Search This Blog

Tuesday, 23 November, 2010

ఎన్నాళ్ళో వేచిన ఉదయం .....

అర్థరాత్రి 12 గంటలు...
హౌరా  మెయిల్ గంటకి అరవై మైళ్ళ వేగంతో దూసుకుపోతుంది party....
అతనికి నిద్ర పట్టలేదు... బెర్తు మీద అసహనంగా కదులుతున్నాడు  d'oh...
ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని అతనికి ఆత్రంగా ఉంది ...నిద్రపట్టినా బాగుండు, త్వరగా తెల్లవారిపోద్ది అనుకుని వృధాప్రయత్నం చేసి, ఇక లాభం లేదని బెర్త్ మీద నుంచి దిగి వచ్చి, అలా కంపార్టుమెంటు కిటికీ దెగ్గర నిల్చున్నాడు ... రివ్వున వీచే గాలికి అతని క్రాఫ్ లయబద్ధంగా కదులుతుంది ... చుకు-బుకు తాళం వేస్తూ చక చక వెళ్ళే రైలు సంగీతం అతని మదిని తియ్యగా మీటుతుంది... అప్పుడు అతని హృదయం ఇలా పాడుకుంది ...
"ఎన్నాళ్ళో వేచిన ఉదయం ... ఈనాడే ఎదురవుతుంటే... ఇన్నినాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే...  ఇంకా తెలవారదేమీ, ఈ చీకటి విడిపోదేమీ..."day dreaming 

                                                                *****

ఉదయం
రాజమండ్రి రైల్వే స్టేషన్....
అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో చిన్న అలజడి.. 
కోనేటిలో స్నానమాడిన ప్రకృతి కాంత, వయ్యారంగా నడుచుకుంటూ వెళ్తుంటే తుళ్ళిపడే నీటి బిందువులలా.. సన్నగా ఆకాశం నుండి చినుకులు...
సన్నగా వీచే చల్లగాలికి చెట్టు కొమ్మలు ఊగుతూ నాట్యమాడుతున్నాయి...
ఆరేళ్ళ తరువాత రాబోతున్న తమ ఆత్మీయ అతిధికి స్వాగతం చెప్పడానికి అక్కడి పంచభూతాలూ ఎదురుచూస్తున్నాయి...

ఇంతలో పెద్ద కూత పెట్టుకుంటూ ప్లాట్ ఫారం మీదకి వచ్చేస్తుంది హౌరా మెయిల్ ....
అతను బ్యాగ్ పట్టుకొని, విండో దెగ్గర నిల్చొని ... అతని హృదయానికి ఎంతో దెగ్గరైన ఆ స్టేషన్ ని అబ్బురంగా చూస్తున్నాడు ....
"రావయ్యా ... రావయ్యా ... రామసక్కని రామయ్యా ...." అంటూ గానమాలపించింది అక్కడి పిల్లగాలి ....
అతను ప్లాట్ ఫారం మీద అడుగుపెట్టగానే ... అతని తనువు పులకరించింది ...అక్కడి పంచభూతాలూ అతన్ని పలకరించినట్లపించింది.. ప్రేమగా 'ఎన్నాళ్ళయింది నిన్ను చూసి' అని కౌగలించికున్నట్లనిపించింది... ఎదో కొత్త ఉత్సాహం, ఉద్వేగం అతనిలో జవజీవాలు నింపుతున్నాయి ...

అలా ఒక్కో అడుగు చూసుకుంటూ... ఆప్యాయంగా ఆ ప్రదేశాన్ని తడుముకుంటూ నడవసాగాడు ...
స్టేషన్ బయటకి వచ్చి ఒక్కసారి అటూ ఇటూ కలయజూశాడు ... పరిచయమున్న ఊరు ... పరిచయమున్న స్టేషన్ ... పరిచయమున్న గాలి ... పరిచయమున్న స్పందన ... అతనికి ప్రతి ఒక్కటీ సుపరిచితమే .... 

పదేళ్ళ క్రితం ఇంజినీరింగ్ చదవడానికి వచ్చాడు అతను రాజమండ్రికి ... ఆరేళ్ళ క్రితం ఆ ఊరు విడిచి వెళ్లిపోయాడు అశ్రునయనాలతో ... అతనికి ఆ ఊరంటే ఎంతో మమకారం.. పుట్టి పెరిగిన ఊరికంటే ఎంతో ఇష్టం ... అలాంటి ఊరిని మరలా ఆరేళ్ళ తరువాత చూడటం... అక్కడ ఉన్న ప్రతి నిముషాన్ని ఆస్వాదించి పదిలపరచుకోవాలని తపన పడటం .. అతన్ని ఎంతో ఉద్వేగానికి గురిచేస్తుంది ....ఆ గాలిలో అదే ఆత్మీయత...ఆ మట్టిలో అదే ఆదరణ..ఆ నీటిలో అదే తియ్యదనం... అవును రాజమండ్రి, పెద్దగా ఏమీ మారలేదు అనుకున్నాడు .... అతనికి ఒక్కసారిగా అతను అప్పటి అతను కాదేమో, ఇంకా ఇంజినీరింగ్ కుర్రాడినేమో అనిపించింది.. ఆ ఊహ నిజమయితే ఎంత బాగుందో అనిపించింది .. కాలం మళ్ళీ గిర్రున వెనక్కి తిరిగిపోతే బాగుండు అనుకున్నాడు ... ఆ క్షణం అప్రయత్నంగా అతని కళ్ళు చెమ్మగిల్లాయి sad...

అతని స్నేహితులని కలుసుకొని, మళ్ళీ ఒక ఇంజినీరింగ్ స్టూడెంట్ లా అతను సంతోషంగా గడిపాడు ఆ రోజు సాయంత్రందాకా  party..

ముందుగా .... గౌతమీ ఘాట్ దెగ్గరి ఇస్కాన్ టెంపుల్ కి వెళ్లారు happy:

బాగుంది కదా .... టెంపుల్ లోపల పాపం ఫోటోలు తియ్యనివ్వలేదు ఆ అబ్బాయిని ...పాపం ...sad

కృష్ణుడి ప్రక్కన ఆ అబ్బాయి batting eyelashes :ఆ తరువాత, గౌతమీ ఘాట్ దెగ్గర, గౌతమీ మహర్షి పక్కన మన హీరో :-) (పాపం గౌతమీ మహర్షి తల ఎగరగొట్టేశాడు నా ప్రాణ మిత్రుడు winking )


ఆ తరువాత ఆకలేసి, కోటిపల్లి బస్టాండు దెగ్గర ఓ హోటలులో ఆత్మారాముణ్ణి శాంతపరచి మరలా ఊరి మీద పడ్డారు..

ధవళేశ్వరం వెళ్లారు.. అక్కడి కొన్ని చిత్రాలు:

కాటన్  దొర పక్కన ఆ బేవార్స్ big grin :

ఆ తరువాత ఓ ఎదవ మొహం ఏసుకొని నిల్చున్నాడు చూడండి ... ఏంట్రా ఆ ఫేస్ ఏంట్రాtime out...


ధవళేశ్వరం బ్యారేజ్ మీద కూర్చొని ఉన్న హీరో(ఎందుకు బాబూ అంత సీరియస్, నవ్వితే రాత్నలేమీ రాలిపోవులే tongue....)
ధవళేశ్వరం బ్యారేజ్ (కుడోస్ టు కాటన్ దొర)

ఇక, ఆ తరువాత అక్కడ ఉన్న కాటన్ మ్యూజియంకి బైల్దేరాడు ఆ అబ్బాయి ....

మ్యూజియం మూడింటికి కానీ తెరవను అని అక్కడి గార్డు భీష్మించుకొని కూర్చుండటంతో హీరోకి ఏమీ పెరుగు పోక sad ( ఎప్పుడూ పాలేనా?.. ఈసారికి పెరుగు పోనిద్దాం)... ఎలాగయినా మ్యుజియం చూడాలనే సంకల్పంతో coolకాసేపు అక్కడే తచ్చట్లాడి, ఓ రెండు ఫోటోలు లాగి.... అవి ఏంటంటే:

నో  పార్కింగ్ దెగ్గర పార్క్ అయిన పౌర రత్నం   straight face :ఇదేదో భూత్ బంగళాలా భలే ఉందని devil ,ఒకటి లాగాడు... కెమెరాని...

ఆ తరువాత ఆ గార్డ్ కరుణించి గేట్ ఓపెన్ చెయ్యడంతో ఫ్రెండ్స్ తో కలిసి మ్యూజియం లోపలికి వెళ్లాడు ... అంత సేపు వెయిట్ చేసినందుకు లోపల ఉన్నవి కొన్ని కాటన్ చిత్రాలు, బ్యారేజు కడుతున్నప్పటి ఫోటోలు మాత్రమే... అంతే నిరాశ కలిగిన మన హీరో ... "అంతేనా, ఇంకేమీ ఉండవా ఈ మ్యుజియంలో..." అని అడిగాడు అక్కడి గార్డుని.
"అంతే... నువ్వు కొన్న రెండు రూపాయల టిక్కెట్టుకి ఇంకా ఏమి కావలేంటి .... వెళ్ళండి ... అలా వెనక్కి వెళ్తే పార్క్ ఉంటుంది ...అక్కడికి వెళ్లి కాసేపు ఆడుకొండి.." అన్నాడు crying...
ఆ మాటని స్పూర్తిగా తీసుకున్న మన హీరో, ఆ పార్క్ లోకి వెళ్లి, ఇలా ఉయ్యాల ఆట ఆడుకున్నాడు tongue:
అక్కడ కాసేపు ఉయ్యాలా జంపాల ఆడుకున్నాక, ఇక బైల్దేరారు అక్కడినుంచి.
సాయంత్రం అన్నవరం పెళ్ళికి వెళ్ళాల్సి ఉండటంతో ఆ అబ్బాయి కాంప్లెక్స్ కి వచ్చి బస్ ఎక్కాడు ... ఆ కాంప్లెక్స్ చూడగానే, అతనిలో పాత జ్ఞాపకాలు ఎన్నెన్నో బయటపడ్డాయి ... ఇంజినీరింగ్ లో ఉన్నప్పుడు రోజూ కాంప్లెక్స్ వచ్చే బస్ ఎక్కేవాడు ఆ అబ్బాయి... అలా నాలుగు సంవత్సరాల అనుబంధం ఉంది ఆ కాంప్లెక్స్ తో ఆ అబ్బాయికి... ప్రాణ స్నేహితుడిని కలిసిన ఫీలింగ్ కలిగింది ఆ కాంప్లెక్స్ ని చూసేసరికి ఆ అబ్బాయికి ....

బస్ ఎక్కి అన్నవరం బైల్దేరుతుండగా .... అతను నాలుగు సంవత్సరాలు చదివిన కాలేజీ కనిపించింది ... అదే గోదావరి ఇంజినీరింగ్ కాలేజ్ ... వెంటనే ఓ క్లిక్కు క్లిక్కాడు ఇలా ...
ఆ తర్వాత అన్నవరం వెళ్లేసరికి, రాత్రి ఎనిమిది అయ్యింది ....
ఆ రాత్రి పూట లైటింగులో అన్నవరం దేవస్థానం ఇలా ఉంది :

ఇక ఆ తర్వాత అక్కడ కజిన్ మ్యారేజీ చూసుకొని, మళ్ళీ అరవ దేశానికి తిరిగి వచ్చాడు .... ఇంతకీ ఆ అబ్బాయి ఎవరంటారు??... ఆ ఎవరో గొంకిస్కా గొట్టం మనకెందుకు అంటారా.. అట్లాగే కానివ్వండి


Note: All the photos are captured with my N96. :-). Thanks to my cutie phone :-)

29 comments:

కృష్ణప్రియ said...

:-)) చాలా బాగుంది.. నేనూ వాడతానిక.. 'పెరుగు పోకలు '

sunita said...

abbaayevaroe gurtupaTTaamu lenDi. chakkagaa kajin marriage, old college visit with friends enjoy chaesaaru. phoToe + captions baagunnaayi mee sTailloe:-)

సుభద్ర said...

kishan,
starting lone naaku telisi poyindi rjmy vachchedi evaro...chalaa baagundi..

manasa said...

"హౌరా మెయిలు" "12 గంటలు" ఇలాంటివి చూసి మరలా ఏదో సస్పెన్స్ కధ అనుకున్నా..బాగున్నాయి రాజమండ్రీ ఫొటోలు.పార్కులో ఉయ్యాలేనా ఇంకా జారుడు బండల్లంటివి ఏమయినా జారావా లేదా?

కవిత said...

Photos bagunnayi...enti konni photos kaki ethukellindi anukunta.check chesukondi.Ayina inka ennallila friends pellillu chestharu??

Anonymous said...

ఏంటి అన్నాయ్, అన్ని ఫొటోల్లో సేం ఫోజు పెట్టావు , కొంచెం ఫోజు మార్చవచ్చు కదా

నేస్తం said...

అసలు ట్రైన్ గోదావరి బ్రిడ్జ్ మీదకు రాగానే నానోటినుండి అప్రయత్నం గా ఒక పాట వస్తుంది వేదం లా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి ..శతాబ్ధాల చరితగల సుందర నగరం ..గతవైభవ దీప్తులకిది కమ్మని కావ్యం .. అని..
తెల్లవాజామున బిర్డ్జ్ దాటుతూ ట్రైన్ చేసే శబ్ధాలు.. చలికి వణుకుతూ ఇంకా పాత పద్దతులు మర్చిపోలేని వాళ్ళు రూపాయి నాణాన్ని కిటికీ నుండి విసురుతూ దణ్ణం పెట్టుకోవడం.. ఇవన్నీ ఎందుకు వర్షంలో తడిచిన రాజమండ్రి ఎంత బాగుంటుంది ...
ఏంటో కిషన్ అన్నీ గుర్తు చేసావ్

3g said...

Good Post Kishan, మీపోస్టు చదివి నేనూ ఒకసారి ప్లాష్ బాక్ లోకెళ్ళొచ్చా.

అవునూ మీరెప్పుడైనా ట్రైనుమీద పాతబ్రిడ్జిమీదనుండి వెళ్ళారా....... ఆ బ్రీడ్జి మూసెయ్యటానికి కొద్దిరోజుల ముందు వెళ్ళాన్నేను. గుమ్మంముందు నించొని గోదాట్లోకి చూస్తే ఉంటుంది... ఆ సౌండుకి, సైడ్ రైల్స్ అడ్డు లేకుండా కనిపించే గోదారినీళ్ళకి ఆహ్.... పెద్ద జయింట్ వీల్ ఎక్కినా ఆ థ్రిల్లింగ్ రాదు.

Anonymous said...

Very nice photos and description. Maadi rjy ne, but am in London now. maa ooru malli naku gurthu chesinanduku thanks

Ramakrishna Reddy Kotla said...

కృష్ణప్రియ: ఇంకెందుకు ఆలస్యం, వాడేయ్యండి ఏమీ పెరుగు పోకపోతే :-)

సునీత:గుర్తుపట్టారా? మీరు మహా తెలివైనవారు సుమీ, ఎంతైనా మా గుంటూరు కదా :-). యా ఎంజాయ్ చేశా.. థాంక్స్ సునీత :-)

సుభద్ర: మీకు స్టార్టింగులోనే తెలిసిపోయిందా.. మీరు ఇంకా సూపరు.. :-)) థాంక్స్

Ramakrishna Reddy Kotla said...

మానస: పార్కులో ఉయ్యాలే కాదు, అన్ని ఆడాము... కానీ అవన్ని ఫోటోలు పెడితే, అడవిబండలా ఉన్నాడు ఇంకా జారుడుబండ ఆడుకుంటున్నాడు చూడు అని నా మీద దాడులు జరుగుతాయని ఆగిపోయాను...

కవిత: కాకి ఎత్తుకుపోలేదు... నీ కంప్యూటర్ మింగేసిందేమో చూడు ... ఎంత కాలం ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు చేస్తావు అంతే, ఏంటి నీ మీనింగు ... ఇక నీకు పెళ్ళెప్పుడు అవ్వుద్దిరా అనే కదా ... చూస్తున్నా చూస్తున్నా ...

అజ్ఞాత: అన్నాయ్, నాకు పెద్దగా పోజులు పెట్టడం రాదన్నాయ్ ... ఎదో నా రేంజ్ లో ట్రై చేశా :-)

Ramakrishna Reddy Kotla said...

నేస్తం, మీకే కాదు నాకు కూడా గోదావరి బ్రిడ్జ్ మీద రైలు వెళ్తుంటే ఆ పాట ఖచ్చితంగా గుర్తొస్తుంది ..నేను కూడా రూపాయ నాణాలు వేసాను మొదట్లో.. మీకు కూడా మీ జ్ఞాపకాలు గుర్తుచేసినందుకు నేను హ్యాపీ :-)

త్రీజీ:థాంక్స్ ... నేను ఆ పాత బ్రిడ్జ్ మీద వెళ్ళేప్పుడు ఎప్పుడూ చూడలేదు .. నేను రాజమండ్రీలో చదివుతున్నప్పుడు కూడా రైలు కొత్త బ్రిడ్జ్ మీది నుంచే వెళ్ళేది ... సో అది మిస్ అయ్యాను అనమాట.

అజ్ఞాత: చాలా థాంక్స్...

చిన్ని said...

ఇదేదో సస్పెన్సే సీరియల్ అనుకున్నాను నేను .:-) బొమ్మలతో కథ చక్కగా చెప్పేశారు ..కాటన్ దొరని గోదారినికాలేజిని చక్కగా చూపించారు .బాగుంది .

Ramakrishna Reddy Kotla said...

చిన్ని మీరు కూడా అలాగే అనుకున్నారా .. మనం స్టార్ట్ చెయ్యడం అలా చేస్తాంలే.. టపా నచ్చినందుకు చాలా థాంక్స్ :-)

Sai Praveen said...

ఎంత బాగా రాసావు బాస్. నేను మా ఊరు చూసి సంవత్సరమున్నర అవుతోంది. వెళ్ళినప్పుడు నాకు ఇలాగే ఉంటుందేమో :)
ఇంటికి వెళ్ళిన ప్రతి సారి ఏదో ఒక రోజు సాయంత్రం మా కాలేజికి వెళ్లి కాసేపు ఉండి వస్తాను నేను.

Ramakrishna Reddy Kotla said...

Thanks a lot Praveen. So eppudu velthunnav mari me ooriki.. apudu neeku ela anipinchindi naaku cheppali.. sarena.. :-)

ఇందు said...

కిషంగారు...కొంచెం ఆలస్యంగా కామెంటుతున్నా...బాగుంది మీ టపా.'నేను'అని చెప్పకుండ.. కథ మొత్తం ఎవరిగురించో చెపినట్లు చెపి ఫొటోలు పెట్టి భలె వ్రాసారు.నైస్ ఐడియా.మా చందుగారిది కూడా రాజమండ్రేనండీ...మీ ఫొటోలన్ని తనకి చూపించా...మళ్ళి తన ఊరు చూసినందుకు చాల హాపీ గ ఫీల్ అయ్యారు :)

Ramakrishna Reddy Kotla said...

ఇందు థాంక్స్ :-). నన్ను గారు అనకు ఎందుకంటే, నేను నిన్ను ఇందు అంటున్నా కాబట్టి ... ఈ గార్లు గీర్లు ఎందుకు చెప్పు .. మనం మనం గుంటూరు వాళ్ళం :-))... చందు గారిది రాజమండ్రీనా... గుడ్ .. తనకి చూపించారనమాట .. థాంక్స్ :-)

శివరంజని said...

కిషన్ గారు లేట్ గా పెడుతున్నాను కామెంట్.... సారీ ...

మీకు రాజమండ్రి తో ఉన్న అనుబంధాన్ని చాలా చక్కగా వివరించారు ..మా గోదావరి అంటే ఏమనుకున్నారు???? ....

కవిత మాటే నాదీను..... ఇలా పెళ్ళిళ్ళు చేస్తూ పంతులు గారు లా ఉండకుండా త్వరగా సుస్మితా కి ఓ మాట చెప్పేయండి మరి ... అయ్యో అలా భుజాలు తడుముకోవద్దు సార్ .. నేను మాట్లాడేది మీ గురించి కాదు ....అదేనండీ బాబు కిట్టి గాడూ లవ్స్ ఎదురింటి అమ్మాయి స్టోరీ గురించి నేను మాట్లాడేది.... నెక్ష్ట్ పార్ట్ ఎప్పుడు సార్ అని అడుగుతున్నా


@ కవిత : బైక్ నేర్చుకుంటూ బ్లాగ్ ని మర్చిపోయారా అస్సలు జాడ లేదు...

Ramakrishna Reddy Kotla said...

థాంక్స్ రంజని.. కిట్టిగాడి పోస్ట్ త్వరలోనే రాస్తాను :-)

divya vani said...

bagunnay kishan gaaru photos...rajamandry kuda

Ramakrishna Reddy Kotla said...

థాంక్స్ దివ్య... ఏంటి చాలా రోజుల తరువాత కనిపించారు? బాగా బిజీనా?..

divya vani said...

baga kadu kani koncham busy ne anduke....

meeru kittigadi post eppudu rastaru....

Ramakrishna Reddy Kotla said...

Yes divya, will post the next part of kittu in a day or two. :)

kavita said...

కృష్ణ గారు మీరు రాసింది చాల చాల బాగుందండి.
అన్నవరం, మీ కాలేజీ, ధవళేశ్వరం బ్యారేజ్, పార్క్. మీరు తీసిన ఫోత్స్ చాల బాగున్నై.
ఇంతవరకు రాజమండ్రి ని చూడలేదండి. ఈ ఫొటోస్ ని చుస్తే అక్కడికి వేల్లినట్టుంది.
చాల థాంక్స్.
మీ కిట్టు గారు post గురించి waiting

రాధిక(నాని ) said...

కిషన్ గారు ,లేటుగా చూసా మీ పోస్ట్ ."పెరుగు పోక ":))బాగుంది.మీ పోస్ట్ ,ఫోటోలు కుడా సుపర్ .మీరు మా రాజమండ్రికి వచ్చి అన్ని ఫోటోలు దిగేసారా?మాకు ఒక గంటెనండి రాజమండ్రి.నేను రాజమండ్రిలో s.k.r.వుమెన్స్ కాలేజ్ లో చదివాను.

శివరంజని said...

కిషన్ గారు మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఈ కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను

Kishen Reddy said...

రంజని నీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు .. నీకు మరియు మీ కుటుంబ సభ్యులకు హార్దిక కొత్త సంవత్సర శుభాకాంక్షలు .. :)

Kishen Reddy said...

కవిత: చాలా థాంక్స్ ... కిట్టిగాడి పోస్ట్ త్వరలోనే :)

రాధిక గారు అవునా .. గుడ్ :)