Search This Blog

Sunday 4 July, 2010

కిట్టిగాడు loves ఎదురింటి అమ్మాయి - 2


ఆ రాత్రి కిట్టిగాడికి రకరకాల రుబ్బుడు స్పందనలు (మిక్సుడ్ ఫీలింగ్స్) కలిగాయి.. సుస్మిత దృష్టిలో వాళ్ళమ్మ దృష్టిలో పడ్డందుకు మనోడికి కొంచెం హ్యాపీగానే ఉన్నా, రేపు ఎక్కడ సుస్మిత వాళ్ళింటికి వచ్చి 'ఆంటీ పురుగులు పట్టాయి అని మీ అబ్బాయి ఉప్మా రవ్వ పారబోశాడేంటి!!.. అది ఉప్మా రవ్వ కాదు పంచదార అని నా డౌట్' అని అమ్మతో అంటే...ఇక అంతే.. వీపు రాకెట్ మోతే.. కానీ ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి సుస్మిత మాత్రం గొప్ప అందగత్తె, ఆ కళ్ళు ఉన్నాయి చూసారూ.. అబ్బబ్బబ్బ... వేరే ఏ అమ్మాయి అయినా కుళ్ళుకు చావాల్సిందే, ఆ పళ్ళు ఉన్నాయి చూసారూ...అర్రేర్రే... నాగమల్లి పువ్వు సైతం వెక్కి వెక్కి ఏడవాల్సిందే.. దేవుడా సుస్మితని ఎలాగైనా నాకు రిజర్వ్ చెయ్యి, ఆ అమ్మాయిని తయారుచెయ్యడానికి బ్రహ్మ తదితరులు వెచ్చించిన ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం వడ్డీతో సహా నీ హుండీలో సమర్పించుకుంటా .. ప్లీజ్...అంటూ రకరకాల స్పందనలతో ఆ రాత్రి గడిపాడు కిట్టిగాడు...

సైన్స్ పుస్తకంలో స్వాతి వీక్లీ పెట్టుకొని సిన్సియర్ గా సమరం కాలమ్ చదువుతున్న కిట్టిగాడికి హాల్లోంచి వాళ్ళమ్మ పిలుపు వినిపించింది "కిట్టూ సుస్మితా వచ్చిందిరా... లోపలేం చేస్తున్నావ్ బైటకిరా.." అని.. మనోడికి రాత్రి కలిగిన రుబ్బుడు ఫీలింగ్స్ మళ్ళీ కలిగాయి.. గుండెలో దడదడ.. సంతోషంతోనో, భయంతోనో తెలీదు.. హాల్లోకి వచ్చాడు.. అతన్ని చూసి చిన్నగా నవ్వింది సుస్మిత.. ఆహా ఏం నవ్వింది.. నా గుండెని బైటకి లాగి పరపరా రంపం తో కోసినట్లుంది .. ఆ నవ్వు వెనుక దాగిన మర్మమేమిటో అనుకుంటుండగా ..."ఒరేయ్ కిట్టిగా...ఆ అవతారమేమిట్రా.. సిగ్గులేకుండా!!..వెళ్లి ప్యాంటేసుకు చావు.." అంది వాళ్ళమ్మ.. అప్పుడు వాడివైపు వాడుచూసుకొని ఒక్కసారిగా సిగ్గుతో కూడిన అవమానభారంతో వాడి గదిలోకి వెళ్లి తలుపేసుకొని..."థూ...నా లైఫు...అది నా అవతారం చూసి నవ్విందా !!" అనుకుంటూ ప్యాంటు కోసం వెదుకుతుండగా... వాళ్ళ మాటలు వినిపించాయి.. "ఎమ్మా సుస్మిత...ఎలా చదువుతున్నావమ్మా?" అంది కిట్టూ వాళ్ళమ్మ.."కాలేజీ ఫస్ట్ మూడు మార్కులతో మిస్ అయిందాంటీ... అది కూడా జావా ల్యాబ్ లో తక్కువ మార్కులు రావడం వల్ల... అందుకే క్రిష్ణ గారి దెగ్గర కొన్ని జావా ప్రోగ్రామ్స్ లాజిక్ తెలుసుకుందామని వచ్చాను.." అంది సుస్మిత.. అంతే వాళ్ళమ్మ పగలబడి నవ్వడం మొదలెట్టింది... ప్యాంటు వేసుకోబోతున్న కిట్టుగాడి ఎడమ కన్ను టపటపా కొట్టుకోవడం మొదలెట్టింది ...మనసేదో కీడు శంకిస్తుంది... "వెనుకటికి ఏదో సామెత ఉందిలే... వాడికే దిక్కూ దివాణా లేదు, నీకేం చెప్తాడు.. ఏళ్ళు తరబడి ముక్కుతున్నా ఒడ్దున పడ్డ పాపాన పోలేదు.. ఆ జావానో ఏదో అన్నావుగా... అబ్బో ఆ సబ్జెక్టులో అయితే మావాడి ఘనత దశదిశలా పాకుతుందేమో... మొదటి సంవత్సరం అనుకుంటా మొదలెట్టాడు దాని మీద...." అంటూ ఆమె చెప్తుండగా, ఎప్పుడొచ్చాడో తెలీదు హాల్లోకి, నిప్పులు కక్కుతూ వాళ్ళమ్మ వైపు చూస్తూ.."అమ్మా...!!@@##...పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయి వెళ్లి చూడు.." అన్నాడు పళ్ళు పటపటా కొరుకుతూ....
"పొయ్యి మీద పాలేమిట్రా!!...పొయ్యి మీద ఏమీ లేవు...ఇదీ వీడి తెలివి.." అంటూ వాడి వైపు మళ్ళీ చూసి.."ఇంకా అదే దరిద్రపు అవతారంలో ఉన్నావేమిట్రా..ప్యాంటు వేసుకోకుండా ఏమి చేస్తున్నావ్..." అంది...
ఆ పిల్ల మళ్ళీ నవ్వింది.. "నవ్వింది మల్లెచెండు.. దొరికింది గర్ల్ ఫ్రెండు..." అంటూ పాటేసుకోవాలనుకున్నాడు వాడిలో ఉన్న మనసు అనే మరో కిట్టిగాడు, కానీ మనోడు "ఓరి ఎర్రి నాగన్నా, దాని నవ్వుకు కారణాలు బోలెడు.. నువ్వనుకునేది మాత్రం కాదు.. నువ్వు ఎక్సైట్ కాకు... నన్ను ఎక్సైట్ చెయ్యకు..థూ ఎదవ లైఫు.. " అంటూ ఈసారి ఖచ్చితంగా ప్యాంటు వేసుకోవాలని డిసైడ్ అయ్యి వెళ్ళాడు...

కిట్టిగాడు ముస్తాబయ్యి హాల్లోకి వచ్చాడు.. వాళ్ళమ్మ లేదు, వంటింట్లో ఏదో పనిలో మునిగిపోయింది..సుస్మిత సోఫాలో కూర్చొని టీవీ చూస్తుంది.."అతడు" సినిమాలో మహేష్ బాబు త్రిషని అందంగాలేవు అనే సీన్ వస్తుంది.. మనోడు సైలెంటుగా ఆ పిల్ల దెగ్గరికి వెళ్లి "మహేష్ బాబు చెప్పింది కరెక్టే ఆ త్రిష ఏం అందంగా ఉంది చెప్పు... అసలు అందాన్ని డిఫైన్ చెయ్యాలంటే, అందానికే అందంలా అనిపించే అమ్మాయి కనిపించాలి.. ఉదాహరణకి నువ్వే ఉన్నావ్..అసలు ఎంత అందంగా ఉంటావనీ..." అంటూ సుస్మిత వైపే చూస్తూ చెప్పాడు ఐస్ చేస్తే కరిగిపోని పిల్లెక్కడుంది అనుకుంటూ..
"నిన్న మీకు నేను ఒక పేపర్ లో నాకు అర్థంకాని జావా ప్రోగ్రామ్స్ రాసిచ్చాను... వాటి లాజిక్ చెప్తారా.. ఒక వారంలో ఇంటర్నల్స్.." అంది...
కిట్టిగాడికి ఎక్కడలేని నీరసం ఆవరించేసింది.. జావా లాజిక్ సంగతి సరే, అసలు ఈ అమ్మాయిల మనసు తెలుసుకోవడానికి ఎవడన్నా లాజిక్ కనిపెట్టి, ప్రోగ్రాం రాస్తే బాగుండు అనుకున్నాడు..

"అదెంత పని సుస్మీ... నే ఇట్టే చేసేయ్యగలను...మా మమ్మీ సరదాగా నా మీద అలా జోక్స్ వేస్తుంది.. నువ్వవేం పట్టించుకోకు.. అసలు మా కాలేజీలో కిట్టూ ఎక్కడా అని ఎవరన్నా అడిగితే, 'కిట్టూ ఎవరు?..ఓ మీరు మాట్లాడేది జావా కుర్రోడి గురించా!!' అంటారు.. అంతలా నేను జావాకి మారు పేరులా తయారయ్యాను మా కాలేజీలో..."
"ఓహొ.. ఏంటో నాకు ఈ జావా పెద్దగా అర్థం కావట్లేదండి.. దాని వల్ల మార్కులు పోతున్నాయి.. రేపు మాకు Inheritance, Polymorphism, Encapsulation.. వీటి మీద ప్రోగ్రామ్స్ రాయమన్నారు.. అసలు ఆ కాన్సెప్టులే నాకు పిచ్చెక్కిస్తున్నాయి... మీరు జావా కుర్రోడు కదా, మీరే నాకు చెప్పాలి..." అంది..
మనోడు ఓ రెండు నిముషాలు ఆ పిల్లనే చూసి... ఓ రెండు సార్లు అటు పక్కకి... ఇటు పక్కకి.. పైకి..కిందకి చూసి.. వెంటనే ఫక్కున పగలబడి నవ్వడం మొదలెట్టి... పొట్టమీద చెయ్యి వేసుకొని 'ఇక నవ్వడం నావల్ల కాదు' అన్నట్లు ఇంకో చెయ్యి ఊపుతూ.. "హ హ హ ... సుస్మీ సుస్మీ...హహ్...హం..హమ్మా... అవి పిల్ల కాన్సెప్టులు సుస్మీ... వాటితో రకరకాల ప్రయోగాలు చేసేవాడిని.. నీకెందుకు సాయంత్రం నేను నీకు వివరించి చెప్తా సరేనా.." అన్నాడు

"అలాగే... థాంక్స్ అండి.. ఆ పేపర్ లో ప్రోగ్రామ్స్ లాజిక్ కూడా చెప్పాలి మీరు.." అంటూ చిన్న నవ్వు రువ్వి వెళ్ళిపోయింది... ఆ పిల్లతో పాటే మనోడి మనసు కూడా అలా వెళ్లి అలా గుమ్మం దెగ్గర ఆగింది.. ఎందుకంటే ఆ పిల్ల కూడా అక్కడే ఆగింది.. సుస్మీ వెనక్కి తిరిగి మనోడి వైపు చూసింది..మనోడు "యస్ ...షీ లవ్స్ మీ... షీ లవ్స్ కిట్టిగాడు.." అనుకుంటూ గుండె మీద చెయ్యి వేసుకొని రుద్దుకుంటుండగా.. ఆ పిల్ల వాడి దెగ్గరికి వచ్చి "అయ్యో...ఆంటీకి అసలు విషయం చెప్పడమే మర్చిపోయా.." అంటూ వంటింట్లోకి వెళ్ళింది...

మనోడు అతడు సినిమాలో వస్తున్న సాంగ్ చూస్తూ మహేష్ ప్లేస్ లో వాడిని, త్రిష ప్లేస్ లో సుస్మీని ఊహించుకొని "నీతో చెప్పనా...నీక్కూడా తెలిసిన..నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా.." అని సాంగ్ లో తేలిపోతుండగా లీలగా వినిపిస్తున్నాయి ఆ మాటలు ..."మా వాడు ఉప్మారవ్వ పారబోయడమేమిటమ్మా.. పురుగులుపట్టడమేమిటి??... నాకేమీ అర్థం కావట్లా..." అంటూ...ఆ మాటలు విన్న కిట్టిగాడికి ఒక్కసారిగా మబ్బు విడిపోయింది.. ఒక అంగలో కిచెన్ లోకి దూకేశాడు.. "ఒరేయ్... నువ్వు డబ్బేడు ఉప్మారవ్వ పారబోశావు అంటుందేమిటి సుస్మితా.. పైగా అది పంచదారేమో అని డౌట్ కూడా వచ్చిందట.. కానీ నువ్వే ఉప్మా రవ్వ అని చెప్పావట..!!" అడిగింది వాళ్ళమ్మ .. 'ఎదురింటిది కొంపముంచేసిందిరా బాబూ..' అనుకుంటూ .."అమ్మా...నాన్నా...అది...కాఫీ...ఆ రోజు..టీ పొడి...అదే... ఉప్మా చేస్తా అన్నావు... ఇడ్లీ పిండి...పంచదారా.. పకోడీ పొట్లం...పాయసం ప్లేటు...హా అదే నమ్మా, మురుకులు పెట్టావే ఆ డబ్బా ..రుబ్బురోలు ...  అయస్కాంతం... ఆవకాయా.." అంటూ అస్పష్టంగా అప్పుడే కోమా నుంచి లేచిన వాడిలా ఏదో అంటుండగా.. కోయ్యబోమ్మల్లా ఆ పిల్లా..వాళ్ళమ్మ నిల్చొని చూస్తున్నారు వాడి వైపే..ముందుగా వాళ్ళమ్మ తేరుకొని "పిచ్చిగానీ పట్టిందా ఏంట్రా తింగరి వెధవా... లేక తమరు చదివే చదువుకి అప్పుడే ఉన్న మతి పోయిందా?.. సంబంధం లేకుండా ఆ మాటలేమిట్రా సచ్చు సన్నాసి.." అంది..

కిట్టిగాడు ఓ క్షణం అలాగే ఉండి "అదే నమ్మా..నిన్న నాన్నకి నువ్వు చేసిన ఉప్మాలో బొద్దింక వచ్చింది చూడు.. అలా ఇంకెప్పుడూ రాకూడదని నేను నిర్ణయించుకొని పారబోశానమ్మా... నువ్వు మర్చిపోయి ఉంటావు.." అని చెప్పి సుస్మీ వైపు తిరిగి "సుస్మీ ఈవెనింగ్ నేనే మీ ఇంటికి వచ్చి నీకు జావాలో లాజిక్కులు మాజిక్కులు చెప్తాను..సరేనా.." అన్నాడు 'ఇక వెళ్ళవే బాబూ..నిప్పెట్టేశావుగా..' అనుకుంటూ.. ఆ పిల్ల వాడిని అల్-ఖైదా తీవ్రవాదిని చూసినట్లో లేక ఎర్రగడ్డ పిచ్చోడిని చూసినట్లో చూసి "వస్తాను ఆంటీ..." అంటూ వెళ్ళిపోయింది..

కిట్టిగాడు వాళ్ళమ్మ వైపు చూశాడు.. ఆమె వాడి వైపు ఏదో అనుమానంగా చూస్తుంది.."ఏంటమ్మా...ఏమయింది.." అన్నాడు అసహనంగా...
"అవునొరే... ఆ మూడు కిలోల పంచదార, ఆ పిల్ల డౌటు పడ్డట్టు, నువ్వు గానీ పారబోయ్యలేదుగా.." అంది ..
"అమ్మా...నాకేమన్నా పిచ్చా డబ్బేడు పంచదార పారబోయడానికి..."
"ఏమో రా.. అసలే ఇందాకే ఏవేవో పిచ్చెక్కినట్లు మాట్లాడావ్...!!"
"అమ్మా...నేను పంచదార ఎందుకు పారబోస్తాను ... దానికి ఒక్క కారణం చెప్పు...నేనే పారబోశాను అని ఒప్పుకుంటా..."
"పిచ్చోళ్ళు చేసేపనులకి పెద్దగా కారణాలు ఏముంటాయి నాన్నా...రోడ్డు మీదకి వెళ్లి ఓ కిలో పంచదార అట్రా..వెళ్ళు ..." అంది ..

                                                    *****
"హలో..."
"ఒరేయ్ రాజుగా...నేను కిట్టిగాడిని..."
"ఒరేయ్ కిట్టిగా... వైజాగ్ ఎప్పుడొస్తున్నావ్.. ఏటి సంగతి..."..
"Inheritance... Polymorphism... Encapsulation..."..
 "ఏట్రా...పట్టపగలే..అదీ ఇంట్లోనే మొదలెట్టావా??"..
"మొదలెట్టడం ఏంట్రా??"..
"నువ్వు.. ఇప్పుడు... తాగే కదా మాట్లాడుతున్నావ్?"..
"తాగానా??..సరిపోయార్రా నాకు...చూడు పిచ్చి నా పుత్రా..పైన నేను చెప్పినవి జావా బాషలో ఏవో కాన్సెప్టులు, అంతేగాని తాగితే వచ్చే తిట్లు కాదు.. వాటి గురుంచి నాకు రెండు గంటల్లో పూర్తి నివేదిక కావలి..."
"అవి జావాలో ఉన్నాయా!!... మనం చదివినప్పుడు లేవే...!!"
"ఒరేయ్.. నీకు జావా ల్యాబ్ లో యాభైకి నలభై అయిదు వచ్చాయని నిన్ను అడిగితే నువ్వేంట్రా..!!"
"అదా... మన జావా సార్ కి ముందు రోజు ఫ్రెండ్షిప్ కొద్దీ స్మిర్న్-ఆఫ్ వోడ్కా ఒక ఫుల్ ఇచ్చానులే... పాపం ఆయన లెవెల్లో ఏదో అలా అభిమానంతో...అలా కానిచ్చేసారు.."
"వార్నీ...సరేలే... నీకు తెలియకపోతే, మన సూరిగాడిని అడుగు..వాడికీ తెలియకపోతే పొట్టి రాజేష్ గాడినో.. బాషా గాడినో.. కిషెన్ గాడినో ...లేకపోతే నీ బీటు నాగలక్ష్మినో అడుగు.."
"నాగలక్ష్మిని చస్తే అడగను... పెద్ద పోజురా దానికి.. మొన్న నా కంప్యూటర్ గ్రాఫిక్స్ ఐదో సప్లిమెంటరీ పరీక్షలో స్లిప్పులు అందించవే అంటే..'మొహం చూసుకో అద్దంలో' అందిరా... అదేదో పెద్ద చందమామలాగా..చపాతీ మొహం వేస్కొని.."
"మీ గోల తర్వాత...నాకు రెండుగంటల్లో ఆ కాన్సెప్టుల మీద పూర్తి సమాచారం కావలి ..అది కూడా మన రేంజ్ లో...మన రేంజ్ అంటే తెలుసుగా.. మన అండర్ స్టాండింగ్ కెపాసిటీ..."

**రెండు గంటల తర్వాత **

"ఓరి కిట్టిగా..."
"చెప్పెహే..."
"పెన్ను..పేపర్..పక్కనేట్టుకో...నేను వివరించేస్తా..రాసేస్కో...డౌట్లు మాత్రం నన్నడక్కు.."
"సర్లే ఏడువ్.."
"Inheritance - అంటే...ఒక తరగతి, మరొక తరగతి నుంచి..తల్లీ పిల్ల పీచులతో సహా అన్నిటినీ ఆవాహం చేసుకోవడం..."
"ఒరేయ్...జావాలో..ఈ తరగతులు.. తల్లి పిల్లా పీచు ఏవిట్రా నీ బొంద...పైగా ఆవాహం చేసుకోవడం ఏవిట్రా ఏబ్రాసి ఎదవా.."
"ఒరేయ్ డౌట్లు అడగొద్దు అన్నానా.. జావాలో కూడా క్లాసెస్ ఉంటాయట..అవే తరగతులు..అలా ఒక తరగతికి చెందిన పేరెంట్-తల్లి, చైల్డ్-పిల్లని ఇంకో తరగతి ఆవాహం చేసుకుంటుంది.. అలా చేసుకున్నదాన్ని సబ్-తరగతి..చేసిన దాన్ని సూపర్-తరగతి అంటారట...ఇక నన్ను అడక్కు..."
"సర్లే..మిగతావి చెప్పు.."
"Polymorphism - అంటే ఒకే తరగతి అనేక అవతారాల్లో ఉంటుంది అనమాట.. సందర్భాన్ని బట్టి ఒక్కో అవతారం ఎత్తుద్ది.. మన విష్ణుమూర్తి లాగా .."
"Polymorphism అంటే విష్ణుమూర్తి అవతారాలా!!...వార్నీ.. ఈ మాత్రం తెలిసుంటే ఈ సబ్జక్టు మీద ఇన్ని దండయాత్రలు జరిగేవే కాదు.. "
"ఇకపోతే Encapsulation - ఇది పెద్ద జాదూరా..ఒక క్లాసు యొక్క తల్లి పిల్లా పీచూ వివరాలన్నీ దాచేస్తుందట.. మరి దానికేం పోయేకాలమో..!!"
"అవునా!!...ఏమోలే పాపం..దాని బాధలు దానివి...ఇక అంతేగా...ఓ.కే .. పర్లేదు వీజీనే...ఇక చూస్కో చించేస్తా.. దెబ్బకి సుస్మితా ఫ్లాట్ అయిపోవాల్సిందే..."
"కిట్టిగా...సుస్మితా ఎవర్రా...??"
"రాజుగా... కిట్టిగాడు లవ్ లో పడ్డాడెహే... ఆ పిల్లే ఈ జావా డౌట్లు అడిగింది .."
"కిట్టిగా.. అరిపించెయ్యి..అల్లాడించెయ్యి..కేకలుపెట్టించు..."
"ఒరేయ్...నేను ఆ పిల్లని రేపో..మర్డరో చెయ్యట్లేదురా...లవ్ చేస్తున్నా... "
"అదే లేవో... మన లాంగ్వేజ్ లో చెప్పా... అన్నట్లు ఒరే.. పైన చెప్పిన కాన్సెప్టులు ఒక్క జావాకే పరిమితం కాదట.. అదేదో ఊప్స్ అంట...దానికి సంబంధించిన అన్ని భాషలకు ఉంటాయట..."
"మధ్యలో ఈ ఊప్స్ ఏంట్రా...సర్లే..ఏదోటి... అడిగిన దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎవడ్రా నిన్ను ఇవ్వమన్నాడు... అసలే మన బ్రెయిన్ కెపాసిటీ తెలుసు కదా... దాన్ని కష్టపెట్టడం నాకు ఇష్టముండదు.. అయినా ఈ పిల్ల కోసం రిస్క్ చేస్తున్నా.. సర్లే ...రేపు మాట్లాడదాం...బాయ్..." అంటూ ఫోన్ పెట్టేసాడు కిట్టిగాడు..

                                                   ****
సమయం సాయంత్రం అయిదు గంటలు...
కిట్టిగాడు పేపర్ మీద రాసుకున్న ఆ కాన్సెప్టులని.. తరగతుల్ని...తల్లి పిల్లా పీచులని వదలకుండా భయంకరంగా బట్టీ పట్టి... పేపర్ మడిచి జేబులో పెట్టుకొని.. నీట్ గా రడీ అయ్యి, ఎదురింటికి బైల్దేరాడు....


[మళ్ళీ కలుద్దాం త్వరలో............................................రామకృష్ణారెడ్డి కోట్ల]

54 comments:

రాధిక said...

నాకు బొత్తిగా engg subjects గురించి జ్ఞానం లేదు గాని..కిట్టిగాడి కి మాత్రం కచ్చితం గా రంగుపడుద్ది...మహా ప్రభో!!కిట్టి గాడి లవ్ స్టొరీ సుఖాంతం కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా!!!..కానీ అంత మీ చేతుల్లోనే ఉంది.. :-))

ప్రణీత స్వాతి said...

"రుబ్బుడు స్పందనలు.."
"పిచ్చోళ్ళు చేసేపనులకి పెద్దగా కారణాలు ఏముంటాయి నాన్నా.."
"Polymorphism అంటే విష్ణుమూర్తి అవతారాలా...!!"

హ్హ హ్హ హ్హ హ్హ హ్హ హ్హ హ్హ హ్హ హ్హ హ్హ...మహాప్రభో నవ్వాగట్లేదు!!

మరి మూడవ భాగం?

నాగప్రసాద్ said...

సూపర్. చాలా బాగా రాస్తున్నారు. :).

Sudha said...

Woww woww, It is the best HILARIOUS story that i have ever read, and not exaggerating the substance but as i told you got the THING in you MR. I couldn't stop laughin all over. The punch dialogues and the comedy timing is absolutely worked.
The below liners were so good
-> రుబ్బుడు స్పందనలు..what a word..hehe
-> ఆ అమ్మాయిని తయారుచెయ్యడానికి బ్రహ్మ తదితరులు వెచ్చించిన ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం వడ్డీతో సహా నీ హుండీలో సమర్పించుకుంటా (hehe, reasonable enough :)
->నా గుండెని బైటకి లాగి పరపరా రంపం తో కోసినట్లుంది (He could have felt that way, lol)
->."అమ్మా...నాన్నా...అది...కాఫీ...ఆ రోజు..టీ పొడి...అదే... ఉప్మా చేస్తా అన్నావు... ఇడ్లీ పిండి...పంచదారా.. పకోడీ పొట్లం...పాయసం ప్లేటు...హా అదే నమ్మా, మురుకులు పెట్టావే ఆ డబ్బా ..రుబ్బురోలు ... అయస్కాంతం... ఆవకాయా.." (hahahaha i couldnt stop laughing at this dialogue :))
->పిచ్చోళ్ళు చేసేపనులకి పెద్దగా కారణాలు ఏముంటాయి నాన్నా...(yeah rightly said)
->"Inheritance... Polymorphism... Encapsulation..."
"ఏట్రా...పట్టపగలే..అదీ ఇంట్లోనే మొదలెట్టావా??"
(haha, this is hilarious)
->"Inheritance - అంటే...ఒక తరగతి, మరొక తరగతి నుంచి..తల్లీ పిల్ల పీచులతో సహా అన్నిటినీ ఆవాహం చేసుకోవడం..(wow, JAVA guys should listen to it lol)
->Polymorphism అంటే విష్ణుమూర్తి అవతారాలా!! (wow, lets link Lord Vishnu to Polymorphism for his poly-avatars, BIG LOL)

Simply, u rocked with the 2nd part.

Anonymous said...

chaala baaguntunnayandi mee kadhalu...really enjoying...thanks ..and keep posting ...tension thattukolekapothunnam...

sunita said...

హహహ! జావా ఇంత ఈజీగా మూడు ముక్కల్లో అవగొట్టొచ్చని నాకు ముందే తెలిస్తే నేనూ కూడా ఓ సర్టిఫికేషను చేసి ఉండేదాన్ని. ఇన్ని బాధలు పడకుండా. చాలా చాలా నవ్వించారు.

ఆ.సౌమ్య said...

నాకు ఈ జావా కి, కెఫే కాఫీ డే కి అస్సలు సంబంధం లేదు. అవంటే ఏమిటో కూడా నాకు తెలీదు. కానీ ఈ పోస్టు తో మొత్తం తెలిసిపోయాయోచ్చ్....నేనూ ఇకపైన ఎంచక్కా సాఫ్ట్ వేర్ర్ భాషలో మట్లాడేస్తా.

ఎపిసోడ్ అదిరింది....తరువాయి భాగం ఎప్పుడు?

Anonymous said...

సైన్స్ పుస్తకంలో స్వాతి వీక్లీ పెట్టుకొని సిన్సియర్ గా సమరం కాలమ్ చదువుతున్న కిట్టిగాడికి..ha! ha!.28 Yrs back..when we were in college.. one of my friends used to read loudly in a packed room.

So still it is continueing...

good narration..keep it up.

చందు said...

chchanroy !!!! navvu aagaledu sumee!!!

శిరీష said...

KiTTu meere kaduu? naaku mee face kanipistuni kadha chadivutunTe. its very good. next post eppudu?

Ram Krish Reddy Kotla said...

రాధిక: కిట్టిగాడి మీద మీకున్న అభిమానానికి థాంక్స్ :-)... ఇక కిట్టిగాడి లవ్ స్టొరీ సుఖాంతం కావడం అనేది నా చేతుల్లో కూడా లేదు.. వాడు కొంచెం తింగరి వేషాలు మాని బుద్ధిగా ఉంటేనే కదా సుస్మీ లవ్ చేసేది..చూద్దాం :-)

ప్రణీత: మిమ్మల్ని అంతగా నవ్వించినందుకు నేను హ్యాపీ... మూడవ భాగం వచ్చే వారం :-)

నాగప్రసాద్: థాంక్స్ అండి :-)

Ram Krish Reddy Kotla said...

Sudha: Thanks a lot for the big comment and big thanks for quoting the lines in my post. Your comment really filled the positive energy in me :-))

Anonymous: థాంక్స్ అండి ... నేనేమి ఈ కథలో టెన్షన్ పెట్టడం లేదు కదండీ.. :-))

సునీత: థాంక్స్ .. ఇప్పటికయినా మునిగి పోయింది ఏమీ లేదు..ఒక సర్టిఫికేషను చేసెయ్యండి... జావాలో ఏమన్నా డౌట్లు ఉంటె మన కిట్టిగాడిని అడగండి :-))

Ram Krish Reddy Kotla said...

సౌమ్య: మీరు ఇంకా చక్కగా జావా బాషలో మాట్లాడేయ్యండి చెప్తాను ..డౌట్స్ ఉంటె, తెలుసుగా...మన జావా కుర్రాడిని..అదే కిట్టిగాడిని అడగంటి.. వాకే నా ..తరువాయి భాగం వచ్చే వారం :-)

అజ్ఞాత:ధన్యవాదాలు... స్వాతిలో సమరం గారి సుఖసంసారం ఇప్పుడు వస్తుంది లేదో నాకు కూడా తెలీదు అండి.. ఇంతకముందు వచ్చేది.. దాన్నే కథలో అలా ఉపయోగించా.. నేను మాత్రం ఎప్పుడూ చదవలేదండీ...నిజ్జంగా నిజం :-))

సావిరహే: ధన్యవాదాలు అండి :-)

Anonymous said...

chala navvochindi, baga rasavu.
Deepthi

Ram Krish Reddy Kotla said...

శిరీష: థాంక్స్ అండి...కిట్టూ నేనేమిటండీ బాబూ... కిట్టూ గాడికి, ఆడి ఎదవ ఏషాలకి నాకు ఎటువంటి సంబంధం లేదు అధ్యక్షా.. :-)..చదువుతుంటే నా ఫేస్ కనిపిస్తుందా.. హమ్..ఇంక నేనేమి చెప్పగలను :-))...

దీప్తి: థాంక్స్... చాలా కాలం తరువాత నా బ్లాగులో తమరి దర్శనం :-)

కవిత said...

అసలు ఏంటి మీరు??జావా ని ఇలా డామేజి చేస్తారా??మీ మిద కేసు పెట్టాల్సిందే....పరవాలేదు బాగానే చదివారు జావా ...మీరు చెప్పిన బండ గుర్తులు బాగున్నాయి....అస్సలు కామెడీ అదిరింది పోండి...చాల చాల బాగుంది....చూసారా 'మా' జావా ఒక ప్రేమ కథ ని నడుపుతుంది,,,,కానివ్వండి కానివ్వండి.....

Ram Krish Reddy Kotla said...

కవిత: జావాని డామేజ్ చేసే హక్కు ఉన్న వాడే...ఈ కిషెన్.. అది ఇంజనీరింగ్ లో నాకు చేసిన డామేజ్ అంతా ఇంతా కాదు..:-)..అలాంటి బండ గుర్తులు పెట్టుకొని హేమాహేమీ లాంటి సుబ్జేక్టులెన్నో అవలీలగా పాస్ అయిన వీర చరిత్ర మాది :-))....జావా కూడా దీనికి అతీతం కాదు :-)

divya vani said...

చాలా బాగా రాసారు .. కాన్సెప్టులు అయితే తల్లి ,పిల్లా,పీచు అని బాగానే బట్టి పట్టాడు కాని మరి లాజిక్ ల సంగతేంటి కిషన్ గారు?శిరిష గారు అన్నట్టు నాకు కూడా ఇది చదువుతుంటే మీ ఫేసే గుర్తుకొచ్చిందండి. .

Ram Krish Reddy Kotla said...

దివ్య: లాజిక్కుల సంగతి మనోడు తర్వాత చూసుకుంటాడు లెండి.. ఈ కాన్సెప్టులు నేర్చుకునే సరికే వాడికి సరిపోయింది.. ఏంటో మీ అభిమానం కానీ కిట్టిగాడి స్టోరీ చదువుతుంటే నేను గుర్తురావడం ఏమిటో... కొంపదీసి నా స్టోరీనే ఇలా రాస్తున్నా అనుకుంటున్నారా ఏవిటీ.. :-((

కాంత్ said...

భలే ఉన్నాయండీ మీ కిట్టుగాడి ప్రేమ వేషాలు. మీ సరళరీతిలో జావా కాన్సెప్ట్స్ బావున్నాయి. మేము కూడ ఇలాగే మాట్లాడుకుంటాము. విష్ణువు ఒక abstract తరగతి అని, instantiate చెయ్యడానికి కుదరదనీ, అందుకే అవతారాలు ఉన్నాయనీ, శివుడు అవతారాలేమీ లేవు కాబట్టి ఒక final తరగతి అని, instantiate చెయ్యలేమనీ అలా అలా.

divya vani said...

ఏమో కిషన్ గారు కొంచం మీ స్టోరినే అనిపిస్తోంది కొంచం కాదు అనిపిస్తోంది .

divya vani said...

ఏమో కిషన్ గారు కొంచం మీ స్టోరినే అనిపిస్తోంది కొంచం కాదు అనిపిస్తోంది.

శివరంజని said...

ఏంటండి సార్ .... కామెడీ కి కూడా ఒక హద్దు ఉండాలి.... ఉదయం నుండి నా బ్లాగ్ లో ఎర్రర్స్ వచ్చి సౌమ్య గారు , శ్రీనివాస్ పప్పు గారు పెట్టిన కామెంట్స్ పబ్లిష్ అవ్వడం లేదని నేను భాదపడుతుంటే.. అంత ఏడుపు లో కూడా నవ్వొచ్చింది మీ పోస్ట్ కి .

ఆ అమ్మాయిని తయారుచెయ్యడానికి బ్రహ్మ తదితరులు లో "నేను" కూడా ఉన్నాను సో ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం వడ్డీతో సహా నాకే చెల్లుతుంది . కాబట్టి కిట్టిగాడిని సృష్టించిన రచయిత నుండి నేను ఈ మొత్తం డిమాండ్ చేస్తున్నాను( వస్తు రూపేణా , నగదు రూపేణా ఏ విధం గా నైనా చెల్లించవచ్చు)... ......................

శివరంజని said...

ఏంటండి సార్ .... కామెడీ కి కూడా ఒక హద్దు ఉండాలి.... ఉదయం నుండి నా బ్లాగ్ లో ఎర్రర్స్ వచ్చి సౌమ్య గారు , శ్రీనివాస్ పప్పు గారు పెట్టిన కామెంట్స్ పబ్లిష్ అవ్వడం లేదని నేను భాదపడుతుంటే.. అంత ఏడుపు లో కూడా నవ్వొచ్చింది మీ పోస్ట్ కి .

ఆ అమ్మాయిని తయారుచెయ్యడానికి బ్రహ్మ తదితరులు లో "నేను" కూడా ఉన్నాను సో ప్రొడక్షన్ కాస్ట్ మొత్తం వడ్డీతో సహా నాకే చెల్లుతుంది . కాబట్టి కిట్టిగాడిని సృష్టించిన రచయిత నుండి నేను ఈ మొత్తం డిమాండ్ చేస్తున్నాను( వస్తు రూపేణా , నగదు రూపేణా ఏ విధం గా నైనా చెల్లించవచ్చు)...

sphurita mylavarapu said...

రుబ్బుడు స్పందనలు...హ హ హ...మీకు భలే అవిడియాలు వస్తాయండి
oops concepts...super...మీకులా వివరించే వాళ్ళు లేక ఆ ఊప్స్ తో తెగ కుస్తీ పట్టేసేవాళ్ళం...నేనూ నా Firend కలిసి...

kinnera said...

nice work

Kalyan C Modugu said...

Ramu ...

I am really proud there is a great writer from our family...

This is the blog i read everytime when ever i feel homesick or lonely ...makes me feel happy for the rest of the day with your hilarious comedy in stories

Ram Krish Reddy Kotla said...

Kalyan, am really very very Happy after seeing ur comment ra. Am happy not because you told me that am a great writer, but because my stories are making you happy whenever u feel bad about something. Thats the real CREDIT dude. Thanks a ton :-)

Ram Krish Reddy Kotla said...

కేకే గారు ధన్యవాదాలు అండి.. ఓహో మీరు కూడా ఇలాగే మాట్లాడుకునే వాళ్ళా... మేము ఏ కాన్సెప్టు రాకపోయినా సరే ఇలాంటి గొప్ప గొప్ప పోలికలు పెట్టి మరీ నేర్చేసుకునే వాళ్ళం :-)

దివ్య: అవునాండీ...అలా అనిపిస్తున్దాండీ ... అనిపిస్తుంది లెండి మీకు అలాగే... ఏం చేస్తాం :-(

Ram Krish Reddy Kotla said...

రంజని, అంత ఏడుపులో మీకు నవ్వు తెప్పించినందుకు నేను హ్యాపీ... అయినా మీ కామెడీ కూడా ఒక హద్దు ఉండాలి.. ఆటల్లో అరటిపండు అంటూ తెగ నవ్వించేసారుగా.. ఆ ప్రొడక్షన్ కాస్ట్ వస్తు రూపంలో పంపిస్తాను...వాకే నా ..మా ఇంట్లో మూలన పది ఉన్న డబ్బా టీవీ ఉంది.. మొన్న పాత సామానులు కొనే వాడు కూడా దాని వైపు కన్నెత్తి చూడలేదు.. అంట గొప్ప యాంటిక్ పీస్ అది... అది మీకు పంపిస్తాను...వాకే నా :-))

స్పురిత గారు, నాకంతే అపుడప్పుడు ఇలాంటి అవుడియాలు తెగ వచ్చేస్తాయి.. మీరు కూడా ఆ కాన్సెప్టులతో అవస్థ పడ్డారా...ఏం చేస్తాం.. అలాంటి కాన్సెప్టులు మరి అవి :-)

కిన్నెర: ధన్యవాదాలు :-)

ఆ.సౌమ్య said...

ఈ కామెంటు శివరంజని గారికి:

అప్పుడప్పుడూ టపాలు రాస్తే అలాగే ఎర్రర్లు వస్తూ ఉంటాయి. మీ బ్లాగుకి మేము తరచూ వచ్చి ఎర్రర్ పోగొట్టాలంటే మీ పంధాలో టపా టపామని పోస్టులు వేసేయండి మరి. మేము చదివి కడుపుబ్బ నవ్వుకుంటాం.

అడక్కుండానే కామెంటు రాసుకోవడానికి స్పేస్ ఇచ్చినందుకు రామకృష్ణ కి బోల్డు థాంక్సులు :D

Kalyan C Modugu said...

future lo nuvvu pedda writer ayithe ne dates and renumeration chuse ne PA post naaku istaava ?

Ram Krish Reddy Kotla said...

కళ్యాణ్ బాబూ ఇది మరీ టూ కాదు...టూ హండ్రెడ్ మచ్... అంత దృశ్యం ఇక్కడ లేదమ్మా :-)

శివరంజని said...

@సౌమ్య గారు: ఎర్రర్స్ పోయాయిలేండి..once again thanks.......

@కిషన్ గారు: అంత గొప్ప యాంటిక్ పీస్ మీ దగ్గరైతేనే భద్రంగా ఉంటుంది(చాలా కాలం నుండి దాస్తున్నారు కదా)..... నేనయితే మిస్స్ చేసుకుంటాను

3g said...

హ.. హ.. సూపర్.......... పోస్ట్ మాత్రం అదిరింది.

..nagarjuna.. said...

వార్ని రెండొ పార్టు అప్పుడే వచ్చేసిందా..నేనుదా ఇది ఎష్టాదా మిస్సైతిని...
చదవడం ఆలస్యమైతే ఐందిగాని గురు క్యామెడి కెవ్వు..

>>అమ్మా...నాన్నా...అది...కాఫీ...ఆ రోజు..టీ పొడి...అదే... ఉప్మా..<<
>>పిచ్చోళ్ళు చేసేపనులకి పెద్దగా కారణాలు ఏముంటాయి నాన్నా..<<
polymorphism = విష్ణుమూర్తి అవతారాలు!!‍%ఽ&*
huh ఈ ముక్క తెలిసుంటే బాలగురుస్వాములు, యశ్వంత్ కనిత్కర్‌లు అంత ఆయాసపడి చెప్పకపోదురు, మేము అంత కష్టపడి బుర్రలు గొక్కోకపోదుము...ఇప్పటికి మించిపోయింది లేదు భావి ఇంజనీర్లని కాపాడడానికి మీరు ప్రొఫెసరు అవతారం ఎత్తాల్సిందే... దీని వల్ల మీలో రచయితను మిస్సవనక్కరలేదు భేషుగ్గా అతణ్ణి polymorphism ద్వారా inherit చేసి వీలునుబట్టి operator overloading దమషాలొ వాడేయండి

..nagarjuna.. said...

పోస్టుకు సంభందంలేని వ్యాఖ్య, అవసరం లేదనుకుంటే తీసేయండి:
రామకృష్ణ భాయ్...ఆ ‘దృశ్యం’పదం మీకూ పిట్టిందా...దర్జాగా ‘సీన్’ అని ఉండగా మనకు ఈ సినిమా అనుకరణలెందుకు గురు. దర్శకేంద్రులవారి సినిమాలో ఆ మక్కీకి మక్కీ తర్జామా డైలాగు వినంగానే నాకైతే పరిపరి నానావిధముగా అనిపించింది, పైగా అది నారదుడితో పలికించడం " నాకంత చిత్రం లేదూ..." అని. నేనైతే అక్కడే ఢమాల్...జావా గురించి సుస్మి అడిగినపుడు కిట్టిగాడిలా

Anonymous said...

Very Good Comedy.

నేస్తం said...

కిషన్ సూపర్.. బాగా నవ్వించేసారు..చాలాబాగా రాస్తున్నారు ..నెక్స్ట్ పార్ట్ కోసం చూస్తున్నా

priya.... said...

hey...wow....good bagundi comedy lovestory....enti encapsulation polymorphism evanni...enti edi ma science words anni tippi tirigi tesukochadu....asale eroje xams ipoindi kada anukunnna....me java lo elantivi kuda untaya babu...bhale undi...ededo munde telisinte....a java ni nen kuda jellada patti ma chelli chepedanni...sarle...me sambhashana lu inta andanga untaya...ante le...entaina mer kuda engg life nunde vachina varu kada...bt nijanga chala bagundi ram...nak nachindi...comedy kuda bagundi...titlu enni vinna takkuve baga nachesai...inkonni artam kaani titlu ade, nu intaka mundu adedo taadu...tokka ento antuntivi kada...alanti pettu inka baguntundi...k na....awaiting for the nxt blog ram....keep going...anta me bhashalo...rechei po ehe....

Ram Krish Reddy Kotla said...

శివరంజని: లేదు అంత గొప్ప యాంటిక్ పీస్ నీకు ఖచ్చితంగా పంపించాల్సిందే.. పంపించేస్తున్నా :-)

త్రీజీ: థాంక్స్ బాస్ :-)

సౌమ్య:నా బ్లాగులో స్పేస్ మీరు ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు :-)

Ram Krish Reddy Kotla said...

చారిగారు: అంతే అంటారా ప్రొఫెసర్ అవతారం ఎత్తేయ్యమంటారా.. ఏదో సరదాగా ఉపయోగించా ఆ "దృశ్యం" అనే పదం

బోనగిరి: ధన్యవాదాలు :-)

Ram Krish Reddy Kotla said...

నేస్తం: ఏమిటండీ ఇన్ని రోజులు ఎక్కడికెళ్ళిపోయారు అసలు... కొత్త ఇల్లు సర్దుకోడంలో బిజీనా?.. కథ నచ్చినందుకు ధన్యవాదాలు.. :-)

ప్రియ: సరే..అలాగే రెచ్చిపోతాను :-)

ప్రణీత స్వాతి said...

హలో కృష్ణ గారూ...ఎటెళ్లిపోయారు? నెక్స్ట్ వీక్ అన్నారూ..ఇంకా రాయరే..టపా..? ఎన్ని రోజులీ సస్పెన్సు? త్వరగా రాయండి మరీ..

Ram Krish Reddy Kotla said...

ప్రణీత గారు, ఎక్కడికీ వెళ్ళలేదండీ..ఇక్కడే ఉన్నాను.. కొంచెం వర్క్ బిజీలో ఉండటం వలన రాయలేకపోయాను..ఈ వారంతో ఖచ్చితంగా రాయడానికి ప్రయత్నిస్తాను..అయినా సస్పెన్స్ అంటారు...నేను సస్పెన్స్ పెట్టలేదు కదా ఎక్కడా??..మీరు మరీను :-)

నేస్తం said...

అంటే సార్ ప్రేమ కధలు ఎక్కడ ఆపినా సస్పెన్స్ గానే ఉంటాయన్నమాట :)

కొత్త పాళీ said...

నేను కాలేజి గ్రాద్యువేటయ్యి చాలా ఏళ్ళయింది గానీ, ఇలాగే మెకానికల్ పరిభాషలో ఏవన్నా కాన్సెప్టులుంటయా అని ఆలోచిస్తున్నా .. నావియర్ శ్టోక్స్ ఈక్వేషనొక్కటే గుర్తొస్తున్నది ప్రస్తుతానికి.
Hilarious

Ram Krish Reddy Kotla said...

నేస్తం: ఓహో అలాగంటారా మేడం...అలాగలాగే... :)

కొత్తపాళీ: ధన్యవాదాలు :)

Sreenivas said...

Really very nice hilarious presentation. Good and expecting more.

Ram Krish Reddy Kotla said...

Thank you sreenivas :)

Anonymous said...

baavundi...keep it up.

Ram Krish Reddy Kotla said...

Thank you Anonymous :)

ఇందు said...

Inheritance - అంటే...ఒక తరగతి, మరొక తరగతి నుంచి..తల్లీ పిల్ల పీచులతో సహా అన్నిటినీ ఆవాహం చేసుకోవడం..."

Polymorphism - అంటే ఒకే తరగతి అనేక అవతారాల్లో ఉంటుంది అనమాట.. సందర్భాన్ని బట్టి ఒక్కో అవతారం ఎత్తుద్ది.. మన విష్ణుమూర్తి లాగా

ఇకపోతే Encapsulation - ఇది పెద్ద జాదూరా..ఒక క్లాసు యొక్క తల్లి పిల్లా పీచూ వివరాలన్నీ దాచేస్తుందట.. మరి దానికేం పోయేకాలమో..!
--


Kevvvvvvvvvvvv!!!!!!!!!!!!!!! Keko keka :) Naaku JAVA vachesindoch :P

ఇందు said...

Inheritance - అంటే...ఒక తరగతి, మరొక తరగతి నుంచి..తల్లీ పిల్ల పీచులతో సహా అన్నిటినీ ఆవాహం చేసుకోవడం..."

Polymorphism - అంటే ఒకే తరగతి అనేక అవతారాల్లో ఉంటుంది అనమాట.. సందర్భాన్ని బట్టి ఒక్కో అవతారం ఎత్తుద్ది.. మన విష్ణుమూర్తి లాగా

ఇకపోతే Encapsulation - ఇది పెద్ద జాదూరా..ఒక క్లాసు యొక్క తల్లి పిల్లా పీచూ వివరాలన్నీ దాచేస్తుందట.. మరి దానికేం పోయేకాలమో..!
--


Kevvvvvvvvvvvv!!!!!!!!!!!!!!! Keko keka :) Naaku JAVA vachesindoch :P