ఈ మధ్య ఆఫీసులో నా కొలీగ్ ఒకడికి తెలుగు బ్లాగులని పరిచయం చేశాను... వాడు వాటికి బాగా అలవాటు అయ్యాడు..రోజూ తెగ చదువుతాడు, స్వతహాగా బద్ధకస్తుడు కాబట్టి కామెంట్ పెట్టడు...మొన్నో రోజు నా దెగ్గరికి వచ్చి...
"ఈ బ్లాగుల వల్ల నాకు బాగా టైం పాస్ అవుతుంది...పైగా పెద్దగా వర్క్ కూడా లేదిప్పుడు.." అన్నాడు
నేనొక స్మైల్ ఇచ్చాను అంతే...
"ఈ మధ్య చూసిన బ్లాగుల్లో చాల మంది ఈష్టు గోదావరి..వెష్టు గోదావరి వాళ్ళవే ఎక్కువ... వాళ్ళు చాలా బాగా రాస్తున్నారు..."
నేను సైలెంట్....
"మీ సైడ్ వాళ్ళు..అదే గుంటూరు..ప్రకాశం..నెల్లూరు సైడ్... పెద్దగా లేరేమో కదా బ్లాగుల్లో...ఎక్కువ కనిపించలేదు నాకు..." అన్నాడు..
"ఉన్నారు..మా వాళ్ళు కూడా ఉన్నారు..." కొద్దిగా రోషం నాలో...
"ఉన్నారేమోలే...చాలా తక్కువ వీళ్ళతో పోల్చుకుంటే...వీళ్ళు చాలా చక్కగా రాస్తున్నారు కూడా.."
"రాస్తున్నారు...మా వాళ్ళు కూడా చాలా చక్కగా రాస్తున్నారు..." తగ్గకూడదు నేను..
"ఏమో...ఓ పది బ్లాగులు చెప్పు మీ వాళ్ళవి..."
"ఆ...అదీ...ఇప్పుడంటే ఇప్పుడు ఎలా చెప్పగలం...సడన్ గా మాస్టర్ క్లాస్ లో పిల్లాడిని లేపి ఫిజిక్స్ బుక్కులో పదో పేజీలో పదో లైన్లో ఏముందో చెప్పమన్నట్లుంది నువ్వడిగేది.." అన్నాను నేను నన్ను సమర్ధించుకుంటూ..
"నేను చెప్పనా వాళ్ల బ్లాగులో ఓ పది.." అన్నాడు నన్ను ఉడికిస్తూ...
ఇకనాకు తిక్కరేగి "ఏ ఊరు మీది?" అన్నాను
"విజయవాడ.." అన్నాడు
"మరి...గోదావరి వాళ్ళు ఎన్ని రాస్తే నేకేందుకు...పొయ్యి పని చూసుకో.." అన్నాను...
అలా అన్నానే కానీ...అతను అన్న మాటలు నన్ను కొంచెం ఆలోచింపజేసాయి...అసలు దక్షిణ కోస్తా బ్లాగర్లు ఎంత మంది ఉన్నారు?..ఎన్ని బ్లాగులు ఉన్నాయి?..మనం మైనారిటీ బ్లాగర్ల లెక్కలో ఉన్నామా?..ఇలాంటి ప్రశ్నలు నా మైండులో డ్యాన్స్ చేశాయి..
అప్పుడే ఒకటి నిర్ణయించుకున్నాను...మెజారిటీ బ్లాగర్లుగా వెలుగొందుతున్న ఈ గోదావరి బ్లాగర్ల ముందు మన ఉనికి తెలియాలంటే, మనం ఏకం అవ్వాలి..అందుకో బ్లాగర్ల సంఘం ఏర్పడాలి...అలాంటి అలోచానా ఫలితమే ఈ "దక్షిణ కోస్తా బ్లాగర్ల సంఘం"(ద.కో.బ్లా.స)
దక్షిణ కోస్తా జిల్లాలు అయిన గుంటూరు, ప్రకాశం, నెల్లూరుకి చెందినా బ్లాగర్లు ఈ సంఘంలో చేరవచ్చు. మన మూడు జిల్లాల బ్లాగర్లు అందరూ ఏకమయ్యి మన ఉనికిని చాటుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఇప్పుడు..కనుకనే గుంటూరు, ప్రకాశం, నెల్లూరుకి చెందినా బ్లాగర్లకి ఇదే నా పిలుపు, మీరంతా వచ్చి మన "దక్షిణ కోస్తా బ్లాగర్ల సంఘం"లో చేరండి. అప్పుడు మన దక్షిణ కోస్తా బ్లాగర్లు అసలు ఎంత మంది ఉన్నారో తెలుస్తుంది. మనం మైనారిటీ కాదని నిరూపించాలి. మన బ్లాగర్ల సంఘం ఇంకా అభివృద్ధి కావడానికి, ఎక్కువమంది దక్షిణ కోస్తా బ్లాగర్లు తయారవ్వడానికి మీ అమూల్యమైన సలహాలు కూడా ఇవ్వండి. ఎవరైనా దక్షిణ కోస్తా యువకుడు కానీ యువతీ కనీ బ్లాగు మొదలెట్టి టపా వెయ్యగానే, మనం వారిని బాగా ఎంకరేజ్ చేసి మెరికల్లా తయారుచెయ్యాలి..ఆవిధంగా మన సంఘాన్ని అభివృద్ధి చెయ్యవచ్చని నాకు అనిపిస్తుంది. ఏమంటారు??. ఇంకా దీనికి సంబంధించిన విధి విధానాలకై మీ సలహాలు కోరుతున్నాను.
120 comments:
జై దక్షిణ కోస్తా బ్లాగర్ల సంఘం
ఒంగోలు నుండి ఒక పెద్దపులి ఉన్న సంగతి తెలీదా మీకు
తెలుసు శ్రీనివాస్ గారు... నాకు మొదట మీరే గుర్తుకు వచ్చారు...పెద్ద పులిని ఎలా మరచిపోగలను..మన సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళి మరింత అభివృద్ది చేద్దాం...ఇంకా మన సంఘ బ్లాగర్లు ఎవరు ఉండి ఉంటారు?
మాది గుంటూరు జిల్లా అండి
అసైన్సు కబుర్లు తార :)) గుంటూరు నుండి
ప్రస్తాన త్రయం బ్లాగ్ ఓనర్ ప్రకాశం జిల్లా నుండి
భరారే కూడా ప్రకాశం జిల్లా నే
మనం మైనారిటీ కాదు చాలా మందే ఉంటాం :))
మలక్ పేట్ రౌడీ పుట్టింది ప్రకాశం జిల్లా చీరాల
అను: దక్షిణ కోస్తా బ్లాగర్ల సంఘంకి సుస్వాగతం...ఇంకా దక్షిణ కోస్తాకి చెందినా యువతులు వస్తారని ఆశిస్తున్నాను.
శ్రీను: గుడ్ ఇన్ఫర్మేషన్...భా.రా.రే అనంతపురం అని చెప్పినట్లు గుర్తు..ప్రకాశమేనా ..గుడ్ :-)
Yes, we shouldn't be minority
మలక్ గారు కూడా మన బ్లా.స లోకే వస్తారా..గుడ్..ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంది :-)
rashtram lone verpatuvadam anukunnam, ippudu blagulakkuda sokinda ee rogam.
dayachesi telugu vaarini ilaa rashtralu blagulu antu vidadiyakandi....Please.....
ప్రకాశం, మాది మధ్య కోస్తా, మేము దక్షిణకోస్తా క్రిందకి రాము
Anon: మీరు దీంట్లో అంత సీరియస్ గా తీసుకునే విషయం ఏమీ లేదడీ...ఇదంతా ఆరోగ్యకరమైన పోటీనే...ఇది వేర్పాటు వాదం కాదు..
Guntur bloggers chaalaa mandi unnaaru. Famous are Telugodu, manasulomaata, thotaramudu....
తార: గుంటూరు, నెల్లూరు, ప్రకాశం...ఈ మూడు దక్షిణ కోస్తానే..కోస్తలోనే ఉన్నవి తోమ్మోది జిల్లాలు..మళ్ళీ ఈ మధ్య కోస్తాలూ అవీ ఎందుకండీ :-)
గుంటూరు వాళ్ళు చాలా మందే ఉన్నారండి,నేను గుంటూరే. ఈ గోదారోళ్లు ఉత్తిత్తినే ఎగిరెగిరి పడుతుంటారు అంతే! (అమ్మో నేస్తం గారు వాళ్లాయన క్రికెట్టు బాట్ పట్టుకుని వచ్చేస్తున్నారు).
Anon: i thnk thotaramudu belongs to Tirupati (chittoor).
Sirisirimuvva: Let all guntur,nellore n prakasham bloggers come out of closet and represent themselves to the association.
మాదీ గుంటూరే బాబూ!నాన్న బ్లాగు భాస్కర్ రామరాజుగారు, భావనాంతరంగం భావన(ఉమ)గారు బందరు, అనంతం బ్లాగు ఉమాశంకర్ గారు, మనసులో మాట సుజాతగారు, గీతాచార్య, వేణూ శ్రీకాంత్ అందరూ గుంటూరు జిల్లా వాళ్ళు. ఠక్కున గుర్తొచ్చినవి ఇవి.
mundu alaane untundi. taruvaate rogam muduruthundi
Sunitha: Very very good info. So we are not at all into minority. hmm good. let more bloggers from our 3 districts keep coming :-)
సిరిసిరిమువ్వ, చదువరి, బ్లాగరులు కూడా మా గుంటూరువాళ్ళే:-)
vimarsakudu gaaru: అంత ముదిరి పోయే రోగం కాదులెండి..ఇంతకన్నా ముదిరే రోగాలు చాలానే ఉన్నాయి..ధన్యవాదాలు :-)
దక్షిణ కోస్తా వాళ్ళకు ఎంత కష్టం వచ్చింది.. పోని సాయం చేయమంటారా ..నన్ను లెక్కపెట్టడం లో :P
ఉత్తర కోస్తా వాళ్ళే బాగా కోతలు కోస్తారు, పనీపాట వుండదు కాబట్టి బ్లాగుల్లోనే కాలక్షేపం. అందుకే వాళ్ళ బ్లాగులు బాగుంటాయి.
మువ్వగారు అంతమాట అంటారా ...గుంటురు మువ్వగారికి,గోదావరి నేస్తానికి మధ్య లో ఎవరూ కూడా పచ్చ గడ్డివేసే సాహసం వేయద్దు
ఉన్నవి తొమ్మిదైతే కలిసుండాలా? అబ్బో, మా రాష్ట్రం మాకు కావలసిందే.. అబ్బా..
ఇంకా ఎక్కువ మాట్టాడితే, మాది మధ్య మధ్య కోస్తా, ప్రకాశం మధ్య దక్షిణ కోస్తా..
మాకు ప్రెత్యేక రాష్ట్రం కావలసిందే
i also from guntur sir
నేస్తం జీ: మీరు లేక్కేడితే మీ చేతులు నొప్పెడతాయేమో..ఎందుకంటే మా వాళ్ళు ఇప్పుడు చాలా మండే అయ్యారు...స్టిల్ కౌంటింగ్ :-))
తార గారు మరి మీరు ఉద్యమం మొదలేడుతున్నారా :-))
ఎంతమంది ఉంటే ఏమి లాభం లేద్దురూ కొత్తగా బ్లాగులు చదివిన మీ ఫ్రెండు కే కనబడనప్పుడు :P ఆ మాటకొస్తే బ్లాగు పుట్టిన సంవత్సరానికి కూడా కనిపెట్టలేదు మీరు కూడా.. ఈ సారికి ఒప్పేసుకోండి సార్ ...:D
తార నువ్వే ఈ సంఘానికి సెగట్రీ
గోదారి జనాలకి బాగా ఎక్కువ అయింది ఈ మద్య :)) ఓ లోకువ కట్టేస్తున్నారు మమ్మల్ని . మా బలం నిరూపించుకునే సమయం వచ్చేసింది.
ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ ఉత్తర కోస్తా జనాల్లో యూనిటీ కరువు
నేస్తం గారు మన సంఘ భావాలను తీవ్రంగా దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారు...అందరూ ఇది ఖండించండి....మన మెజారిటీని నిరూపించండి...రాబోయే కాలంలో హవా మొత్తం దక్షిణ కోస్తా బ్లాగార్లదే కావలి
Ikkadem jaruguthundi??asalu endi mee gola??maa KCR anna ni tholkarammantara,endi??Okate gola chesthundru....nenu matram mee group kaadu .
mari naako doubt,naadi telangana...maa vaaridi andra.Ippudu nenu ee sangam lo cheraali??
Srinu,nenu already memmulni adiga...ippudu naa gamyam etuvayipu??
శ్రీనివాస్ బాగా చెప్పావు...మన బాల నిరూపణ కావలి ఇప్పుడు...గోదావరి బ్లాగర్లకి మన బలమెంతో తెలియాలి...ద.కో బ్లాగరులారా కదలిరండి ..
Kavitha: me ayana guntur kabatti. needi kooda guntur kinda lekke. ur not telangana now. so u comes under our sangham.
కదలిరండి దక్షిణ కోస్తా బ్లాగరులారా..కదలిరండి...ఉద్యమం తీవ్రం చేద్దాం...మనం బలం చూపిద్దాం... జై ద.కో.బ్లా.స
aadavallani anichi vetshunnaru kishan...No .Thuchhh.Nenoppukonu.nenu maa KCR annani tholukostha..anthe.
Nenu kuda oka kotha sangam pedatha...meeku vyathirekanga.
ఆ కలిపేసుకోండి బాబు కలిపేసుకోండి అందరినీ కలిపేసుకోండి...అది చీటింగ్ అవుతుందమ్మా.. తార గారు మీరు సైడ్ కొచ్చేసేయండి... మీ వూరి వాళ్ళూ బోలెడు మంది తెలుసా బ్లాగ్స్ లో
Ikkada Krishna vallu evaru lera??? :')
ఏమన్దోయి కవిత గారు మీ మెట్టినిల్లు గుంటూరు కాబట్టి మీరు మా సంఘమే .. వచ్చేయండి వచ్చేయండి
Archana: krishna vallu maa sangham paridhi loki raru.
nestham: meeru mammalni tappu daari pattisthunnaru. tara garu maa sanghame. ayana prakasham.
కవితా వెళ్ళకు వెళ్ళకు..కిషన్ అహా పాపం అలాగేం..అయితే సుజాత గారు కూడా మీ సంఘం కాదు వాళ్ళ ఆయన గారు మా గోదావరి జిల్లానే... ఆ మాట కొస్తే అమ్మాయిలెవరు మీ సంఘలో ఉండరు గాక ఉండరు..
ఓయ్ ..తార గారంటే ఏమనుకున్నారు మాట మీద నిలబడతారు...తార గారు మీరు దక్షిణ కోస్తా కాదు కదండి... మధ్య కోస్తా కదా ...కావలంటే అడిగి చూడు కిషన్ :)
మన సంఘాన్ని ఎదగనియ్యకుండా నేస్తం గారు పన్నే కుట్రల్ని ధైర్యంగా తిప్పి కొట్టండి...మనం ఐక్యమే మన బలం..మీరు ఎన్ని చెప్పిన అరచేతితో సూర్యుడిని ఆపలేరు..ఆపలేరు ..
నేస్తం గారు మా సంఘం లొ చీలిక తేవడానికి శతవిధాల కుట్రలు పన్నుతున్నారు.
మీ కుట్రలు మేము తిప్పి కొడతాం .
ఒక్కసారిగా ఒవ్వేత్తున లేచిన కెరటమే...దక్షిణ కోస్తా బ్లాగర్ల సంఘం...పాపం నేస్తం గారి భయం పట్టుకుంది ఎక్కడ గోదావరి వాళ్ల ఉనికి లేకుండా పోతుందేమో అని...అందుకే మనపై నెగటివ్ పబ్లిసిటీ
మరి నేనో? పుట్టి పెరిగింది విజయనగరం, చదివింది కృష్ణ, పెళ్ళి చేసుకున్నది రాయల సీమ లో, వుద్యోగం కోసం ఇప్పటివరకు నెల్లూరు, వచ్చే నెల నుండి తెలంగాణ...నేను ఏ సంఘం లో చేరాలో??
హూం ...శ్రీనివాస్ నేనెందుకు బాబు కుట్రలు పన్నడం..అసలే బ్లాగ్స్ లో మీరెక్కడ ఉన్నారో మీకే తెలియక కలపరపడుతుంటే కాసింత హెల్ప్ చేసి నా ప్రఘాడ సానుభూతి తెలపడానికొస్తేనూ ... కెరటం ఉవ్వెత్తున లేచి క్రింద పడిపోవలసిందే అలా నీ పోస్ట్ పడగానే ఉవ్వెత్తున పైకి లేచి ...తరువాత మీ బ్లాగర్లు ఎక్కడా అని అడిగితే తడుముకుంటూ మళ్ళీ పోస్ట్ వేసుకోవలసిందే...( జిజ్జినక .. అనవసరం గా వేసా ఈ పోస్ట్ అనుకుంటున్నావ్ కదా )
శిరీష గారు పుట్టి పెరిగింది ముఖ్యం...విజయనగరం కనుక మీది ఉత్తర కోస్తా...అయినా కాని, నెల్లూరు తో మీకు మంచి సంబంధాలు ఉన్నాయి కనుక...నెల్లూరు మీద అభిమానం ఉంది కనుక..మీరు మా సంఘం లో చేరవచ్చు .. :-)
పదవి అంటే ఆలోచించాల్సివస్తున్నది, మరీ మొహమాట పెడుతున్నారు..
నేస్తం ఈ పోస్టు సరయిన టైం లోనే వేసాను...మీరు అలాగే చూస్తూ ఉండండి...మా ద.కో సంఘం బలమెంతో తెలుస్తుంది...ఇకనుంచీ మాలో ఐక్యత చూస్తారు.
తార గారు పదవి మీకే...మన సంఘానికి మీ సేవలు కావలి
పెద్ద పదవి తారకే
శిరీష గారు మీకు దక్షిణ కోస్తా తో ఉన్న అనుబంధం కారణంగా మీరు గ్రూపే. ఉత్తర కోస్తా వాళ్ళలో ఐక్యత లేదు పైగా గోదారి జనాల డామినేషను కూడాను
పదవివ్వాలేగాని, రెచ్చిపోను..
అసల మన జిల్లాల్లో ఒక మందు ఫ్యాక్టరీ లేదు, ఒక పెద్ద షిప్‌యార్డ్ లేదు, ఒక విమానాశ్రయం లేదు, ఒక పెద్ద బస్సు, రైల్ స్టేషన్ లేదు, ఒక పెద్ద ఇనప ఘని లేదు..
మకన్నా వెనకబడిన ప్రాంతం ఉన్నదా..
అందుకనే నేను .......... డిమాండ్ చేస్తున్నా..
(ఇంతకీ మనం దేని కోసం పోరాడాలో అది పైన చుక్కల మధ్య పెట్టాలి)
పెట్టుండ్రి పెట్టుండ్రి.....ఫుల్లుగా పెట్టుండ్రి...
ఐనా ఏందివయ్యా....మా ఏరియా కవితగారిని కన్‌ఫ్యూజ్ జేస్తుర్రు. గమ్మున కవితగారికి మాఫీజెప్పి చేర్చుకోండ్రి....
:))
@నేస్తంగారు: >>ఎంతమంది ఉంటే ఏమి లాభం లేద్దురూ కొత్తగా బ్లాగులు చదివిన మీ ఫ్రెండు కే కనబడనప్పుడు :Pఆ మాటకొస్తే బ్లాగు పుట్టిన సంవత్సరానికి కూడా కనిపెట్టలేదు మీరు కూడా..
లోళ్ళు......కెవ్వు కేక.
ఇందాకట్నించి వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నా కాని మీ కామెంట్ చూసి టెంపరవరీ బ్రేకిచ్చా!!
ఈ వేర్పాటువాద ఉధ్యమాలకి వ్యతిరేకంగా మళ్ళీ వ్యూహాత్మక మౌనం లోకి......... (అపోజిషనోళ్ళ బలం పూర్తిగా తెలిసింతర్వాత మళ్ళీ వస్తాం)
ద.కో.బ్ల.స. అంటే దక్షిణ కోస్తా బ్లాగర్ల సంఘమా ? ఇంకా నేను దగాకోరు బ్లాగర్ల సంఘమేమో అనుకుని డౌట్ పడ్డాను, పేరు ఇంకేదన్నా చూసుకోండీ సారు, జనాలు కంఫ్యూజ్ అవుతారు ;)
కృష్ణ గారు మొదటగా మీరే ఇలా కన్ఫ్యూజ్ అయ్యారు...ఇప్పటిదాకా ఎవరూ అవ్వలేదు...అవ్వరుకూడా...పేరుకి వచ్చిన డోకా ఏమీ లేదు :-)
త్రీజీ గారు: మాది వేర్పాటు వాదం కాదు...మా ఉనికిని చాటుకొని బాల నిరూపణ చేసే పనిలో ఉన్నాము...ప్రస్తుతానికి మా సంఘ సభ్యులు కూడా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు తగిన సమయం కొరకు :-)
కృష్ణ : అయినా టపా పేరులోనే దక్షిణ కోస్తా అని రాస్తే దగాకోరు అని మీరు ఎలా డౌట్ పడ్డారో మీకే తెలియాలి... ;-)
బాల నిరూపణ ఏమిటి అండీ బాబు, మీరందరూ బాలలు మిగిలిన వాళ్లు ముసలి వాళ్లనా ?
కృష్ణ గారు మీరు మరీ ఇలా మాట్లాడితే ఎలాగండీ....బలనిరూపణ అంటే...బాలలు ముసలివాళ్ళ బలాలు కాదండీ బాబు...మా దక్షిణ కోస్తా బ్లాగరులు ఎంత మంది ఉన్నారో అదే మా బలం ;-)
సరదాగా తీసుకోండి , పేరడీ చేసేవారికి ఇలా అనుకునే అవకాశం వుంది, అల్రేడీ కామెంటు పబ్లిష్ అయ్యిపొయింది కాబట్టి, పేరు అన్నా మార్చేయ్యండి , లేదా కామెంటు అన్నా తీసెయ్యండి.
బహుశా ఏ సంఘం లేదని కుళ్లు అనుకుంటా నాది :)
కృష్ణ గారు సరదాగానే లెండి...సీరియస్ ఏముంది దీనిలో.. :-)
ఏంది తమ్ముడూ, ఎవరైనా మన జిల్లాని ఏమన్నా అంటుండారా?
నాకూ చేరాలని వుంది గానీ నేనప్పుడెప్పుడో ఒక సంఘాన్ని పెట్టుకున్నా ఇప్పుడెట్లా? అయినా నాది అనంతపురం అన్నందుకు వాకౌట్ చేస్తున్నా :-)
ఏంది తమ్ముడూ, ఎవరైనా మన జిల్లాని ఏమన్నా అంటుండారా?
నాకూ చేరాలని వుంది గానీ నేనప్పుడెప్పుడో ఒక సంఘాన్ని పెట్టుకున్నా ఇప్పుడెట్లా? అయినా నాది అనంతపురం అన్నందుకు వాకౌట్ చేస్తున్నా :-)
బాబు, విజయనగరం,విశాఖ,శ్రీకాకుళం వాళ్ళని కలుపుకునే ప్రయత్నాలు ఆపెయ్యండి. మాది సెపరేట్ జోన్.
మీరిలా వచ్చారా. అయితే నేను మరోలా వస్తాను. తెబ్లాస...అంటే ఏమిటో అర్ధం అయ్యింది కదా. శిరీష గారు మీరు తెబ్లాస క్రిందికే వస్తారు. తె..ల్లోళ్ళు అందరూ తెబ్లాసకి జై అనండహో! (తెలంగాణా అని పూర్తిగా అంటే ఎక్కడ వేర్పాటువాదమనుకుంటారేమోనని తె..తో సరిపెట్టేశా). ఎక్కడ పుట్టిందీ, ఎక్కడ పెరిగిందీ ప్రధానం కాదు. ఇప్పుడెక్కడున్నారు అనేదే ఈ బ్లాసకి ప్రధానం. ఈ రూలు ప్రవాసాంధ్రులకు, నాబోటి విదేశాంధ్రులకు వర్తించదు ;)
జై దక్షిణ కోస్తా బ్లాగర్ల సంఘం
i am from guntur
పలనాటి బిడ్డలం ఇక్కడే వున్నాము. ;-)
రామకృష్ణా! నా పేర్రాసుకోండి!
గుంటూరోళ్ళ బ్లాగుల్లో డెప్తుంటుంది! గోదారోళ్ళ బ్లాగుల్లో కబుర్లుంటాయి. కావాలంటే వెళ్ళి అన్ని గోదారి బ్లాగులూ చెక్ చేసుకోండి!
ఈ మాటకి గోదారోళ్లెవరూ పరెగెత్తుకు రాక్కర్లేదు ఖండించడానికి! ఇక్కడ ఆ పని చేయడానికి మా ఇంట్లో ఉనే ఒకరున్నారు.
సుజాతగారు ఏంటది ఏంటది హెంత మాట అనేసారు...మంచు పల్లకి గారి బ్లాగు ,నా స్పందన లలిత గారి బ్లాగు ఇవన్ని కబుర్ల బ్లాగుల్లా అనిపిస్తున్నాయా ఆయ్ ...ఏమి రాసారన్నది కాదు మేడం.. ఎంత మంది టక్కున గుర్తుపెట్టుకుంటున్నారు అన్నది ముఖ్యం :P అయినా పెళ్ళయ్యాకా భర్తే ప్రత్యక్ష దైవం ...మీరో మారు మంగళ సూత్రం కళ్ళకద్దుకుని ఇటొచ్చేయండి మర్యాదగా :D
భా.రా.రే అన్నయ్యా మీరు చేరితేనే కదా మన సంఘానికి ఒక దర్పం...మీరు ఖచ్చితంగా చేరాల్సిందే..అనంతపురం అని మేరేప్పుడో చెప్పినట్లు భ్రమ పడ్డాను అంటే...దీనికే మీరు వాకవుట్ చెయ్యడం బాలేదు...మీకు ఇంక సంఘం ఉన్న పర్లేదు...రండి..చేరండి ...
మురళీ: మీ జోన్ వాళ్ళని కలుపుకొనే ప్రయత్నాలు మేమేమీ చెయ్యడం లేదు...వారంతట వారోస్తేనే ఆహ్వానిస్తున్నాం :-)
శరత్ గారు...మీరలా వచ్చారా..ఇంకా రాలేదేమితా అనుకున్నాను..కవిత గారు కూడా మీ సంఘమే చేర్చుకోండి...
శివ: వెల్కం
శ్రీరాం: నేను కూడా పల్నాటి బిడ్డనే..
సుజాత గారు: మీరు కూడా మా సంఘం వారే అవడం ఆనందకరం :-)
నేస్తం గారు మా సంఘ సభ్యుల మీద మీరు ప్రయోగించే ఎమోషనల్ అస్త్రాలు ఏమీ పనిచెయ్యవు :-)
హ హ ... గొదారివాళ్ళు ఒకేత్తు... మిగతా రాస్ట్రం అంతా ఒక ఎత్తు అంతా ఒక ఎత్తు.. మీరెంత గుంజుకున్నా లాభం లేదు...
సుజాత గారు : గుంటూరోళ్ళ బ్లాగుల్లో డెప్తు గొదారి జిల్లాలవాళ్లని చేసుకున్నకే వచ్చిన టేలెంట్... కావాలంటే నేను ఇస్తా బొల్డు ఉదాహరణలు ... అయినా ఆర్ట్ సినిమాలు ఎందుకండీ ఈ రొజుల్లొ... మాంచి జనరంజకమయిన సినిమాలు కావాలని :-))
W.E. ROCK !!
Not a good post. Sorry to say. Don't divide.
Excuse me, Excuse me.. Nenu kuda unna mi group lo.
నేను పల్నాడు బ్లాగర్ల సంఘం పెడుతున్నా. దకోబ్లాసం చీలికదార్లకిదే ఆహ్వానం.
"గొదారివాళ్ళు ఒకేత్తు... మిగతా రాస్ట్రం అంతా ఒక ఎత్తు అంతా ఒక ఎత్తు.."
మిగతా ప్రాంతాల బ్లాగర్ల మనుభావాలు దెబ్బతీసే విధంగా మంచు గారు చేసిన వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాం
జాబిలి: వెల్కం టూ అవర్ సంఘం :-)
అబ్రకదబ్ర గారు: నేను కూడా పల్నాడే...కానీ మన పల్నాడు నుంచి పట్టుమని పది మంది కూడా లేరు..అందుకే దక్షిణ కోస్తా మొత్తం మనదే...ఇందులో చీలికలకు తావు లేదు...లేదు ..
మీ ద కొ కూడా పట్టుమని పదిమంది కూడా లేరు...అందుకే మాతొ కలసివుంటే మీకే లాభం... మీకు కావాలంటే ప్రత్యేక కామెంట్ల ప్యాకేజి ప్రకటిస్తాం :-))
Anon.. this just for fun.. don't worry :-))
పట్టు మని పది మంది కూడా లేరా...ఇప్పటికే ఇరవై మంది దాక తేలారు...ఇంకా తేలాల్సిన వాళ్ళు చాలా మండే ఉన్నారు...మీరు, నేస్తం గారు ఎలాంటి కుట్రలు పన్నినా...ఎదుగుతున్న సరికొత్త విప్లవాన్ని ఆపలేరు...ఆపలేరు...
ఏంటిది.......అసలేంటిది అని అడుగుతున్నాను.
ఏదో కొన్నాళ్ళు పని ఎక్కువయ్యి బ్లాగులు పెద్దగ చూడక పోయేసరికి మళ్ళి వచ్చి చూడగానే ఎక్కడ చూసినా బ్లా.స లు .
వ.బ్లా.స , యు.బ్లా.స అంటే అర్ధం అయింది. బ్ర.బ్లా.స పుట్టుక గురించి తెలుసుకో బాసు అని నాగార్జున ఇచ్చిన లింకు చదివే లోపే ఇక్కడ మళ్లీ ద.కో.బ్లా.స అంట. (ఇక్కడ ఇంకొక విషయం. టైటిల్ చదివినప్పుడు బాగానే ఉన్నా, కామెంట్లు చదివేటప్పుడు కృష్ణ గారికి తట్టిన పేరే నాకు కూడా తట్టింది).
అసలు అన్నిటి కన్నా ముందు మొదలవ్వవలసిన తె.బ్లా.స ఇంతవరకు లేదు కానీ ఈ ద.కో.బ్లా.స(మళ్ళీ నాకు అదే గుర్తొస్తోంది. lol!) గోలేంటో.
ఇంక లాభం లేదు. నేస్తం గారు, వీళ్ళతో మీకు వాదన ఎందుకు కాని మీరు తూ.గో.బ్లా.స పెట్టుకోండి. నేను ప.గో.బ్లా.స పెడతాను అనుకుంటున్నారా. కాదు .నాది భీ.బ్లా.స (భీమవరం బ్లాగర్ల సంఘం). ఇంకా ఎంత మంది ఉన్నారో నాకు అనవసరం. ఎవరు లేకపోతే నా స. లో నేనే స. (నా సంఘం లో నేనే సభ్యుడిని). ఇది అంతే. ఫైనల్.
భలే భలేగా ఎవరి స. గురించి వాళ్ళు డబ్బా కొట్టుకుందాం. మన స. లో మనం ఐక్యత పాటిద్దాం. ;)
ఈ ఉద్యమం పాలపొంగు లాంటిది.. త్వరగానే చాల్లరిపొతుంది :-))
అగ్రరాజ్యం లాంటి గోదావరి బ్లాగర్లను మీరు తట్టుకొలేరు :-))
అయినా అసలు మొత్తం ద కొ మీద మీ పల్నాడు వాళ్ళ జులం ఎమిటి అని ప్రశ్నిస్తున్నా ???????????
హా హా ప్రవీణ్...మరెందుకు ఆలస్యం...మీ బ్లా.సం మీరు పెట్టుకోండి...ఏ బ్లా.స లు వచ్చిన రేపటి సూర్యుడు మా ...ద.కొ.బ్లా.స
మంచు: "అగ్రరాజ్యం లాంటి గోదావరి బ్లాగర్లను మీరు తట్టుకొలేరు :-)) "
హా హా హా...ఇది మరింత హాస్యాస్పదం... మా ఎదుడుదల మీకు మింగుడు పడదు ... పల్నాడు దా.కో లో భాగమే...మాకు దా.కో మీదున్న గౌరవం అలాంటిది :-)
ఏందబ్బా ఈడ కోస్తా,గొదావరి అని జనాలు తెల నీలుగుతుండారు మా సీమ ముందు యాడికి ఇయన్నీ, ఏందప్పా సీమ నుంచి ఎవురైనా ఉండారా ఈడ లేకపోతే నన్నే సీమ సంఘం పెట్టి పెతాపం సూపించమంటారా?
వెంకట అన్నా...సీమ సంఘం పెట్టి పెతాపం సూపెట్టు అన్నా...ఇంకెందుకు లేటు..కానియ్యి...
మరి నేను ఏ సంఘం? పోనీ మావారిని పంపుదామా అంటే...విజయవాడలో పనిచేసిన అనుభవంతో గుంటూరు అమ్మాయితో వారిని మీరు సెటిల్ చేస్తే, కోస్తాలో పుట్టిన ఆయనగారి గాలి మళ్ళుతుందేమో జాగ్రత్తగా చూసుకోండి:):)
జై జై దకోబ్లాస, మాది గుంటూరు :-)
నన్ను కూడా చేర్చుకోండి, మాది గుంటూరు నడిబొడ్డు.
జై దక్షిణ కోస్తా బ్లాగర్ల సంఘం!
నేను వి.బ్లా.సా(విదేశీ బ్లాగర్ల సంఘం) పెడుతున్నా.బోలేడు మంది వస్తారు దీని లెక్కలోకి :). మా ఊరి నుండే నేను,నేస్తం గారు,శ్రావ్య గారు ఉన్నాము.
@ సాయి ప్రవీణ్ ,
నేను టపా చదవడం మొదలెట్టినప్పుడు అలా ఫీలు అవ్వలేదు గాని, కాసేపు అయ్యిన తరువాత టపా టైటిలే మర్చిపోయాను :) మాటి మాటికి ద.కో.బ్లా.స. అంటుంటే అలా అనిపించేసింది,
@ రామకృష్ణ గారు,
చక్కగా ఇంగిల్పీసులో అన్నా పిలుచుకోండి బాబు, మాటి మాటీకి అదే గుర్తుకు వస్తుంది ;)
>.పల్నాడు దా.కో లో భాగమే...మాకు దా.కో మీదున్న గౌరవం అలాంటిది :-) >>
ఇలా మళ్లీ దాకోడాలు , దొంగాటలు హేమిటీ మళ్లీ ?
కిషన్,శ్రీను ...కావాలంటే మా మెట్టినిల్లు..ఇంకా కావాలంటే మా వారిని కూడా మీరే తిసేసుకోండి.నేను మాత్రం మీ సంగం లో చేరని పొంది.అడిగి నాకు నాగార్జున ,శరత్ లాంటి పెద్దోల్ల పుల్లు సపోర్ట్ ఉందిగా. అయిన నేను ఇప్పుడు మద్రాస్ లో ఉంటున్న కాబట్టి ,నేను తెలుగు(తెలంగాణ...!!!!) బ్లాగార్లా సంగాని(తె.బ్లా.స) కి మద్దతు ఇస్తా.
సృజన గారు మీరూ మీ ఆయనా ఇద్దరూ రండి కావాలంటే ... అభ్యంతరం లేదు...మీ ఆయన గారు గాలి మళ్ళకుండా నేను చూసుకుంటా కాదా...రూములో ఫాన్ కూడా తెసేయిస్తా మీ ఆయన కోసం...అప్పుడు గాలే రాదు, ఇంకేం మళ్ళుతుంది :-))
పానిపూరి గారు...జై దకోబ్లాస...సంఘానికి సుస్వాగతం :-)
జే.బీ గారు...మీరు చేర్చుకోండి అని అడగటం ఏమిటండీ...జాయిన్ అయ్యి పోవడమే...జై దకోబ్లాస :-)
రిషి మీ ఇష్టం వచ్చిన సంఘం పెట్టుకోండి... దక్షిణ కోస్తా బ్లాగర్ల సంఘం ఒక శక్తిగా మారబోతుంది...ఇక దాని ముందు ఏ సంఘమైన దిగదుడుపే :-)
కృష్ణ: ఇంగ్లీష్ లో ఎందుకండీ...చక్కగా మనం తెలుగు వారము అయ్యి ఉంది..ఇంగ్లీష్ లో అయితే
కవిత: మీరు చేరకపోయినంత మాత్రాన మా సంఘం నిర్వీర్యం అయిపోదు...ఇంకా బలోపేతం అవుతుంది...ఎవరు ఎంత అనగదోక్కితే, అంత పైకి లేస్తుంది... జై దక్షిణ కోస్తా బ్లాగర్ల సంఘం :-)
నేను కోస్తా జిల్లా కాని ,,,,,,,,,,,,,,,,,,,,ఊ హు ,ఉహు ,ఉహు ..........నెనూ చేరత మీసంఘంలో ..........వా ...........................
100
Count Me In...
అజ్ఞాత: చేరే వాళ్ల కోసం ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి...మీరు మా దక్షిణ కోస్తా పరిధిలోకి వస్తారా లేదా అనేది మీరు మాకు చెప్పవలసిన అవసరం ఉంది :-)
హర్ష: వెల్కం :-))
అయ్యో కిషన్ గారు గోదావరి వాళ్ళు బలమైన బ్లాగ్గర్స్ అని మేమెప్పుడూ అనలేదు తెలుసా ... మీరే చెప్పకనే చెప్పారు ...
అవును మీరు దక్షిణ కోస్తా బ్లాగరా ?? ఇన్నాళ్ళు అరవ బ్లాగర్ అని అనుకుంటున్నాను సుమీ ?
పాపం కిషన్ గారు మా గోదవరి వాళ్ళకి ఏ సంఘం లేదు ... విడి విడీ గానే ఉన్నాము .. అలాంటిది మా మాకు యాంటీ గా ఇంత పెద్ద సంఘమా?
ప్చ్. మీలో ఓ బాల కృష్ణ ఉన్నాడనుకున్నానే
... మీ కష్టం చూస్తే మనసు తరుక్కుపోతుంది కిషన్ గారు.... పోనీ మీ సంఘం తరపున మమ్మల్ని ప్రచారంచేయమంటారా సార్ ?
సెంచురీ చేసినందుకు అందుకోండి నా అభినందనలు ...
అన్నట్టు చెప్పడం మర్చిపోయా మీ సంఘం అభివృద్ది చెందాలని ఆశీర్వదించిపెడతాము అక్షింతలు తెచ్చుకోండి (గోదావరి వాళ్ళది మంచి మనసు కదా వాళ్ళ ఆశీర్వాదం కూడ మంచి చేస్తుంది )
మాది నెల్లురు అండి
@శివరంజని గారు:
చిన్న పాము నైన పెద్ద కర్ర తొ కొట్తమన్నారు కదా!!
ఏమో హర్ష గారు నా కెందుకో మీ సంఘం founder మీద నాకు పే.....ద్ద డౌట్ గా ఉంది ... ఎందుకంటే గోదావరి బ్లాగ్గర్స్ లో వీలీనమయిపోవల్సి వస్తే ఆ లైన్ లో ఆయనే ముందుంటారు ..కావలిస్తే కిషన్ గారి పాత పోస్ట్ లు చదవండి
@శివరంజని గారు:
మీకు సంఘం లేకపొతే ఒక పని చెయ్యండి
మా సంఘం లొ చేరిపొండి
ఎలాగు ఐతే Begnal ని మొత్తం West Bengal అని పిలుస్తారో
అలగే కోస్తా మొత్తాన్ని దక్షిణ కోస్తా బ్లాగర్ల సంఘం గా పిలుచుకుందాం...
meeku eavru leru ani adhyrya padakandi..
mee antha manchi manasulu vunna Godavari vallu ante maku kooda abhimaname...
అంటే బ్లాగు లోకంలో గోదావరి వాళ్ళు, దక్షిణ కోస్తా వాళ్ళు తప్ప ఉత్తరకోస్తా వాళ్ళు లేరనా...ఇది అన్యాయం. మేము కూడా ఉత్తరకోస్తా సంఘం ఒకటి మొదలెడతాం
హర్ష గారు :అయ్యో మేము మీ సంఘం లో విలీనమవ్వడం కాదు కిషన్ గారే గోదావరి బ్లాగ్గర్స్ లో విలీనమయిపోతారని డౌట్ గా ఉంది …ఒక్కసారి ఆయన పాత పోస్ట్ లు చూడండి ... నా కెందుకో మీ సంఘం founder మీద నాకు పే.....ద్ద డౌట్ గా ఉంది ..గోదవరి వాళ్ళకి సంఘాలు ఎందుకు… మేము స్వతహాగా శాంతిపరులము , సహనశీలులము , మాకు బోలెడంత ఔదార్యం కూడ
మీరూ గోదావరి వాళ్ళు తప్ప ఉత్తర, దక్షిణ ఆంధ్రాలంటే నేనూ మీతో చేయి కలిపేదాన్ని. ఇప్పుడు దక్షిణ ఆంధ్ర మాత్రమే అంటునారు కాబట్టి మీకు మేము కొత్త పార్టీ పెట్టుకుంటాం
hahaha
meeru ma founder ke esaru pettesara direct ga...
adi antha Yuddam modalavvaka mundu ayyi vuntundi...
"స్వతహాగా శాంతిపరులము , సహనశీలులము , మాకు బోలెడంత ఔదార్యం కూడ"
ante thella janda choopisthunnara??
Ayna Okka sari Sye ante inka nye nye anna aaagdu ee viplavam
hahahaha
ఆ.సౌమ్య garu:
ee roju mee punyama ani appudeppuduoo cheddi lu vesukone time lo choosina andhra map ni malli ee roju choosanu andi
Meeru uttara kostha start chesthe, Godavari a Kostha kindaki vasthundi???
meeku vaddu ante Godavarii Dakshina Kosthalo kalipesukuntam..
already ma party abhyardhi ga @sivaranjani garu vunnaru...
hahahah
ఎవరెన్ని సంఘాలయినా పెట్టుకొండి.. మా గొదావరి జిల్లాల బ్లాగర్లకి సంఘాలంటే కస్టం...అంతమందిని మైంటైన్ చెయ్యాలంటే కస్టం... :-)))
చెప్పేకదా... రెండు గొదావరి జిల్లాల బ్లాగర్లు ఒక ఎత్తు.. మిగతా చిన్న చితకా సంఘాలన్ని (ద కొ ఉ కొ , సీమ, తెలంగాణ, హైదరబాద్, వగైరా ) కలిపి ఒక ఎత్తు.
From Bapatla!
Increase the count!
ప్రకాసం - విశాఖ మధ్యకాక పైనా, కిందా కోస్తాలకి మా వ్యూహాత్మక మద్దతు ఇస్తాం. ఇగ లడాయి షురూ చేయున్రి.
మురుగుకాల్వకుట్ల ముక్కుటేకర్ రావ్
రంజనీ ఇది మీకు యాంటీ సంఘం కాదు..కాకపోతే, బ్లాగర్లలో మా దక్షిణ కోస్తా వాళ్ళు కూడా మెజారిటీ అని బ్లాగు లోకానికి చేయ్యలనుకున్నాం...మా దక్షిణ కోస్తా కుర్రాళ్ళని, అమ్మాయిలని బ్లాగుల్లోకి ఆహ్వానించి వాళ్ళ వెలికి తీయాలని కూడా అనుకుంటున్నాం...ఆ విధంగా మా సంఘం అభివృద్ధి చేసుకుంటాం...అంతేకానీ మేము ఎవరికీ యాంటీ కాదు...పోటీ ఉన్నా అది ఆరోగ్యకరమైనదే...
సౌమ్య గారు...మీరు కూడా ఉత్తర కోస్తా పెట్టుకోండి..ఆల్ ద బెస్టు. :-))
హర్ష: బాగా చెప్పావు...ఈ సంఘం ఎదుగుదల ఎవరూ ఆపలేరు ...
తిరు: మీరు చెప్పినట్లు నాకు ఏమీ రాలేదు..అయినా చూస్తాను ప్రాబ్లం ఏమన్నా ఉందేమో అని ..
మంచు: మేమంతా ఒక ఎత్తు అని మీరు ఎన్ని ఎత్తులు వేసిన...ఉదయించే సూర్యుడిని ఆపగలరా..ఎగసిపడే కెరటానికి అడ్డు నిలవగాలరా..అదీ సంగతి..
లక్ష్మణ్: వెల్కం
మురుగుకాల్వకుట్ల ముక్కుటేకర్ రావ్ గారు హా హా హా ..భలే చెప్పారు..అయినా మీ ముక్కు ఎందుకు అలా గద్ద ముక్కు లా ఉంటుంది...హహ..అలాగే షురు జేస్తం..
హాయ్ మాది కడప మా గ్రూప్ ఏదో చెప్పడి
Post a Comment