"...కానీ... విషయం మన ముగ్గురి మధ్యనే ఉండాలి....." చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు శీనుగాడు ఫోన్ లో...
"అలాగేలే...ఎందుకు మరీ అంత చిన్నగా చెప్తున్నావ్...పక్కన ఎవరయినా ఉన్నారా ఏంటి..." అడిగాను నేను...
"లేరు...కాని గోడలకు కూడా చెవులు ఉండొచ్చు...ఇప్పుడు ఈ విషయం నాలుగో ప్రాణికే కాదు , దేనికీ తెలియకూడదు..." దాదాపు గుసగుసగా చెప్తున్నాడు
"ఒరేయ్ ప్రాణికి కాకుండా ఇంకా దేనికి తెలుస్తుంది రా..." వాడి స్టేటుమెంట్ పూర్తిగా అర్థంకాక అడిగాను...
"క్వశ్చన్స్ వెయ్యకు....టెన్షన్ లో ఉన్నా...చెప్పింది ఫాలో అవ్వు..."
"అచ్చా..అసలు విషయం ఏంటి...ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏంటి??..."
"అది నేను ఇక్కడ చెప్పను, మన ఫోన్ ఎవరన్నా టాప్ చెయ్యొచ్చు.....సో లెట్స్ మీట్ ఎట్ గోల్కొండ షార్ప్ సిక్స్ పి.ఎం "..................
************* కొద్ది నిముషాల ముందు *****************
హైదరాబాద్ కి ఆ రోజు ఉదయమే వచ్చాను...ఇంటికి వచ్చీ రాగానే బెడ్ మీద వాలిపోయాను కుంబకర్ణుడిని గుర్తుతెచ్చుకుంటూ...
అసలే ట్రైన్ లో ఆర్.ఏ.సి కంఫాం కాక రాత్రంతా ఆ బెర్త్ మీద కూర్చొని వచ్చేసరికి తాతల ముత్తాతలు కనిపించారు...పైగా నా ఆర్.ఏ.సి భాగస్వామి మొదట్లో బెర్త్ మీద కూర్చొని తర్వాత అక్కడే ముడుచుకొని పడుకొని మెల్లి మెల్లిగా బెర్త్ లో ఎనభై శాతం ఆక్రమించుకున్నాడు....సొంత గడ్డని బ్రిటిష్ వాడు ఆక్రమించుకున్నప్పుడు సగటు భారతీయుడికి వచ్చినంత కోపం వచ్చింది నాకు అప్పుడు...
"హలో బాస్ ఆర్.ఏ.సి అంటే ఈ బెర్త్ లో సగం నాది కూడా....మీరు ఇలా పడుకుంటే నాకు కూర్చోడానికే కష్టంగా ఉంది..." అన్నాను అతన్ని తట్టి లేపుతూ...
"ఓహ్ సారీ బాస్...ఒక పని చేద్దాం...మీరు అటు తల పెట్టుకొని పడుకోండి, నేను ఇటు తల పెట్టుకొని పడుకుంటాను..." అన్నాడు ...'ఎడం కాలితో తంతే ఎగిరిపోతావ్ రోయ్ బక్కోడా...' అని అందాం అనుకోని "అలా నాకు చాలా అసౌకర్యంగా ఉంటుంది మాష్టారు...." అన్నాను.."సరేలెండి నాకు చాలా నిద్ర వస్తుంది నేను ఎలాగో సర్దుకొని పడుకుంటాను.." అని చెప్పి అప్పటికి ముడుచుకొని పడుకొని మళ్లీ మెల్లి మెల్లిగా ఆక్రమించుకున్నాడు... ఇలాంటి భారతీయ బ్రిటిషర్స్ ఉన్నంత కాలం నాలాంటి కమల్ హసన్ టైపు భారతీయుడికి పోరాటం తప్పదు..నాకో భీభత్సమైన ఐడియా వచ్చి "మాష్టారు ఓ సారి లేవండి.." అన్నాను..."మళ్ళీ ఏమైంది మాష్టారు..." అన్నాడు వాడు ఆవలిస్తూ.."నాకు ఇలా కూర్చోడం ఇబ్బందిగా ఉంది..ఈ బెర్త్ ని సగానికి ఫోల్డ్ చేద్దాం...నా పార్ట్ లో నేను కుర్చుంటాను...మీ పార్ట్ లో మీరు పడుకోండి..దోర్లండి..ఏమైనా చెయ్యండి...నాకేం ప్రాబ్లం లేదు.." అన్నాను...అంతే దెబ్బకి బిక్క మొహం వేసాడు...లేకపోతే నాతొ పెట్టుకుంటాడా??...
శీను గాడి ఫోన్ తో మెలుకువ వచ్చింది..టైం మధ్యాహ్నం 2 అయింది..అమ్మో ఇంతో సేపు నిద్రపోయానా అనుకుంటూ "ఏంట్రా.." అన్నాను విసుగ్గా ఫోన్ లో...
"ఆరువేల కొట్లలో నీకు రెండు వేల కోట్లు ఇస్తాను....కావాలా వద్దా??" అన్నాడు..
నాకు ఒక్కసారిగా దిమ్మ తిరిగి...మైండ్ బ్లాకు అయ్యి...షట్ డౌన్ అయ్యి...రీస్టార్ట్ అయ్యి..మళ్ళీ షట్ డౌన్ అయ్యింది....కొయ్య బొమ్మలా అలాగే ఫోన్ పట్టుకొని ఉన్నాను..
'వీడికి మైండ్ దొబ్బిందా...లేక నాకు మైండ్ దొబ్బి ఏవేవో వినిపిస్తున్నాయా..లేకా ఇదంతా అబద్దమా నేను ఇంకా పడుకొని కలగంటున్నానా...అయినా నా కలలో ఇందాకే నేను ఉజ్జయిని రాజకుమారితో డ్యూయెట్ వేసుకొని..కళింగ రాజకుమారితో 'టెన్ డౌనింగ్ స్ట్రీట్' పబ్ డేట్ కి వస్తానని చెప్పి..ఆకాశ మర్గాన భాగ్యనగరం చేరుకోబోతున్నాను కదా...మధ్యలో వేరే కల సడన్ గా అనధికారిక ఎంట్రీ ఎలా ఇచ్చింది...ఇలా నా ఆలోచనలు తలా తోకా లేకుండా నడుస్తుండగా...శీను గాడికి చిర్రెత్తి "ఒరేయ్....ఏంట్రా మూగామునిలా ఏమి మట్లాడవ్?" అన్నాడు...
" ఏమి మాట్లాడమంటావురా ...నిద్ర పోతున్న వాడికి ఫోన్ చేసి రెండు వేల కోట్లు ఇస్తాను...కావాలా? అంటే....వాడి మానసిక పరిస్థితి ఏమవుతుంది అని ఆమాత్రం అర్థం చేసుకోకపోతే ఎలారా??" అన్నాను దీనంగా..
"హ హ....విషయం చెపుదామనే ఫోన్ చేసాను రా..."
"అయితే టెన్షన్ పెట్టకుండా అదేంటో త్వరగా చెప్పరా బాబు..." అన్నాను..
"చెప్తాను...కానీ... విషయం మన ముగ్గురి మధ్యనే ఉండాలి....." చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు శీనుగాడు ఫోన్ లో...
******************************************
సమయం :సాయంత్రం 6 గం.లు
ప్రదేశం : గోల్కొండ
శీను గాడు మధ్యలో...నేను కుడిప్రక్కన తూర్పు దిక్కున తిరిగి...సునీల్ గాడు ఎడమప్రక్కన పడమటి దిక్కున తిరిగి నిల్చున్నాం...ఏదన్నా ముఖ్యమైన విషయం ముగ్గురు మాట్లాడుకొనేటప్పుడు ఈ విధమైన త్రికోణ ఆకృతి కలిగిన భంగిమలో ముగ్గురూ నిల్చొని చర్చించుకోవాలని ఈ విధమైన సెట్ అప్ చేసాడు శీను గాడు...
"నాకు త్వరలో ఆరు వేల కోట్లు రాబోతున్నాయి...అందులో మీరు ఇద్దరు నా ప్రాణ స్నేహితులు కాబట్టి మీ ఇద్దరికీ చెరో రెండు వేల కోట్లు ఇస్తాను...ఈ విషయం బైట ఎవరికీ పొక్క కూడదు.." అన్నాడు రహస్యంగా...
నాకు వెంటనే 'స్నేహమేరా జీవితం...స్నేహమేరా శాశ్వతం..' అనే పాట గుర్తొచ్చి..తర్వాత అసలు విషయం గుర్తొచ్చి "అసలు నీకు ఆరు వేల కోట్లు ఎలా వస్తున్నాయిరా??" అడిగాను..
"ఒరేయ్ అంత డబ్బు మనం ఏం చేసుకుంటామురా...ఎన్ని సినిమాలు తీసి ఫ్లాపులు అయినా పెద్దగా నష్టం అనిపించదు.." అన్నాడు సునీల్ గాడు పదవ ప్లాప్ కి రెడీ అవుతున్న పాపిష్టి ప్రొడ్యూసర్ లా..
"A B C లేదు 1 2 3 లేదు పక్కింటి పంకజం కూతురు పార్వతి మెల్టన్ అన్నాడుట నీలాంటి వాడొకడు...ముందు ఆ ఏబ్రాసి గాడిని విషయం చెప్పనివ్వు.." అన్నాను
"చెప్తాను...నాకు ఆరు వేల కోట్లు రాబోతున్నట్లు అధికారికంగా తెలిసింది...ఇలాంటి అదృష్టం అంత ఈజీగా ఎవరికీ దక్కదు...ఏ కోట్ల మందిలో ఒక్కడికో దక్కుతుంది..ఆ ఒక్కడు మీ స్నేహితుడు అయినందుకు..మీ దుంపలు తెగ మీరు కూడా అదృష్టవంతులు అయ్యరురా నాలాగా...ఎప్పుడో చిన్నప్పుడు మా నాయనమ్మ నాకు చెప్పింది నా జాతకంలో నాకు నడిమంత్రపు సిరి కలిగే యోగం ఉందని..అది ఇన్నాళ్ళకు ఇలా కలుగుతుంది...అసలు అడ్డంగా సుడి మీద వట్రసుడి ఉంటేకాని ఇలాంటి అదృష్టం పట్టదురా..." అన్నాడు శీను గాడు 'నీ అదృష్టం తగలెయ్య..!!' అని వాడిని వాడు ముద్దుగా తిట్టుకుంటూ...
"ఒరేయ్ కొంచెం అర్థమయ్యేలా చెప్పురా..." అన్నాను
"నాకు ఆరు కోట్లు రాబోతున్నట్లు ఒక అధికారిక లిఖితపూర్వక సమాచారం తెలిసిందిరా....ఆఫ్రికా లో ఆడం జూమ అనే అతనికి ఉన్న ఆరు వేల కోట్ల ఆస్తి నాకు వచ్చేస్తుంది..." అన్నాడు...
"ఆఫ్రికాలో ఆడం జూమ ఆరు వేల కోట్లు నీకు ఇస్తున్నాడా?....ఆడు మీ ముత్తతా?? కొంపదీసి మీ ముత్తాతలు ఆఫ్రికాలో సెటిల్ అయ్యారా?...మా ముత్తాతలు ముప్పావలా ఆస్తి కూడా వెనకేయ్యలేదు, మొత్తం వీధి చివరి చింతామణికి దోచి పెట్టారు అని నువ్వు చెప్పినట్లు గుర్తు.." అన్నాడు సునీల్ గాడు
"నీ మొహం...మా ముత్తాతలకు అంత సీన్ లేదు...అసలు ఆ ఆడం జూమ ఎవడో కూడా నాకు తెలీదు ...కాని ఆడి ఆస్తి మొత్తం నాకు వస్తుంది...అదే నడిమంత్రపు సిరి అంటే...ఆడు ఆడి ఫ్యామిలీ తో సహా ఆక్సిడెంట్ లో చచ్చాడంట ..ఆడి ఆస్తి మొత్తం బ్యాంకు లో దాచుకున్నాడట..ఆ బ్యాంకు వాళ్ళు ఆ అనాధ ఆస్తిని ఒక గొప్ప అదృష్టవంతుడికి కట్టబెట్టాలని నిర్ణయించుకొని నాకు ఒక లేఖ రాసారు...వాళ్లు అలా నాకు అంత ఆస్తి కట్టబెట్టుకొవాలనుకోవడం నాకేమి ఆశ్చర్యం అనిపించలేదు...చెప్పాగా సుడి మీది వట్రసుడి అండ్ నడిమంత్రపు సిరి పాలసీ అని..." అన్నాడు
మాకు ఏమి మాట్లాడాలో తెలియక కోయ్యబోమ్మల్లా నిల్చుంటే...ఆడే మళ్ళీ "అసలు ఆ ఆడం జూమ గాడు నాకు ఏదో జన్మలో బాకీ ఉన్నట్లు ఉన్నాడురా...ఈ జన్మలో తీర్చుకుంటున్నాడు పాపం...అయినా నేనొక పని చేద్దాం అనుకుంటున్నానురా...పాపం అంత కష్టపడి సంపాదించిన ఆస్తి మొత్తం నాకు కట్టబెట్టి పైలోకంకి వెళ్ళాడు కదా...అందుకే నా వాటాలోనుంచి ఒక పది కోట్లు ఏదైనా చారిటికి వాడి పేరు మీద డొనేట్ చెయ్యాలని నిర్ణయించుకున్నానురా..." అన్నాడు మా వైపు చూసి...
'కైలాస శిఖరాన కొలువైన స్వామీ..నీ కంట పొంగేనా గంగమ్మ తల్లి..మనసున్న మంచోళ్ళే మారాజులు..మమతంటూ లేనోళ్ళే నిరుపేదలు...రాజువయ్యా...మహరాజువయ్యా...'అంటూ మేము ఇద్దరం ఒకేసారి సాంగ్ వేసుకున్నాం..
"ఒరేయ్ ఆ లేఖ దాని వివరాలు మాకు చూపించురా.." అన్నాను నేను...
"అలాగే ఈ రోజు అర్దరాత్రి కి మా ఇంటి నుంచి నా లాపికి వై.ఫై ఆక్సెస్ దొరుకతుంది..ఆ టైం లో నేను నా లాపి నుంచి వై.ఫై ద్వారా నెట్ కనెక్ట్ చేసి ఆ లేఖ మీకు చూపిస్తా...నా లాపి నుండి నా నెట్ కనెక్షన్ ద్వారా చూపించొచ్చు...కానీ ఎవరయినా ట్రేస్ చేసే ప్రమాదం ఉంది...అందుకే ఈ లాజిక్...సో ఈ రోజు అర్థ రాత్రికి మా ఇంట్లో కలుద్దాం.." అన్నాడు..
***********************
సమయం : అర్థ రాత్రి 12 గం.లు
ప్రదేశం : కూకట్పల్లిలో శీను గాడి ఇల్లు
ఇంట్లో లైట్స్ అన్ని ఆపేసి..కాండిల్ వెలిగించి..లాపి ఓపెన్ చేసి..వై.ఫై కనెక్ట్ చేసి...మెయిల్ ఓపెన్ చేసాడు...అంతా చదివాం..ఒక పది సార్లు చదివాం ఇద్దరం...ఆంతా వాడి చెప్పినట్లే ఉంది...ఏంటో నమ్మశక్యం కాలేదు...
"ఇప్పుడు మనం ఎలా ప్రొసీడ్ అవుదాం..." అడిగాను నేను...
"ఇక్కడ ఇచ్చిన నంబర్స్ కి కాల్ చేసి...మన అకౌంట్ డీటైల్స్ ఇవ్వాలి..ఇంకా వాళ్ళు ఎమన్నా ఇన్ఫర్మేషన్ అడిగితే, అది ఇవ్వాలి...అంతే తర్వాత కొన్ని రోజులకి మన అకౌంట్ లో ఆరు వేల కోట్లు....ఆ నెంబర్ కి రేపు మధ్యాహ్నం 2 : 39 ని.ల కు కాల్ చెయ్యబోతున్నాను...అది పంతులుగారు పెట్టిన ముహూర్తం.." అన్నాడు శీనుగాడు
నాకు ఈ వ్యవహారం మొత్తం ఏదో తేడాగా అనిపించింది..అదే వాడికి చెప్పాను...వాడు నమ్మలేదు నా మాట...తర్వాతి రోజు నేను ఇంటికి వచ్చి అమెరికాలో ఉన్న మా అన్నయ్యకి విషయం చెప్పగా "అది మొత్తం పెద్ద ఫ్రాడ్...అలాంటి ఫ్రాడ్ లో చాలా మంది చిక్కుకొని చాలా నష్టపోయారు...శీనుకి వెంటనే చెప్పు ఈ విషయం..ఎవరికీ కాల్ చేసి ఏ డీటైల్స్ ఇవ్వవద్దని చెప్పు...కావాలంటే ఇలాంటి ఈ-మెయిల్ ఫ్రాడ్స్ గురుంచి గూగుల్ లో వెతుకు బొచ్చెడు దొరుకుతాయి" అని చెప్పాడు...
నేను వెంటనే శీను గాడికి విషయం చెప్పాను...వాడు నమ్మలేదు..."నా నడిమంత్రపు సిరి మీద నీకు కుళ్ళు... సుడి మీద వట్రసుడి ఉన్న వాడికి ఇలాంటివి జరుగుతుంటాయి...మీ అన్నయకి ఆ విషయం తెలీదు...ఒరేయ్ నీకు రెండు వేల కోట్లు కావాలా వద్దా??" అంటూ ఆర్గుమెంట్ కి దిగాడు వాడు...
(పరి పరి విధాలా చెప్పిన పిమ్మట...గూగుల్ లో ఎన్నో సాక్ష్యాలు చూపించిన అనంతరం...మన వాడికి అది ఫ్రాడ్ అని కొద్ది కొద్దిగా అర్థం అయ్యింది)
****************
"సో ఫ్రాడ్ అని తెలిసిందిగా...ఇప్పుడు ఏమంటావ్?" అడిగాను...
"ఏముంది...నా నడిమంత్రపు సిరికి ఇంకా టైం రాలేదు..." అన్నాడు
"మీ ఇంటి పక్కన ఉండే సిరి కాలేజీ కి వెళ్ళే టైం మాత్రం అయ్యింది..." అన్నాను
"ఒరేయ్...చెప్పవేంట్రా..." అన్నాడు బైక్ కీస్ తీసుకొని పరిగెత్తుతూ...
"ఏముంది...నా నడిమంత్రపు సిరికి ఇంకా టైం రాలేదు..." అన్నాడు
"మీ ఇంటి పక్కన ఉండే సిరి కాలేజీ కి వెళ్ళే టైం మాత్రం అయ్యింది..." అన్నాను
"ఒరేయ్...చెప్పవేంట్రా..." అన్నాడు బైక్ కీస్ తీసుకొని పరిగెత్తుతూ...
11 comments:
Good one:)
Had I encashed all such lotteries, prizes, gifts for last 5 years, I am equivalent to ten YSJagans .... 10 lakh crores :))
నిజం నిలకడగా తెలుస్తుంది...మీ ఫ్రెండ్ కి ఇంకా త్వరగానే అర్థం అయిందనుకుంటాను:):)
Nice post..
mari nee share money emindhi??icahada,ledha???pani undhi ani cheppi,leave petti...HYD velli meru chese panulu ivaa??malli spot okati fix chesukuntunnaru.....anyway informative matter to everybody.Keep writting my Dear...
ఛ!ఆ ఆరు కోట్లు వచ్చుంటే కలలో కాకుండా నిజంగానే ఉజ్జయిని రాజకుమారితో డ్యూయెట్ వేసుకొని కళింగ రాజకుమారితో 'టెన్ డౌనింగ్ స్ట్రీట్' పబ్ డేట్ కి వెళ్ళేవారే ప్చ్! పాపం
Anonymous: Thats true.
Padma: మా ఫ్రెండ్ కి త్వరగా అర్థం అవ్వడంలో నా పాత్రా చాలా ఉంది...వాడిని కన్విన్స్ చేసే సరికి నా తాతలు కనిపించారు
మురళి: థాంక్స్
కవిత : ఇంకా షేర్ ఇచ్చేదేంటి అక్కడ అందరికి బొక్కే కదా....హైదరాబాద్ లో ఇలాంటి పనులే చేస్తుంటాం మేము...హి హి
రంజని : ఆరు కోట్లు కాదు...ఆరు వేల కోట్లు...అందులో నా శారే రెండు వేల కోట్లు...అదనమాట...హి హి
కిషన్ శైలి భలే పదునెక్కింది ..:)
ఇది నిజం గా జరుగుంటే అద్భుతం గా వ్రాసారు.. ఊహించింది అయితే చివరిలో కాస్త హడావుడి ముగింపు అయినట్లు అనిపించింది.. ఊ..ఊ మొత్తానికి రైటర్ అయ్యే లక్షణాలు మీలో పుష్కలం గా కనబడిపోతున్నాయి నాకు.. కంటిన్యూ కంటిన్యూ
నేస్తం మీ వ్యాఖ్య నాకు చాలా సంతోషం కలిగించింది...థాంక్స్ ఎ లాట్...మీ ప్రోత్సాహంతో ముందుకు దూసుకుపోతాను చూడండి..ఇది 90 శాతం నిజంగా జరిగినదే..కొంచెం కల్పించాను..ముగింపు హడావిడి అయిన మాట వాస్తవమే..
కొత్త బ్లాగ్ కోసం ఎదురు చూస్తున్నాం అండి, కిషన్ గారు.ఎప్పుడు పోస్ట్ చేయబోతున్నారు ????
ఇట్లు,
$$$$$$$$
Post a Comment