Search This Blog

Tuesday, 29 June, 2010

కిట్టిగాడు loves ఎదురింటి అమ్మాయి - 1


"ఎవరూ?..." అన్నాడు కిట్టిగాడు గుమ్మం బయట నిల్చున్న ఆ అమ్మాయినే తదేకంగా చూస్తూ....
"ఆంటీ లేరా?.."అంది అమ్మాయి వాడి చూపులకు ఇబ్బంది పడినట్లుగా....
"మీరూ?...."అంటూ ఆలోచనలో పడ్డాడు ఎవరయి ఉంటుందీ అమ్మాయి అని.. 
"కొంచెం ఆంటీని పిలుస్తారా?..."అంది గుమ్మం కి అడ్డంగా నిల్చున్న కిట్టిగాడికి పక్కగా జరిగి లోపలికి చూస్తూ...
"అమ్మా....అమ్మా..." అరిచాడు కిట్టిగాడు... "ఎంట్రా..ఏదో మునిగిపోయినట్లు.."అంటూ వచ్చిందావిడ...వస్తూనే గుమ్మంలో అమ్మాయిని చూసి " సుస్మితానా...రామ్మా లోపలికి..."అంటూ వాడి వైపు తిరిగి "ఏరా అమ్మాయిని లోపలికి పిలవాలనే జ్ఞానం లేదా?" అంటూ చీవాట్లు పెట్టింది... 

వాడు నల్ల మొహం వేసాడు.... "ఎమ్మా?...కాఫీ తాగుతావా" అడిగిందావిడ.. "లేదాంటీ...వెళ్ళాలి....ఇంటికి బంధువులోచ్చారు...పాలు నిండుకున్నాయి...మీ ఇంట్లో పాలు ఉన్నాయేమో అమ్మ తీసుకురమ్మంది...వాళ్ళకి టీ పెట్టాలి.."అంది అమ్మాయి అమాయకంగా... "దానికేం భాగ్యం తల్లి...ఇదుగో ఇప్పుడే తెస్తా ఉండు.."అంటూ లోపలి వెళ్ళింది...
"మీ ఇల్లెక్కడ?...మిమ్మల్ని ఎప్పుడూ నేను చూడలేదే...??" అన్నాడు కిట్టిగాడు, ఇంత బ్యూటీని ఎలా మిస్ అయ్యనబ్బా అనే లెవెల్లో... "కొత్తగా వచ్చాం...మీ ఎదురింట్లోకి.." అంది అమ్మాయి నేల చూపులు చూస్తూ ....వాడు మాత్రం తినేసేలా చూస్తున్నాడు అమ్మాయిని..
"..అలాగా..నేను హాస్టల్లో కదా ఉండేది అందుకే తెలీదు....అయినా నేను వచ్చి వారం అయింది...ఒక్కసారి కూడా కనిపించలేదే ... ఇంట్లోంచి బయటకే రావా?...ఏం చదువుతున్నావు?" అన్నాడు .. 
వాడు వెంటనే ఏకవచనంలోకి మారిపోయే సరికి కొంచెం ఇబ్బంది పడుతూ "సెకండ్ బిటెక్.." అంది.
"అంటే... రెండో సారి బీ-టెక్ చదువుతున్నావా ..??"
ఆ అమ్మాయి షాక్ తిని కళ్ళు పెద్దవి చేసి చూస్తూ .."బీ-టెక్ రెండో సంవత్సరం చదువుతున్నాను ..." అంది...

"ఓహో...నేనేమి చదువుతున్నానో అడగవేంటి....అన్ని నేనే అడగాలా?" అన్నాడు అమ్మాయి వైపు చూసి.... అమ్మాయి ఒక్కసారిగా ఖంగుతింది..వీడెక్కడ దొరికాడురా దేవుడా అనుకుంటుండగా, వాళ్ళమ్మ వచ్చి దేవతలా రక్షించింది... పాలు తీసుకొని తుర్రుమంది...
"పాలు నిండుగున్నాయి అని చెప్పి మళ్లీ పాలు పట్టుకువెళ్తుంది..మెంటలా పిల్లకి.."అన్నాడు వాళ్ళ అమ్మతో.. "ఓరి నీ తెలివి సంతకెళ్ళ...నిండుగున్నాయి కాదురా...నిండుకున్నాయి అంది అమ్మాయి...అంటే ఖాళీ అని అర్థం...ఏం చదువులో ఏంటో" గొణుక్కుంటూ వెళ్ళింది.... 

ఆ రోజు సాయంత్రం టీవీలో వస్తున్న "టైటానిక్" సినిమాలో కేట్ ని చూస్తుంటే ప్రొద్దున పాల కోసం వచ్చిన సుస్మిత గుర్తొచ్చింది మనోడికి...ఎంత కాదనుకున్న కేట్ లో కొన్ని పోలికలు సుస్మితలో కనిపించాయి కిట్టిగాడికి..ముఖ్యంగా ఆ కళ్ళు...ఆ పెదవులు .. ఈష్టు గోదావరి కేట్ విన్నుస్లెట్ అంటే సుస్మితేనని తీర్మానించుకున్నాడు .. ఇంకో పది రోజుల్లో మళ్ళీ కాలేజీ మొదలువుతుంది..ఈ లోపు ఆ అమ్మాయిని లైన్ లో పెట్టాలి,అసలే నాకు ఇంకా గర్ల్ ఫ్రెండ్ లేదని నా స్నేహితులు ఎగతాళి చేస్తున్నారు అని ఫుల్ గా డిసైడ్ అయ్యాడు కిట్టిగాడు.. అనుకున్నదే తడవుగా మెదడుకు మాల్టోవా పెట్టడం మొదలెట్టాడు.. ఒక మహత్తరమైన ఐడియా తట్టి... వెంటనే వంటింట్లోకి వాళ్ళ అమ్మ లేని టైంలో వెళ్లి, డబ్బాలో నిండుగా ఉన్న మూడు కీజీల పంచదారని ఇంటిప్రక్కన ఉన్న మురికికాలవలో గుమ్మరించి మళ్ళీ ఆ డబ్బాని యథాస్థానంలో ఉంచి, వాళ్ళ అమ్మ దెగ్గరికి వెళ్లి.." అమ్మా... తలనొప్పిగా ఉంది ఒక మాంచి స్ట్రాంగ్ కాఫీ పెట్టవే.." అన్నాడు తల మీద రుద్దుకుంటూ...

"లేచిన దెగ్గరనుంచి ఆ దిక్కుమాలిన టీవీ చూడకురా అని చెప్తుంటే విన్నవూ.. వచ్చి వారం అయింది ఒక్క రోజన్నా పుస్తకం తీసిన పాపాన పోలేదు, మొన్న సెమిస్టర్ లో వచ్చిన నీ మార్కులు మీ నాన్నగారు చూసుంటే ఇంక నిన్ను చదివించడం సుద్ద దండగ అని డిసైడ్ చేసి నిన్ను ....."
"అమ్మా....తలనొప్పి బాగా ఎక్కువగా ఉందమ్మా... ప్లీజ్ అమ్మా వెళ్లి కాఫీ పెట్టమ్మా.." అన్నాడు తల పట్టుకొని ఊగిపోతూ...
'ఎందుకు పనికోస్తావురా నువ్వు...' అనే ఓ భయంకరమైన లుక్ విసిరి వాళ్ళ అమ్మ వంటింట్లో కెళ్ళింది...

"ఒరేయ్ కిట్టిగా...." గట్టిగా పిలిచింది వాళ్ళమ్మ ...
"ఏంటమ్మా ....హబ్బా ఒకటే తలనొప్పి..." అని తల పట్టుకుంటూ లోపలికి వెళ్లాడు ...
"ఒరేయ్...మొన్ననే మూడు కీజీల పంచదార తెచ్చి ఈ డబ్బాలో పోశానురా... ఇప్పుడు చూస్తే మొత్తం ఖాళీ... ఏంటో ఏదో మాయలా మాయమయిందేంటిరా ..." అందామె తెల్లబోతూ ...
"హబ్బా అమ్మా...నువ్వు నిజంగా తెచ్చి ఆ డబ్బాలో పోస్తే ఏమవుతుంది చెప్పు... అంతా నీ భ్రమ..." 
"డబ్బా అట్టుకొని మొహాన కొట్టానంటే తలనొప్పి కాస్తా ఎగిరిపొద్ది ఎధవా... భ్రమ అంట భ్రమ ... నిజంగా తెచ్చి పోశానురా అంటుంటే ..." అందామె ..
"అమ్మా...పోనీ మనింట్లో పిల్లులు ఎలుకలు రాత్రి స్వైర విహారం చేస్తాయి కదా...అవి తినేశాయేమో...ఇప్పుడెలాగమ్మా నాకిప్పుడు కాఫీ కావలి ..."
"పిల్లులు తినడం ఏవిట్రా నీ మొహం...హమ్...సరే రోడ్డు మీదికెళ్ళి ఇప్పటికి ఓ అరకిలో పంచదార అట్రా..."
"తలనొప్పితో రోడ్డు దాకా ఎలా వెళ్లనమ్మా... ఎదురింటి సుస్మితా వాళ్ళింటికి వెళ్లి ఓ గ్లాసెడు తీసుకురానా? " అన్నాడు కళ్ళింత చేస్తూ...
"సుస్మితా వాళ్ళింటికా...వద్దులేరా..ప్రొద్దునే కదా ఆ అమ్మాయి వచ్చి మన ఇంట్లో పాలు తీసుకువెళ్ళింది... ఇప్పుడు మనం వెళ్లి పంచదార అడిగితే, పాలకి పంచదార బదులేమో అనుకుంటారు ...బాగోదు..."
"నువ్వూరుకోమ్మా...ఊరికే తొక్కలో మొహమాటాలూనూ...నే వెళ్లి తీసుకువస్తా ఉండు ..." అంటూ ఓ గ్లాస్ పట్టుకొని బైల్దేరాడు వాళ్ళమ్మ వద్దన్నా వినకుండా....

సుస్మిత వాళ్ళింట్లో అడుగెట్టాడు కిట్టిగాడు అలియాస్ కృష్ణ చైతన్య...
హాలులో సుస్మిత వాళ్ళ అమ్మగారు అనుకుంటా జెమినీలో సీరియల్ చూస్తూ అందులో ఉన్న రాధిక ఏడుస్తుంటే ఈవిడ అంతకన్నా ఎక్కువగా కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది ముక్కు తుడుచుకుంటూ...
ఎలా మొదలెట్టాలో అనుకుంటూ ..చిన్నగా దగ్గి "ఆంటీ ..." అన్నాడు ..
ఆమె వినిపించుకునే పరిస్థితుల్లో లేదు.. టీవీకి ఆమెకి ఆరడుగు గ్యాప్ కూడా లేదు...మళ్ళీ పిలిచాడు...ఊహూ .. తన స్పందనకి ఆమె ప్రతిస్పందన లేకపోయేసరికి పిచ్చెక్కినట్లు అటూ ఇటూ చూసి... వాళ్ళింటి గడప దెగ్గర గ్లాస్ పట్టుకొని నిల్చున్న వాడి వాలకాన్ని వాడు చూసుకొని థూ ఎదవ జీవితం .. కానీ తప్పట్లేదు అనుకొని ..డోర్ పైన కొడదాం అనుకొనే లోపే సుస్మిత హాల్లోకి వచ్చింది... గడప దెగ్గర ఉన్న వాడిని చూసి మైల్డ్ గా షాక్ కొట్టిన దానిలా ఫేస్ పెట్టి...వెంటనే తేరుకొని ..."మమ్మీ...మమ్మీ...ఆ అబ్బాయి వచ్చాడు..." అంటూ వాళ్ళమ్మని కుదిపి ఈలోకంలోకి తీసుకొచ్చింది... మనోడు 'ఛా అనోసరంగా వాళ్ళమ్మని పిలిచింది...ఈ పిల్లే వచ్చి ఏం కావాలని అడగోచ్చుగా...' అనుకొంటుండగా సుస్మిత వాళ్ళమ్మ కిట్టూని అదోరకంగా చూస్తూ వస్తూ .."నువ్వు ఎదురింటి రాజ్యలక్షీగారి అబ్బాయివి కదా...రా బాబు వచ్చిలా కూర్చో ...కృష్ణ చైతన్య కదా నీ పేరు " అందామె ... దొరికిందే చాన్స్ అనుకొని కుర్చీ లాక్కొని కూర్చొని "అవునండీ.."అన్నాడు..

"ఏం బాబూ ఎలా ఉన్నావు ..ఇదే కదా మా ఇంటికి రావడం.." అందామె
"ఆ బాగున్నాను ఆంటీ...అది.. కొంచెం పంచదార ఉంటే ఇస్తారేమో అని అమ్మ పంపిస్తే వచ్చానండి..." అన్నాడు గ్లాస్ టీపాయ్ మీద పెడుతూ...
"సుస్మీ... వెళ్లి ఈ గ్లాస్ నిండా పంచదార తీసుకొనిరా ..." అంటూ సుస్మీకి గ్లాస్ ఇచ్చి .."ఎక్కడ చదువుతున్నావు బాబూ..." అందామె..
"నేను వైజాగ్ గీతంలో ఇంజినీరింగ్ ..." అన్నాడు గ్లాస్ తీసుకొని లోపలి వెళ్తున్న సుస్మీనే చూస్తూ...ఆ పిల్ల వంటింటి గుమ్మం దాకా వెళ్లి వీడి వైపు తిరిగి.. ఏ మగ పుంగవుడూ అర్థం చేసుకోలేని...నిర్వచించలేని ఒక చూపు విసిరి లోపలికి వెళ్ళింది... 

మనోడు ఆ చూపుని డీకోడ్ చేసేలోపే ..ఆంటీ గారు .."అలాగా... ఏ ఇయర్?" అంది...
"నేను థర్డ్ ఇయర్... కంప్యూటర్స్ .."
"అలాగా...మా సుస్మీ ఇక్కడే గోదావరి కాలేజీలో చదువుతుంది...తను కూడా కంప్యూటర్స్..ఇప్పుడు సెకండ్ ఇయర్.. తను మొదట్లో హాస్టల్లో ఉండేది..కానీ తనకు హాస్టల్ పడకపోయేసరికి..మేము కాకినాడ నుంచి ఇక్కడకి షిఫ్ట్ అయిపోయాం... ఒక్కతే కూతురాయే దాని కన్నా మాకు ఎక్కువేంటి..." అందావిడ..
'అబ్బో...పర్లేదు ఆంటీ కోపరేటివ్ గానే ఉంది..ఇక రోజూ కాసేపు ఇలా వచ్చి సుస్మీకి బీట్ వెయ్యొచు....పైగా ఒక్కతే కూతురంటా.. ఆస్తి మొత్తం అమ్మాయిదే అనమాట...పైగా విలన్.. అదే... బ్రదర్ కూడా లేడు..లక్కంటే ఇలా కలిసి రావాలిరా కిట్టిగా ...' అనుకొని లోపల సంబరపడుతూ కేరింతలు కొట్టడంమొదలెట్టాడు కిట్టిగాడు...
ఈ లోపు సుస్మీ పంచదార తెచ్చి టీ-పాయ్ మీద పెట్టి లోపలికి వెళ్లబోతుండగా..."సుస్మీ...ఇలా రా...ఈ అబ్బాయి కృష్ణ చైతన్య ఎదురింటి రాజ్యలక్ష్మి ఆంటీ వాళ్ళబ్బాయి..గీతంలో కంప్యూటర్స్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడట.." అంటూ పిలిచింది...
"హలో..." అంటూ వచ్చి వాళ్ళమ్మ ప్రక్కన నిల్చుంది...
కిట్టిగాడు ఆ పిల్లని పైనుంచి క్రింది దాక ఎగాదిగా చూస్తూ "హలో ..." అన్నాడు... పింక్ కలర్ టీ-షర్ట్ లో మెరిసి పోతుంది సుస్మితా...ఛా వైజాగ్ లో కూడా ఇట్టాంటి పిల్ల కనిపించలేదే...
"తను నీకు సీనియర్..ఎమన్నా డౌట్స్ ఉంటే తనని అడుగు..." అందామె... కిట్టిగాడికి గొంతులో వెలక్కాయ పడింది.. అసలైతే ఆంటీ అన్నదానికి ఎగిరి గంతెయ్యొచ్చు.. కానీ ఎక్కడ??...కిట్టి గాడికి ఇంకా మొదటి సంవత్సరం సుబ్జేక్టులే నాలుగు ఉన్నాయ్.. అలా ప్రతి సెమిష్టరులో క్రమం తప్పకుండా ఓ నాలుగు రాళ్ళు వెనకేసుకొస్తున్నాడు...అదే నాలుగు సబ్జెక్టులు...

ఆ పిల్ల లైట్ గా తల ఊపి మొదటిసారిగా కిట్టిగాడిని ఓ రెండు సెకండ్లు చూసింది.. కుర్రాడు బాగానే ఉన్నాడు కానీ ఎర్రితనం కొట్టొచ్చినట్లు కనిపించింది వాడిలో ఆ పిల్లకి...
"మీకు జావా బాగా వచ్చా..." మొదటి సారి నోరు తెరిచి అడిగింది ఆ పిల్ల ...
మనోడికి రానిదే అది ... జావా మీద ఇప్పటికే మూడవ దండయాత్ర కూడా మొన్నే ముగిసింది...
"వై నాట్...జావాలో ప్రోగ్రాం ఎడం చేత్తో రాసి...కుడి చేత్తి కంపైల్ చేసి.. కను చూపుతో అవుట్ పుట్టు తీస్తా..."
"నాకు రెండు మూడు జావా ప్రోగ్రాములు రావడం లేదు...లాజిక్ చెప్తారా?"
"అ....లా....గే...రేపు చెప్తాను... అన్నట్లు మీకు ఏ హెల్ప్ కావాలన్నా నన్నడగండి ఎదురిల్లే కదా..." అన్నాడు..
చిన్నగా తలూపింది ...
"సరే...ఇక నేను వెళ్తాను..." అంటూ లేచాడు కిట్టిగాడు...
"ఒక్క నిముషం..." అంటూ లోపలికి వెళ్లి ఒక మడిచిన పేపర్ తీసుకువచ్చింది సుస్మిత...

కిట్టిగాడు గుండె వేగం హెచ్చించింది... మై గాడ్ అప్పుడే లవ్వు లెటర్ ఇచ్చేస్తుంది.. ఏంట్రా కిట్టిగా అమ్మాయిలు పెద్దగా పట్టించుకోని నీ సుడి ఈ రోజు ఇన్ని వంకరలు తిరుగుతుంది...అనుకున్నాడు...
సుస్మిత ఆ కాగితం కిట్టిగాడికి అందివ్వగా... మనోడు సిగ్గు పడుతూ సుస్మీ కళ్ళలోకి ఆరాధనగా చూస్తూ అందుకున్నాడు ఆ శ్వేత పత్రం... ఆత్రుత ఆపుకోలేక కొంచెం మడత విప్పి చూస్తే ఏదో ఇంగ్లీష్ లో రాసుంది... అబ్బో ఇంగ్లీష్ లవ్ లెటరేమో అనుకోని చూడగా మధ్యలో కొన్ని బ్రాకెట్లు..*&^%...ఇలాంటి సింబల్స్ కనిపించేసరికి, లవ్ లెటర్ ఇలాక్కూడా ఉంటుందా అని కళ్ళు చిట్లించి చూడగా...దానిలో కంటెంట్ చూసిన మనోడుకి బ్రెయిన్ బ్రేక్ డౌన్ అయ్యి.. షట్ డౌన్ అయ్యి..ఇంకేదో అయ్యి... అలా షాక్ కొట్టి కాకిపిల్లలా ఓ క్షణం ఆ పిల్ల వైపే చూశాడు... సెగ రేగిన ఆశల మీద కూల్ డ్రింక్ చల్లడం తట్టుకోలేక పోయాడు...
"ఆ పేపర్ లో నాకు లాజిక్ అర్థం కాని జావా ప్రోగ్రామ్స్ ఏవేవో రాసిచ్చాను... వాటి లాజిక్ మీరు నాకు రేపు చెప్తారా ..." అంది
"దా...ని...కేం.. భా...గ్యం...అలగలగే..." అంటూ వెళ్లాడు ఏదో ట్రాన్స్ లో ఉన్నవాడిలా...
గుమ్మం దాకా సుస్మీ కూడా వచ్చింది...
"సరే మరి... వెళ్ళొస్తా .." అంటూ కదలబోతుండగా...
"ఇందాక చూశాను...మీరు మీ ఇంటి పక్కన ఉన్న మురికి కాలవలో ఒక డబ్బాలో నిండుగా ఉన్నది ఏదో పారబాసారు... ఏంటో నాకది చెక్కెరలా కనిపించింది ...." అంది సందేహంగా...
కిట్టిగాడికి కత్తి వేటుకి నెత్తురు చుక్క లేదు...
వెంటనే తేరుకొని..."అబ్బే కాదు...కాదు ...చెక్కెర కాదు... భలేదానివే చెక్కెర పారబోసుకుంటారా ఎవరైనా...అదీ..మా అమ్మ పురుగులు పట్టాయిరా అంటే ఉప్మా రవ్వ నేనే పారబోసాను అనమాట..అదీ సంగతి..." అంటూ నీళ్ళు నమిలాడు కిట్టిగాడు ...
"ఉప్మా రవ్వకి పురుగు పడితే పారబోసుకుంటారా ఎవరైనా...దానికి ఓ మంచి చిట్కా ఉంది...రేపు నేను ఆంటీకి చెప్తాలే..ఓ కె బాయ్..." అంటూ లోపకికి తుర్రుమంది ఆ పిల్ల...
మనోడికి అంత చలి లోనూ చెమటలు పట్టడం మొదలెట్టాయి... తొక్కలో ఐడియా వేసినందుకు వాడిని వాడే బండ బూతులు తిట్టుకుంటూ... ఈడ్చుకుంటూ ఇంటికి చేరాడు...[కిట్టి గాడి ఇంట్లో ఏమయిందో వచ్చేఎపిసోడ్ లో తెలుసుకుందాం...అందాకా...విరామం మరి - కోట్ల రామకృష్ణా రెడ్డి.]

42 comments:

Sai Praveen said...

హహ.. ఈ సారి ట్విస్ట్లు కాకుండా కామెడీ మీద కాన్స న్ట్రేట్ చేస్తున్నారన్నమాట. బాగుంది.

Harish said...

Very nice. Waiting for next episode

abhedyudu said...

Excellent... I had fun while reading this

NMreddy said...

Nice story .. :-)

venuram said...

super...keka...arupulu...mantalu.. :) :) waiting for next post...

sowmya said...

హ్మ్ కామెడీలో కూడా సస్పెన్సా? మీరున్నారే....మళ్ళీ ఇంకో ఎపిసోడ్ కోసం పడిగాపులు...అలగే చేస్తాం, ఎందుకు చెయ్యం....తప్పదు కదా :)

nagarjuna said...

ha ha hha....
Had much fun reading the story.

రాధిక said...

very funnny..nice post :-)

కవిత said...

కిషన్ గారు,ఎదేన్టండి మీరు, ఈ గీతం కాలేజి ని ,జావా ని ఎప్పుడు వదలరు. చక్కరని పిల్లులు తింటాయి అని చెపుతార??అమ్మాయి కోసం ౩క్గ చెక్కర అల పాడు చేయటం ఏమిన న్యాయమా అండి???చాల బాగుంది....ఒక చిన్న సలహా(ఉచిత సలహానే...చెక్కర నిండుకుంది,కాస్త తెచ్హి పెట్టరు.. అని మాత్రం అడగ వద్దు ..ప్లీజ్) కామెడీ ఇంకా కొంచం పెంచగలిగితే ఇంకా బాగుంటుంది ....ఆలోచించండి ఒకసారి....ఎలాగో పోయిన సీరియల్ లో అందరిని ఏడిపించారు కదా....!!!!!!!

sivaprasad nidamanuri said...

వాడు నల్ల మొహం వేసాడు.

superb boss

రాధిక(నాని ) said...

బాగుందండి .

కొత్త పాళీ said...

"ప్రతి సెమిష్టరులో క్రమం తప్పకుండా ఓ నాలుగు రాళ్ళు వెనకేసుకొస్తున్నాడు"
హ హ భలే.
నాకు తెలిసిన ఒక పట్టువదలని విక్రమార్కుణ్ణి గురించి ఇక్కడ చదవచ్చు.

Ramakrishna Reddy Kotla said...

ప్రవీణ్: యా..కొంచెం రూటు మార్చ రెండో కథలో..హా హా...థాంక్స్ అండి ప్రవీణ్ గారు..

హరీష్: థాంక్స్..త్వరలోనే రాసే ప్రయత్నం చేస్తాను

అభేధ్యుడు: ధన్యవాదాలు :-)

Ramakrishna Reddy Kotla said...

NM రెడ్డి: ధన్యవాదాలు సర్ :-)

వేణురాం: హా హా...థాంక్స్ అండి.. తొందరలోనే రాస్తాను నెక్స్ట్ పార్ట్ :-)

సౌమ్య: ఇది మరీ బాగుంది.. నేను ఎక్కడ సస్పెన్స్ పెట్టానండీ... అది కూడా ఒక సస్పెన్స్ ఎ నా..సస్పెన్స్ అంటే ఏంటో, ఫ్యూచర్ లో రాయబోయే ఓ కథలో చూపిస్తా.. ఇది ప్లెయిన్ స్టోరీ లెండి :-)

priya.... said...

wow!!!!!!!!!!!!!! good start ram....."kathi debhaki netturu chukka ledu" baagundi dialoge elanti vatiki tamariki tamare saati anukunta......awaiting 4 ur nxt blog with still more comedy lines in it....k carry on ram.......

Ramakrishna Reddy Kotla said...

చారి గారు: మీకు ఫన్ కలిగించినందుకు నేను ధన్యుడిని ...థాంక్స్ భయ్యా :-)

రాధికా: ధన్యవాదాలు .. మీ బ్లాగ్ చాలా బాగుంది :-)

కవిత:గీతం కాలేజీని, జావాని వదలలేను లెండి..బోలెడు కారణాలు..అవి తర్వాత మాట్లాడు కుందాం.. ఏం పిల్లులు చెక్కర తినవనుకున్నారా :-)..ఓ అమ్మాయి కోసం మూడు కేజీల చెక్కెర పారబోస్తే తప్పేంటి అధ్యక్షా :-)

Ramakrishna Reddy Kotla said...

శివప్రసాద్: థాంక్స్ అండి :-)

రాధికా: థాంక్స్ :-)

కొత్తపాళి: మీ టపా చదివాను ..చాలా నచ్చింది..ఇంతకీ ఆ కుర్రాడు పాస్ అయ్యాడో లేదో పాపం .. :-)

సతీష్ said...

>>"సెకండ్ బిటెక్.." అంది.."అంటే... రెండో సారి బీ-టెక్ చదువుతున్నావా ..??"
>>ఆ పిల్ల వంటింటి గుమ్మం దాకా వెళ్లి వీడి వైపు తిరిగి.. ఏ మగ పుంగవుడూ అర్థం చేసుకోలేని...నిర్వచించలేని ఒక చూపు విసిరి లోపలికి వెళ్ళింది...
>>కుర్రాడు బాగానే ఉన్నాడు కానీ ఎర్రితనం కొట్టొచ్చినట్లు కనిపించింది వాడిలో ఆ పిల్లకి...
>>దానిలో కంటెంట్ చూసిన మనోడుకి బ్రెయిన్ బ్రేక్ డౌన్ అయ్యి.. షట్ డౌన్ అయ్యి..ఇంకేదో అయ్యి... అలా షాక్ కొట్టి కాకిపిల్లలా ఓ క్షణం ఆ పిల్ల వైపే చూశాడు...

ఇవి మాత్రం కత్తి, కేక, కెవ్వు బాసు. నవ్వలేక చచ్చాను

Ramakrishna Reddy Kotla said...

ప్రియ: నీకు నచ్చినందుకు నాకు ఆనందంగా ఉంది... నెక్స్ట్ పార్ట్ త్వరలోనే రాస్తాను .. :-)

సతీష్: చాలా థాంక్స్...ఆ లైన్స్ మీకు నచ్చినదుకు ధన్యుడిని :-)

Shiva Bandaru said...

:) Waiting for next episode

ప్రణీత స్వాతి said...

"ప్రతీ సెమిస్టర్ లోనూ నాలుగు రాళ్ళు(సబ్జెక్టులు) వెనకేసుకొస్తున్నాడు...ఉప్మా రవ్వ లో పురుగులు పడితే మురుక్కాలవలో పారెయ్యడం.." హ్హ హ్హ హ్హ హ్హ హ్హ హ్హ హ్హ..చాలా బాగుంది.

మళ్ళీ సీరియల్ మొదలెట్టారన్నమాట. చూస్తూంటే ఈసారి బాగా నవ్వించేట్టున్నారే..మరి రెండో ఎపిసోడ్ ఎప్పుడు..?

కొత్త పాళీ said...

మళ్ళీ చదువుతుంటే, జావా భాషలో లవ్ లెట్రు అనే కాన్సెప్టు వెలిగింది. మేం ఎంటెక్ చదూతున్న రోజుల్లో మా వాడొకడు కంప్యూటర్ భాషకూడా భాషే, కావాలంటే ఫొర్ట్రాన్‌లో (ఆ రోజుల్లో మాకున్న భాష అదే!) ప్రేమలేఖ రాసిస్తా అని ఛాలెంజ్ చేస్తూండేవాడు. మరి మా వాళ్ళెవరన్నా ఆ ఛాలెంజ్ మీద వాణ్ణి తిరిగి ఛాలెంజ్ చేశారో గుర్తులేదు. తరవాత వాడు ప్రేమపెళ్ళి చేసుకున్నాడు. ఆ రోజుల్లో తన ప్రేయసికి ఏ భాషలో లవ్ లెట్రు రాశాడో ఈ సారి కల్సినప్పుడు అడగాలి.

anita said...

బాగుందండి ,పోస్ట్ చదువుతునంతసేపు నవ్వుకున్నాను ,సీరియల్ ముగింపు వరకు కామెడీ ఇలాగే వుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను .

divya vani said...

ఇంతకి మనొడు జావా తొ ఆ పిల్లని లైన్లో పెడతాడంటారా కిషన్ గారు . తొందరగా రాయండి waiting for next post

divya vani said...

ఇంతకి మనొడు జావా తొ ఆ పిల్లని లైన్లో పెడతాడంటారా కిషన్ గారు . తొందరగా రాయండి waiting for next post

శివరంజని said...

కిషన్ రెడ్డి అలియాస్ క్రిష్ణ చైతన్యగారు :
ప్రేమ కోసం ప్రాణాలు త్యాగం చేసే లవ్ స్టొరీ కంటే పంచదార త్యాగం చేసే మీ లవ్ స్టొరీ kevv kEka.

కొన్ని లైన్స్ ఎంత humorous గా రాసారంటే really i feel jealousy.(నేను పోస్ట్ లు రాయక పోవటానికి కారణం మీరే..మీరు మరీ ఇంత బాగా రాసేస్తుంటే.... .కామెడీ,సస్పెన్సె ఏది వదలకుండా రాసేస్తుంటే మేమేమి రాయాలి అంట ..మా మెట్ట వేదాంతం ఎవరు వింటారు అని :)

Ramakrishna Reddy Kotla said...

శివ: కమింగ్ సూన్ :-)

ప్రణీత: చూసారా కిట్టిగాడి తెలివి.. ఉప్మా రవ్వలో పురుగులు పడితే మురుక్కాలువలో పోసే తెలివి.. మీ అభిమానానికి థాంక్స్ ... నవ్విద్దమనే నీ ఉద్దేశం కూడా :-)

కొత్తపాళి: మీ వాడిని కనుక్కొని నాకు చెప్పండి...ఉపయోగ పడుతుందేమో చూద్దాం :-)

Ramakrishna Reddy Kotla said...

అనిత: ధన్యవాదాలు... అలాగే ఉండాలి (కాదు రాయాలి) అని నేను కూడా కోరుకుంటున్నా ..చూద్దాం ఏమవుతుందో :-))

దివ్య: ఆ పిల్లని మనోడి చేత లైన్లో పెట్టిద్దామనే కదా నా తాపత్రేయమంతా.. అప్పుడే మూడు కేజీల పంచదార పారబోయించాను చూసారా... :-)

రంజని: కిషెన్ అలియాస్ క్రిష్ణ చైతన్య కాదు... కిట్టుగాడు అలియాస్ క్రిష్ణ చైతన్య .. మీరు నా కథల్లో హీరోని నాకు అన్వయించడం ఏమన్నా బాగుందా :-))...మీరు పోస్టులు రాయకపోడానికి నేను కారణమా...ఇది మాత్రం నేను చస్తే నమ్మను... త్వరలోనే ఒక పోస్ట్ రాస్తావని ఆశిస్తాను :-)..మీది మెట్ట వేదంతమా...భలేవారే...మీ నిద్రోపాఖ్యానం ఎంత బాగుందనుకున్నారు ... అలాంటిదే ఇంకోటి వదలండి మరి :-)

మేఘ శ్రీ said...

An exceptional work and entertaining narration makes your post an evenly enjoyable, awaitin the next part.

Ramakrishna Reddy Kotla said...

Thank you Megha Sri. Will write soon.

'Padmarpita' said...

ఇలా రాస్తూపొండి....హాయిగా నవ్వేసుకుంటా:):)

Ramakrishna Reddy Kotla said...

పద్మార్పిత గారు...అలాగే రాస్తూపోతాను ..మీరు నవ్వేసుకోండి :-))

Lakshmi said...

entertaining good narration again..so many humorous punch lines as satish mentioned..keep going

Ramakrishna Reddy Kotla said...

Thanks a lot Lakshmi garu :-)

మురళి said...

comedy ga try chestunnara mallik writings chadivinatlu undi...

బద్రి said...

ఏంటన్నయ్య కిట్టి గాడి ఇంట్లో ఇంకా తెల్లారలేదా ???

Ramakrishna Reddy Kotla said...

మురళీ గారు ధన్యవాదాలు.. :-)

Ramakrishna Reddy Kotla said...

బద్రి: ఇంకా తెల్లవారలేదండి కిట్టూ వాళ్ళకి...త్వరలో తెల్లవారుతుందిలెండి :-)

Sudha said...

Mr.Ramakrishna, the way you narrated it was awesome and unbelievably hilarious. U got the thing in you. Keep writing and waiting for your next part.

Ramakrishna Reddy Kotla said...

Sudha, thanks a lot for ur comments and encouragement...will write the second part soon.. :-)

Anonymous said...

waiting for next episode

Ramakrishna Reddy Kotla said...

Anonymous, second episode is already there, if u were referring to 3rd episode, will write it soon..thanks.. :-)