Search This Blog

Saturday, 19 June, 2010

హృదయం ప్రేమిస్తానంటే...విధి విడదీస్తానంటే !! - 9 [Final Part]


ఫోన్ మోగింది..
"హలో ...." అంది సంహిత
"సంహిత గారు ...నేను కార్తీక్ ని "
"కార్తీక్ మీరా??...చెప్పండి ...మీ కాల్ కోసమే రోజూ చూస్తున్నాను ... నేను మిమ్మల్ని ఓ సాయం అడిగాను అది మీరు మరచిపోయారు కదా! "
"లేదు సంహితా ... మీతో నేను కొన్ని విషయాలు చెప్పాలి ...  మనం కలుద్దామా?"
"అలాగే ...ఎక్కడ?"
"రేపు ఉదయం గీతం కాంపస్ దెగ్గర ...పదింటికి ..."
"అలాగే ..."
                                             
                                                   ****
గీతం  కాంపస్ దెగ్గర వెయిట్ చేస్తున్నాడు కార్తీక్ సంహిత కోసం ... కొద్దిసేపు అయ్యాక సంహిత వచ్చింది ...
"కార్తీక్ .. సారీ మిమ్మల్ని వెయిట్ చేయించానా?" అంది కార్తీక్ దెగ్గరికి వస్తూ
"లేదు ... సంహిత నేను నీకు కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాలి ..అవి నీ జీవితానికి సంబంధించినవి.. ఇవి నీకు తెలియాల్సిన పరిస్థితి వచ్చింది ..." అన్నాడు
అర్థం కానట్లు చూసింది కార్తీక్ వైపు ...కార్తీక్ సంహితని కాంటీన్ కి తీసుకువెళ్ళాడు...అలాగే దివ్యకి కూడా కాల్ చేసి కాంటీన్ కి రమ్మన్నాడు ... సంహితా,కార్తీక్ లు కాంటీన్ కి చేరగానే, దివ్య కూడా వాళ్ళతో వచ్చి కలిసింది.

"హాయ్ సంహిత..." అంది దివ్య వస్తూనే
"హాయ్ ..." అంది దివ్యని చూస్తూ ... బాగా పరిచయం ఉన్న అమ్మాయిలా అనిపించింది దివ్యని చూడగానే సంహితకి.
"సంహిత...షీ ఈజ్ దివ్య..మై వైఫ్...ఇక్కడే ఇప్పుడు లెక్చరర్ గా చేస్తుంది .." అన్నాడు కార్తీక్ ...
మళ్ళీ తనే మాట్లాడుతూ ..."ఎలా మొదలెట్టాలో నాకు తెలియడం లేదు ... నేను చెప్పబోయేది నీకు చాలా షాకింగ్ గా అనిపించొచ్చు..కానీ ..." అంటూ చెప్పబోతుండగా
"ప్లీజ్... అదేంటో త్వరగా చెప్పండి ... మీరు ఇలా చెప్తుంటే నాకు భయమేస్తుంది .." అంది సంహిత
"ఆ రోజు నన్ను హాస్పిటల్ లో చంటీ అన్నావు గుర్తుందా ..." అడిగాడు కార్తీక్
"అవును..." అంది సంహిత
"నువ్వు నన్ను అలాగే పిలిచే దానివి...."
అర్థంకానట్లు చూస్తుంది సంహిత..
"దాదాపు ఆర్నెల్ల క్రితం ఆక్సిడెంట్ లో సుధీర్ చనిపోవడం వల్ల, నీలో మానసికంగా చాలా మార్పులు వచ్చాయి.. నువ్వు సుధీర్ ని, అతనికి సంబంధించిన వ్యక్తులని, పరిసరాలను పూర్తిగా మర్చిపోయావు.. అందుకే నీకు అసలు మేము ఎవరమో కూడా తెలీదు.. బట్ వీ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్.. ఇదే కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకున్నాం మనం.. ఆ టైంలోనే సుధీర్ మనకు పరిచయం అయ్యాడు ...."
"ఏంటి కార్తీక్...నాకేమీ అర్థంకావడం లేదు...సుధీర్ నాకు ఈ మధ్యే పరిచయం... తను మొన్న ఆక్సిడెంట్ లో చనిపోయాడు..ఆ విషయం నీకు కూడా తెలుసు..." అంది అతని మాటలు పూర్తికాకుండానే ...
"సంహితా...నీకు ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు తెలీదు... అతను నిన్ను కలవడం...మీ మధ్య పరిచయం..నువ్వతన్ని ఇష్టపడటం..అతను చనిపోవడం...ఇదంతా నిజంగా జరగలేదు..అవి నీ హాలుసినేషన్స్ అని డాక్టర్ చెప్పాడు..."
"నాకేమన్నా పిచ్చా...నాకెందుకు హాలుసినేషన్స్ వస్తాయి ...."
"అది నీ మానసిక పరిస్థితి వల్ల...యు హవ్ అమ్నేషియా..."
                                                **** 


"అమ్మా... నేను సుదీర్ని కాదా .." ఆవేదనగా అడిగాడు భార్గవ్ 
"ఏమైంది కన్నా... నువ్వు సుధీర్ కాకపోవడం ఏంటి?...అసలు నిన్నంతా ఎక్కడికెళ్ళావు రా!!" కంగారుగా అడిగిందామె ..
"నిన్న గీతం కాంపస్ లో కార్తీక్, దివ్య కనిపించారు... నేనెవరో ఎరుగనట్లే ప్రవర్తించారు...నేను సుధీర్ కాదంట.. వాళ్ళ స్నేహితుడు సుధీర్ చనిపోయాడంట... ఇతనే సుధీర్ అని ఒక ఫోటో చూపించాడు కార్తీక్.. అదేంటో ఆ ఫోటో చూడగానే..నా మెదడు మోద్దుబారింది.. ఎవరో బలంగా నా తల మీద మోదినట్లు అలాగే పడిపోయాను... లేచేసరికి ఈ రోజు ప్రొద్దున హాస్పిటల్ లో ఉన్నాను ..."
ఆందోళనగా చూసింది భార్గవ్ వైపు ఆమె తల్లి ... అప్పుడే నిశ్చయించుకున్నదానిలా డాక్టర్ ని కలవడానికి బైల్దేరింది ...
                                             ****
"ఇదీ డాక్టర్ జరిగింది ...నాకేదో భయంగా ఉంది ..." అందామె.
డాక్టర్ కొద్దిసేపు ఆలోచించి "మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే, భార్గవ్ లో Identity conflict మొదలయ్యిందేమో అనిపిస్తుంది...ఎప్పుడైతే సుధీర్ స్నేహితులు భార్గవ్ కి తను సుధీర్ కాదు సుధీర్ చనిపోయాడు అని చెప్పారో, ఎప్పుడైతే సుధీర్ అసలు ఫోటో తను చూశాడో ఆ క్షణమే ఆ సంఘర్షణ అతని మెదడులో మొదలయ్యి ఉండవచ్చు... ఇప్పటిదాకా సుధీర్ కి సంబంధించిన అన్ని విషయాలు అతనిలో ట్రాన్స్ ప్లాంట్ చెయ్యబడ్డ వైటల్ ఆర్గన్స్ లోని న్యూరో పెప్టైడ్స్ (ఏవైతే ఆ అవయవాలలో సమాచారో నిక్షిప్తం చేసుకొని మెదడుకు అందిస్తాయో) అతని మెదడుకి చేరవేశాయి .. అలా అవి చేరవేసిన సమాచారానికి కాంట్రాస్టింగ్ గా ఏ సమాచారం మెదడుకి అందలేదు కనుకే, అతనిలో సుధీర్ ఐడింటిటి బలంగా నాటుకుపోయింది... కానీ ఇప్పుడు సుధీర్ ఫ్రెండ్స్ ఇచ్చిన సమాచారం మరియు అసలైన సుధీర్ ఫోటో చూసిన భార్గవ్ కి మొదటిసారిగా కాంట్రాస్టింగ్ గా External stimulus అందడం, ఆ ఇన్ఫో నేరుగా మెదడుకి చేరవేయబడి అతను సుధీర్ కాదు అన్న సమాచారం మెదడు ప్రాసెస్ చెయ్యడం...ఆ సమాచారం, అప్పటికే నిక్షిప్తమైన సమాచారానికి కాంట్రాస్టింగ్ గా ఉండటంతో Identity conflict మొదలయ్యింది... ఈ conflict వల్ల అణగదొక్కబడి ఉన్న భార్గవ్ ఐడింటిటి తన ఉనికిని చాటే ప్రయత్నము చేసి ఉండొచ్చు... భార్గవ్ లో సుధీర్ వైటల్ ఆర్గన్స్ ఉన్నంత మాత్రాన, పూర్తిగా వాడు వీడు అవ్వడం జరగదు.. అది కేవలం భార్గవ్ లో ఉన్న సుధీర్ అవయవాలు మెదడుపై చూపించిన ప్రభావమే..అది మరింత ఎక్కువ ఉండటమే భార్గవ్ లో సుధీర్ ఐడింటిటి బలంగా ఉండటానికి కారణం... ఎపుడైతే ఆ ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతుందో.. అణగదొక్కబడి ఉన్నభార్గవ్ ఐడింటిటి బయట పడగలదు.. ఇప్పుడు ఎలాగూ భార్గవ్ లో Identity conflict మొదలయ్యింది కనుక, అతనిలోని భార్గవ్ ని మనం బైటకి తీసుకురావచ్చు...సుధీర్ ఐడింటిటిని పూర్తిగా తుడిచివేయవచ్చు..." అన్నాడు డాక్టర్ 

"ఇది జరుగుతుందంటారా?"
"ఖచ్చితంగా... నేను భార్గవ్ కి సైకోఅనలిటిక్ థెరపీలు స్టార్ట్ చేస్తాను...అతనిలో పూర్తి భార్గవ్ ని బైటకి తీసుకువస్తాను.. ఈ థెరపీల ద్వారా conflict లో ఉన్న రెండు ఐడింటిటీలలో ఒక దాన్ని పూర్తిగా తుడిచివేయడం జరుగుతుంది... దీనికి అతను కూడా సమాయత్తం కావలి.. అందుకు మీ సహకారం అవసరం.. అతనిలో అతనికి సుధీర్ కాదేమో అన్న సందేహం ఇంకా బలంగా కలగాలి.. అతనికి ట్రాన్స్ ప్లాంట్ జరగకు ముందు, భార్గవ్ గా అతనికి సంతోషం కలిగించే జ్ఞాపకాలు ఏమైనా తెలిసేలా చెయ్యడం కాని, అతను బాగా ఇష్టపడే వస్తువులు ఏమైనా అతని కంట పడేట్టు చెయ్యడం లాంటివి ..." అన్నాడు డాక్టర్ ...
"అలాగే డాక్టర్ .. నా భార్గవ్ నాకు దక్కితే అంతకన్నానా ..." అందామె ..
                                                     ****
సంహిత కళ్ళల్లో ధారాపాతంగా నీళ్ళు ... ఒక్కసారిగా ఆమె గుండెల్లో నిఘూడంగా దాగి ఉన్న దుఃఖం కట్టలు తెంచుకుంది ..ఇన్నాళ్ళు అజ్ఞాతంలో జీవిస్తున్న ఆమెలో అతని జ్ఞాపకాలు గొంతు చించుకొని అరవసాగాయి "సుధీర్ ......" అంటూ.... సుధీర్ తో కలిసి ఉన్న ప్రతి క్షణం, ప్రతి చోటు, మాటాడిన ప్రతి మాటా ఆమెకు కళ్ళు ముందే కనిపిస్తున్నాయి ... గుండెను రంపపు కోతకు గురిచేస్తున్న బాధ ఆమెకు కలుగుతుంది .. తను సుధీర్ ని అంత ప్రాణంగా ప్రేమించింది, అతనే జీవితం అనుకుంది...కానీ ఈ రోజు అతను తనకు లేడు... ఆ నిజం జీర్ణించుకోలేనిదిగా అనిపిస్తుంది సంహితకి..

"చంటీ ......దివ్యా .....నా సుధీర్ నాకిక లేడా" ఆమె గొంతు జీర పోయింది ...
"సంహీ ... సుధీర్ భౌతికంగా నీ దెగ్గర లేకపోయినా ...అతని మనసు ఇంకా నీకోసమే ఎదురుచూస్తుంది ...అతని గుండె నీకోసమే కొట్టుకుంటుంది ...అతను నీకోసమే బ్రతుకుతున్నాడు " అన్నాడు కార్తీక్
"చంటీ ....." ఆమె ఆశ్చర్యంగా చూస్తుంది ...
"అవును సంహీ ...సుధీర్ చనిపోయాక అతని వైటల్ ఆర్గన్స్ అన్నీ భార్గవ్ అనే అతనికి ట్రాన్స్ ప్లాంట్ చేశారు ... నీ మీదనే అణువణువు ప్రేమ నింపుకున్న సుధీర్ భార్గవ్ లో నీకోసం జీవిస్తున్నాడు ... భౌతికంగా అతను భార్గవ్, కానీ మానసికంగా సుధీర్ ... నిన్ను, నన్ను దివ్యని అందరినీ గుర్తుపట్టాడు ... నీ నుంచి సుధీర్ ని దూరం చెయ్యడం ఆ దేవుడికే తప్పనిపించి ఉంటుంది , అందుకే నీకోసం మళ్ళీ సుధీర్ ని పంపాడు ..." అన్నాడు కార్తీక్ ఉద్వేగంతో ...
"చంటీ...నువ్వు చెప్పేది నిజమా .... నేను అతన్ని చూడాలి ..." అంది.
"మనం అతన్ని త్వరలోనే కలుస్తున్నాం సంహీ ...."
                                                  *****

కొన్ని రోజులకి భార్గవ్ కనిపించాడు కార్తీక్ కి ...."సుధీర్ ...." అంటూ కేకేశాడు కార్తీక్ ...
భార్గవ్ అతని వైపు చూడకుండా తనపాటికి తను వెళ్ళిపోతున్నాడు ....
కార్తీక్ పరిగెత్తుకుంటూ వెళ్లి భార్గవ్ ని కలిసి "సుధీర్ ..." అన్నాడు 
"సుధీరా?...నా పేరు భార్గవ్ ...మీరు?" సంశయంగా చూసాడు భార్గవ్ కార్తీక్ వైపు ...
అంతే నిశ్చేష్టుడై చూస్తూ నిలబడ్డాడు కార్తీక్ ..."సు..ధీ...ర్ ...నేన కార్తీక్ ... సంహిత నీకోసం చూస్తుంది .." లీలగా వస్తున్నాయి అతని మాటలు...
"మీరేదో పోరపడినట్లు ఉన్నారు..అయాం భార్గవ్ ...మిమ్మల్ని నేను ఎప్పుడూ చూడలేదే ..." అన్నాడు భార్గవ్ 

                                                 ** **

సడన్ గా జోరున వర్షం మొదలైంది  ...
రోడ్డు మీద నడిచే జనాలు మొత్తం తుపాకి పేల్చితే చెల్లాచెదురు అయ్యే కాకుల్లా అటూ ఇటూ పతిగెత్తుతున్నారు షెల్టర్ కోసం
ఆమె మాత్రం అలానే వర్షంలో తడుస్తూ నిల్చుంది ...ఆమె కళ్ళు బస్సు స్టాప్ లో నిల్చున్న అతన్నే చూస్తున్నాయి ... వర్షంలో వర్షిస్తున్న ఆమె కళ్ళు కడిగిన ముత్యాల్లా ఉన్నాయి ...
"సంహీ ...."
తిరిగి చూసింది ...వెనుకగా వస్తూ కార్తీక్ ...
"ఎన్నాళ్ళిలా అతని కోసం రోజూ బస్సు స్టాప్ లో నిల్చుని చూస్తావ్ ... భార్గవ్ మనల్ని ఇంకెప్పుడూ గుర్తుపట్టడు  ..." అన్నాడు కార్తీక్ బాధగా ..
"ఏదో ఒక రోజు అతనిలో ఉన్న సుధీర్ గుండె నాకోసం కొట్టుకుంటుంది ..నేను రోజూ చూసే ఎదురుచూపులు ఆ గుండెని ఎదోనాడు కరిగించక మానవు ...ఆ రోజు వరకూ ఎదురు చూస్తాను .. ఆ గుండె నిండా నేనే ఉంటాను చంటీ ... ఎప్పటికైనా ఆ గుండెలో స్థానం నాదే ..."

                            ** రెండు సంవత్సరాల తరువాత **

"భార్గవ్...రారా...సంహీ ఎక్కడ?" అడిగాడు కార్తీక్ భార్గవ్ రావడం చూసి ..ఆ రోజు కార్తీక్ కొడుకు మొదటి పుట్టిన రోజు ...
"తను సుధ కలిసి వస్తామన్నారు ... కాసేపట్లో వస్తారు....నేను డైరెక్ట్ గా ఆఫీసు నుంచి వస్తున్నానురా .. ఇంతకీ నా అల్లుడు ఎక్కడ?... వేర్ ఈజ్ మై బర్త్ డే బాయ్ సుధీర్ " అన్నాడు ఇంట్లోకి వస్తూనే ...
"సుధీర్....మామయ్య వచ్చాడురా .. " అంటూ పిలిచాడు కార్తీక్ తన కొడుకు సుధీర్ని ...
ఇంతలో  సంహిత, సుధ వచ్చారు ....
"కార్తీక్...సుధీర్ పేరు నాకు కొడుకు పుడితే పెడదాం అనుకున్నానురా ...కానీ ఈ ఛాన్స్ నువ్వే ముందు కొట్టేసావ్ ..." అన్నాడు భార్గవ్ నవ్వుతూ 
"పర్లేదు లెండి...మనకి డెఫినెట్ గా అమ్మాయే పుడుతుంది ...దానికి సుధీరి అని పెడదాం పేరు ..." అంది సంహిత నవ్వుకలుపుతూ ...
"సుధీరీనా!!... నీకేమో సంహిత అని పోష్ పేరు...నా కూతురికేమో సుధీరినా .." అన్నాడు భార్గవ్ నవ్వుతూ...
పార్టీ అయిపోయాక సంహిత, భార్గవ్ ఇంటికి బైల్దేరారు ...
చాలా సీరియస్ గా కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు భార్గవ్ .. 
"భార్గవ్ ...ఆర్ యు ఆల్ రైట్" అంది సంహిత..  
డ్రైవ్ చేస్తూ సంహిత వైపు చూస్తూ "సంహీ ..." అన్నాడు..
"ఊ ..." 
"ఆ రోజుని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను ..."
"ఏ రోజుని?"
"నువ్వు నాకు ప్రోపోజ్ చేసిన రోజుని ...  "
"జోకా!!...తమరే నన్ను ప్రోపోజ్ చేసారు ముందు... నేను రోజూ బస్సు స్టాప్ కి తమరి కోసమే వచ్చినా, నా కన్నా ముందు మీరే బస్సు స్టాప్ లోనే వచ్చి నన్ను పెళ్ళిచేసుకుంటావా అని అడిగారు కదా..మర్చిపోయారా... నువ్వు లేకపోతే నేను బ్రతకలేనేమో అనిపిస్తుంది నిన్ను చూస్తుంటే అని కూడా అన్నారు ..." అంది సంహిత చిన్నగా నవ్వుతూ 
ఓ నిముషం భార్గవ్ ఏమీ మాట్లాడలేదు ....

"ఆ రోజు గీతం కాంపస్ లో ...కాంటీన్ లో ....నువ్వు నాకోసం పెట్టిన కన్నీళ్లు .. జీవితాంతం నాకు తోడుగా ఉంటావా అని అడిగిన మాట నేను మర్చిపోలేను బంగారం ..."
చివాల్న తిరిగి అతని వైపు చూసింది ... ఆమెలో సన్నని వణుకు ... నిశ్చేష్టురాలై అతన్నే చూస్తూ ఉంది ...
"అదే రోజు రిషికొండ దెగ్గరి అమ్మవారి గుడిలో నీకు బొట్టుపెట్టి నీతోనే ఎప్పటికీ కలిసి ఉంటాను అని ప్రమాణం చేశాను ...ఆ మాట నిలుపుకోలేక పోయాను... నిన్ను వదిలేసి ఈ లోకం నుంచి వెళ్ళిపోయాను ..." అతని కళ్ళలో నీళ్ళు ...
"సు ...ధీ .....ర్ " వణుకుతున్న ఆమె పెదవుల నుండి లీలగా వచ్చాయి ఆ పదాలు ...
అతను వంద  కె.ఏం.పి.హెచ్ తో హై వే మీద దూకించాడు బండిని ....

********************* సమాప్తం ********************
Meet you all soon -------------- Ramakrishna Reddy kotla 

17 comments:

ప్రణీత స్వాతి said...

కృష్ణ గారూ..ముగింపుకి ఇంకో రెండు ఎపిసోడ్స్ పడుతుందని అనుకున్నా. అదేంటండీ..కధని కుదించేశారు? కొద్దిగా అస్పష్టంగా అనిపించింది.

మధురవాణి said...

హమ్మయ్యా.. మొత్తానికి సుఖాంతం చేసారుగా! :-) చాలా బాగా రాశారు కథని.Keep writing!

nagarjuna said...

చప్పట్లు, ఈలలు... ఏవ్విధమైన సస్పెన్సు వగైరా లేకుండా కథని ముగించినందుకు.
ఐనా కథన్నాక మమ్మల్ని టెన్షన్‌కు గురిచేయాలిగాని హీరోయిన్ని అదీ claimaxలో టెన్షన్ పెట్టించావేమిటి బాసు...

సతీష్ said...

అద్భుతంగా ముగించారు, నేను అనుకున్న ఎండింగ్ కాదు, మీ ఎండింగ్ నాకు నచ్చింది. ఎంత, థెరపీల ద్వారా అతన్ని భార్గవ్ ని చేసినా, అతనిలో ఆమెకోసం ఉన్న సుధీర్ ఆమె ప్రేమకోసం బైటకి వస్తాడు అని చూపించారు చివరిలో, అది బాగా నచ్చింది. ఇంకా డాక్టర్ ఆ identity గురుంచి వివరించిన తీరు చాలా బాగుంది. మరో మంచి కథ కోసం వెయిట్ చేస్తుంటా.

sowmya said...

అంతా బాగానే ఉందికానీ మళ్ళీ ఈ సస్పెన్స్ ఏమిటి బాబూ. ఆ సంహితని హాయిగా బతకనివ్వరా?
పైన "నాగార్జున 4E" అడిగినట్టూ పాఠకులని టెన్షన్ పెట్టాలిగానీ హీరోయిన్ ని పెడితే ఎలా :)

ఏది ఏమైనా కథని నడిపించిన విధానం, ముగింపు చాలా బాగుంది. మొత్తం చదివాక అయ్యో అప్పుడే ముగించేసారా అనిపించింది.

త్వరలో ఇంకో కథ రాస్తారని తలుస్తున్నాను.

శివరంజని said...

ఏమిటండీ కిషన్/రామకృష్ణ గారు(సడెన్ గా మీ పేరు తో ఎంటర్ అయ్యేటప్పడికి ఈ రెండింటిలో ఏ పేరుతో పిలవాలో తెలియడం లేదు)... మా పోరు పడలేక త్వరగా ముంగించేసారా స్టొరీ... ఏదో మాట వరసకి అలా అంటాం కాని ఇంకో రెండు ఎపిసోడ్స్ ఉంటే బావుండుననిపించింది.స్టోరీ చాలా రియాల్స్టిక్ గా కళ్ళ ముందు ప్లే అవుతున్నట్టు రాసారు . ఈ స్టొరీ కోసం ఎంత హోంవర్క్ చేసారో చదువుతుంటే అర్దమవుతుంది అందుకే ఇంత బాగా ప్రెజెంట్ చేయగలిగారు . అందుకోండి నా అభినందనలు .

చివరిలో మీరు పెట్టిన ట్విస్ట్ కి నాకీ డౌట్స్ వచ్చాయి. మరేమో సుధీర్ చనిపోయినా తన ఆర్గాన్స్ సైతం సంహీని మర్చిపోలేదు .. మరి సంహీ?? మర్చిపోకపోయినా భార్గవ్ తో ఎలా అడ్జస్ట్ అవగలుగుతుంది ? భార్గవ్ లో సుధీర్ ని మాత్రమే చూస్తుందా ?సంహీ ది కరెక్ట్ డెసిషన్? నాది అర్ధం పర్ధం లేని ప్రశ్న అండీ? శ్రమ అనుకోకుండా చెబుతారా?

కవిత said...

naku kuda Shivaranjani gari lage konni chethha doubts vachayi....smahi ala ela adjust indi abba???malli...last lo ee twist enti???

Ramakrishna Reddy Kotla said...

ప్రణీత: నిజమే, ఇంకో రెండు ఎపిసోడ్స్ రాద్దామనుకున్నాను..కానీ స్టోరీకి మొదటి అయిదు ఎపిసోడ్స్ కి ఉన్న మొమెంటమ్ తర్వాత ఆ స్తాయిలో లేదేమో అనిపించి, ముగించాలనే నిర్ణయించి ముగించాను.. ఆదరించిన మీకు నా అభినందనలు

మధురవాణి : థాంక్స్..:-)

నాగార్జున: సంహిత సుధీర్ ని కొంచెం మరచిపోయి ఆ స్థానంలో భార్గవ్ ని ప్రేమించడం మొదలెట్టింది ..ఇది సహజమే కదా...కనుక చివరిలో సుధీర్ ని సంహితకి గుర్తుచేద్దామని అలా చేశా ... :-)

Ramakrishna Reddy Kotla said...

సతీష్: చాలా థాంక్స్ :-)

సౌమ్య : థాంక్స్, కొద్ది రోజుల్లో రాస్తాను :-)

కవిత : రంజని గారికి ఇచ్చే సమాధానంలో మీకు సమాధానం దొరుకుతుందిలెండి :-)

Ramakrishna Reddy Kotla said...

రంజని: ఏ పేరుతో పిలిచినా పలుకుతాను... అయినా ఈ మధ్య అందరూ తెగ టపాలు పెట్టారుగా "పేరులోనేముంది .." అని ..సో అదనమాట.. మీ పోరు పడలేక కాదులెండి..కావాలనే ముగించా... మీ అభినందనలకు నేను ఆల్రడీ మునగచెట్టు మీదున్నా ...

మీ ప్రశ్నలకు సమాధానాలు చెపుతాను...ఒక కథలా కాకుండా మాములుగా ఆలోచించండి .. సంహిత సుధీర్ ని ప్రేమించింది.. అతను చనిపోయాడని తెలిసాకా చాలా బాధపడింది .. కానీ ఇంకో వ్యక్తిలో తన ప్రియుడి అవయవాలు ఉన్నాయి అని తెల్సి, అతను తనకు సొంతం కావాలి అనుకుంది ..ఆ విధంగా సుదీరే తనతో ఉన్నట్లు అనుకోవచ్చు అనుకుంది ...కానీ పెళ్లైంది ..రెండు సంవత్సరాలు గడిచిపోయాయి .. ఒక భర్తగా భార్గవ్ ఎంతో దెగ్గర అయ్యాడు.. పైగా తనకు ప్రాణ దానం చేసిన సుధీర్ పై ఎంతో కృతజ్ఞత పెంచుకున్నాడు .. అది ఎప్పుడూ సంహితకి తెలియజేస్తూనే ఉన్నాడు .. కొన్ని నేనల తరువాతా భార్గవ్ ని ఒక ప్రేమికుడి అవయవాల సంహారంగా కాకుండా ఒక వ్యక్తిగా..ఒక మనసున్న మనిషిగా.. తన పై ఎంతో ప్రేమ చూపించే ప్రేమికుడిగా చూడటం జరుగుతుంది .. రెండు సంవత్సరాలలో తనని అంత ప్రభావితం చేస్తాడు భార్గవ్ .. మెల్లిగా సుధీర్ స్థానాన్ని భార్గవ్ నింపేస్తాడు .. ఇక్కడ ప్రాక్టికల్ గా జీవించడం అనేది నా ఉద్దేశం.. మనసులో సుధీర్ ని ఉంచుకొని ఎంత కాలం భార్గవ్ లో సుధీర్ ని చూడగలదు .. భార్గవ్ సొంత వ్యక్తిత్వం ఆమెకి ఏదో ఒకనాడు తెలుస్తుంది ..అప్పటినుంచి అతన్ని భార్గవ్ లానే చూస్తుంది .. మనసులో సుధీర్ ఆలోచనలను పక్కన పెట్టి భార్గవ్ ని భార్గవ్ గానే ప్రేమించడం మొదలెడుతుంది .. ఆమె అతడి భార్య కనుక ... మీకు కావలసిన జవాబులు దొరికాయా .. నా అభిప్రాయాలతో మీకు ఎకీభవించాల్సిన పని లేదు కనుక నేను చెప్పిన దానిలో మీకు నచ్చని విషయం ఉంటే చెప్పండి ... :-)...

శివరంజని said...

@కిషన్ గారు: కవిత గారు అన్నట్టు నా చెత్త డౌట్స్ కి ఓపికగా సమధానం చెప్పినందుకు థాంక్స్.(ఆహా ఏమి చెప్పారండి జీవితాన్ని కాచి వడపోసినట్టు చెప్పారే ) .
నా డౌట్ మీకు సరిగ్గా ఎక్ష్ప్రెస్స్ చేయలేకపోయాను . అందుకే మీరు అంత భారీ సమధానం చెప్పవలసి వచ్చింది .
అంటే సంహీ సుధీర్ కోసం పేరేంట్స్ ని వదలడానికి సిద్దపడింది . సుధీర్ వల్లే కదా అమ్నేషియా పేషంట్ గా కూడా తయారయ్యింది . అలాంటిది భార్గవ్ ని ఏక్సెప్ట్ చేయగలిగిందా ? అని అనిపించింది.
నేను అమ్మాయిలా ఆలోచించాను మీరు అబ్బాయిలా ఆలోచించారు అందుకే ఇద్దరి అభిప్రాయలలో చిన్నపాటి డిఫరెన్స్ వచ్చిందేమో.
మీ సమధానం చదివాక మీరెంత ముందు చూపుతో రాసారో ఈ స్టొరీ అర్ధమయ్యింది.(ఇది కేవలం నాకు డౌట్ వచ్చి అడిగాను అంతే.కోపం తెచ్చుకోకండి. మీరు రాసిన స్టొరీలో లోపాలు వెదకటం లేదు అని మనవి,its true..)

అయినా మీ బ్లాగ్ కి నేను రెగ్యులర్ రీడర్ ని అవ్వడం మీ దురదృష్టం నా డౌట్స్ తో మిమ్మల్ని విసిగించేస్తాను జాగ్రత్త...
మాకీ సస్పెన్స్ లు బాగా అలవాటయిపోయాయి so,next serial మొదలుపెట్టేయండి త్వరగా .

ఆ ....అన్నట్టు చెప్పడం మరిచిపోయాను వర్షా కాలం కదా మునగ చెట్టు మీద గొంగలి పురుగులు ఎక్కువ గా ఉంటాయి... Take care

Anonymous said...

Ramu, I am really proud of you raa. Neeku teledu kaani nenu nee blogs baaga follow avutunna.. Maa family nunchi oka manchi writer..

Ramakrishna Reddy Kotla said...

Anonymous lo comment ichindi ma vadina gaara leka akka gaara??... :-)..anyway, am so happy seeing your comment vadina/akka... :-)

Raj said...

Hi kishan

mothaniki muginchesaru

happy kani happy aina sad ending kada

samhitha ni malli tension petti vadilesaranna mata cool

viewers ni vadilesi characters ni tension pedutunnara

Anonymous said...

hi kishan garu.. nenu mee story hrudayam premisthanu ante vidhi vidadeesthanu ante chadivanu.. hatsoff to your narration.. nijam ga ee famous writter novel kanna mee story takkuva kadu .. yendamuri garu mee inspiration anukunta ... story lo science ni palikinchadam ayana trademark... kani meeru mee style lo adaragottaru.. you have great heights to reach ..

mee story antha chadivaka nenu anukunna daniki , ranjani gari ki meeru ichina clarification ki naku oka doubt vachindhi ..

nenu anukunnadi: samhitha sudhir kosam bhargav ni premisthundi.. alane bhargav loni sudhir ee roju ayina spandisthadaa ani wait chesthundhi ..alane bharghav propose cheyatam jarigi.. sudhir kosam bharghav ni pelli chesukuntundhi.. melliga 2 years lo bharghav vyakthithvaniki aakarshithurali bharghav ni accept cheyagaligindi.. thanaki ippudu athanu sudhir+bhargav .. anduke appudu appudu athanu sudhir la patha vishayalni matladina artham chesukogaluguthondi .. happies ending

meeru ranjani gariki ichina clarification batti infer chesukunnadi: modata sudhir kosame bhargav ni pelli chesukunna, melliga bhargav ni artham chesukuni melli melli ga sudhir ni marchipogaligindi.. ippudu sudhir oka gnapakam ... practical ga alochinchi new life ni start chesindhi ..

Ila ayithe climax lo bharghav lo ni sudhir cheppina dialogues ki samhitha lo antharmadhanam start avada...sudhir uniki ledu anukuni marchipoyi undatam oka ethu.. kani aa manishi manaki daggarina vallalo lone inka jeevinchi unnadu .. appuduappudu teralu vidichu bitaki vasthunnadu ante chaala confusing kada aa ammayi life...

plzz andi ee naa 2 inferences lo edi correct oo cheppandi.. oka vela second one correct ante inkoncham clarification ivvara plzz plzz.. ayyo chala pedda comment ayindi sorry.. waiting for ur reply

sriharsha said...

నైస్ స్టొరీ అండి ..
మీ నెక్స్ట్ స్టొరీ కోసం ఎదురు చూస్తూ..

vijay.... said...

రామ కృష్ణ గారూ , మీరు మాములు వాళ్ళు కాదు అండి మీరు రాసిన హృదయం ప్రేమిస్తానంటే...విధి విడదీస్తానంటే చదువు తుంటే నా ముందు జర్గుతుంటూ నేను ఆ కధ లో ఉన్నటు ఫీల్ అండి ఫీల్ కాదు నేను ఉన్నటు అనిపించింది.
మీ సుధీర్ పాత్రా కేక, అండ్ సుధీర్, షంషీత మధ్య కలిగే ప్రేమ సూపర్ గ రాసారు. బాగా బావోదువేగం ఆయను చదువుతున్నపుడు, డాక్టర్ ఐడెంటిటీ గురుంచి చెప్పటం కేక లాగా ఉంది.
క్లైమాక్స్ అన్ని స్టోరీ లాగా కాకుండా డిఫరెంట్ ఎండ్ చేసారు..

నా హృదయం మీ స్టోరీ ని ప్రేమిస్తుంటే మీరు ఏమో విడదీశారు.

మీ
బాహు (విజయ్ )