Search This Blog

Friday, 10 July, 2009

ఓయ్...ఓయ్....అంటూ క్యాజువల్ గా పిలిచెరో...


రోజు కొన్ని ఘనకార్యాలు చేశాను నేను....మొదటిది రోజు ఆఫీసుకి సెలవు పెట్టడం.
"
వాట్ ఆర్.కే (నన్ను అలానే పిలుస్తారు ఆఫీసు లో), వై డూ యు వాంట్ లీవ్.... ప్రతిసారి లీవ్ అడుగుతావేంటి.." మండిపడ్డాడు మా మేనేజర్ నేను లీవ్ అడిగిన వెంటనే...అమ్మతోడు రెండు నెలల నుంచి ఒక్క లీవ్ కూడా తీసుకోలేదు...వాడంతే, అలాగే అంటాడు.. ఆరునెలల తరవాత లీవ్ అడిగినా, నిన్నే తీసుకున్నావ్ కదా అన్నట్లు మాట్లాడుతాడు...
"
అది కాదండీ...ఫ్రెండ్ పెళ్లి ఉంది..వెళ్ళకపోతే ఫీల్ అవుతాడు.."
"
ఆహా...సరే ఇలా కూర్చో...ప్రాజెక్ట్ లో నీ పెర్ఫార్మన్స్ గురుంచి... పెండింగ్ టాస్క్ గురుంచి మాట్లాడదాం.." అంతే అరగంట చావగొట్టాడు...ఒక్క లీవ్ అడిగిన పాపానికి ఇలా వేయించుకు తింటావా..ఒరేయ్ దొరక్కపోవురా నాకు..కసికసిగా తిట్టుకున్నా.."వాట్ డిడ్ యు సే.."అన్నాడు అనుమానంగా....నీ పిండాకూడు...నీ శార్ధం...బొంగు బోషానం..."అబ్బే ఏం లేదు ...ప్రాజెక్ట్ మీద మీకెంత శ్రద్ధ." అనుకుంటున్నా అంతే... "పొగడ్తలు కాదు పని కావాలి నాకు...సరే వెళ్ళు..." ..మొత్తానికి లీవ్ ఇచ్చాడు...

అసలు లీవ్ ఎందుకు పెట్టానో నాకే తెలీదు...ఏంటో అపుడపుడు అలా లీవ్ పెట్టాలనిపిస్తుంది అంతే...మరుసటి రోజు పదకొండుకి లేచా...ప్రతిరోజు తొమ్మిది కల్లా "కౌసల్యా సుప్రజా రామా..పూర్వ సంధ్యా.." అనుకుంటూ నా సెల్ ఫోన్ అలారం కొట్టగానే సెల్ ఫోన్ లోఅలారం పెట్టినవాడిని..అసలు అలారం అనే కాన్సెప్ట్ ని కనుక్కున్న వాడిని సంస్కృతం లో తిట్టుకుంటూ...దాన్ని స్నూజ్ చేస్తూ తొమ్మిదీ ఇరవై కి లేచే వాడిని... రోజు అలారం గోల లేకుండా హాయిగా నిద్రించా...నిద్రలో ఉన్నసుఖాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాను నేను... బహుశా ప్రొద్దున తొమ్మిది ఇంటికి అలారం పెట్టుకునే గొప్ప డిస్సిప్లిన్ కలిగిన అబ్బాయిని నేనే అనుకుంటా...పన్నెండుకి బ్రష్ చేశా... అబ్బో ఇలాంటి మంచి అలవాట్లు చాల ఉన్నాయిలెండి... తర్వాత లాప్ టాప్ ఓపెన్ చేసి...మెయిల్స్ ...చాటింగ్ (ఒక్క అమ్మాయికూడా ఆన్ లైన్ లో లేదు రోజు ... :( ...) ఇంక బోర్ కొట్టి మ్యూజిక్ ఆన్ చేశా

"
నూట డెబ్భై ఆరు బీచ్ హౌస్ లో ప్రేమ దేవతా....
ఎల్లో చుడిదార్ వైట్ చున్నితో దోచే నా ఎదా
ఓయ్..ఓయ్...అంటూ క్యాజువల్ గా పిలిచెరో
ఓయ్...ఓయ్..ట్వంటీ సార్లు కల్లో కలిసేరో...
ఓయ్...ఓయ్...యంటి గుండె నిండా నిలిచెరో...
లవ్ అట్ ఫస్ట్ సైట్...." అంటూ సాగిందా పాట.....అంతే అలా తెలిపోయాను పాటలో...తెగ నచ్చేసింది ఓయ్ పాట..ఎప్పుడూ అంత శ్రద్దగా వినలేదు పాటని...ఒక పాట నచ్చితే ఇక సినిమా చూడాల్సిందే... అంతే టైం చూసాను...ఒకటి అయింది...నెట్ ఓపెన్ చూసి థియేటర్ లో ఓయ్ సినిమా ఆడుతుందో చూశా...కేసినో థియేటర్లో చెన్నై లో తెలుగు సినిమాలు కంటిన్యువస్ గా ఆడేది రెండు థియేటర్లలో మాత్రమే...ఒకటి జయప్రద..ఇంకోటి కేసినో... మద్య జయప్రద గారు టాక్స్ కట్టలేదని ఆవిడగారి థియేటర్ ని మూసేసారు..ఇక మాకు మిగిలింది కేసినో మాత్రమే...అదొక తొక్కలో థియేటర్..దానికంటే మా గుంటూరు లో నాజ్ థియేటర్ సూపర్ ఉంటుంది....ఏం చేస్తాం తప్పదు మరి...కేసినోలో మటినీ షో మూడున్నరకి...వెళ్ళడానికే గంట పడుతుంది, టికెట్లు అందుతాయో లేదో అనుకోని గబగబా స్నానం చేసి..రెడీ అయ్యి బైల్దేరాను...అప్పుడు గుర్తొచ్చింది ప్రొద్దుటి నుంచి ఏమీ తినలేదని.. విషయం గుర్తురాగానే వెంటనే ఆకలి వేసింది...ఏం చేస్తాం జీవితం...సర్లే టికెట్లు తీసుకున్నాక టైం ఉంటుందిగా తినోచ్చులే అనుకొన్నాను..థియేటర్ కి వచ్చి టికెట్ తీసుకున్నాను...


టైం మూడు అయింది, అరగంటలో తినేసి రావచ్చులే అనుకోని బైటకి వచ్చి ఒక రెస్టారెంట్లో కూర్చున్నాను..సీట్ నెంబర్ ఎంత ఇచ్చాడో చూసుకుందాం అని పర్సు తీసి అందులో ఉన్నటికెట్ తీసా...దెబ్బకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యింది...కారణం టికెట్ ఉంది కానీ డబ్బులు లేవు...అయిదు వందలు కదా నేను వాడికి ఇచ్చింది టికెట్ కోసం...అంతే పైనుంచి కిందదాకా ఒక షాక్ తగిలింది...సో వాడు నాకు తిరిగి చిల్లర ఇవ్వలేదు...టికెట్ యాభై రూపాయలు...నాలుగు వందల యాభై బొక్కేనా??, నా మైండ్ వేసిన ప్రశ్నని నేను ఇంకా జీర్ణించుకోలేదు..."సర్ ఆర్డర్ సర్.." బెరేర్ వచ్చాడు.."...మీ రెస్టారంట్లో కార్డు తీసుకుంటారా?" అడిగాను నేను..."సారీ సర్...ఓన్లీ కాష్.." అన్నాడు వాడు.."ఓహ్!! అలాగా... విల్ బీ బ్యాక్." అని చెప్పి అక్కడ నుంచి బైటకి వచ్చా..."ఒరేయ్ మెంటల్...కౌంటర్ వాడిని వెళ్లి అడుగు ఇలా చేంజ్ ఇవ్వలేదు అని.." మొట్టికాయి వేసింది నా మనసు...వెంటనే కౌంటర్ దెగ్గరికి పరిగెట్టాను..ఇవ్వడని తొంభై తొమ్మిది శాతం తెలుసు...కానీ ఒక్క శాతం మిస్ అవ్వకూడదు అని...నేను అడగ్గానే వాడు ముఖం అదోలా పెట్టాడు ' ఊరు మనది?' అనే లెవెల్లో...ఇక నేను అక్కడ నుంచి వచ్చేశా...పది నిముషాల్లో షో మొదులవుతుంది...ఒక వైపు ఆకలి...దేగ్గర్లో ఏదన్న ఏటిఎం ఉందేమో అని చూశా...ఏమీ కనిపించలేదు...సర్లే సినిమాలో పడితే ఆకలి గుర్తుండదులే అని కేవ్ కేవ్ మని కేకలు వేస్తున్న ఆకలి పెగులకి సర్దిచేప్పా...

"
సెలెబ్రేషన్.. అది చేసుకోడానికి ఒక్కొక్కళ్ళకి ఒక్కో రీజన్...అందరు జరుపునే కామన్ సెలేబ్రషన్ న్యూ ఇయర్..న్యూ ఇయర్ సెలేబ్రషన్ అంటే నాకు చాలా ఇష్టం...ఎందుకంటే రోజు నా బర్త్ డే కాబట్టి...కానీ లాస్ట్ ఇయర్ నుంచి జరుపుకోడం మానేసాను..." అంటూ హీరో సిద్దార్థ్ అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళడంతో ఓయ్ సినిమా మొదలవుతుంది....ఫస్ట్ హాఫ్ పర్లేదు అనిపించింది...అంటే యాభై రూపాయలకి సినీవినోదం బాగానే ఉండేది...కానీ అయిదువందలు బొక్కేట్టుకున్నాంగా అంచానాలు పెరిగాయి..కాని ఓయ్ సినిమా కోసం అయిదువందలు ఎవడు పెట్టి ఉండడెమో...నేను తప్ప...అంటే పెట్టేలా దేవుడు శాసించాడు... కిషెన్ పాటించాడు... కౌంటర్ వాడు పండగ చేసుకున్నాడు..

ఇంటర్వెల్లో నా ఆకలి పేగులు మళ్ళి నిద్ర లేచి గోల చెయ్యడం స్టార్ట్ చేసాయి... థియేటర్ లో క్రెడిట్ కార్డు ఎవడు తీసుకుంటాడు నా బొంద..అయినా అడిగాను...వాడు విచిత్రం గా చూశాడు....సినిమా కి వెళ్తే ఇంటర్వెల్ లో మినిమం ఒక చేతిలో ఒక కూల్ డ్రింక్, ఇంకో చేతిలో చిప్స్ లేక పఫ్ ప్యాకెట్ లేనిదే సెకండ్ హాఫ్ చూసినట్లు ఉండదే...చా తొక్కలో జీవితం...నాకు ఎప్పడు ఫ్రస్ట్రేషన్ వచ్చినా నా నోటితో నా జీవితం బలవుతుంది...చదివారుగా నా ఇంటర్మీడియట్ సంగతులు...ఇప్పుడు సెకండ్ హాఫ్ అసలు ఎలా చూడలబ్బా...చిరాకు వేసింది...చా అయినా అంత మతిమరుపు ఏంటో నాకు... జన్మలోనో కౌంటర్ జీవికి మతిమరుపు జీవి బాకీ అనుకుంటా...అందరు కూల్ డ్రింకులు, పుఫ్ లు, పాప్ కార్న్ లు తెగ కొనుక్కొని వెళ్తున్నారు...అవన్నీ చూసే నా ఆకలి పేగులు బ్రేక్ డాన్స్ చెయ్యడం మొదలుపెట్టాయి...పాపం ప్రొద్దుటి నుంచి వాటి సంగతి చూడలేదు మరి..అవి ఎలా తట్టుకుంటాయి..జాలి వేసింది నాకు వాటి మీద ...చురుగ్గా పనిచెయ్యడం మొదలు పెట్టింది నా బుర్ర సడన్ గా.... తళుక్కున మైండ్ లో ఒక మెరుపు మెరిసింది...


వెంటనే పర్సు తీసాను...అందులో ఒక చిన్న జిప్ హోల్దర్ ఉంటుంది..అది తెరిచాను...కళ్ళు జిల్ జిల్ జిగేల్ మన్నాయి...అవును అందులో యాభై రూపాయలు ఉన్నాయి మరి...నిన్న రాత్రి డిన్నర్ బిల్ పే చేసాక వాడిచ్చిన యాభై చేంజ్ ఎందుకో వెరైటిగా జిప్ హోల్దేర్ లో పెట్టాను...ఇప్పుడు అర్థం అయింది అపుడు అలా ఎందుకు పెట్టానో...కొన్ని కొన్ని సార్లు మనం కొన్ని పనులు వెరైటి గా చేస్తుంటాం...ఎందుకో మనక్కూడా తెలీదు...బహుసా అవి ఇలాంటి అత్యవసర స్థితిలో ఉపయోగపడ్డానికేమో....నా రీజనింగ్ మరియు అనలిటికల్ అబిలిటీకి నాకే ముచ్చటేసింది...అపుడు నాకు కనిపించిన యాభై రూపాయలే నాకు అయిదువందల కంటే ఎక్కువ అనిపించాయి...అప్పుడు నాకు ఇంకో విషయం అర్థమైంది...డబ్బుకి విలువ ఒక అంకె పక్కన ఎన్ని సున్నాలు తోడైతే అంత పెరిగినట్లు కాదని... డబ్బు ఒక మనిషికి ఎంత గొప్ప అత్యవసర పరిస్థితిలో ఉపయోగపడితే దానికి అంత విలువ అని...అయ్యబాబోయ్, ఇలాంటి టైం లో బిచ్చ గాడికి బిర్యాని పొట్లం దొరికినట్లు నాకు యాభై దొరికేసరికి నా అనలిటికల్ పవర్ కి వెయ్యి మెగావాట్లు అందాయిగా...ఎన్నెని విషయాలు తెల్సిపోతున్నాయో...అమ్మో సెకండ్ హాఫ్ టైం అయింది అనుకోని వెండర్ దెగ్గరికి వెళ్లి ఒక ఫాంటా పెట్ బాటిల్...రెండు ఎగ్ పఫ్ లు కొనుక్కొని లోపలి వెళ్ళా...


అపుడే సినిమా స్టార్ట్ అయింది, పాపం హీరోయిన్కి కాన్సర్ ఉందని తెల్సి హీరో ఫేస్ జీరో వాల్ట్ బల్బు అయింది...ఇక అక్కడి నుంచి హీరోయిన్ కోరికలు తీర్చడానికి నానా కష్టాలు పడతాడు మన హీరో...అమ్మో ఇన్ని వెరైటీ కోరికలు ఉన్న అమ్మాయిని నేను ఖచ్చితంగా లవ్ చెయ్యను...ఎందుకంటే నాకు మహా బద్ధకం, నా చిన్ని చిన్ని కోరికలే ఇంకా నేను తీర్చుకోలేదు, ఇంకా దాని కోరికలు ఎక్కడ తీర్చను...రివర్స్ గా నా కోరికలు తీర్చే అమ్మాయి దొరికితే బాగుండేమో..."దేవుడా... మంచి దేవుడా...నువ్ నాకు యాభై రూపాయలు దొరికేలా చేసావ్..తద్వారా కూల్ డ్రింక్ ఇచ్చావ్...రెండు పుఫ్ లు కూడా ఇచ్చావ్ అలాగే ఇంకో చేత్తో మంచి గర్ల్ ఫ్రెండ్ ని ఇవ్వు...నాకు ఏది కావాలంటే అది కొనిపెట్టేలా...నా ఫోన్ బిల్లులు అన్ని తన బిల్లులుగా తలచి అన్ని క్లియర్ చేసేలా...తన క్రెడిట్ కార్డ్ నా బర్త్ డే కి గిఫ్ట్ గా ఇచ్చేలా(బిల్ మాత్రం తన అడ్రస్ కే వచ్చేలా).... విధంగా నాకు గర్ల్ ఫ్రెండ్ ని ఇస్తావని కోరుకుంటాను....నువ్ ఇస్తావ్...నాకు తెలుసు...ఎందుకంటే యు ఆర్ బెసికల్లీ వెరీ గుడ్ గాడ్.." అని వెంకి లెవెల్ లో దేవుడికి చిన్న ప్రార్ధన చేసుకున్నా...సినిమా చివర్లో కొంచెం బాధేసింది...పాపం షామిలి చనిపోతుంది...చనిపోయేప్పుడు హీరో మీద తనకి ఎంత ప్రేమ ఉందొ చూపిస్తుంది..చివర్లో లవ్ యు అంటుంది...అపుడు నేను కూడా కొంచెం ఫీల్ అయ్యాను...అక్కడ కొంచెం సెంటిమెంట్ నచ్చింది...మొత్తానికి మూవీ అయిపొయింది బైటకి వచ్చేశా..."
ఓయ్ ...ఓయ్...నిన్నే..."

ఏంటబ్బా హీరోయిన్ వాయిస్లా ఉంది అని వెనక్కి తిరిగి చూశా...

ఎవరూ లేరు...అంత నీ భ్రమా...బ్రాందీ...విస్కీ...అంతే..అని చెప్పింది నా మనసు...

"
ఓయ్ ఓయ్ ..అంటూ క్యాజువల్ గా పిలిచేరో...

ఓయ్ ఓయ్ ..కల్లో ట్వంటీ సార్లు కలిసేరో...."
...

27 comments:

నేస్తం said...

తొమ్మిదింటికి అలారమా :O

కిషన్ రెడ్డి said...

హ హ నేస్తం...చెప్పాకదా నాకు చాలా చాలా మంచి అలవాట్లు ఉన్నాయని...తొమ్మిదికి అలారం పెట్టుకునే డిసిప్లిన్ కూడా నాదే అని... :) :)

స్వాతి said...

chaduvutunnanta sepu navvutute unna

కిషన్ రెడ్డి said...

స్వాతి గారు..మీ చిన్న కామెంట్ నాకు పెద్ద సంతోషాన్ని కలిగించింది..మిమ్మల్ని హాయిగా నవ్వించగలిగినందుకు...

nagarjuna చారి said...

చివరికి 450రూ బొక్కకి బాధ కాకుండా....హీరోయిన్‌ చనిపోయినందుకు ఫీలయ్యారా..
ఈసారి సినిమాకి వెళ్దామనుకునే ముందురోజు తప్పకుండా బయట డిన్నర్‌ చేయండి..పేగులు బ్రేక్‌డాన్స్‌ చేయవు... :)

MIRCHY VARMA OKA MANCHI PILLODU said...

kishan reddy garuu nenu kuda anthe chadivinatha sepu navvuthune unnau. office lo vallu nanu chusi emiti navvukuntunnadu tana lo tane anukunnaru andi chala navvu vachhindii keka ma guntur antunnaur manadi gunture na andi
endukante madi guntur andi alage na blog ki vacjhhi chusi mee coments ivvandi untanu andi
http://mirchyvarma.blogspot.com

...Padmarpita... said...

అందుకే మరి అబద్దం చెప్పి లీవ్ తీసుకోకండి అని చెప్పింది...
చూసారా! Rs.450/- సమర్పించవలసి వచ్చింది....

కిషన్ రెడ్డి said...

చారి గారు, హీరోయిన్ చనిపోయేప్పుడు నిజంగానే ఫీల్ అయ్యానండి...అప్పుడు డబ్బులు గుర్తురాలేదు...తర్వాత గుర్తోచాయి :)...మీ సలహా పాటిస్తానండి..

మిర్చి వర్మ గారు, థాంక్స్ అండి...అవును మాది గుంటూరు అండి...మీ బ్లాగ్ దర్శించా...బాగుందండి...keep writing..

srujana said...

అయ్యో!!! ఆకలితో సినిమా చూసారా, అందులోను హీరోయిన్ చచ్చిపోయింది...ఎన్ని కష్టాలండి!

కిషన్ రెడ్డి said...

పద్మ గారు, ఇంతకముందు చాలాసార్లు అబద్దాలు చెప్పి లీవ్ తీసుకున్నా, అపుడు పావలా కూడా పోలేదు :).. ఆయినా అబద్దాలుకు లీవ్ లకు అవినాభావ సంభంధం ఉందిలెండి..

అవునండీ సృజన గారు...చూసారుగా ఎన్ని కష్టాలో... :(

రాఘవ said...

9 కి అలారమా?? నేనే మేలు రోజు 8:45 కి అలారం పెడతాను...

కిషన్ రెడ్డి said...

రాఘవ గారు, చెప్పాకదా తొమ్మిది కి అలారం పెట్టుకొనే దమ్మూ ధైర్యం నాకే ఉందని :)... నా తర్వాత వరుసలో మీరు ఉంటారు 8:45 కదా :))

సుజాత said...

డబ్బూ పోయి, ఆకలికీ మాడి, హీరోవినూ చచ్చిపోయి,...పాపం, మొత్తానికి ఓయ్ మీకు చాలా జీవిత సత్యాలు నేర్పిందన్నమాట.అన్నట్లు మీదీ గుంటూరేనన్నమాట. సంతోషం!

కిషన్ రెడ్డి said...

హహ సుజాత గారు నిజమేనండి,ఓయ్ నాకు కొన్ని జీవిత సత్యాలు ప్రాక్టికల్ గా చూపించింది లెండి...మీదీ గుంటూరే అన్నమాట, సంతోషం...ఈ పోస్ట్ వాళ్ళ గుంటూరు వాళ్ళు బాగా కలుస్తున్నారు...చాలా సంతోషం

కొత్త పాళీ said...

good show

రాధిక said...

:)

రాధిక said...

ha ha good one

కిషన్ రెడ్డి said...

కొత్త పాళీ గారు, థాంక్స్ అండి.

రాధిక గారు...ధన్యవాదాలు.. :)

తృష్ణ said...

tadhAstu!!mIku mi kOrikalu tirche ammaayi doruku gAka!!good post.

కిషన్ రెడ్డి said...

@తృష్ణ గారు, మీ దీవెనలు ఫలిస్తే అంతకన్నా కావాల్సింది ఏముంది చెప్పండి....థాంక్స్ :)

Ganex said...

good blog!
moderator: telugu blogger orkut community!

You can check my blog at ganex.blogspot.com

కిషన్ రెడ్డి said...

Hi Ganex, thanks a lot...I have gone through your blog too...good creativity..keep it up. :)

ss said...

hii

SAKETH said...

wow nijam ga super.....but thnk denivalla koncham nastam kuda undi.denni maalante vallu chooste no prblm kani if ur manager sees.....taluchukunte nake edola undi....mee manager choodakudadani ashistu...elantivi marinni posts cheyalani korutuuu...SAKETH

కిషన్ రెడ్డి said...

హహ సాకేత్, మా మేనేజర్ కి తెలుగు రాదులే...ప్రాబ్లం లేదు...థాంక్స్ రా కామెంట్ కి.

Anonymous said...

aunu sir , eppudina kudirite malli manam syamala theatre lo meet avali sir , esari anni 100rs notes teesukuni randi

కిషన్ రెడ్డి said...

Hello Anonymous...meeru peru chebithe meeru evaro kanukkogalanu...i think my engg junior..rite?..peru cheppi punyam kattukondi plz...