Search This Blog

Wednesday 15 July, 2009

నీ జతలో...


గడిపాను ఇంతకాలం నీ జతలో....తీరేదెలా ఆ లోటు
నీవు లేవనీ.. ఇక రావనీ తెలిశాక .....

తడిచాను నీ చిరునవ్వుల జడిలో...మరచేదెలా ఆ సవ్వడి
మూగాబోయావనీ...మరలి రాలేవనీ తెలిశాక...

కరిగావు ఓ కలగా నా కన్నుల వాకిట్లో...మేలుకొనేదెలా ఈ ఉదయం
కల చెదిరిందనీ... తెలవారిందనీ తెలిశాక...

అనురాగాలు కురిపించావు గారాల పలుకులతో... వినలేనేమో ఆ రాగం
శ్రుతి తప్పిందని... పోలమారిందనీ తెలిశాక...

ఊహలుగా జీవించావు నా ఆశల పల్లకిలో...కదిలేదెలా ఇక ముందుకు
నడక ఆగిందని... దారి తప్పిందనీ తెలిశాక...

అధ్భుతాలు చూపించావు నీ ఆదర్శాల బాటలో... కనలేనేమో ఇక ముందు
చూపు మందగించిందనీ..మసకబారిందనీ తెలిశాక...

నడి రాతిరిలో మేలుకుంటే కమ్మని నీ తలపులతో...దరిచేరదు నిద్దుర
నీ పిలుపు వినపడే దూరంలో నేను లేనని తెలిశాక..

నాకోసం మళ్లీ పుడతావా మరుజన్మలో...ఎదురుచూసే నా చూపులు
ఆలా ఆకశం వైపు... వింటున్నావా ప్రియతమా నా మనవి.



12 comments:

Anonymous said...

ayya baboyi ! meeru kavitalu kooda rastara ?

Priya said...

hi..ramu garu meru chala impresive ga vrasaru ela meru varninchukuntu...pote inka memelni pogadataniki maku matalundavandi edi nijam.

MIRCHY VARMA OKA MANCHI PILLODU said...

chaalaa bagundii

please watch my latest posting

Ram Krish Reddy Kotla said...

Anonymous ( i think u r padma)- ఏదో రాస్తాను అండి అపుడపుడు..

మిర్చి వర్మ గారు...థాంక్స్, మీ కొత్త పోస్ట్ చూశా బాగుంది...

Padmarpita said...

మీరు ఇంత బాగా వ్రాసి పిలిచాక...
"విన్నానులే ప్రియ" అని పాడుకుంటు పరుగున వస్తుంది లెండి!!!

తృష్ణ said...

very nice !!

Ram Krish Reddy Kotla said...

తృష్ణ గారు...ధన్యవాదాలు :)

Chaitanya said...

Thats a good poetry...

Yohanth said...

Its good.

Ram Krish Reddy Kotla said...

Chaitanys and Yohanth...Thanks for your comments

నేస్తం said...

మీ బ్లాగ్ మొత్తానికి మీరు చెప్పినట్లు వింటుంది అండి ..ఈ రోజు ఓపెన్ అయింది :)

Ram Krish Reddy Kotla said...

హహ నేస్తం....దానికో సీరియస్ వార్నింగ్ ఇచ్చాలెండి [:)]