Search This Blog

Monday 26 October, 2009

A క్యూట్ లవ్ స్టొరీ with బట్టర్ స్కాచ్ topping....

"ఒసేయ్...నా మాథ్స్ నోట్స్ ఇవ్వవే పందిదాన...రెండు రోజులనుంచి ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తున్నావానే దున్న..!!" ..మాటలు మాస్ గా అనిపించినా అవి పలికించిన గొంతు కాకినాడ కాజా కన్నా తియ్యగా అనిపించడంతో వెనక్కి తిరిగి చూసాను...

సీతాకోకచిలుకకి అన్ని రంగులు అలమిన దేవుడు...మయూరానికి అందాల పించాలు అతికించిన ఆ పైవాడు..నల్లటి కోయిలకి తియ్యటి గాత్రాన్ని వరమిచ్చిన ఆ సర్వాంతర్యామి...ఈ అమ్మాయిని తయారుచేయడానికి వీటన్నిటికన్నా ఎక్కువ శ్రద్ధ చూపించాడేమో అనిపించింది ఆ అమ్మాయిని చూడగానే...ఆమె వేసుకున్నతెలుపు చూడిదార్ మీద పువ్వుల ఎంబ్రాయిడరి సింపుల్ గా ఉంది..కాదు...ఆమె వేసుకోడం వల్ల సింపుల్ గా ఉన్నడ్రెస్ కి విలువ పెరిగిందేమో...అందుకేనేమో అంత విలువ చెయ్యని దుస్తుల్నికూడా సినిస్టార్స్ తో వేయించి వాటికి వేలకి వేలు ధర నిర్ణయిస్తారు..నా ఆలోచనలు ఇలా ట్రేడ్ సీక్రెట్స్ వైపు మళ్ళుతుండగా ఆమె తన ఫ్రెండ్స్ తో పాటు నన్నుదాటుకొని వెళ్ళిపోయింది నుదుటిపై పడ్డ కురులని సవరించుకొంటూ...అదోలాంటి మత్తుగోలిపే అరోమా నన్ను తాకి వెళ్ళిపోయింది...ఆమెతో పాటే సాగుతూ పదిమందికి సువాసన పంచుతున్నఆ పెర్ఫుమ్ జీవితం ధన్యం...అది ఏ కంపెనీదో...
"హై-టెక్..."
"ఏంటి..." చిరాగ్గా చూసాను.. ఎప్పుడొచ్చాడో తెలీదు కాని నా ముందు నిల్చున్నాడు శీనుగాడు పుస్తకం చూపిస్తూ..
"అదేరా...నిన్నజావా కోసం హై-టెక్ సిరీస్ బుక్ అడిగావ్ కదా...సత్య దెగ్గర తీసుకొచ్చా..." అన్నాడు
ఓహొ అన్నట్లు తలూపాను..."ఇక్కడేం చేస్తున్నావ్...పదా గుడ్డోడి క్లాసు ఇప్పుడు..." అంటూ లాక్కెళ్ళాడు..

గుడ్డోడు అంటే మా ప్రిన్సిపాల్...వాడు గుడ్డోడు కాదు గానీ...నా వైపు చూస్తే నా పక్కన వాడి వైపు చూస్తున్నట్లు అర్థం..మొదట్లో ఈ విషయం తెలియనప్పుడు ఓ సారి నా వైపు చూస్తూ "గెట్ అవుట్ అఫ్ మై క్లాస్.." అన్నాడు ..ఎందుకన్నాడో అర్థం కాకపోయినా పైకి లేచాను వెళ్దామని, అసలే క్లాస్ తెగ బోర్ గా ఉంది.."నువ్వు కాదు..." అంటూ నా కుడి వైపు ఉన్నవాడి వైపు చూస్తూ..."యు గెట్ అవుట్ ..." అంటూ నా వైపు చూసాడు...లేచింది నేనయితే నా పక్కన వాడిని నువ్వు కాదు అంటాడెంటి...మళ్లీ లేచి వెళ్లబోయాను..."ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు కాదు.." నా పక్కన వాడిని ఉరిమి చూసాడు..వాడు దెబ్బకి వణికిపోయాడు.."యు గెట్ అవుట్ ఇడియట్..."అంటూ మళ్లీ నా వైపు చూసాడు...నాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది..నేను అలాగే నిల్చున్నాను.."హౌ డేర్ యు...నా మాటే వినవా.." అంటూ ముందుకి వచ్చి నా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ నా ఎడమ ప్రక్కన ఉన్నవాడి ముందు బెంచ్ మీద దబా దబా కొట్టాడు...నేను అతని కళ్ళలోకి తీవ్రంగా చూసా, అప్పుడు అర్థం అయింది వాడికి అదో టైపు మెల్ల కన్ను అని..అసలు గెట్ అవుట్ అన్నది నా ఎడమ ప్రక్కన వాడిని...కాని హడలు కొట్టింది మాత్రం నన్ను నా కుడి ప్రక్కన వాడిని....

"ఏటి ఎంకన్న రోజురోజుకి సాంబార్ కాస్తా గోదావరి వాటర్ అవుతున్నాయి...దీనికన్నా రసమే బెటర్ ఏమో...అంతేకదరా?" అన్నాడు సీనుగాడు నా వైపు చూస్తూ సాంబార్ గెలుకుతూ...ఆడికి హాస్టల్ లో సాంబార్..కాలేజీ లో జావా తప్ప ఇంకేం పట్టవ్..
"ఈ రోజు కాలేజీలో ఒక అమ్మాయిని చూసారా...షీ ఈజ్ ఆసం..." అన్నాను ఏమంటాడో అని..

"ఆసమా....అదేం పేరురా...!!" ఎదవ మొహం ఏస్కోని చూసాడు నావైపు...
"నీ మొహం...ఆసం అంటే, అది ...కత్తిలా ఉందని అర్థం..." చెప్పాను మా లాంగ్వేజ్ లో ..
"అవునా...." అని తింటున్న వాడల్లా ముఖం అదోలా పెట్టి.."ఛీ..ఇది పెరుగా..ఇంత పుల్లగా ఉంది..నిన్నటిది ఫ్రిజ్ లో పెట్టి ఈ రోజు వేసుంటారు...నీకెలా ఉంది.." అన్నాడు ఏదో అంతర్జాతీయ సమాఖ్యలో పేదరిక నిర్మూలనా చర్చలో ఎదుటి సభ్యుడి సలహా కోసం ఎదురుచూస్తున్నవాడిలా ముఖం పెట్టి...క్రూరంగా చూసాను వాడి వైపు...నా మనోవేదన అర్థంచేసుకున్నవాడిలా.."అయితే..ఆ అమ్మాయి ఎవరంటావ్.." అన్నాడు చివరికి...
"ఏమో తెలీదురా...చూడగానే చాలా నచ్చింది..."
"అవునా...సరేలే..కృష్ణాగాడిని రమణాగాడిని కూడా తీసుకొని వెళ్లి రేపు ఆ అమ్మాయి తో మాట్లాడతాం.."
"ఏమని?.." కంగారుగా అడిగాను...
"ఏముంది నువ్వంటే మా వాడికి ఇష్టం అని ఆ అమ్మాయికి చెప్తాం.." అన్నాడు ప్లేట్ అంచులు నాకి చేయి కడుక్కోడానికి లేస్తూ...
"ఇంకానయం...పెళ్లి చూపులకు వెళ్దాం అని చెప్పావుకాదు.." అన్నాను వ్యంగ్యంగా..
"మరేం చెయ్యమంటావ్ రా..." అన్నాడు కోస్చేన్ మార్క్ మొహం పెట్టి...
"ఏమీ చెయ్యొద్దురా..తొందరగా చెయ్యి కడుక్కో...మళ్లీ నువ్వు రూంకి వెళ్లి జావా మీద రీసెర్చ్ చెయ్యాలిగా.." అన్నాను....అవునన్నట్లు తలూపాడు...నాకు అక్కడున్న అంబూజా సిమెంట్ గోడకేసి తల బద్దలు కొట్టుకుందామా అనిపించింది...

ఓ మూడు రోజుల వరకు ఆ అమ్మాయి మళ్లీ నాకు కనిపించలేదు...నేను తనని చూసిన ప్రదేశంలో చాలాసార్లు వెయిట్ చేశా కానీ కనిపించలేదు...ఓ రోజు కాంటీన్ లో కూర్చొని కోక్ తాగుతుంటే "హలో సర్...కెన్ ఐ సిట్.." అని వినిపించిన మాటలవైపు తలెత్తి చూసాను ఆశ్చర్యంగా...నమ్మలేకపోయాను..ఇది కల ఏమో అనుకున్నా...కాదు నిజమే...నిజంగానే ఆ అమ్మాయి నా ఎదురుగా నిల్చుని ఉంది...అలాగే చూస్తూ ఉండిపోయాను.."జొల్లు కార్చడం ఆపి...ఆ అమ్మాయిని కుర్చోమను.." నాలో రోమేయో నిద్రలేచి సలహా ఇచ్చాడు.."ష్యూర్...కూర్చోండి..." అన్నాను ఇంకా ఇదంతా నిజంగా జరుగుతుందా అన్న విషయం ఖచ్చితంగా తేలక..."సర్ నేను మీ జూనియర్ ని...అండి అనకండి.." అంది కూర్చుంటూ...ఆ అమ్మాయి మాటలకి మంత్రముగ్దుడిలా అలాగే చూస్తుండిపోయాను...ఈ అమ్మాయి నా ఎదురుగా ఇలా...ఇలాగే కాలం ఆగిపోతే బాగుండేమో అనిపించింది..నేను ఏమీ మాట్లాడకపోయేసరికి...సారీ..మాటలు రాకపోయేసరికి మళ్లీ ఆ అమ్మాయే "సర్...అక్కడ దూరంగా కనిపించే ఇద్దరు సీనియర్ సర్ లు నన్ను రాగ్ చేస్తున్నారు...వాళ్ళు నాకు మిమ్మల్ని చూపించి మీ డీటైల్స్ అడిగి తెల్సుకొని రమ్మన్నారు...ఈ పువ్వు కూడా మీకు ఇవ్వమన్నారు.." అంటూ తన చేతిలో ఉన్న ఎర్ర గులాబి చూపించింది...ఎవరబ్బా ఆ సీనియర్లు అని చూస్తే రమణ గాడు..శీను గాడు ఉన్నారు...షాక్ కొట్టినట్లు అయింది నాకు...వీళ్ళకు ఈ అమ్మాయే అని ఎలా తెల్సు??..ఎదోకటిలే..ఐ ఓవ్ ఏ పార్టీ టు యు గైస్..అనుకున్నా..ఇదే మంచి టైం ఏదోక సొల్లు కొట్టి ఈ అమ్మాయి ముందు ఇంప్రషన్ కొట్టెయ్యాలి అని నాలో రోమియో తెగ సంబరపడుతున్నాడు...

"నీ పేరేంటి..." అడిగాను...
"సుస్మిత సర్..."...అబ్బో ఎంత సక్కటి పేరో..రోమియో గాడు పండగ చేసుకుంటున్నాడు...
"ఎస్.డి చెప్పాలా సర్.." అంది తనే మళ్ళీ...ఆ స్వీట్ వాయిస్ కి నాకు జలుబు చేస్తుందేమో అనిపించింది...
"అక్కర్లేదు సుస్మితా...నాకు ఈ ర్యాగింగ్ అంటే పడదు...జూనియర్స్ తో స్నేహంగా ఉండాలేకాని ర్యాగింగ్ అదీ..ఇదీ అని వాళ్ళని ఎడిపించకూడదు...నా వరకు అయితే ఎక్కడన్నా ర్యాగింగ్ జరుగుతున్నట్లు కనిపిస్తే వెంటనే వెళ్లి ఆపుతాను...ముఖ్యంగా అమ్మాయిలను ఎవరన్నా ర్యాగింగ్ చేస్తే నేను ఊరుకోను...పాపం ఎక్కడెక్కడినుంచో చదువుకోడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళని ర్యాగింగ్ పేరుతో హింసించడం పాపం కాదా?..." నా మాటలకు సుస్మితా నావైపు అభిమానపూర్వకంగా చూసింది..మాకు రెండు టేబుళ్ళ పక్కన కూర్చున్నవాడు మాత్రం క్రూరంగా చూసాడు...రెండు రోజులముందే వాడిని నేను క్రిష్ణాగాడు కల్సి ర్యాగింగ్ చేసాం...
"మీలా అందరూ ఆలోచిస్తే నిజంగా కాలేజెస్ విల్ బె ది బెస్ట్ ప్లేసెస్..." అంది నవ్వుతూ...ఆ అమ్మాయి ఇంకాసేపు అలాగే నవ్వితే నేనేమైపోతానో నాకే అర్థంకావడంలేదు...
"ఇందులో నా గొప్పతనం ఏముంది సుస్మి..." అని ఒక్కసారి ఆగాను ఆమె వైపే చూస్తూ నేనేమన్నానో గుర్తొచ్చి..
"మీరు నన్నుసుస్మి అని పిలవచ్చు సర్...నో ప్రాబ్లం...అఫ్కోర్స్ అలా నన్నునా పేరెంట్స్ క్లోజ్ ఫ్రెండ్స్ తప్ప ఇంకెవరూ పిలవరు...." అంది...
"సారీ సుస్మితా, నేను అలా పిల్చి ఉండకూదదేమో..." అన్నాను నోచ్చుకున్నవాడిలా...
"భలేవారే సర్...పాజిటివ్ గా ఆలోచించండి సర్...ఏమో మనిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వోచ్చేమో కదా...ఏం ఈ జూనియర్ తో స్నేహం చెయ్యరా...." అంది అందంగా నవ్వుతూ అక్కడున్నరోజా పువ్వు నా చేతికి ఇస్తూ...
ఒక్కసారిగా నాలోని రోమియో నానుంచి క్రిందకి దూకి "ఎగిరే మబ్బులలోనా...పగలే వెన్నెల వాన..గుండెల్లో సాగే రాగాలేవో..." అంటూ ఆమె ముందు వాలిపోయాడు...నాకేమో తొలిప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ లా ఎక్కడన్నాచెట్టుతొర్ర కనిపిస్తే "ఒన్ మినిట్ ప్లీజ్" అని చెప్పి ఆ తొర్రలో డాన్స్ వెయ్యాలనిపించింది..
"అంత భాగ్యం నాకుందంటావా..?" అన్నాను ఆమె కళ్ళలోకి చూస్తూ...
"ప్లెజర్ ఈజ్ అల్ మైన్ సర్..." అని నవ్వుతూ చూస్తూ.."మన స్నేహం సాక్షిగా ఇద్దరం ఒకే బట్టర్ స్కాచ్ ఐస్ క్రీంలో రెండు స్పూన్స్ వేసి తిందాం.." అని ఒక బట్టర్ స్కాచ్ ఆర్డర్ చేసింది...

"బాసూ ఫ్రెండ్షిప్ లో ఎవ్వరూ ఇలా ఒకే ఐస్ క్రీంలో రెండు స్పూన్స్ వేసి తినరు, బడ్జట్ వీక్ అయితే తప్ప...సో ఖచ్చితంగా తను నిన్ను ఫ్రెండ్ కంటే ఎక్కువగా అక్సేప్ట్ చేసింది..." అంటూ నా రోమియో నాకు ప్రేమోపదేసం చేశాడు..
"నిజమా...ఆయినా అమ్మాయిలు మొదటి చూపులోనే ఫ్లాట్ అయ్యే అంత సీన్ మనకు లేదు కదరా..." అన్నాను సందేహిస్తూ...
"ఏమో గురూ...ఈ అమ్మాయికి నీలో ఏం నచ్చిందో..." రోమియో గాడు కన్విన్స్ చెయ్యడానికి ట్రై చేస్తున్నాడు..  
"అంతే అంటావా..." అన్నాను చివరగా..
"హలో సర్...ఐస్ క్రీం లేట్ చేస్తే కరిగిపోద్ది...మరి కానిద్ధామా..." అంది ఆమె స్పూన్ ఐస్ క్రీంలో ముంచుతూ...
"బట్టర్ స్కాచ్ ఇంత టేస్టీగా ఎప్పుడు అనిపించలేదు..." అన్నాను...ఆమె మధురంగా నవ్వింది...అప్పుడే..ఆక్షణమే తెలిసింది ఇక నాకు రాత్రి నిద్దుర ఉండదని...

ఆ రోజు నుంచి ప్రతి రోజు బస్సు స్టాప్ లో తన కోసం వెయిట్ చెయ్యడం..కల్సి కాలేజీకి వెళ్ళడం...కల్సి లంచ్ చెయ్యడం...ఈవెనింగ్ కల్సి స్నాక్స్ తినడం...ప్రతి గురువారం బట్టర్ స్కాచ్ తినడం విత్ టు స్పూన్స్  (గురువారం మేము కలసిన రోజు...)..మా రేలషన్ కి బట్టర్ స్కాట్చ్ అందించిన తియ్యదనం అంతా...ఇంతా కాదు...ఆ అమ్మాయి ఒక్కరోజు రాకపోతే నాకు ఏదోలా ఉండేది...ఓ రోజు రమణగాడు క్రిష్ణగాడు సినిమా ప్రోగ్రాం వేసారు వీక్ డేలో..నేను కాలేజీ వెళ్తాను అన్నా వినకుండా నన్ను ఎగోట్టేలా చేసి సినిమాకి తీసుకెళ్ళారు...మరుసటి రోజు సుస్మి నాకు బస్సు స్టాప్ లో ఎంత సేపు ఎదురుచూసిన రాలేదు...లంచ్ కి కలవలేదు...ఆ రోజు గురువారం..తనతో కల్సి బట్టర్ స్కాచ్ తినాలని కాంటీన్ లో ఎంత సేపు వెయిట్ చేసినా రాలేదు...చివరికి లేచి తిరిగి వెల్లిపోబోతుంటే అప్పుడు కనుపించిది సుస్మీ...తన కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్న మేఘాల్లా ఉన్నాయ్..

"సుస్మి...ఏమైందిరా...ప్రొద్దుటి నుంచి నీకోసం ఎంత వెతికానో తెల్సా..." అన్నాను...
"నీకు నేను ఒకదాన్ని ఉన్నాను అని గుర్తుందా..." అంటూ నావైపు చూసింది...తన కళ్ళలో నుంచి జాలువారిన నీటి బొట్టు..ఎర్రగా కందిన ఆమె బుగ్గపై నిల్చిన్న ముత్యంలా ఉంది...
"సుస్మీ..." అంటూ ఆమె దెగ్గరికి వచ్చాను...
"పో...నాతో అసలు మాట్లాడకు...నిన్న నీకోసం నేను పిచ్చిదానిలా కాలేజీ మొత్తం వెతికా...చివరికి మీ ఫ్రెండ్ సునీల్ ని అడిగితే ఫ్రెండ్స్ తో కల్సి సినిమాకి వెళ్ళావని చెప్పారు...నాకంటే నీకు మీ ఫ్రెండ్స్ తో సినిమా ఎక్కువ కదా...నీకు ఇష్టమని నేనే సొంతగా ఇంట్లో ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసి నిన్న నీకోసం తీసుకొచ్చాను తెల్సా..అందుకు నేను నిజంగా పిచ్చిదాన్నే.." అంది ధారాపాతంగా జారుతున్న కన్నీళ్లను తుడిచే వృధా ప్రయత్నం చేస్తూ...
"సారీ రా..." అన్నాను నా కళ్ళ వెంబడి కూడా కన్నీరు కారుతుందనే విషయం తెలియక...
"నువ్వెందుకు ఏడుస్తావ్...సరేలే ఇంకెప్పుడూ ఇలా చెయ్యకు....పదా బట్టర్ స్కాచ్ తిందాం..." అంటూ కాంటీన్ లోపలికి తీసుకెళ్ళింది...
బట్టర్ స్కాచ్ తింటున్నవాడినల్లా ఆమె వైపు చూస్తూ.."సుస్మీ...మనం ఇంజనీరింగ్ అయ్యాక...మంచి జాబు తెచ్చుకొని అప్పుడు ఇద్దరం పెళ్లి చేసుకుందామా..." అని అడిగేసాను...అంత దైర్యం ఎక్కడనుంచి వచ్చిందో నాకు తెలీదు...బహుశా నా కోసం తపన పడిన ఓ అమ్మాయి కన్నీరు చూసాక వచ్చిందేమో..."నువ్వులేకపోతే ఒక్కరోజే ఉండలేకపోయినదాన్ని...నువ్వులేకుండా లైఫ్ అంతా ఎలా ఉండగలను రా..." (సర్ పోయి 'రా' ఎప్పుడో వచ్చేసింది)...

ఆ రోజుతో లైన్ క్లియర్ అయిన మాకు ఇక పట్టా పగ్గాలు లేవు...తన ప్రేమ నాకు రోజుకో కొత్త లోకం చూపించేది...తను ప్రతిరోజూ నాకు కొత్తగానే కనిపించేది...అప్పటినుంచి కాలేజీ మానేస్తే ఇద్దరం కలిసే మనేసేవాళ్ళం..ఎలా గడిచిపోయాయో ఏళ్ళు.. ఇంజనీరింగ్ అయిపొయింది...విడిపోయే రోజు ఇద్దరం చాలా బాధపడ్డం...కానీ త్వరలోనే కలుద్దాం అని నిర్ణయించుకున్నాం...తనకు విప్రోలో నాకు ఇన్ఫోసిస్ లో జాబు వచ్చింది...ఇద్దరం హైదరాబాద్ పోస్టింగ్....మా ప్రేమ విష్యం పెద్దలకు చెప్పగా వాళ్ళు వెంటనే అంగీకరించడం మా సూపర్ లక్....మే 24న మా పెళ్లి జరిగింది..

"హనీమూన్ కి సింగపూర్ అని నేను ...కాదు పారిస్ అని సుస్మీ..ఇద్దరికీ ఈ విష్యం లో ఒకటే గోల....ఏంచెయ్యాలి..."
నా మొహాన ఒక్కసారిగా చెంబెడు నీళ్ళు పడ్డాయి...."ఏం చెయ్యాలా??...వెళ్లి స్నానం చేసి కాలేజీ కి రెడీ అవ్వాలి..." అన్న మాటలు పలికిన వ్యక్తి వైపు వింతగా చూసాను...ఎదురుగా ఏబ్రాసి మొహం వేసుకొని శీనుగాడు....మైండ్ బ్లాక్ అయింది ఒక్క నిముషం...వాడి వైపే చూస్తున్నాను...
"నువ్విక్కడ ఏం చేస్తున్నావ్...మా ఆవిడ ఎక్కడ...సుస్మీ..."అంటూ అరిచాను...అది హాస్టల్ అని స్పృహ ఇంకా రాలేదు..
""మీ ఆవిడ ఇప్పుడే పుట్టింటికి వెళ్ళింది, ఇక తమరు లేస్తే కాలేజీకి వెళ్దాం.. .నీ ఎంకమ్మ నైట్ అంతా తొక్కలో కలవరింతలతో సంపావ్ గదరా....సుస్మి ఎవర్రా బాబూ....రాత్రి డిన్నర్ చేస్తుంటే ఒక అమ్మాయిని చూసాను అని చెప్పావ్..ఆ అమ్మాయి పేరు సుస్మీనా...ఒక్కరోజుకే అన్ని కలవరింతలా...." అన్నాడు నోరు సున్నాలా చుట్టి...ఒక పది పదిహేను నిమిషాలు పట్టింది ఈ లోకం లోకి రావడానికి...అదంతా కల అని తెలిశాక చాలా బాధేసింది...కాలేజీకి వెళ్ళబుద్ధి కాలేదు...కలలో నేను కాలేజీ మానేస్తే సుస్మీ ఏడ్చింది...ఇప్పుడు మానేసి మరుసటి రోజు వెళ్తే నా వైపు కూడా చూడదు...ఎందుకు చూస్తుంది..అసలు ఆ అమ్మాయి పేరు ఏంటో ??...నేను కలలో తగిలించిన పేరు సుస్మీ...ఒక్క రాత్రి కలలో ఒక క్యూట్ లవ్ స్టొరీ విత్ బట్టర్ స్కాచ్ టాపింగ్....సూపర్...

లంచ్ టైంలో ఆ అమ్మాయి కనిపించింది..వాళ్ల ఫ్రెండ్స్ తో లంచ్ చేస్తుంది...సుస్మీ నువ్వు నాతో కదరా లంచ్ చేస్తావ్ రోజూ...ఇప్పుడేంటి ఇలా...నా మనసుదొక గోల...రోమియో గాడు లేచి "బాసూ అబ్దుల్ కలాంగారు చెప్పినట్లు...కల నిజం చెయ్యలేవా..??" అన్నాడు..."కష్టం రా....విధి విచిత్రమైనది...కలలు అంత కన్నా చిత్రమైనవి...లేకపోతె కలలో అంత కెమిస్త్రీ ఉండి కూడా ఆ అమ్మాయి నేను ఎవరో తెలియనట్లు వెళ్లిపోతుంటే పట్టించుకోకుండా ఉండాలి...ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరో తెలియనట్లు ఎలా ఉండాలి రా....నేను ఎమి మాట్లాడుతున్నానో రోమియో గాడికి అర్థంకాక పారిపోయాడు...

కాంటీన్ లో కూర్చొని కోక్ తాగుతున్నాను.."హలో సర్..." అంటూ ఆమె గొంతే మళ్లీ...నమ్మలేకపోయా..ఏంటి కల ఇలలో పునరావృతం అవుతుందా ఏమిటి...ఆమె వైపే చూస్తున్నాను సంభ్రమంగా..."ఇఫ్ యు డోంట్ మైండ్...ఆ టేబుల్ మీద కుర్చుంటారా...మేము నలుగురం ఫ్రెండ్స్ వచ్చాం..వేరే టేబుల్స్ ఏవీ ఖాళీ లేవు..అందరూ బాయ్స్ ఉన్నారు...మీరు ఒక్కరే కాబట్టి ఆ పక్క టేబుల్ మీద కుర్చుంటారా? " అంటూ అడిగింది
నేను వెంటనే లేచి పక్క టేబుల్ మీద కూర్చున్నాను...వాళ్ళు నలుగురు ఫ్రెండ్స్ వచ్చి కూర్చున్నారు...నలుగురు కల్సి రెండు బట్టర్ స్కాచ్ ఆర్డర్ చేసి షేర్ చేసుకొని తింటున్నారు...ఒక్కసారిగా ఆ బట్టర్ స్కాచ్ చూసేసరికి నా హార్ట్ బ్రేక్ అయింది...ఇక అక్కడ ఉండాలనిపించలేదు...వెళ్ళిపోవడానికి లేచి...ఏదో గుర్తోచ్చినవడిలా ఆ అమ్మాయి దెగ్గరికి వెళ్లి..."మీ పేరేంటి? " అని అడిగాను...

"సుస్మిత.." అని చెప్పి బట్టర్ స్కాచ్ తినడంలో నిమగ్నం అయ్యింది ఆ అమ్మాయి....

33 comments:

మంచు said...

కిషన్
మొదటిసారి మీ బ్లాగ్లొకి రావడం.. కల + కామెడి రెండు బాగున్నయి...
కొన్ని డైలాగ్స్ పంచ్ అదిరింది.

sunita said...

బాగా రాశారు. కామెడీ కల బాగుంది. టెంప్లటె
రంగులు మార్చండి. చదవడం ఇబ్బందిగా ఉంది

Unknown said...

kishen babu,

kalla adirindhi. chaala radam ani undi kaani..elago nevu naa comments accept cheyavu kadha.. ( nee blog ki 2 comments rasanu..ani kaki vetukuni velipoyindhi antav..andugee adagaledu mari)

Padmarpita said...

:)...:)

Susmitha said...

Hello Kishen...

Woww the narration is awesome...simply superb..incidentally my name is susmitha too :)...u can call me susmi :) :)...The way you presented the humour and sensitive relation between a boy and girl is outstanding...The post is very interesting that i find it over in no time...very gripping story-telling capability is ur talent....keep going...i became ur fan :)

Ram Krish Reddy Kotla said...

@ మంచు పల్లకి...ఈ పోస్ట్ మీకు నచ్చినందుకు ధన్యవాదాలు...మీ ప్రోత్సాహం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా..

సునీత గారు, థాంక్స్ అండి....ఈ సరి సరయిన కలర్ కాంబినషన్ ఎంచుకుంటాను లెండి...ఇది బట్టర్ స్కాచ్ లవ్ పోస్ట్ కాబట్టి మాచింగ్ గా ఉంటుందని ఆ ఫాంట్ ఎన్నుకున్నాను...

Ram Krish Reddy Kotla said...

రాజేష్ గారు నా మీద ఇంత దారుణంగా అభాండాలు వెయ్యడం భావ్యమేనా...నేను నీ కామెంట్ ప్రచురించలేదా??..నేను ఖచ్చితంగా ప్రచురిస్తాను అండి....ఇక పోతే కాకి ఎత్తుకపోవడం విషయానికి వస్తే, ఆ రోజు నేస్తం గారు తన కామెంట్ రాలేదు అని చెప్తే, సరదాగా నేనే కాకి ఎత్తుకుపోయింది అని కామెంట్ ఇచ్చాను..

Ram Krish Reddy Kotla said...

@ padma, :) :)

@ Susmi, thanks for ur comments and affection :)

నేస్తం said...

హమ్మయ్యా ఇప్పటికన్నా నమ్ముతారా మీ కామెంట్ బాక్స్ దగ్గర నిజంగానే కాకి ఉంది అని ..చూడండి ఎంతమంది కామెంట్స్ ఎత్తుకుని వెళ్ళిపోతుందో ...
>>ఒసేయ్...నా మాథ్స్ నోట్స్ ఇవ్వవే పందిదాన...రెండు రోజులనుంచి ఇంట్లో పెట్టుకొని పూజ చేస్తున్నావానే దున్న..!!"
:))) ఖచ్చితంగా ఆమె కాకినాడ అమ్మాయే ..బాగా రాసారు

Unknown said...

LoL kishan..

Take it easy...last time naa comments pamichina nee blog lo raledu..so ala ananu.

Good Narration and description with background effects. Keep rocking

శివరంజని said...

kishen gaaru mee blog chuDadam ide first time . okkokkasari kalaki nijaniki teda teliyadu aa visayanni chala chkkaga funny ga rasaru .templet maarchandi

Deepthi Pemmaraju said...

chala bagundi articulation.

Ram Krish Reddy Kotla said...

నేస్తం ఆ అమ్మాయి కాకినాడ అమ్మాయే అక్షరాల...మీరు సూపర్ అండి...
ఇంకో విషయం, నేను నా బ్లాగ్ టెంప్లేట్ మార్చడానికి కారణం మీరే...ప్రతిసారీ మీరేమో నా కామెంట్ రాలేదు అనడం...నేనేమో అయ్యో నేస్తం గారి కామెంట్ రాకపోవడం ఏంటి అని తెగ అలోచించేయ్యడం...ఇలా ఉండగా, ఓ ఐడియా వచ్చింది...టెంప్లేట్ మార్చాలని...ఇదివరకు టెంప్లేట్ లో ఏదో దోషం ఉందేమో..అనుకోని టెంప్లేట్ మార్చాను...ఇక మీ కామెంట్స్ ని కాకి కాదు కదా కొండ మీద కోతి కూడా ఎత్తుకుపోదు...చూసారా నేను నేస్తం కోసం ఎంత చేసానో...:) :)

Ram Krish Reddy Kotla said...

Krishna Rajesh, thanks for ur affection bhayya :)

Ranjani gaaru, thanks for ur comment...me blog choosanu..meeru post iragadesaaru achcham mee nidra lage...simply superb...ika template marchadam antara...emo cheppalenandi...nestam gaari comments kosam ee template pettanu mari :)

Ram Krish Reddy Kotla said...

Deepthi, nice to see you in my blog..thanks for ur comment.

భాస్కర రామిరెడ్డి said...

కిషనా కిసుక్కుమని నవ్వించావు కదా! ఏం పర్లేదు ఇప్పటి నుంచి సుష్మీని లైన్లో పెట్టు :)

Ram Krish Reddy Kotla said...

లైన్ లో పెట్టడానికి ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో తెలీదు భాస్కరా !!...నా టపా మిమ్మల్ని నవ్వించినందుకు ధన్యవాదాలు...

మంచు said...

నేస్తం గారు .. మన గొ..జిల్లావారయివుండి..ఆ డైలాగును బట్టి కాకినాడ అని చెప్పడం ఎమి బాగాలేదు.. నేను తీవ్రం గా ఖండిస్తున్నా...

నేను ఈ డైలాగు "సీతాకోకచిలుకకి అన్ని రంగులు అలమిన దేవుడు...మయూరానికి అందాల పించాలు అతికించిన ఆ పైవాడు..నల్లటి కోయిలకి తియ్యటి గాత్రాన్ని వరమిచ్చిన ఆ సర్వాంతర్యామి...ఈ అమ్మాయిని తయారుచేయడానికి వీటన్నిటికన్నా ఎక్కువ శ్రద్ధ చూపించాడేమో అనిపించింది ఆ అమ్మాయిని చూడగానే."
ని చూసి కాకినాడ అనుకున్నా.. మీరు చెప్పిన డైలాగు కాదు..

మీరు అర్జంట్గా కాకినాడ అమ్మాయులు ఎంత అందగత్తెలొ అంత మంచివారు , అని ఒక పొస్ట్ రాసెవరకు ఈ ధర్నా ఆగదు...

మాలా కుమార్ said...

నేను ఈ రోజే చూస్తున్నాను మీ బ్లాగ్ . బాగుందండి .

Ram Krish Reddy Kotla said...

@ మంచుపల్లకి, మీరు కాకినాడ అమ్మాయా?? :)..లేక గోదావరి జిల్లా వారు కాబట్టి కాకినాడ అమ్మాయిలకు సపోర్టా.... :)..కానీ ఎంత మీరు సపోర్ట్ చేసినా, నేస్తం కరెక్ట్ గానే చెప్పారేమో...ఏమండీ నేస్తం అంతేనా??

Ram Krish Reddy Kotla said...

malakumar, thanks for your comment.

Lakshmi said...

Hello Kishen,
Chala baga rasarandi.. very humorous..still smilling the way u narrate..quite narural..i felt like my daughter telling me the college stories to me whenever she come home..
keep it up..

నేస్తం said...

మంచు పల్లకి గారు మరదే ..అక్కడే చిన్న పోయింట్ మిస్ అయిపోతున్నారు..కాకినాడ అమ్మాయిలు దున్నా అన్నా పంది అన్నా కోన సీమ కొబ్బరి నీళ్ళు తాగినంత తీయగా ఉంటుంది తప్ప ఎబ్బెట్టు ఉండదు ..పైన కిషన్ చెప్పలేదూ..
>>మాటలు మాస్ గా అనిపించినా అవి పలికించిన గొంతు కాకినాడ కాజా కన్నా తియ్యగా అనిపించడంతో వెనక్కి తిరిగి చూసాను..
అదన్నమాట ...
కాబట్టి కాకినాడ అమ్మాయిని కనీసం కలలో అయినా పెళ్ళి చేసుకున్నందుకు మన కిషన్ జన్మ ధన్యం ఏమంటారూ..:P
ఇంకా ధర్నా ఆపేయండి :)

మంచు said...

అంతే కదా మరి..

Ram Krish Reddy Kotla said...

Lakshmi garu, I felt really happy after seeing ur comment...ur encouragement means a lot and thanks for it.

Ram Krish Reddy Kotla said...

నేస్తం, నిజంగానే జన్మ ధన్యం అయింది...ఎందుకో అప్పటినుండి పెళ్లి చేసుకుంటే గోదావరి జిల్లాలోని అమ్మాయినే చేసుకోవాలని అనుకున్నాను...ఆ పైవాడు ఎలా శాసిస్తాడో, ఈ కిషెన్ ఎలా పాటిస్తాడో.. :)

మంచు said...

http://ramyamgakutirana.blogspot.com/2009/10/vs.html
ఇది చూసి డిసైడ్ అయ్యవా కిషనూ ??

Anonymous said...

@kishen Reddy,నేను నీ పార్టీయే

యణక్కు ఒరు కోనసీమ కుట్టీ వేణుం :),

priya... said...

aha...cha...motthaniki edi nijamo kado teleyadu kani...bt lovestory chala baga sagincharu...me romeio nd me jokes chala bagunnai ram...ok carry on...future lo maro susmitha dorakochemo chudam...

Ram Krish Reddy Kotla said...

@ మంచుపల్లకి, మీరు చెప్పాకే నీహారిక గారి పోస్ట్ చూసాను...చాలా బాగా చెప్పారు ఆవిడ...కనుక నేను గోదావరి అమ్మాయిని కోరుకోవడం తప్పేం కాదు...నా నిర్ణయం కరెక్ట్.. :)

Ram Krish Reddy Kotla said...

Anonymous గారు, మీరు నా పార్టీయేనా ....గుడ్...మీకు కూడా ఒక కోనసీమ కుట్టి దొరుకుతుంది లెండి...మొత్తానికి కోనసీమ కుట్టీస్ కి డిమాండ్ పెరిగిపోయేలా ఉంది...:)

ప్రియ, నీ మాట వల్ల రేపు సుస్మిత అనే అమ్మాయి..అదీ గోదావరి అమ్మాయి దొరికితే చాలు...

sunita said...

హహహ!బాగుంది.

Ram Krish Reddy Kotla said...

Sunita, thanks for ur comment...