Search This Blog

Sunday 18 July, 2010

కిట్టిగాడు loves ఎదురింటి అమ్మాయి - 3


కిట్టిగాడు సుస్మీకి, ప్రొద్దుటినుంచి బట్టీపట్టి రాసుకున్న పేపర్ జేబులోనుండి బైటకి తియ్యకుండా..ఆ జావా కాన్సెప్టులు మొత్తం గడగడా అప్పజెప్పి సోఫాలో కూలబడ్డాడు ...

"క్రిష్ణ గారు...మీరు చెప్పింది నాకు అస్సలు అర్థం కాలేదు...చాలా డౌట్స్ ఉన్నాయి.." అంది సుస్మిత తెగ బాధపడిపోతూ...
'రాజు గాడు ప్రొద్దున చెప్పిన కాన్సెప్టులని ఇప్పటిదాకా బట్టీపట్టి దీనికి అప్పజెప్పడమే పెద్ద విషయం... పైగా మళ్ళీ దాంట్లో డౌట్లా??..అసలు నాకు అర్థమవుతే కదా దీనికి డౌట్స్ క్లియర్ చెయ్యడానికి...మరేం పర్లేదు,అన్నీటికీ ఆ భగవంతుడే ఉన్నాడు..' అనుకోని...."అసలు నీకు ఏం అర్థంకాలేదు?" అన్నాడు
"ఏమీ అర్థం కాలేదు... ఆవాహం చేసుకోవడం ఏంటీ?...అవతారాలు ఏంటీ??..మా సర్ ఇలా చెప్పినట్లు గుర్తులేదే..!!" అంది..
"అంటే...సుస్మీ...మేము ప్రతీదాన్ని చాలా ప్రాక్టికల్ గా ఆలోచిస్తాము కాబట్టి...నీకు అలా సులభంగా చెప్పాను..."
"సులభంగా చెప్తే అర్థం కావలి కదా.." అంది కళ్ళింతవి చేస్తూ...
కిట్టిగాడి చిర్రెత్తింది..... కంట్రోల్ కంట్రోల్ అనుకుంటూ...
"సరే...ఇప్పుడు నీకెలా చెప్పాలంటావ్??.."

"ఒక కాన్సెప్టు తీసుకొని...దాని డెఫినిషన్ చెప్పండి..రియల్-టైం ఎగ్జాంపుల్ ఒకటి ఇవ్వండి..ఒక ప్రాక్టికల్ ప్రోగ్రాం రాసి చూపించండి..అప్పుడు పూర్తిగా అర్థమవుతుంది..."
కిట్టిగాడికి పాయసం తాగుతుంటే పచ్చిమిర్చి నమిలినట్లు అనిపించింది...మంటగా చూసాడు సుస్మీ వైపు... 'ఇప్పుడెం చెయ్యాల్రా బాబూ.. అంత సీన్ ఉంటే గీతంలో పది కాలాల పాటు స్టూడెంట్ నెం.1 గా వెలిగిపోదును..' అనుకుంటూ..'రాజు గాడికి మళ్ళీ ఫోన్ చేస్తే..ఎస్..ఇప్పుడదే బెటర్..' అనుకొని "సుస్మీ...అలాగే చెప్తాను...దాహంగా ఉంది...కొంచెం కాఫీ ఇస్తావా..?" అన్నాడు..
"కాఫీనా .. లేకపోతే వాటారా?" అంది అయోమయంగా 
"ఏం...మీ ఇంట్లో కాఫీ పొడి లేదా.."
వాడి వైపు ఓ దిక్కుమాలిన చూపు విసిరి "ఉంది..పారబోయలేదు...మీరు దాహంగా ఉంది అన్నారు కదా అని..వాటారా అని అడిగా.."
కిట్టిగాడికి రిటైర్ అయిన అంకుల్స్ అన్నా...సెటైర్ వేసే అమ్మయిలన్నా చిరాకు..
"నాకు దాహం వేస్తే...కాఫీ తాగుతా.." అన్నాడు సీరియస్సుగా..
'వీడెక్కడి తిక్కల బొంత' అనే లుక్కోటి ఇచ్చి కిచెన్ లోకి వెళ్ళింది సుస్మీ...
"తొందరేం లేదు..నిదానంగానే పెట్టు కాఫీ.." అంటూ వాళ్ళింటి బాల్కనీ లోకి వెళ్లి సెల్ తీసి రాజు గాడి నెంబర్ కొట్టాడు..

"హలో..కిట్టిగా...సుస్మీని కాన్సెప్టులతో ఫ్లాట్ చేసి...దాని హార్ట్ లో ఫ్లాట్ కొన్నావా లేదా.." అన్నాడు రాజుగాడు..
"రాజుగా...మనకి టైం చాలా తక్కువుంది..పొద్దున్న చెప్పిన కాన్సెప్టులకి...డెఫినిషన్, రియల్-టైం ఎగ్జాంపుల్, ప్రోగ్రాం..ఇవన్ని నాకొక అయిదు నిముషాల్లో కనుక్కొని చెప్పగలవా??"
రాజుగాడికి  వాడేం వింటున్నాడో అర్థం కాగానే...మైల్డ్ నుంచి స్ట్రాంగ్ దాకా వేరీ అవుతూ కొట్టిన షాక్ నుంచి వెంటనే తేరుకొని "ఓరి కిట్టిగా...నీకు సుస్మీని చూసి చూసి మతి గానీ భ్రమించిందా?.. లేక నేనేమన్నా జావాలో జాతీయ గీతం రాశాననుకున్నావా?..పొద్దున్న నువ్వు చెప్పినవి, ఆడినీ ఈడినీ కనుక్కొనేసరికే రెండు గంటలు అయ్యింది ...ఇప్పుడు నువ్వు చెప్పినవి కనుక్కొని...వాటిని నేను అర్థం చేసుకొని..తమరికి అర్థమయ్యేలా చెప్పాలంటే మినిమం ఒక రోజు పడుతుంది...అసలు ఈ పాటి హోంవర్క్ మన చదువు కోసం మనం చేసుకోనుంటే, గోల్డ్ మెడల్ వచ్చేదేమో"..
"ఒక రోజంటే కష్టం భే...నేను ఇప్పుడు ఆ పిల్ల ఇంట్లోనే ఉన్నా...నువ్వు నాకు చెప్పింది, మక్కీకి మక్కీ చెప్పాను దానికి...ఒక్క ముక్క కూడా అర్థం కాలేదంట...పైగా, రియల్-టైం ఎగ్జాంపుల్ కావలంట.."
"రియల్-టైం ఎగ్జాంపుల్ అంటే ...!!"
"ఏమో ఎవడికి తెలుసు...అది కూడా తెలుసుకొని చెప్పు ..."
"దాన్ని తెలుసుకోడానికి ఇంకొకడిని అడగాలా..రియల్ టైం ..అంటే నిజంగా పనిచేసే టైం ..అంటే, బొమ్మ కాకుండా నిజంగా పనిచేసే వాచ్...అలా నిజంగా పనిచేసే వాచ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఈ కాన్సెప్టులు చెప్పమంటుందేమో..."
"వార్నీ...నువ్వు ఎంతైనా మన గ్యాంగులోనే తెలివైనోడివిరా...అయినా వాచ్ ఎందుకురా..ఏకంగా విష్ణుమూర్తినే ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం కదా ..."
"ఎవరి ఇష్టాలు వాళ్లవి...ఆ పిల్లకి వాచ్ అంటే ఇష్టమేమో ..."
"సర్లేగాని ఇప్పుడెలారా..ఓ రోజంటే కష్టం..."
"కిట్టిగా..ఎద్దులా పెరిగావ్...ఆమాత్రం పిల్ల దెగ్గర మేనేజ్ చెయ్యలేవా..." అనేసరికి కిట్టిగాడికి వాడిమీద వాడికే అసహ్యమేసి ఫోన్ పెట్టేసి, దీర్ఘాలోచనలో పడ్డాడు ...

"ఏంటి ఇక్కడ ఉన్నారు ..." అంటూ కాఫీ కప్పుతో వచ్చింది సుస్మిత ...
"ఏం లేదు...వ్యూ బాగుంటే చూస్తున్నా ..." అన్నాడు కాఫీ కప్పు అందుకుంటూ ...
అటువైపు ఎదురుగా ఒక ఆంటీ బట్టలు ఆరేస్తుంది మాగ్జిమం ఎక్సుపోజు చేస్తూ ....
అంతే కిట్టిగాడి వైపు దరిద్రంగా ఓ లుక్కిచ్చింది సుస్మీ ...
కిట్టిగాడికి విషయం అర్థమయ్యి ..."ఛీ ..ఛీ..వ్యూ అంటే అది కాదు ...ఐ మీన్ అస్తమిస్తున్న సూర్యుడు...ఆ ఆకాశం...ఆ నీలి మబ్బులు...ఆ కొబ్బరి చెట్లు..." అంటూ చెయ్యి చాపి చూపిస్తున్నాడు ..."ఎవడ్రా నువ్వు నాకేసి చెయ్యి చూపిస్తున్నావ్ ..."అంటూ వచ్చిన అరుపు ఎటువైపు నుంచి వచ్చిందో అర్థమయ్యేసరికి సెకండులో వందో వంతు టైం కల్లా హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుకున్నాడు..లైట్ గా చెమటలు పట్టాయి కిట్టిగాడికి... సుస్మీ వాళ్ళమ్మ టీవీ చూస్తూ ఇంకా ఏడుస్తూనే ఉంది.. లేడీస్ ఇలా సీరియళ్ళు చూస్తూ ఏడుపు ప్రాక్టీసు చేస్తారేమో అనిపించింది కిట్టిగాడికి ...మెల్లిగా నవ్వుకుంటూ వచ్చింది సుస్మిత కిట్టిగాడి కంగారు చూసి..

"కృష్ణ గారు...దాహం తీరిందా...ఐ మీన్ కాఫీ సరిపోయిందా...ఇంకో కప్పు కావాలా ..?" అంది, వాడు జీవితాంతం గోడకేసి తల బాదుకున్నా అర్థంకాని లుక్కోటి విసిరేస్తూ ...
'జావా అయినా ఈజీగా అర్థం చేసుకోవచ్చేమో కాని, దీని లుక్కుల్లో పరమార్థం అర్థం కావట్లేదురా బాబూ...' అనుకుంటూ "చాలు ...." అన్నాడు...
"కృష్ణ గారు...." అంటూ ఏదో అనబోతుండగా ...
"కాల్ మీ కిట్టూ ..." అన్నాడు
"అలాగే ...కిట్టూ గారు ..."
"కిట్టూ గారు కాదు ....కిట్టు "
"కిట్టూ ...." అని లైట్ గా సిగ్గుపడి ..."బాబోయ్... అలా పిలవడం కష్టమేనండీ బాబు ..." అంది బుగ్గలు ఎరుపెక్కగా ...
కిట్టిగాడికి ఆ పిల్ల సిగ్గు పడటం చూసి తెగ సిగ్గేసేసింది...
"అలవాటవుతుందిలే...." అన్నాడు ...
"నేను నా సిస్టంలో జావా లోడ్ చేశాను... కొన్ని ప్రోగ్రామ్స్ కి మీరు ఇప్పుడు నాకు లాజిక్ చెప్పాల్సిందే...అలాగే ఆ కాన్సెప్టులకి ఇప్పుడు రియల్-టైం ఎగ్జాంపుల్స్ చెప్పరా ప్లీజ్..." అంది..
కిట్టిగాడికి సుస్మిత ఆ క్షణం ఎందుకో తెగ ముద్దోచ్చేసింది...
"నీకు ఏ వాచ్ ఇష్టం...దాని మీదే ఎగ్జాంపుల్స్ చెప్తాను ..." అన్నాడు..
"వాచ్ మీద ఎగ్జాంపుల్స్ ఏంటి ?? ...."
"అదే రియల్ టైం అన్నావు కదా... అంటే వాచ్ అని నాకు తెలీదు అనుకున్నావా ఏంటి ..??" అన్నాడు కళ్లెగరేస్తూ..
"హా హా హా....మీరు భలే జోకులు వేస్తారే ..." అంది నవ్వుతూ ...
'అమ్మనీ...కొంపదీసి రియల్ టైం అంటే వాచ్ కాదా?...ఈ పిల్ల నవ్వేస్తుందేంటి?...ఓరి రాజుగా సచ్చావురా నా చేతిలో...కొద్దిగుంటే అడ్డంగా దొరికిపోయేవాడిని దీనికి...' అనుకొని...ఓ క్షణం సీరియస్ గా చూస్తున్నట్లు నటించి...వెంటనే గోళీ సోడా కొట్టినట్లు ఫక్కున నవ్వేస్తూ ..."హా హా ..కదా...మా గ్యాంగ్ కూడా అదే అంటుంటారు..నే వేసే జోకులకి వాళ్ళంతా కింద పడీ పడీ నవ్వి నవ్వి కడుపు ఉబ్బిపోయి, ఒక రొండు రోజులు ఏమీ తినేవాళ్ళు కాదు పాపం ..." అన్నాడు ...
"ఐ లైక్ హ్యూమర్ సెన్స్ ఇన్ గైస్ ..." అంది డెబ్బై శాతం అందమైన నవ్వులో ముప్పై శాతం సిగ్గు కలుపుతూ ...
'కిట్టిగా...పిల్ల నిన్ను లైక్ చెయ్యడం మొదలెట్టింది...కమాన్ ...ఇక తగ్గకూడదు ...ఏదోటి చేసెయ్..' అంటూ మనసనే జూనియర్ కిట్టిగాడు యంకరేజ్ చేశాడు ...
"దెన్...యు లైక్ మీ....?" అన్నాడు గోళ్ళు కొరుక్కుంటూ ...
"యా...వై నాట్...మీలో కూడా మంచి హ్యూమర్ సెన్స్ ఉంది ..."
"కూడా నా ??...అంటే ?"
"యా కిరణ్ కూడా అంతే ....చాలా హ్యూమరస్...the best guy i have ever come across is kiran... మై క్లాస్ మేట్...చాలా సపోర్టివ్...తనంటే నాకు చాలా ఇష్టం ..." అంది ...
కిట్టిగాడిలో వెయ్యి వోల్కెనోలు..లక్ష భూకంపాలు ఆల్రడీ అలజడి మొదలెట్టేసాయి ....
"అంటే కిరణ్ ...??" అన్నాడు ఏదో టాన్స్ లో ఉన్నట్లుగా ...
ఆ పిల్ల వెంటనే సిగ్గు పడింది...మనోడికి చిరాకేసింది...వెంటనే ఆడి జీవితం మీద ఆడికే విరక్తి పుట్టింది...దేవుడి మీద ఎక్కడలేని కోపం వచ్చింది..ఎందుకో రాజు గాడికి కాల్ చేసి ప్రపంచంలో ఉన్న అష్ట దరిద్రపు తిట్లన్నీకలిపి వాడిని తిట్టాలనిపించింది...మొదటి సారీ లైఫ్ లో జన్యూన్ గా కంట్లోంచి ఒక డ్రాప్ రాలడానికి సిద్ధంగా ఉంది కిట్టి గాడికి ....

టీవీ లో "మెట్టెల సవ్వడీ..ఓ ఓ ..మెట్టెల సవ్వడీ...మెడలో మాంగల్యం..." అంటూ సాంగు...దానితో పాటే సుస్మీ వాళ్ళమ్మ ఏడుస్తూ ముక్కు చీదుకుంటున్న శబ్దం మంద్రంగా వినిపిస్తుంది కిట్టిగాడికి .....




[Meet you all soon next week.................................. Ramakrishna Reddy kotla]

37 comments:

Harish said...

Ante Kittu di failed love story na ? I wont accept it.
I pray for kittu's success. :)

..nagarjuna.. said...

చెప్పకూడదు కాని పోస్టు మొదలైందగ్గరనుండి too much laughing... :))
>>రిటైర్ అయిన అంకుల్స్ అన్నా...సెటైర్ వేసే అమ్మయిలన్నా చిరాకు..<<
ఇది చదవగానే బ్రహ్మి డైలాగోటి గుర్తొచ్చింది " గట్స్‌లేని మగాళ్లన్నా గాజుల్లేని ఆడొళ్లన్నా నాకు అసహ్యం.." హ హ్హ హ

‘జావాలొ జాతీయ గీతం’, ‘రియల్ టైమ్’ కాన్సెప్టు యమా నవ్వించాయి

Sai Praveen said...

కిట్టి గారు... సారీ కిషెన్ గారు ;)
చాలా బావుంది. waiting for next episode.

నేస్తం said...

:)))జావాలో జాతీయ గీతం... రియల్ టైం వాచ్ ... భలే రాస్తున్నారు ..

3g said...

"డెబ్బై శాతం అందమైన నవ్వులో ముప్పై శాతం సిగ్గు కలుపుతూ ..." :-)

ఇంతకీ విషాదంగా ముగించేసారా లేక ఇంకో పార్ట్ ఉందాండి.

sphurita mylavarapu said...

జావా లో జాతీయగీతం...superb :D

sunita said...

హహహ! అందరూ చెప్పేసారు. ఐనా "జావాలో జాతీయ గీతం" మాత్రం హైలెట్:-)

సతీష్ said...

సూపర్,బంపర్ కామెడీ. చాలా నవ్వించేసారు. అసలు కొన్ని డైలాగ్స్ అందరూ చెప్పినట్లు చాలా హైలెట్ గా ఉన్నాయి..

>>కిట్టిగాడికి పాయసం తాగుతుంటే పచ్చిమిర్చి నమిలినట్లు అనిపించింది...మంటగా చూసాడు సుస్మీ వైపు..
>>నాకు దాహం వేస్తే...కాఫీ తాగుతా..
>>నేనేమన్నా జావాలో జాతీయ గీతం రాశాననుకున్నావా?
>>అసలు ఈ పాటి హోంవర్క్ మన చదువు కోసం మనం చేసుకోనుంటే, గోల్డ్ మెడల్ వచ్చేదేమో
>>రియల్ టైం ..అంటే నిజంగా పనిచేసే టైం ..అంటే, బొమ్మ కాకుండా నిజంగా పనిచేసే వాచ్
>>కిట్టిగా..ఎద్దులా పెరిగావ్...ఆమాత్రం పిల్ల దెగ్గర మేనేజ్ చెయ్యలేవా..

హా హా హా ...ఇవ్వన్నీ సూపర్బ్..తరువాయి భాగం ఉందా లేక ముగించేసారా?

divya vani said...

జావా లో జాతీయగీతం ,super kishan gaaru.
papam kittigadu ! kompateesi edustada kishan gaaru?

దుర్గా రామాంజనేయులు said...

అన్నా... సూపరు సీరియల్. కామెడీ అదుర్స్. మొత్తం మూడూ ఒకేసారి చదివేశాను. తర్వాత పార్ట్ కోసం వెయిట్ చెయ్యాల్సిందేనా...

అయినా ఇదేం బాలేదన్నా. పార్ట్ పార్ట్ కీ గ్యాప్ పెంచేస్తున్నావ్... ఇలా అయితే నేనొప్పుకోనంతే...

Rishi said...

చాలా రోజుల నుండీ మీ బ్లాగు వైపు రావట్లేదు. ఈరొజు కూర్చుని కిట్టిగాడి కధ మొత్తం చదివేసా.బాగుంది ఫన్నీ గా,కాకపోతే నాకొక డవుటు కిట్టిగాడు అంటే,ఇది మీ స్టొరీ నా ఏమిటి?(అంటే,మీరు జావా లో మరీ అంత వీక్ అని నా ఉద్దేశ్యం కాదు సుమా :) )

కవిత said...

కిషన్,జావా లో జాతీయ గీతం ...ఎం అయిడియ ....అసలు ఎలా వస్తాయి అండి బాబు???....
సూపర్ కామెడీ ...
ఏంటి రియల్ టైం అంటే ఏంటి ????బాబు నవ్వి నవ్వి చచ్చాను .....నాకు కూడా జావాలో రియల్ టైం Example కావాలి...కొంచం imported ఐతే బాగుంటుంది...కిట్టు కి చెప్పి తెప్పించరు ...

Ram Krish Reddy Kotla said...

హరీష్: ఫెయిల్ అయిని అప్పుడే చెప్పలేను..చూద్దాం..ఇంకో రెండు భాగాలు ఉంటుంది కథ :)

చారి: బ్రహ్మి డైలాగ్ "బొట్టు లేను ఆడాళ్ళన్నా...గట్స్ లేని మొగాళ్ళన్నా నాకు చిరాకు.." అని వస్తుంది...నా కాన్సెప్టులు నచ్చినందుకి ధన్యవాదాలు :)

ప్రవీణ్: మీరు కావాలనే అన్నారు లెండి :)...కానీ కిట్టూకి నాకు ఎటువంటి పోలికా లేదు :).. థాంక్స్ :)

Ram Krish Reddy Kotla said...

నేస్తం: ధన్యవాదాలు :)

త్రీజీ: విషాదంగా ముగించలేదు..ఇంకో పార్ట్ ఉంది :)

స్పురిత: ధన్యవాదాలు :)..ఈ "జావాలో జాతీయగీతం.." అనే డైలాగ్ ఇంత మందికి నచ్చినందుకు చాలా హాపీగా ఉంది :)

Ram Krish Reddy Kotla said...

సునీత: థాంక్స్ అండి :)

సతీష్: నచ్చిన డైలాగ్స్ కోట్ చేసినందుకు ధన్యవాదాలు ...ఇంకో పార్ట్ ఉంది :)

దివ్య: థాంక్స్..ఎదుస్తాడేమో..చూద్దాం తర్వాత పార్ట్ లో :)

Ram Krish Reddy Kotla said...

దుర్గా రామాంజనేయులు: థాంక్స్ అన్న..గ్యాప్ అంటే, ఏం చేస్తాం ఈ ఉద్యోగం అలాంటిది..హమ్..ఒక వారం అయినా గ్యాప్ తప్పనిసరి అవుతుంది :(

రిషి:థాంక్స్...ఇకపోతే కిట్టిగాడు నేను కాదు...కానే కాదు..మీకు ఆ డౌటే అవసరం లేదస్సలు..ఇది పూర్తి ఫిక్షన్ :)

కవిత: థాంక్స్ అండి..ఏదో అప్పుడప్పుడు అలా అవిడియాలు వచ్చేస్తుంటాయి..అలాగే మీకో రియల్ -టైం ఎగ్జాంపుల్ కిట్టిగాడిని అడిగి చెప్తాలెండి :)

Anonymous said...

package com.india;

public class India {
public static void main(String[] args) {
new India().writeJaateeyageetam();
}
public void writeJaateeyageetam() {
System.out.println("జాతీయగీతం");
}
}

Ram Krish Reddy Kotla said...

అజ్ఞాత: సూపర్ అండి..కత్తి..కేక..కొడవలి..అసలు జావాలో జాతీయగీతాన్ని, ఇలా "జాతీయ గీతం" అనే పదాన్ని అవుట్-పుట్ తీయాలనే అవిడియా రావడం..ప్రోగ్రాం రాసేయ్యడం..అబ్బో మీరు సూపరు..ఇంకా సుస్మీ అడిగిన ప్రోగ్రాములు కొన్ని ఉన్నాయి, అవి మీకు పంపించేస్తా..ఎంచక్కా వాటికి కూడా కోడ్ రాసిచ్చేయండి..నేను..సారీ..కిట్టిగాడు.. సుస్మీ దెగ్గర పోజు కొట్టేస్తాడు :)..మీరు పేరు రాసి ఉండాల్సింది :)

Anonymous said...

నీ పొగడ్తలకి సిగ్గేసేస్తొందన్నో, నేనే కిరణ్ ని, అసలు సుస్మీని పడగొట్టింది ఈ జాతీయగీతం తోనే !!!

Ram Krish Reddy Kotla said...

ఓహో కిరణ్.. అయితే...నా ఎనిమీ..సారీ కిట్టిగాడి ఎనిమీ..అయినా నీకు సుస్మీ పడింది అని, ఎలా అనేసుకున్నావ్ అన్నాయి...నేను ఇంకా ఆ పాయింట్ దాటలేదు కథలో.. :) చూద్దాం...కిట్టిగాడు వర్సెస్ కిరణ్ :))

ప్రణీత స్వాతి said...

"హా హా ..కదా...మా గ్యాంగ్ కూడా అదే అంటుంటారు.. నే వేసే జోకులకి వాళ్ళంతా కింద పడీ పడీ నవ్వి నవ్వి కడుపు ఉబ్బిపోయి, ఒక రొండు రోజులు ఏమీ తినేవాళ్ళు కాదు పాపం ..."

ఇక్కడ మా పరిస్థితి కూడా సేం టు సేం. చాలా బాగుందండీ..వెయిటింగ్..ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్..!!

Ram Krish Reddy Kotla said...

ప్రణీత మిమ్మల్ని అంతగా నవ్విస్తున్నందుకు నేను ధన్యుడిని.... థాంక్స్ :-)

శివరంజని said...

కిషన్ గారు ....ఎంత బాగ రాసారో చెప్పమంటారా సార్? మీరు రాసిన పోస్ట్ కి దీటుగా కామెంట్ పెట్టడం కూడా చేత కావడం లేదు నాకు ...(చెప్పడానికి మాటలు లేవు కేవలం నవ్వులే) బాగుంది ... చాల బాగా నవ్వించారు అనే కామెంట్స్ కి దాటి ఎదిగిపోయారు...


ఇకపోతే సుస్మీ కోసం పడే కష్టాలు చూసి మనసు తరుక్కుపోతుంది... ప్చ్.. పాపం కిషన్ గారు ...సారీ సారీ కిట్టిగాడు ...హుమ్మ్ ఎవరైతే ఎమిటి లే ఇద్దరు ఒకటే కదా ???????

Ram Krish Reddy Kotla said...

రంజనీ నువ్వు పదే పదే నన్ను కిట్టూతో పోల్చి నా మనోభావాలు తీవ్రంగా దెబ్బతీస్తున్నావు..:)..ఇది సహించజాల..ఏదైనా నీ కాంప్లిమెంట్ లాంటి కామెంట్ కి థాంక్స్ :)

కృష్ణప్రియ said...

చాలా బాగా రాస్తున్నారు. 80ల్లో జంధ్యాల సినిమా లో రాజేంద్రప్రసాద్ గుర్తొస్తున్నాడు కిట్టిగాడి పాట్లు చదువుతుంటే..

Ram Krish Reddy Kotla said...

కృష్ణప్రియ గారు ధన్యవాదాలు.. జంధ్యాల సినిమాల్లో రాజేంద్రప్రసాద్ గుర్తొచ్చాడు అని మీరు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది :-)

Anonymous said...

kitti gaadiki anyaayam jaragadaaniki veelleduuuu

saati premikudi baadha oka preminche hrudayaaniki maatrame telustundhi...

vache episode lo ayina susmi kitti gaadi premani ardam chesukovalani korukuntu.... oka premikudi aavedana

Ram Krish Reddy Kotla said...

Anonymous: I hope kittigadu wins the heart of susmi one day..am sure of dat..:-) mee avedana artham chesukunna..me peru chepte bagundedi :)

Anonymous said...

paina anonymous ni nene..

future lo meeru pedda writer ayithe me pakkana me rates and dates chuse place lo kerchief vesina vaadini

Ram Krish Reddy Kotla said...

haha kalyan ...its YOU dude..thanks a lot for ur encouragement :-)

priya... said...

hey nice blog....chala nachesindi....me comparision chala bagunnai....a ammai chupulu anni nijanga pedutundo ledo kani meru cheppe matalaki chachinattu petalsinde....really nice blog...payasam lo pachimirchi...retired uncles....satired ammais........wonderful........chala bagundi...waiting 4 next blog....unta....

Unknown said...

కిట్టు కాలేజీ కి వెళ్ళిపోయాడ మళ్ళి ఎప్పుడు వస్తాడు.
లేక సుష్మ .NET కి shift ఆ...
waiting for next post...........

అనామిక said...

ఇన్ని రోజులు కిట్టిగాడు బాగ జావా నెర్చెసుకున్నట్టున్నాడు,, ఇంక వచెయ్యమంది సుష్మి దగ్గరికి అదరగొట్టెయ్యొచ్చు ఇంక,,,,ఐనా రెందు గంటల్లొ అంత నెర్చుకున్న వాడు ఇప్పటికి జావా లొ జాతీయ గీతం ఎప్పుడొ రాసెసి ఉంటాడు, ఇంకా ఎందుకు ఆలస్యం ..

Anonymous said...

babu rama krishsna gaaru, really tired waiting for next part. tvaragaa raasi punyam kattuko babayya !

- your fan: seetha mahalakshmi

Ram Krish Reddy Kotla said...

prasanna: Next post will come soon.

త్రుప్తి: త్వరలోనే కిట్టిగాడు మీ ముందుకు వచ్చేస్తున్నాడు...రడీగా ఉండండి :-)

సీతమహాలక్ష్మి గారు, త్వరలోనే రాస్తాను..ఈ మధ్య పనుల వల్ల కుదరలేదు.. మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు నన్ను క్షమించాలి..

Nagaraju said...

Hi,
Visit my Blog : http://gsystime.blogspot.com/ ...

వ్యాఖ్యాత: :Nagaraju బ్లాగు :ఆలోచనా తరంగాలు టపా : తొలగిన శుక్రుని కరుణ వ్యాఖ్యనించిన తేది: 02-09-10 04:38:12

Hi,
Visit my Blog : http://gsystime.blogspot.com/

This is having spiritual and general society information.
The way of thinking of thoughts are wonder with my intent to write the Blog.
I written from 2009 December onwards.
I wtitten in Telugu and English languages (In English few things are wrote).
Main Topics covered from Dec 2009 (Note: Important topics I mentioned before
the title as symbol of '*').
Main Topics are : (Read in order to better understand)
Tel - (Dec, 2009) 'samaajaanni maarchagalavaa maaragalavaa'
Tel - (Jan, 2010) ' * kshanam antaa telisipoyenaa'
Eng - (Jan, 2010) ' * Second - Everything Knows'
Eng - (Jan, 2010) ' * How Brain Works'
Eng - (Jan, 2010) ' * Where Dream World?'
Eng - (Jan, 2010) ' * Why the Food?'
Eng - (Jan, 2010) ' * About Soul - Six Sense's '
Tel - (Feb, 2010) ' * Jana ganamuna'
Tel - (Feb, 2010) ' * Prakrutigaa panchaboothamulu yelaa '
Eng - (Feb, 2010) ' * How Nature starts in Universe '
Tel - (Feb, 2010) ' * Medhassu yelaa pani chestundi? '
Tel - (Feb, 2010) ' * Kalala lokam yekkada? '
Tel - (Feb, 2010) ' * Aahaaram enduku? '
Tel - (Feb, 2010) ' * Aatma - Aaru "yeruka"lu '
Tel - (Feb, 2010) ' * Nidra Yelaa Vastundi? '
Tel - (Feb, 2010) ' eenaadu nedai rojugaa '
Tel - (Mar, 2010) ' * Neti samaaja sthiti yevariki '
Tel - (Jun, 2010) ' Hithamu palikinatlu chetulu - Caption: "Aatmgnaanam
chendavaa shwaasa neelone kadaa!" '
Tel - (Jul, 2010) ' Mounangaa unnaanani naalo agnaanam - Caption:
"Aatmgnaanam chendavaa shwaasa neelone vishwamaa!" '
These two caption's so many written along with these.
* * * Tel - (May, 2010) ' * Naa Naannanu ' - In this topic I written single
letter of words and sentences in telugu (In Note book I wrote more than 1000
lines : for Record).

As soon as possible please give reply to my mail, about my Blog.

Regards,
Nagaraju G
Contact : +91 9741005713 for any queries

Anonymous said...

i really am sad that i cant read this blog! i guess u know who this is lol :)