Search This Blog

Monday, 20 September, 2010

ద.కో.బ్లా.స సభ్యులు

ద.కో.బ్లా.స కి వచ్చిన అనూహ్యమయిన స్పందనకి చాలా ఆనందంగా ఉంది...ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు..ముఖ్యంగా ఒంగోలు శీనుగారి సహకారం, సపోర్ట్ అభినందనీయం. ఇకపోతే ఈ సంఘంలో సభ్యులు ఎవరెవరు అన్నది తేట తెల్లం చెయ్యడానికే ఈ టపా.

మునుపు రాసిన టపా ప్రకారం ఈ క్రింది లిస్టులో ఉన్నా బ్లాగర్లు  ద.కో.బ్లా.స కి చెందినట్లుగా భావిస్తున్నాం.

1. కోట్ల రామకృష్ణ రెడ్డి. (పల్నాడు - మాచెర్ల) 
2. ఒంగోలు శీను (ఒంగోలు)
3. అను (గుంటూరు జిల్లా)
4. తార (మీ పదవి గ్యారెంటీ లెండి ;-) ) (ప్రకాశం)
5. భాస్కరరామి రెడ్డి (ప్రకాశం)
6. మలక్ పేట రౌడీ (వీరు సభ్యత్వాన్ని అంగీకరించాల్సి ఉంది :-) ) (ప్రకాశం)
7. దుర్గేశ్వర (వినుకొండ...గుంటూరు జిల్లా)
8. సుజాత (నరసరావు పేట, గుంటూరు జిల్లా)
9. సిరిసిరి మువ్వ (ఏవండీ మీ చెప్పండీ..) (గుంటూరు జిల్లా)
10. సునీత (గుంటూరు)
జయదేవ్ చల్లా)
21. వేణూ శ్రీకాంత్ (వీరు సభ్యత్వాన్ని అంగీకరించాల్సి ఉంది ) (గుంటూరు జిల్లా )
22. తాడేపల్లి  (బాపట్ల..గుంటూరు జిల్లా)
23. వీకెండు పొలిటీషియన్ (బాపట్ల...గుంటూరు జిల్లా)
24. కౌటిల్య (ప్రకాశం)
25. కొండముది సాయికిరణ్ కుమార్ (గుంటూరు)

ఇది ఇప్పటిదాకా తేలిన లిస్టు (మునుపటి టపా ప్రకారం). ఈ లిస్టు ఇంకా చాలా పెద్దది అని నాకు తెలుసు. మన ద.కో.బ్లా.స బ్లాగర్లు ఇంకా చాలా మందే ఉండి ఉంటారు. పై లిస్టులోని బ్లాగర్లలో జిల్లాల వారీగా వివరాలు ఇలా ఉన్నాయి:
గుంటూరు జిల్లా : 18
ప్రకాశం జిల్లా     :  5
నెల్లూరు జిల్లా    :  2  

ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి ఇంకా చాలా మంది బ్లాగర్లకి ఈ సంఘం గురుంచి తెలియకపోయి ఉండొచ్చు, కనుక వారి పేర్లు మీకు తెలిసినట్లయితే ఇక్కడ పేర్కొనవచ్చు. ఈ టపా తో ఈ లిస్టు మాలీ డబల్ అవుతుందని ఆశాభావంతో ఉన్నాను. పై లిస్టులో పేర్కొన్న సభ్యులు ఇంకా తమకి తెలిసిన దక్షిణ కోస్తా బ్లాగర్ల వివరాలు అందిస్తారని ఆశిస్తున్నాను.

Note: The above list will be updated regularly as and when new members join the association.

40 comments:

HarshaBharath said...

Sir,
Valla valla Blogs kooda links icchi vunte chala bagundedi..
:)

శివరంజని said...

కిషన్ గారు మీరు ఆ పక్కన పెట్టిన త్రాసు లో గోదావారి వాళ్ళు వచ్చి ఒక వచ్చి ఒక తులసీదళం వేస్తే చాలు ...ఏమంటారు

Anonymous said...

ఈకెండు పొలిటీషియన్ దీ బాపట్లే అని ప్రొఫైల్లో ఉంది.

కవిత said...

Only 20..he he he he.Just kidding.Pogesukondi ,pogesukondi.

Sujata said...

హ హా హా ! అదేదో ఐ.కా.స. లా వుంది.

మనసు పలికే said...

కిషన్ గారు, బాగుందండీ మీ ద.కో.బ్లా.స :)) ఆ...ఆ.. తొందర పడకండి. నేను మీ సంఘం లో చేరడానికి అర్హురాలిని కాను లెండి..అదే నాది దక్షిణ కోస్తా కాదు అని చెబుతున్నాను..:)
మొత్తానికి చాలా బలమైన పటిష్ఠమైన సంఘాన్ని ఏర్పరచుకున్నారన్నమాట..:)అభినందనలు..

తార said...

ద.కో.బ్లా.స. వర్ధిల్లాలి

కవిత said...

trasulo em lekuntane thukam vestunnara???Entha goppavallandi...

కౌటిల్య said...

రెడ్డిగారూ, నేనూ ఈ సంఘంలోకే వస్తా..పుట్టి పెరిగింది ప్రకాశం....చాన్నాళ్ళనుంచి పెరుగుతుంది మాత్రం గుంటూరే...నన్నూ కలుపుకుంటారుగా..:-)....

sunita said...

Guntur zilla kaadu.Guntur paTtaNamae maadi.

astrojoyd said...

my name is jayadev.challa.

సుజాత said...

సుజాత(గుంటూరు జిల్లా) అని గాదబ్బా రాసేది! సుజాత, నరసరావు పేట, గుంటూరు జిల్లా అనిగదా! మాచెర్ల మా మేనత్త వాళ్ల వూరే కాబట్టి ఆ లెక్కన గూడా మనకేం పర్లా!

కౌటిల్యా, ఇంకా పెరుగుతూనే ఉన్నారా ?డాక్టర్ గారైపోయాక కూడా!

Ramakrishna Reddy Kotla said...

హర్ష: లింక్స్ అప్డేట్ చేస్తాను.

రంజనీ: వెయ్యండి వచ్చి చూద్దాం :-))...మీకు మాకూ మధ్య తులసీ దళం వేసినా భగ్గుమంటుంది.. హా హా :-))

అజ్ఞాత: ఇంకేం పొలిటీషియన్ గారిని కూడా కలిపేద్దాం ..

Ramakrishna Reddy Kotla said...

కవిత గారు పోగేసుకుంటాం...మీరేం వర్రీ కాకండి...

సుజాత గారు అలాగే అనుకోండి..

అపర్ణ గారు, మీది ఏ ఊరు??

తార: మీలాంటి వాళ్ళే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి .. :-))

Ramakrishna Reddy Kotla said...

కౌటిల్య గారు...సాదరంగా ఆహ్వానిస్తున్నాం..

సునీతా గారు, గుంటూరు పట్టణం కూడా గుంటూరు జిల్లానే కదండీ..హా హా..అలాగే అప్డేట్ చేస్తాను :-)

జయదేవ్ గారు ధన్యవాదాలు ..

సుజాత గారు అట్టాగంటారా...అట్టాగే అట్టాగే..ఓ మీ మేనత్త గారిది మా ఊరినా..మంచిది..

Weekend Politician said...

కొంపదీసి, ఇది మన రాష్ట్ర సాధనకి తొలి అడుగు కాదుగదా!
రామక్రిష్ణా రెడ్డి గారూ, ఎందుకైనా మంచిది ఈ నెల్లూరోళ్ళ మీదా ఒంగోలోళ్ళ మీదా ఒక కన్నేసి పెట్టండి.
రేపెవరైనా గ్రే.రా.సీ.బ్లా.స పెడితే...
ఒక పని చేసేద్దాం కీలక మైన పదవుల్లో వీళ్ళనే పెట్టేస్తే ఇక మనకి దిగులుండదు :-)

మనసు పలికే said...

హ్మ్.. మా ఊరు భద్రాచలం లెండి. ఎవరైనా ఆ ఊరు / జిల్లా / ప్రాంతం నుండి వచ్చిన వాళ్లు ఒక సంఘం పెడితే అప్పుడు జాయిన్ అయిపోతాను.. :))))

కౌటిల్య said...

@రెడ్డిగారు..
ధన్యవాదాలు...

@సుజాత గారు,
డాక్టర్ అయ్యాక ఇంక పెరగకూడదంటే ఎలా అండీ! పెరిగి ఇంకా పెద్ద డాక్టర్ అవ్వాలిగా!

మంచు said...

7. తెలుగోడు
16. అబ్రకదబ్ర
ఒక్కరు కాదా????
ఎంటి ఇంతా చెస్తే వచ్చినొళ్ళు 20 మంది... ఇరవై మందితొ సంఘం ఎమిటి..

శివరంజని.. మనం తులసిదళం వెయ్యక్ర్లేదు... నెంబర్ వన్ లొ రాసుకున్న కోట్ల రామకృష్ణ రెడ్డి గారే రెపొ మాపొ గొదావరి అమ్మయిని చేసుకుని ఆయనే వెసేలా ఉన్నాడు ఆ తులసి దళం ... నువ్వు చెప్పినట్టు ఆ గ్రూప్ లొనుండి ముందు జంప్ అయ్యేది తనే :-)))

Anonymous said...

కలగూరగంపకూడా గుంటూరు బ్లాగేనని విన్నాను.

Ramakrishna Reddy Kotla said...

పొలిటీషియన్ గారు అట్టాగే చేద్దాం..మీరు చెప్పిన ఐడియా బాగుంది...కీలిక పదవులు వాళ్ళకే లెండి..

అపర్ణ గారు, మీరలా ఫిక్స్ అయిపోండి.. :-)

మంచు, ఇద్దరూ ఒక్కరే అని ఇందాకే తెలిసింది..మారుస్తాను...మీరు శివరంజనికి ఇచ్చిన కామెంట్ మీద నా కామెంట్ : నో కామెంట్ :-)

అజ్ఞాత: అయాన్ని కూడా జాయిన్ చేసేద్దాం :-)

Weekend Politician said...

మలక్కూ, ఒంగోలు శీనూ, భ రా రే మన సంఘం లో వున్నారంటే మాలికా మనదే, హారం కూడా మనదే!!

ఇంక దంచుడే దంచుడు.. :-)

Sai Praveen said...

ఈ గోల ఇంకా నడుస్తూనే ఉందా....

JB - జేబి said...

సునీతగారూ, ఎంతమాటన్నారు! గుంటూరు పట్టణం అంటారా? మనది నగరమండీ! తాడేపల్లిగారి ప్రకారమైతే మహానగరం :-)

కొండముది సాయికిరణ్ కుమార్ said...

Me too from Guntur :))

శివరంజని said...

కిషన్ గారు..మీరు ఆ పక్కన పెట్టిన త్రాసు చూసి శ్రీ కృష్ణ తులాభారం గుర్తుకొచ్చింది ... కృష్ణుడి లా మీ ద.కో.బ్లా స అంతా గోదావరి వాళ్ళ బలానికి తేలిపోతారేమో అనుకుంటున్నా....ఏమంటారు మంచు గారు

durgeswara said...

taadepalligaaridi bapatla area

naadi vinukonda

Ramakrishna Reddy Kotla said...

Post updated with new members and stats as per districts.

Anonymous said...

మహానగరమైన బెజవాడ పక్కనే ఉండడం మూలాన గుంటూరు సంగతి ఎవరూ పట్టించుకోవడం లేదు గానీ

ఎనిమిది లక్షల జనాభా
100 చదరపు కిలోమీటర్ల ఏరియా
300 కోట్ల బడ్జెట్ గల మునిసిపల్ కార్పొరేషను
ఏడాదికి వెయ్యికోట్ల ఎగుమతి వ్యాపారాలూ
మూడు రైల్వే స్టేషన్లు
30 సినిమాహాళ్ళూ
విశ్వవిద్యాలయం
50 కాలేజీలూ
లెక్కలేనన్ని పోష్ హాస్పిటళ్ళూ, లగ్జరీ హోటళ్ళూ

కలిగిన గుంటూరు,
పట్టణం ఎలా అవుతుంది ? ప్రస్తుతానికి మహానగరం కాకపోయినా ఇంకో ఇరవై-ముప్ఫై ఏళ్ళ తరువాత అయినా తప్పకుండా అవుతుందని ఆశిస్తాను. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం పదిలక్షల జనాభా దాటిన ప్రతి ఊరూ మహానగరమే,

PRADEEP said...

k we r waiting for kitt story

వేణూ శ్రీకాంత్ said...

హ హ సీరియస్ గానే కలెక్ట్ చేసి లిస్ట్ పెట్టారు కదా :) అలాగే నా సభ్యత్వాన్ని కూడా ఖరారు చేసుకోండి.

అన్నట్లు ఈ క్రింది బ్లాగర్లని కూడా కలిపేస్కోవచ్చు...
గీతాచార్య గారు (గుంటూరు)
నాన్న, నలభీమ బ్లాగర్ భాస్కర రామరాజు గారు (గుంటూరు)
ఊకదంపుడు బ్లాగర్ (గుంటూరే అనుకుంటా)
వెన్నెలసంతకం బ్లాగర్ ఇందు గారు (గుంటూరు)
చదువరి బ్లాగర్ గారు కూడా గుంటూరు జిల్లానే అని ఎపుడో అన్నట్లు గుర్తు.
ఇంకా DR Ram అని ఒకరు ఉండాలి ఇప్పుడు రాస్తున్నారో లేదో..

3g said...

ద.కో.బ్లా.స. వర్ధిల్లాలి.

సిరిసిరిమువ్వ said...

సిరిసిరిమువ్వ: ఈతేరు..గుంటూరు జిల్లా
శిరీష్ కుమార్(చదువరి): కావూరు..గుంటూరు జిల్లా
తాడేపల్లి:మర్రిపూడి(మా ఊరు పక్కే) గుంటూరు జిల్లా
గుంటూరు వాళ్ళు ఇంకా చాలామందే ఉండాలి..చూసి చెప్తాను.

ఇందు said...

నేను ఉన్నానండీ....మాది గుంటూరు నగరమే...

కొత్త పాళీ said...

@ శివరంజని .. కేక!

బ్లాగువోన్రు గారికి విన్నపం - కామెంటాలన్నప్పుడల్లా ఏంటేంటో వ్యాపార ప్రకటనల పాప్-అప్ లు వస్తున్నై. కాస్త వాటిని తగ్గించే ప్రయత్నం చెయ్యండి.

రావి సురేష్ said...

నాదీ గుంటూర్ జిల్లా, రేపల్లె

Manju said...

అయ్యొ మాది గుంటూరు జిల్లా నే..నన్ను కూడా చేర్చుకోండి సంఘం లొ..
పేరు :మంజు
భ్లొగ్:నా అందమైన ప్రపంచం(HttP://nenu-naa-prapancham.blogspot.com)

Mauli said...

mAdi koodA Guntur zillA :)

Sasidhar Anne said...

Maadi guntur andi.. :) nannu kooda add chesukondi.

చాతకం said...

అహ మాది గుంటూరే, మీది గుంటూరే. ఈ గురవయ్య హైస్కూల్లో చదువుకున్న పసి బ్లాగర్ని గూడా చేర్చుకోండి.;)