నాకెందుకు హాలుసినేషన్స్ వస్తాయి ...."
"అది నీ మానసిక పరిస్థితి వల్ల...యు హవ్ అమ్నేషియా..."
                                                **** 


"అమ్మా... నేను సుదీర్ని కాదా .." ఆవేదనగా అడిగాడు భార్గవ్ 
"ఏమైంది కన్నా... నువ్వు సుధీర్ కాకపోవడం ఏంటి?...అసలు నిన్నంతా ఎక్కడికెళ్ళావు రా!!" కంగారుగా అడిగిందామె ..
"నిన్న గీతం కాంపస్ లో కార్తీక్, దివ్య కనిపించారు... నేనెవరో ఎరుగనట్లే ప్రవర్తించారు...నేను సుధీర్ కాదంట.. వాళ్ళ స్నేహితుడు సుధీర్ చనిపోయాడంట... ఇతనే సుధీర్ అని ఒక ఫోటో చూపించాడు కార్తీక్.. అదేంటో ఆ ఫోటో చూడగానే..నా మెదడు మోద్దుబారింది.. ఎవరో బలంగా నా తల మీద మోదినట్లు అలాగే పడిపోయాను... లేచేసరికి ఈ రోజు ప్రొద్దున హాస్పిటల్ లో ఉన్నాను ..."
ఆందోళనగా చూసింది భార్గవ్ వైపు ఆమె తల్లి ... అప్పుడే నిశ్చయించుకున్నదానిలా డాక్టర్ ని కలవడానికి బైల్దేరింది ...
                                             ****
"ఇదీ డాక్టర్ జరిగింది ...నాకేదో భయంగా ఉంది ..." అందామె.
డాక్టర్ కొద్దిసేపు ఆలోచించి "మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే, భార్గవ్ లో Identity conflict మొదలయ్యిందేమో అనిపిస్తుంది...ఎప్పుడైతే సుధీర్ స్నేహితులు భార్గవ్ కి తను సుధీర్ కాదు సుధీర్ చనిపోయాడు అని చెప్పారో, ఎప్పుడైతే సుధీర్ అసలు ఫోటో తను చూశాడో ఆ క్షణమే ఆ సంఘర్షణ అతని మెదడులో మొదలయ్యి ఉండవచ్చు... ఇప్పటిదాకా సుధీర్ కి సంబంధించిన అన్ని విషయాలు అతనిలో ట్రాన్స్ ప్లాంట్ చెయ్యబడ్డ వైటల్ ఆర్గన్స్ లోని న్యూరో పెప్టైడ్స్ (ఏవైతే ఆ అవయవాలలో సమాచారో నిక్షిప్తం చేసుకొని మెదడుకు అందిస్తాయో) అతని మెదడుకి చేరవేశాయి .. అలా అవి చేరవేసిన సమాచారానికి కాంట్రాస్టింగ్ గా ఏ సమాచారం మెదడుకి అందలేదు కనుకే, అతనిలో సుధీర్ ఐడింటిటి బలంగా నాటుకుపోయింది... కానీ ఇప్పుడు సుధీర్ ఫ్రెండ్స్ ఇచ్చిన సమాచారం మరియు అసలైన సుధీర్ ఫోటో చూసిన భార్గవ్ కి మొదటిసారిగా కాంట్రాస్టింగ్ గా External stimulus అందడం, ఆ ఇన్ఫో నేరుగా మెదడుకి చేరవేయబడి అతను సుధీర్ కాదు అన్న సమాచారం మెదడు ప్రాసెస్ చెయ్యడం...ఆ సమాచారం, అప్పటికే నిక్షిప్తమైన సమాచారానికి కాంట్రాస్టింగ్ గా ఉండటంతో Identity conflict మొదలయ్యింది... ఈ conflict వల్ల అణగదొక్కబడి ఉన్న భార్గవ్ ఐడింటిటి తన ఉనికిని చాటే ప్రయత్నము చేసి ఉండొచ్చు... భార్గవ్ లో సుధీర్ వైటల్ ఆర్గన్స్ ఉన్నంత మాత్రాన, పూర్తిగా వాడు వీడు అవ్వడం జరగదు.. అది కేవలం భార్గవ్ లో ఉన్న సుధీర్ అవయవాలు మెదడుపై చూపించిన ప్రభావమే..అది మరింత ఎక్కువ ఉండటమే భార్గవ్ లో సుధీర్ ఐడింటిటి బలంగా ఉండటానికి కారణం... ఎపుడైతే ఆ ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతుందో.. అణగదొక్కబడి ఉన్నభార్గవ్ ఐడింటిటి బయట పడగలదు.. ఇప్పుడు ఎలాగూ భార్గవ్ లో Identity conflict మొదలయ్యింది కనుక, అతనిలోని భార్గవ్ ని మనం బైటకి తీసుకురావచ్చు...సుధీర్ ఐడింటిటిని పూర్తిగా తుడిచివేయవచ్చు..." అన్నాడు డాక్టర్ 

"ఇది జరుగుతుందంటారా?"
"ఖచ్చితంగా... నేను భార్గవ్ కి సైకోఅనలిటిక్ థెరపీలు స్టార్ట్ చేస్తాను...అతనిలో పూర్తి భార్గవ్ ని బైటకి తీసుకువస్తాను.. ఈ థెరపీల ద్వారా conflict లో ఉన్న రెండు ఐడింటిటీలలో ఒక దాన్ని పూర్తిగా తుడిచివేయడం జరుగుతుంది... దీనికి అతను కూడా సమాయత్తం కావలి.. అందుకు మీ సహకారం అవసరం.. అతనిలో అతనికి సుధీర్ కాదేమో అన్న సందేహం ఇంకా బలంగా కలగాలి.. అతనికి ట్రాన్స్ ప్లాంట్ జరగకు ముందు, భార్గవ్ గా అతనికి సంతోషం కలిగించే జ్ఞాపకాలు ఏమైనా తెలిసేలా చెయ్యడం కాని, అతను బాగా ఇష్టపడే వస్తువులు ఏమైనా అతని కంట పడేట్టు చెయ్యడం లాంటివి ..." అన్నాడు డాక్టర్ ...
"అలాగే డాక్టర్ .. నా భార్గవ్ నాకు దక్కితే అంతకన్నానా ..." అందామె ..
                                                     ****
సంహిత కళ్ళల్లో ధారాపాతంగా నీళ్ళు ... ఒక్కసారిగా ఆమె గుండెల్లో నిఘూడంగా దాగి ఉన్న దుఃఖం కట్టలు తెంచుకుంది ..ఇన్నాళ్ళు అజ్ఞాతంలో జీవిస్తున్న ఆమెలో అతని జ్ఞాపకాలు గొంతు చించుకొని అరవసాగాయి "సుధీర్ ......" అంటూ.... సుధీర్ తో కలిసి ఉన్న ప్రతి క్షణం, ప్రతి చోటు, మాటాడిన ప్రతి మాటా ఆమెకు కళ్ళు ముందే కనిపిస్తున్నాయి ... గుండెను రంపపు కోతకు గురిచేస్తున్న బాధ ఆమెకు కలుగుతుంది .. తను సుధీర్ ని అంత ప్రాణంగా ప్రేమించింది, అతనే జీవితం అనుకుంది...కానీ ఈ రోజు అతను తనకు లేడు... ఆ నిజం జీర్ణించుకోలేనిదిగా అనిపిస్తుంది సంహితకి..

"చంటీ ......దివ్యా .....నా సుధీర్ నాకిక లేడా" ఆమె గొంతు జీర పోయింది ...
"సంహీ ... సుధీర్ భౌతికంగా నీ దెగ్గర లేకపోయినా ...అతని మనసు ఇంకా నీకోసమే ఎదురుచూస్తుంది ...అతని గుండె నీకోసమే కొట్టుకుంటుంది ...అతను నీకోసమే బ్రతుకుతున్నాడు " అన్నాడు కార్తీక్
"చంటీ ....." ఆమె ఆశ్చర్యంగా చూస్తుంది ...
"అవును సంహీ ...సుధీర్ చనిపోయాక అతని వైటల్ ఆర్గన్స్ అన్నీ భార్గవ్ అనే అతనికి ట్రాన్స్ ప్లాంట్ చేశారు ... నీ మీదనే అణువణువు ప్రేమ నింపుకున్న సుధీర్ భార్గవ్ లో నీకోసం జీవిస్తున్నాడు ... భౌతికంగా అతను భార్గవ్, కానీ మానసికంగా సుధీర్ ... నిన్ను, నన్ను దివ్యని అందరినీ గుర్తుపట్టాడు ... నీ నుంచి సుధీర్ ని దూరం చెయ్యడం ఆ దేవుడికే తప్పనిపించి ఉంటుంది , అందుకే నీకోసం మళ్ళీ సుధీర్ ని పంపాడు ..." అన్నాడు కార్తీక్ ఉద్వేగంతో ...
"చంటీ...నువ్వు చెప్పేది నిజమా .... నేను అతన్ని చూడాలి ..." అంది.
"మనం అతన్ని త్వరలోనే కలుస్తున్నాం సంహీ ...."
                                                  *****

కొన్ని రోజులకి భార్గవ్ కనిపించాడు కార్తీక్ కి ...."సుధీర్ ...." అంటూ కేకేశాడు కార్తీక్ ...
భార్గవ్ అతని వైపు చూడకుండా తనపాటికి తను వెళ్ళిపోతున్నాడు ....
కార్తీక్ పరిగెత్తుకుంటూ వెళ్లి భార్గవ్ ని కలిసి "సుధీర్ ..." అన్నాడు 
"సుధీరా?...నా పేరు భార్గవ్ ...మీరు?" సంశయంగా చూసాడు భార్గవ్ కార్తీక్ వైపు ...
అంతే నిశ్చేష్టుడై చూస్తూ నిలబడ్డాడు కార్తీక్ ..."సు..ధీ...ర్ ...నేన కార్తీక్ ... సంహిత నీకోసం చూస్తుంది .." లీలగా వస్తున్నాయి అతని మాటలు...
"మీరేదో పోరపడినట్లు ఉన్నారు..అయాం భార్గవ్ ...మిమ్మల్ని నేను ఎప్పుడూ చూడలేదే ..." అన్నాడు భార్గవ్ 

                                                 ** **

సడన్ గా జోరున వర్షం మొదలైంది  ...
రోడ్డు మీద నడిచే జనాలు మొత్తం తుపాకి పేల్చితే చెల్లాచెదురు అయ్యే కాకుల్లా అటూ ఇటూ పతిగెత్తుతున్నారు షెల్టర్ కోసం
ఆమె మాత్రం అలానే వర్షంలో తడుస్తూ నిల్చుంది ...ఆమె కళ్ళు బస్సు స్టాప్ లో నిల్చున్న అతన్నే చూస్తున్నాయి ... వర్షంలో వర్షిస్తున్న ఆమె కళ్ళు కడిగిన ముత్యాల్లా ఉన్నాయి ...
"సంహీ ...."
తిరిగి చూసింది ...వెనుకగా వస్తూ కార్తీక్ ...
"ఎన్నాళ్ళిలా అతని కోసం రోజూ బస్సు స్టాప్ లో నిల్చుని చూస్తావ్ ... భార్గవ్ మనల్ని ఇంకెప్పుడూ గుర్తుపట్టడు  ..." అన్నాడు కార్తీక్ బాధగా ..
"ఏదో ఒక రోజు అతనిలో ఉన్న సుధీర్ గుండె నాకోసం కొట్టుకుంటుంది ..నేను రోజూ చూసే ఎదురుచూపులు ఆ గుండెని ఎదోనాడు కరిగించక మానవు ...ఆ రోజు వరకూ ఎదురు చూస్తాను .. ఆ గుండె నిండా నేనే ఉంటాను చంటీ ... ఎప్పటికైనా ఆ గుండెలో స్థానం నాదే ..."

                            ** రెండు సంవత్సరాల తరువాత **

"భార్గవ్...రారా...సంహీ ఎక్కడ?" అడిగాడు కార్తీక్ భార్గవ్ రావడం చూసి ..ఆ రోజు కార్తీక్ కొడుకు మొదటి పుట్టిన రోజు ...
"తను సుధ కలిసి వస్తామన్నారు ... కాసేపట్లో వస్తారు....నేను డైరెక్ట్ గా ఆఫీసు నుంచి వస్తున్నానురా .. ఇంతకీ నా అల్లుడు ఎక్కడ?... వేర్ ఈజ్ మై బర్త్ డే బాయ్ సుధీర్ " అన్నాడు ఇంట్లోకి వస్తూనే ...
"సుధీర్....మామయ్య వచ్చాడురా .. " అంటూ పిలిచాడు కార్తీక్ తన కొడుకు సుధీర్ని ...
ఇంతలో  సంహిత, సుధ వచ్చారు ....
"కార్తీక్...సుధీర్ పేరు నాకు కొడుకు పుడితే పెడదాం అనుకున్నానురా ...కానీ ఈ ఛాన్స్ నువ్వే ముందు కొట్టేసావ్ ..." అన్నాడు భార్గవ్ నవ్వుతూ 
"పర్లేదు లెండి...మనకి డెఫినెట్ గా అమ్మాయే పుడుతుంది ...దానికి సుధీరి అని పెడదాం పేరు ..." అంది సంహిత నవ్వుకలుపుతూ ...
"సుధీరీనా!!... నీకేమో సంహిత అని పోష్ పేరు...నా కూతురికేమో సుధీరినా .." అన్నాడు భార్గవ్ నవ్వుతూ...
పార్టీ అయిపోయాక సంహిత, భార్గవ్ ఇంటికి బైల్దేరారు ...
చాలా సీరియస్ గా కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు భార్గవ్ .. 
"భార్గవ్ ...ఆర్ యు ఆల్ రైట్" అంది సంహిత..  
డ్రైవ్ చేస్తూ సంహిత వైపు చూస్తూ "సంహీ ..." అన్నాడు..
"ఊ ..." 
"ఆ రోజుని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను ..."
"ఏ రోజుని?"
"నువ్వు నాకు ప్రోపోజ్ చేసిన రోజుని ...  "
"జోకా!!...తమరే నన్ను ప్రోపోజ్ చేసారు ముందు... నేను రోజూ బస్సు స్టాప్ కి తమరి కోసమే వచ్చినా, నా కన్నా ముందు మీరే బస్సు స్టాప్ లోనే వచ్చి నన్ను పెళ్ళిచేసుకుంటావా అని అడిగారు కదా..మర్చిపోయారా... నువ్వు లేకపోతే నేను బ్రతకలేనేమో అనిపిస్తుంది నిన్ను చూస్తుంటే అని కూడా అన్నారు ..." అంది సంహిత చిన్నగా నవ్వుతూ 
ఓ నిముషం భార్గవ్ ఏమీ మాట్లాడలేదు ....

"ఆ రోజు గీతం కాంపస్ లో ...కాంటీన్ లో ....నువ్వు నాకోసం పెట్టిన కన్నీళ్లు .. జీవితాంతం నాకు తోడుగా ఉంటావా అని అడిగిన మాట నేను మర్చిపోలేను బంగారం ..."
చివాల్న తిరిగి అతని వైపు చూసింది ... ఆమెలో సన్నని వణుకు ... నిశ్చేష్టురాలై అతన్నే చూస్తూ ఉంది ...
"అదే రోజు రిషికొండ దెగ్గరి అమ్మవారి గుడిలో నీకు బొట్టుపెట్టి నీతోనే ఎప్పటికీ కలిసి ఉంటాను అని ప్రమాణం చేశాను ...ఆ మాట నిలుపుకోలేక పోయాను... నిన్ను వదిలేసి ఈ లోకం నుంచి వెళ్ళిపోయాను ..." అతని కళ్ళలో నీళ్ళు ...
"సు ...ధీ .....ర్ " వణుకుతున్న ఆమె పెదవుల నుండి లీలగా వచ్చాయి ఆ పదాలు ...
అతను వంద  కె.ఏం.పి.హెచ్ తో హై వే మీద దూకించాడు బండిని ....

********************* సమాప్తం ********************
Meet you all soon -------------- Ramakrishna Reddy kotla 

Monday, 7 June, 2010

బ్లాగ్మిత్రుల సందేహానికి...నా లాంగ్ జవాబు

హృదయం ప్రేమిస్తానంటే...విధి విడదీస్తానంటే !! కథని ఆదరిస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఇకపోతే మొన్న రాసిన ఎనిమిదవ ఎపిసోడ్ తార్వత బ్లాగ్మిత్రులు చాలామంది, ఒకే సందేహాన్ని నా ముందుంచారు..

"భార్గవ్ కి చెయ్యబడినది బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంట్ కాదు, అలాంటప్పుడు సుధీర్ ఐడింటిటి భార్గవ్ కి ఎలా వస్తుంది అని...." ఇంచుమించుగా అందరి సందేహమూ ఇదే.

ఇంతవరకు పరిపూర్ణ బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంట్ జరగలేదు.. దీని మీద చాలా రీసర్చ్ కొనసాగుతుంది.

ఈ ప్రశ్న నేను ముందే ఊహించాను... దీనికి జవాబు నా దెగ్గర ఉంది...నేను కథ రాసే ముందే ఈ ఆర్గన్ ట్రాన్స్ ప్లాంట్స్ మీద బాగెనే రీసర్చ్ చేసాను.. ఒక పక్కా అవగాహణకి వచ్చాకే ఈ కథ మొదలెట్టాను, ఆఫ్ కోర్స్ తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేశాను అనుకోండి, కానీ అనుకున్న స్టోరీ లైన్ ఏమాత్రం మార్చలేదు .. మొన్న రాజు గారు అడిగారు, కామెంట్స్ చూసి స్టొరీ ఎమన్నా మారుస్తున్నారా అని... అలా ఎప్పటికీ చెయ్యలేదు, స్టొరీ డవలప్మెంట్ లో భాగంగా చిన్న మార్పులు చేశాను అంతే...

ఇక పోతే పై ప్రశ్న కి నా సమాధానం... ఈ సమాధానం చాలా వరకు medical jargon లో ఉండటం వల్ల, I feel am better off expressing it in English and hope you guys don't mind.

Well, i like your doubt and lemme explain in detail. I have done exhaustive research on this Organ transplants before writing this story as this subject matter has always been a fascinating factor for me.
Well, now i wont confuse you people with all the confusing jargon related to this and will come to this specific question.

Here, i wanna introduce you guys to a concept called "Cellular Memory". Cellular memory is a theory that states the brain is not the only organ that stores memories or personality traits, that memory as a process can form in other systems in the body and can be stored in organs such as the heart, lungs, liver etc. The memory traces will be formed in a special kind of memory cells called "Neuropeptides" in many vital organs of our body. I will tell more about Neuropeptides in the later part of my post.

It was Maurice Renard's Story "Les Mains D'Orlac" that popularized the idea for the first time. In the story a pianist looses his hands and a killer's hands are transplanted in their place. Of course the story has been spoofed and remade so many times in our own culture there's scarcely anyone that doesn't know how the story ends, with the killer's hands possessing the main character to kill. This is an extreme and over simplified version of what cellular memory could be.

First studies in heart transplant recipients Cellular Memory was noted when, upon waking up from surgery patients would display a strange change in tastes, opinions, cravings, and other personality changes that ranged to the extreme of change of self-identity

So,in addition to this, lemme give some real-life examples related to your question.

1. In 1970,a patient called Claire Sylvia received a heart and lung transplant from an eighteen year old male donor who had been in a motorcycle accident. None of this information was known to Sylvia, who upon waking up claimed she had a new and intense craving for beer, chicken nuggets, and green peppers, all food she didn't enjoy prior to the surgery. A change in food preferences is probably the most noted in heart transplant patients. Sylvia wrote a book about her experiences after learning the identity of her donor called A Change of Heart. She even confessed in her book that she is sexually attracted to girls after the surgery(remember her vital body parts has been transplanted from a male donor).

2. A 47 year old man receiving a heart from a 17 year old black boy suddenly picked up an intense fondness for classical music. The boy whose heart had been donated was killed in a drive-by shooting, still clutching his violin case in his hands. A 50 year old transplant patient claimed that his new heart was responsible for a sudden onset of eating disorders, heralded from the heart's previous owner, a 14 year old girl. Once a change in sexual orientation was even documented in a twenty seven year old lesbian who soon after getting a new heart settled down and married a man.

3. The most stunning example of cellular memory was found in an eight year old girl who received the heart of a ten year old girl. The recipient was plagued after surgery with vivid nightmares about an attacker and a girl being murdered. After being brought to a psychiatrist her nightmares proved to be so vivid and real that the psychiatrist believed them to be genuine memories. As it turns out the ten year old whose heart she had just received was murdered and due to the recipients violent reoccurring dreams she was able to describe the events of that horrible encounter and the murderer so well that police soon apprehended, arrested, and convicted the killer.

And other common quirks recorded due to vital body transplants have been changes in attitude, temperament, vocabulary, patience levels, philosophies, and tastes in food and music and finally to the stage of a change in identity.

Change in identity is very very rare, which i have already told you in the previous part. Change in identity happens depending upon the mental state of donor. Here, while am referring to mental state, i mean to refer strong emotional holds for a particular person or lover or parents. Their memory traces take a strong hold on Neuropeptides (as per celluar theory) and can take a dominating position in transplanted patient while sending messages to brain.

Lets see the working of this Cellular Memory. I told you about Neuropeptides in the starting part of my post. First these Neuropeptides were believed to exist only in the brain, but later inventions proved they exist in each vital organ of our body. There Neuropeptides are a way for the brain to "speak" to other bodily organs and for the organs to rely information back. This is how the donor memories stored in Neuropeptides of all major bodily organs are passed to the brain of the patient who has been transplanted with donor's vital organs.

Still some questions are unanswered in this research. Why don't all transplant recipients have these experiences? It's been theorized this may be due to the fact not all of them are in tune with their body as some other individuals may be. Perhaps the explanation lies with the sensitivity of the individual. I have told already about the mental state of donor which is more important.

Well, coming to our story, Sudheer is in love with Samhitha. His Neuropeptides in heart, liver, lungs etc store this information very strongly. Not to mention the fact that sudheer is so deeply in love with Samhitha, Well, in reality, attaining the full identity of donor may not be possible, but here in this story, Bhargav attains the maximum identity of sudheer. In this context, my assumption was to show you all that sudheer loves samhitha so deeply and crazily that his peptides in all the organs consolidated this fact and after transplantation they took the demanding position over the other peptides in patient, in sending this important information to brain every time. So actually Bhargav mind registered all this information while suppressing his own identity. Well, actually this is my assumption here - means how i applied this cellular theory to my story.

Hope am clear with the concept. Any more doubts in this subjects are welcome.

Well, It may be anecdotal, but many real life incidents happening cant be taken lightly. Well i dont wanna go more technical than this and any how i adopted this concept for my story. Hope am bit reasonable enough than just cooking something that really doesnt make any sense at all. I Hope this piece of technical info enough for me to write a story, moreover please treat this as story than going too deep into the concept to come up with something. Am writing this post as i feel it is my responsibility to alleviate some of the doubts of my blogger-friends. Iam happy with people who like my effort, and am more happy with people who feels it rubbish. Just a matter of fact, to tell u, this is my first story. I dont have any pre-experince on story writing and i knew am not perfect, but am trying hard to achieve some perfection day by day.

Thank you one and all for listening to me ------------------------- Ramakrishna Reddy Kotla

Sunday, 6 June, 2010

హృదయం ప్రేమిస్తానంటే...విధి విడదీస్తానంటే !! - 8


"ఎస్...హీ ఈజ్ పెర్ఫెక్ట్ ఫర్ ద ట్రాన్స్ ప్లాంట్స్ ...." సుధీర్ బాడీని, అతని ముఖ్య అవయవాలని పరీక్షించి నిర్ధారించాడు డాక్టర్... "గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు మార్పిడి చెయ్యడానికి అనుగుణంగానే ఉన్నాయి ..."
"కానీ డాక్టర్...అతని బంధువులు దీనికి సమ్మతించాలి..." అన్నాడు అక్కడున్న మరో డాక్టర్
"నిజమే ... ఇతనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చారా..." అడిగాడు నర్స్ ని ..
"లేదు డాక్టర్..." అందామె ..
"బ్రెయిన్ డెడ్ వ్యక్తి అవయవాలు కొన్ని గంటలలోనే మనం ట్రాన్స్ ప్లాంట్ చెయ్యాలి ... ఈ లోపు ఇతనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తే బాగుండు ..." అన్నాడు డాక్టర్

కొన్ని గంటలు గడిచాయి ... సుధీర్ బాడీని చూడటానికి ఎవరూ రాలేదు.. ఈ విషయమై మాట్లాడేందుకు డాక్టర్స్ సమావేశమయ్యారు ...
"డాక్టర్ ఇక మనం చెయ్యగలిగింది ఏమీ లేదు ..." అన్నాడు ఒక డాక్టర్
"నిజమే ... అప్రూవల్ లేకుండా మనం ఈ ట్రాన్స్ ప్లాంట్ చెయ్యలేము ... మన చేతుల్లో ఒక గంట కూడా లేదు ...ఈలోపు అతని ఆర్గన్స్ ని వేరు చేసి భద్రపరచాలి ..లేకపోతే వాటి ఫంక్షనింగ్ ఆగిపోతుంది ... చూడబోతే అతని కోసం ఎవరూ వచ్చేలా లేరు " అన్నాడు మరో డాక్టర్
"ఇక్కడ మనం మానవతా దృష్టితో ఆలోచించాలి ... అతను ఎలాగూ బ్రెయిన్ డెడ్.. అంటే ఈక్వల్ టు డెడ్, కాని అతని అవయవాలు మరో వ్యక్తికి జీవితాన్ని అందించగలవు అని తెలిసాక ఉపేక్షించి, పరిస్థితి చెయ్యి జారాక మధనపడటం అవివేకం... ఐ వాన్నా గో విత్ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ ..." అన్నాడు భార్గవ్ కి ట్రీట్ చేస్తున్న డాక్టర్ రామకృష్ణ.
"రామకృష్ణ గారు .. నిజమే..కానీ రేపు అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చి మన మీద గొడవ చేసి... కేస్ పెట్టే వరకు వెళ్తే ?" అంటూ సందేహాన్ని వెలిబుచ్చాడు మరో డాక్టర్
"ఐ విల్ టేక్ ద బ్లేమ్... ఏదైనా దానికి బాధ్యత నేనే వహిస్తాను ..." అన్నాడు డాక్టర్ రామకృష్ణ ధృడంగా ..
"కానీ ...." అంటూ అందరూ మళ్లీ ముఖ్తకంఠంతో ఏదో చెప్పబోతుండగా ...అక్కడ ఇక సమయాన్ని వృధా చెయ్యడం ఇష్టం లేక లేచి వెళ్ళబోతూ అందరినీ చూసి "ఒక్క సారి ఈ యాదృచ్చిక పరిస్థితిని గమనించండి .. భార్గవ్ కి ప్రాణం ఉంది, కానీ వైటల్ ఆర్గన్స్ పనిచెయ్యడం లేదు ...సుధీర్ కి ప్రాణం లేదు కానీ వైటల్ ఆర్గన్స్ ఇంకా పని చేస్తున్నాయి ... మరికొద్ది గంటల్లో చనిపోబోయే భార్గవ్ కి, మనమందరం ఆశలు వదిలేసుకున్న భార్గవ్ కి, సరిగ్గా కంపాటిబుల్ ఉన్న బ్రెయిన్ డెడ్ డోనర్ దొరకడం ఆశ్చరంగా లేదూ.. సుధీర్ మరణానికి ఓ అర్థం కల్పించడం దైవేచ్ఛ కావచ్చు ... ఇది జరుగుతుంది .."అంటూ వెళ్ళిపోయాడు డాక్టర్ రామకృష్ణ.

అవయవాల మార్పిడి ఆపరేషన్ విజవంతంగా పూర్తిచేశాడు డాక్టర్ రామకృష్ణ...
డాక్టర్  రామకృష్ణకి చేతులెత్తి నమస్కరించింది భార్గవ్ తల్లి ..
"నా వృత్తి ధర్మం నేను నిర్వహించాను .. కానీ ఇదొక మిరకిల్, అంత అరుదైన డోనర్ సరిగ్గా టైంకి దొరకడం నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది .. అతని చావు ఇంకొక వ్యక్తికి జీవితం ప్రసాదించిందని తెలిస్తే, సుధీర్ ఆత్మ తప్పక శాంతిస్తుంది .. అందుకే నేను ధైర్యంగా ముందడుకు వేశా.. చెప్పాలంటే ఓ రకంగా నీ కొడుకులో సుధీర్ జీవిస్తున్నాడు ...శరీరమే నీ కొడుకుది, కాని అందులో ఉన్న గుండె, కాలేయం, ఊపిరి తిత్తులు, కిడ్నీలు, స్పైనల్ కార్డ్ ...ఇవన్నీ సుధీర్ వి.." అన్నాడు డాక్టర్ రామకృష్ణ ..

ఓ నెల హాస్పిటల్ లో ఉన్న భార్గవ్ ని డిస్చార్జ్ చేసారు ...ఇంటికి వెళ్ళిన కొద్ది రోజుల తర్వాత డాక్టర్ ని కలవడానికి వచ్చింది భార్గవ్ తల్లి ...
"డాక్టర్ గారు, నా కొడుకు చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు ..." అందామె..
"ఏమైంది ?" అడిగాడు డాక్టర్ రామకృష్ణ 
"ప్రొద్దున్నే లేచాక ... తను కాలేజీకి వెళ్ళాలి అనేవాడు ... 'కాలేజీ ఎంటిరా? షాప్ కి వెళ్ళడం లేదా' అని అడిగాను ..వాడు కంప్యూటర్ సేల్స్ చేస్తుంటాడు.. 'ఏంటమ్మా...ఏం మాట్లాడుతున్నావ్.. షాప్ ఏంటి, నేను గీతంలో ఇంజనీరింగ్ చేస్తుంటే' అని అనేవాడు ...నాకు ఏమీ అర్థం కాలేదు ..వాడు కాలేజీకి అని వెళ్ళేవాడు ..సాయంత్రం వచ్చేవాడు..రాగానే చాలా దిగులుగా ఉండేవాడు ..ఏమైంది కన్నా అని అడిగితే 'సంహిత కనిపించడం లేదమ్మా... నన్ను మర్చిపోయిందేమో అని భయంగా ఉందమ్మా.. తను నా కోసమే ఎదురుచూస్తుంటుంది అని చెప్పవా?' అని వాడు అడుగుతుంటే నాకేమి చెప్పాలో అర్థం అయ్యేది కాదు ...రోజూ ఇదే తంతు...వాడి ప్రవర్తనలో కూడా ఎన్నో మార్పులు .." అంటూ చెప్పుకొచ్చింది భార్గవ్ తల్లి ..
డాక్టర్ కొద్దిసేపు ఆలోచించి ... ఒక ఫైల్ ఓపెన్ చేశాడు..అది సుధీర్ బ్రెయిన్ డెడ్ & ఆర్గన్ ట్రాన్స్ ప్లాంట్ కి సంబంధిన ఫైల్... అందులో సబ్జక్ట్ హిస్టరీ కూడా రాసుంటుంది .. అతను అదంతా మళ్లీ ఓ సారి చదివి ...ఆమెతో " నేను చెప్పేది జాగ్రత్తగా వినండి .. ఒక వ్యక్తి వైటల్ ఆర్గన్స్ ఇంకొక వ్యక్తికి డొనేట్ చెయ్యడం వల్ల, డొనర్ కి ఉన్న కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ట్రాన్స్ ప్లాంట్ చెయ్యబడ్డ పేషంట్ కి వస్తాయి ..ఇవి కేవలం వైటల్ ఆర్గన్స్ - గుండె, కాలేయం, ఊపిరి తిత్తులు, కళ్ళు  మొదలైనవి ట్రాన్స్ ప్లాంట్ చెయ్యడం మూలాన మాత్రమె వస్తాయి .. ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్.. కానీ అన్ని కేసెస్ లో రావాలని లేదు ... అందుకే నేను మొదట మీకు ఎటువంటి హెచ్చరికా చెయ్యలేదు... మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే, సుధీర్ క్యారెక్టరిస్టిక్స్ భార్గవ్ లో చాలా స్థిరంగా నాటుకున్నాయేమో అనిపిస్తుంది .. సుధీర్ గీతం కాంపస్ స్టూడెంట్.. అతనికి కార్తీక్, సంహిత చాలా బెస్ట్ ఫ్రెండ్స్ .. ఈ విషయాలన్నీ మా టీం కేస్ స్టడీ కోసం కాలేజీకి వెళ్లి గేదర్ చేసింది  .. భార్గవ్ ఐడింటిటి కన్నా అతనిలో సుధీర్ ఐడింటిటి బలంగా ఉంది ..." అన్నాడు 
"ఇప్పుడు ఏం చెయ్యాలి డాక్టర్ ..." అడిగిందామె అయోమయంలో..
"మీరు అతన్ని సుధీర్ లాగానే గుర్తించండి ... సంహిత ఎవరో తెలిసినట్లే ప్రవర్తించండి.. అతని మనఃస్థితి అలాగే ఉండనివ్వండి...నేను దీనికి కొన్ని సైకలాజికల్ థెరపీలు రికమండ్ చేస్తాను... " అన్నాడు డాక్టర్ ...

************ ప్రస్తుతం ********************

అలా తలపట్టుకొని క్రింద పడిపోయిన భార్గవ్ ని హాస్పిటల్ లో చేర్చాడు కార్తీక్... అక్కడి డాక్టర్ భార్గవ్ కి ఏవో పరీక్షలు చెయ్యగా అతని వైటల్ ఆర్గన్స్ అన్నీ ట్రాన్స్ ప్లాంట్ చెయ్యబడ్డవే అని గుర్తించి కార్తీక్ కి చెప్తాడు అదే విషయం.. అది కార్తీక్ కి చాలా షాకింగ్ గా అనిపించింది .. 'ట్రాన్స్ ప్లాంట్ చెయ్యబడ్డ ఆర్గన్స్ ఎవరివో ట్రేస్ చెయ్యవచ్చా' అని కార్తీక్ డాక్టర్ ని అడిగాడు.. డాక్టర్ ప్రయత్నించవచ్చు అని చెప్పి, అన్ని మేజర్ హాస్పిటల్స్ కి కాల్ చేసి ఈమధ్య జరిగిన మేజర్ బాడిలీ ట్రాన్స్ ప్లాంట్స్ గురుంచి యంక్వయిరీ చేశాడు..

"మిస్టర్ కార్తీక్... ఈ మధ్య జరిగిన మేజర్ బాడిలీ ట్రాన్స్ ప్లాంట్ - ఆల్ వైటల్ ఆర్గన్స్ ట్రాన్స్ ప్లాంట్...ఇది చాలా అరుదు .. ఇతనికి కూడా అన్ని వైటల్ ఆర్గన్స్ ట్రాన్స్ ప్లాంట్ చెయ్యబడ్డాయి ...సో, ఇతనిదే ఆ మేజర్ ట్రాన్స్ ప్లాంట్ అయ్యుండొచ్చు ... ఆ పేషంట్ పేరు భార్గవ్ అని తెలిసింది ..." అన్నాడు డాక్టర్ 
"ఏ వ్యక్తి ఆర్గన్స్ ట్రాన్స్ ప్లాంట్ చేశారో మనం తెలుసుకోవచ్చా?" అడిగాడు కార్తీక్ 
"అది హాస్పిటల్ వాళ్ళు గోప్యంగా ఉంచుతారు...అయినా నేను ప్రయత్నిస్తాను .." చెప్పాడు డాక్టర్ 
"థాంక్ యు డాక్టర్ ...ఇది నా నెంబర్...మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ దొరికితే నాకు చెప్పండి " అని తన నెంబర్ ఇచ్చాడు కార్తీక్ ..

                                        ****
"వాట్?? ఏంటి నువ్వనేది ??" ఆశ్చర్యంగా చూసింది సుధ
"నిజం...అతను అచ్చు సుధీర్ లాగానే ప్రవర్తించడమే కాదు ...నన్ను, దివ్యని గుర్తుపట్టాడు .. సంహిత గురుంచీ అడిగాడు .. సంహితని కలిశాడట.." చెప్పాడు కార్తీక్ 
"అసలిదెలా సాధ్యం ..అయోమయంగా ఉంది " అంది సుధ ఆశ్చర్యపోతూ..
"అతని ముఖ్య అవయవాలు అన్నీ ట్రాన్స్ ప్లాంట్ చెయ్యబడ్డాయి ...అతని పేరు భార్గవ్ అట"..
ఇంతలో కార్తీక్ కి ఒక కాల్ వచ్చింది ...
"వాట్ ?" కార్తీక్ నోట మాట రాలేదు అవతలి వ్యక్తి చెప్పింది విని...
"ఏమయింది ?" అడిగింది సుధ
"భార్గవ్ అవయవాల డోనర్.........సుధీర్ " చెప్పాడు ఏదో ట్రాన్స్ లో ఉన్నవాడిలా..
"ఏంటి నువ్వు మాట్లాడేది ..." అందామె షాక్ తగిలిన దానిలా ...
"మనం వెంటనే భార్గవ్ ని కలవాలి .." అన్నాడు కార్తీక్....
"ఎందుకు .... అతనికి మొత్తం చెప్పేస్తావా ?" అడిగింది సుధ ...
"లేదు...అతను ఇప్పుడు తను సుధీర్ అనుకుంటున్నాడు ...అతన్ని సుధీర్ గానే మనమూ చూడాలి...నేను తన స్నేహితుడిగానే అతన్ని కలుస్తాను ... కానీ ...సంహితకి అన్ని విషయాలూ తెలియాలి ...సంహితకి తను ప్రేమించిన సుధీర్ గురుంచి తెలియాలి ... సుధీర్ అవయవాలతో బ్రతుకుతున్న భార్గవ్ గురుంచీ తెలియాలి .... ఇకనుంచి ఏమి చెయ్యాలో నాకు అర్థం అయింది ...." అన్నాడు కార్తీక్ ధృడంగా నిశ్చయించుకున్న వాడిలా ....

[To be continued in the 9th part...have a great day - Ramakrishna Reddy Kotla]