Search This Blog

Sunday 2 August, 2009

యమహా నగరి...చెన్నై పురి..



నా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలనంతరం నేను మొదటి సారిగా మద్రాస్ వెళ్లాను...అక్కడ అప్పుడు మా అన్నయ్య వదిన ఉండేవాళ్ళు...అక్కడ ఉన్నది కొన్ని రోజులే అయినా చాలా నచ్చింది నాకు మద్రాస్..ఆ బీచ్, అక్కడే ఉన్న అష్టలక్ష్మి కోవెల..బీచ్ పక్కనే సాగుతూ అందంగా ఉండే రోడ్..మరో వైపు ఆకాశంలో దూసుకుపోతున్నట్లుండే భవంతులు..ఇంటర్ కనెక్టేడ్ ఫ్లయ్-ఓవర్ లు..సబ్-వే లు..అబ్బో తెగ నచ్చేసింది ఆ యమహా నగరి...అప్పుడే అనుకున్న ఉద్యోగం చేస్తే మద్రాస్ లోనే చెయ్యాలి అని...నాకు తెలీదు అప్పుడు తథాస్తు దేవతలు నా మనవి ఆలకించారని....


2007 ఫిబ్రవరి ...సమయం రాత్రి 7 30..చెన్నై లో ఓ బహుళ జాతి సంస్థ..
ఇంటర్వ్యూ అయ్యాక టెన్షన్ గా కూర్చొని ఉన్న నాకు.."మిస్టర్ రామకృష్ణ, యు గాట్ సెలెక్టెడ్...యు హావ్ టు రిపోర్ట్ హియర్ ఆన్ ఫిబ్రవరి 26th.." అన్న మాటలు అమృత ధారల్లా నా చెవిన పడ్డాయి..ఆ విషయం చెప్పిన హెచ్.ఆర్ వైపు కృతజ్ఞతాపూర్వకంగా చూశాను...ఆమె నాకు పంజాబీ డ్రెస్ లో ఉన్న పరమేశ్వరిలా కనిపించింది..


చెన్నైలో అప్పటికే నా ఇంజనీరింగ్ స్నేహితుడు ఉంటుండటంతో నేను వేరే రూం వెతుక్కోవలసిన అవసరం లేక పోయింది..మెల్లిగా చెన్నైలో రోజులు గడుస్తున్నాయి...రోజూ లేవడం..దెగ్గరిలోనే నుంగంబాక్కం రైల్వే స్టేషన్ ఉండటంతో అక్కడి దాకా నడిచి అక్కడ నుంచి గిండీ (నేను పని చేసే ప్రదేశపు నామధేయం) దాక వెళ్ళడం...అక్కడ నుంచి ఆఫీసు దాకా షేర్ ఆటోలో వెళ్ళడం...సాయంత్రం ఇంటికి రావడం...తినడం...ఇక భోజనానికి ఇబ్బంది లేకుండా చెన్నైలో ఎక్కడపడితే అక్కడ మన ఆంధ్ర మెస్ లు కుప్పలు కుప్పలుగా వెలిశాయి...


ఇకపోతే సినీ నటుడు శోభన్ బాబు ఉండేది మా ఎదురు వీధిలోనే...అపుడపుడు ఆయన వాళ్ళ ఇంటి లాన్ లో కనిపించేవారు...నవ్వి హలో అంటే , ఆయన తిరిగి హలో అనేవారు...ఆయన పరమపదించినపుడు చూడ్డానికి మేము కూడా వెళ్ళాము..ఓ గొప్ప సంస్కారం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయన సొంతం అని ఆయనను చూసిన వారికి ఎవరికైనా అనిపించకమానదు.


క్రమ క్రమంగా నాకు చెన్నై మీద విరక్తి మొదలైంది..దానికి కారణాలు బోలెడు..అసలు ఇంటర్ అయ్యాక వెళ్ళినప్పుడు నేను చూసి..అబ్బురపడి..ఆనందించి..అచ్చెరువొందిన మద్రాస్ ఇదేనా అనిపించింది..ఇక్కడ వేసవి కాలాన్ని భరించడం కష్టం..దాదాపు సంవత్సరంలో ఆరు నెలలు ఇక్కడ వేసవి గానే పరిగణించాలి..ఆ వేడిమికి మలమాలా మాడి మసైపోతమేమో అనిపించేది..ఇక్కడి వాళ్ళు అందరూ అంత గ్యారంటీ కలర్ లో ఉండటానికి ఇది కూడా ఓ కారణమేమో అనిపించింది...చెన్నైలో ఎక్కడ చూసినా శుభ్రత సూన్యం..ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోయి ఉంటుంది..మెయిన్ రోడ్స్ లో తప్ప మిగతా ఏ గల్లీల్లో నడుస్తున్నా ముక్కుకు కర్చీఫ్ సాయం తప్పనిసరి..ఒక్కోసారి కొన్ని మెయిన్ రోడ్స్ లో కూడా తప్పదీ పరిస్థితి...ఆంధ్రా నుంచి చెన్నై ట్రైన్ లో వచ్చేవాళ్ళకు ఈ అనుభవాలు సుపరిచితమే..చెన్నై అవుట్ స్కర్ట్లు దేగ్గరనుంచి సెంట్రల్ దాక ముక్కు మూస్కోవాలి తప్పదు..చెప్పాలంటే చెన్నై ఒక పెద్ద సైజు మురికి వాడ...ఇక ఇక్కడి జనాలు చదువుకున్నా సరే పరిశుభ్రత అనేది చాలా కొద్ది మందిలో కనిపిస్తుంది...వైన్ షాపుల దెగ్గర అయితే జనాలు అక్కడక్కడే తాగి ఆ రోడ్ల మీద పడి హాయిగా నిద్రపోతుంటారు...ఇక్కడి జనాల్లో చాలా మందిలో సున్నితత్వం తక్కువ, నువ్వు ఎలా అన్నా మాట్లాడు వాళ్ళ సమాధానం ఒకేలా..చాలా కరుకుగా అనిపిస్తుంది..బహుశా లంకేయులు వీళ్ళ బంధువులు కాబోలు...

నాకు చెన్నై అంతే విరక్తి రావడానికి ఇంకో కారణం అమ్మాయిలు...కొంచెం అందంగా కనిపించే అమ్మాయిలను చూస్తె కళ్ళకు చలవ అని ఓ మహా జ్ఞాని చెప్పారు..రోజు అలా కాసేపు చూస్తె కళ్ళకు ఎంతో మంచిది, చత్వారం అంత త్వరగా రాదు, కళ్ళు వాటికి అవే మలినాల నుంచి పరిశుభ్రం అవుతాయి...ఇలా ఆ థియరీ చెప్తుంది. నాలాంటి చాలా మంది కుర్రోళ్ళు ఈ థియరీని ఫాలో అయ్యి కళ్ళ జబ్బులు రాకుండా చూసుకుంటారు..అదన్నమాట..కానీ దురదృష్టం ఏమిటంటే జల్లెడ వేసి జల్లినా, భూతద్దంలో నుంచి చూసినా చెన్నైలో చాలా అరుదుగా కనిపిస్తుంటారు అందమైన అమ్మాయిలు...దాదాపు అందరూ బ్లాకు బ్యూటీలే...కనిపించిన కొంతమంది కూడా పర రాష్ట్రీయులు కావడం గమనార్హం..ఇలా నా కళ్ళకు చలవ లేకుండా పోయింది...ఇక్కడ ఇలానే కంటిన్యూ అయితే ఏదన్న కంటి జబ్బు రావడం ఖాయమని తోచింది..





ఇక చెన్నైలో వర్షం పడితే సరే సరి...అసలే చెత్త పేరుకుపోయి ఉన్న గల్లీలు బురదమయం, ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద గుంటలు..క్రిందటి ఏడాది నవంబర్ లో వచ్చిన తూఫాన్ కి చెన్నై అల్లకల్లోలం అయింది...మా ఆఫీసు లో అప్పెర్ బెసెమేంట్, లోయర్ బెసెమేంట్ ఫ్లోర్స్ నీళ్ళకి మునిగి పోయాయి..అన్ని రోడ్లల్లో మోకాలు లోతు నీళ్ళు..స్థంబించిన ట్రాఫిక్..అప్పుడు అధికారు ఏమి చర్యలు తీసుకున్నారో నాకైతే తెలీదు కాని..పేపర్ లో ఎన్నెన్నో చావు కబుర్లు..కరెంటు షాక్ కొట్టి కొందరు..ఇళ్ళకు ఇళ్ళు జలమయం అయి ఎంతో మంది బలయ్యారు...ఇటువంటి సమయంలో చురుకుగా వ్యవహరించలేని అధికారులు, మరెన్నో సందర్భాల్లో మాత్రం తెగ చురుకుగా ఉంటారు...అవేంటో మీకు నేను చెప్పాల్సిన పని లేదు... 


ఇక్కడి వాళ్ళకి బాషాభిమానం, రాష్ట్రాభిమానం చాలానే ఉంది...వీళ్ళకు వీళ్ళు ఓ జట్టుగా ఉంటారు..బహుళ జాతి సంస్థల్లో పని చేసే మన వాళ్ళకు వీళ్ళ ప్రవర్తన సుపరిచితమే..మన వాళ్ళతో పెద్దగా కలవారు..ఇక మీ మేనేజర్ తమిళుడు అయితే వార్షిక పెర్ఫార్మన్స్ రేటింగ్ మీరు ఎంత పొడిచినా ఐదుకి మూడు దాటదు..ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి సిద్దపడిన మా టీం లో కొందరు వాళ్ళకి వాళ్ళు ఓ మార్పు తీసుకురాగలిగారు..పెద్ద మార్పేమీ కాదు..వాళ్ళు ప్రాజెక్ట్ మారిపోయారు..కాదు మార్చబడ్డారు..అంతే..


నేను చెన్నై లో ఉండబట్టి రెండున్నర ఏళ్ళు దాటినా నాకు తమిళ్ సరిగ్గా రాదు..మొదట్లో చాలా కష్టపడినా తర్వాత బ్రతకడానికి ఉపయోగపడే కొన్ని పదాలు నేర్చుకోడం తప్పని సరి అయింది.. ఎంగే (ఎక్కడ ), అంగే (అక్కడ), ఎప్పు (ఎప్పుడు ), ఇప్పు (ఇప్పుడు ), యవల (ఎంత), అవళ (అంత ), ఎప్పడి( ఎలా ), ఇరుకు (ఉంది )....ఇలా ఏవేవో తంటాలు పడే వాడిని.. రెండున్నర ఏళ్ళు గడిచాయి ..నాకు ఇక చెన్నై మీద విరక్తి తీవ్ర స్థాయిలో తయారయింది...ప్రతి మనిషికి ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది...నాకు ఆ బ్రేకింగ్ పాయింట్ ఎప్పుడో  బ్రేక్ అయిపొయింది..ఎప్పుడెప్పుడు ఈ మురికి వాడ నుంచి బైటపడి స్వచ్చ మయిన గాలులు పీల్చుకుందామని ఉంది..

"యమహా నగరి ..చెన్నై పూరి...
నమహో మురికివాడా.. దోమల అడ్డా.."








25 comments:

నాగప్రసాద్ said...

హ హ హ బహు చక్కగా వివరించారు చెన్నై గురించి. నేను కూడా మూడు సంవత్సరాల నుంచి ఉంటున్నా ఇక్కడ. అఫ్‌కోర్స్ నాక్కూడా తమిళ్ రాదనుకోండి.

నవంబర్‌ 2008 లో వచ్చిన తుఫాన్‌లో నేను కూడా గిండి రోడ్ల మీద దాదాపు ఒకరోజంతా ఈదాను. :)

నాగప్రసాద్ said...

హ హ హ బహు చక్కగా వివరించారు చెన్నై గురించి. నేను కూడా మూడు సంవత్సరాల నుంచి ఉంటున్నా ఇక్కడ. అఫ్‌కోర్స్ నాక్కూడా తమిళ్ రాదనుకోండి.

నవంబర్ 2008లో వచ్చిన తుఫాన్‌లో నేను కూడా గిండి రోడ్ల మీద దాదాపు ఒకరోజంతా ఈదాను. :)

Anil Dasari said...

దేశంలో అన్ని మహానగరాల పరిస్థితీ అదేనండి.

మద్రాసు అమ్మాయిల గురించిన వ్యాఖ్యలు తీసేస్తే మిగతా టపా బాగుంది.

మెహతా నగర్‌లో ఉండేవాళ్లన్నమాట :-)

Sreenu said...

Chaala baga vrasavu boss...nenu kooda ee chennai lo ne chastunnanu...nijame chepparandi, chennai lo chooddamanna okka manchi ammai kanipichadu mari....keep blogging boss

Ram Krish Reddy Kotla said...

నాగ ప్రసాద్ గారు ధన్యవాదాలు...నేను కూడా గిండీ రోడ్ల మీద ఈదాను లెండి ఆ నవంబర్ లో...

శ్రీను గారు...థాంక్స్ అండి

Ram Krish Reddy Kotla said...

అబ్రకదబ్ర గారు...నిజమే అన్ని మహానగరాల పరిస్థితి దాదాపు ఇదే...వాటిల్లో చెన్నై ముందు వరసలో ఉంటుందేమో...ఇక చెన్నై అమ్మాయిల విషయం అంటారా..వాళ్ళని కించపరచడం కాదు కాని...అందమైన అమ్మాయిలు కొంచెం అరుదుగానే కనిపిస్తారు కదా...కొంచెం సరదాగా వ్రాసాను అంతే..

Ram Krish Reddy Kotla said...

అబ్రకబద్ర గారు...ఇందాక చెప్పడం మరిచాను...నేను మెహతా నగర్ లో నే ఉండేవాడిని అప్పుడు..శోభన్ బాబు గారి ఇంటి దెగ్గరే...ఇపుడు గిండీ లో నే ఉంటున్నా..

Anonymous said...

బెంగుళూరు వచ్చేయండి... నేను 5 సంవత్సరాల నుండీ ఉన్నాను. బెంగుళూరు మీద ప్రేమ పెరుగుతూనే ఉంది కానీ తగ్గటంలేదు, ముఖ్యంగా నేనుండే జయనగర్ మీద :-). ఇక్కడ కూడా వాతావరణంలో మార్పులు, ట్రాఫిక్ లాంటి సమస్యలున్నా మిగిలిన నగరాలతో పోలిస్తే తక్కువే. కన్నడ నేర్చుకోవటం కూడా చాలా సులభం.
"బన్ని బెంగుళూరు బహళ సుందర ఉద్యాననగరి.నాను నిమగె కన్నడ కలిసుత్తెనె"
(Come, Bengaluru is very beautiful gardencity. I will teach you Kannada)
-యువ

చిలమకూరు విజయమోహన్ said...

అబ్రకదబ్ర గారూ అన్ని మహానగరాల పరిస్థితి అదే అయినా చెన్నైలో ఉన్నంత కంపు ఎక్కడా ఉండదండీ బాబూ.దూరంగా ఉండి తలచుకుంటుంటేనే వ్యాక్...

నేస్తం said...

మీకు మొదట్లో మాత్రం ఎలా నచ్చిందండి బాబు చెన్నై :)

Anonymous said...

నాకు తెలుగు లొ నచ్చని ఒకే ఒక్క పదం చెన్నై.... మ అన్నయ్య ఇప్పటికి వంద సార్లు బతిమాలుంటారు నన్ను రమ్మని. మనం ససేమిరా...చెన్నై మొత్తం ఎయిర్ కండీషను చెయ్యించు అన్నయ్యా అప్పుడొస్తా అంటా.

నచ్చే విషయం ఎంటంటే గుడులు, గోపురాలు, మల్లెపూలు, కదంబ మాలలు.... సూపరయిన వేడి వేడి పొంగలి. వత్త కొళంబు, మోరు కొళంబు. అహా. తమిళుల వంటలే వంటలు. అప్పుడప్పుడు ఇవి మాత్రం మిస్ అవుతుంటా. శరవణభవన్ కి అర్జీ పెడదామనుకుంటున్నా. ఇక్కడో బ్రాంచ్ ఓపెన్ చెయ్యమని.

Ram Krish Reddy Kotla said...

యువ గారు..ధన్యవాదాలు...నాకు కూడా బెంగుళూరు నచ్చింది..కొన్ని సార్లు వచ్చాను బెంగుళూరు...నేను కూడా ఈ చెన్నై వదిలి వేరే లొకేషన్ ట్రై చేస్తున్న...కుదిరితే హైదరాబాద్ లేకపోతె బెంగుళూరు అనుకుంటున్నా....బెంగుళూరు వస్తే మీ దెగ్గరే కన్నడ నేర్చుకుంటాను :)

Ram Krish Reddy Kotla said...

నేస్తం...అదే నాకు అర్థం కాలేదు...అప్పట్లో నాకు చెన్నై ఎందుకు నచ్చిందో... పై పై మెరుపులు కొన్ని కనిపించి ఉంటాయి లెండి...అప్పుడే ఎక్కువ రోజులు ఉండలేదు కాబట్టి, చెన్నై డెప్త్ తెలీలేదు :)

Ram Krish Reddy Kotla said...

అన్వేషిత గారు...తెలుగులో అయిన అరవంలో అయిన మలయాళంలో అయిన...చెన్నై పదం ఒక్కటే...హహ...గుడులు గోపురాలు బాగానే ఉంటాయి కాని, ఆ చెన్నై తిండి నాకు అంతగా ఏమీ నచ్చదు...మన ఫుడ్డే సూపర్..అయినా కొన్ని వెళ్ళు బాగా చేస్తారులెండి...సరవనాభావన్ మరీ కాస్ట్లీ...అంత సీన్ లేదేమో అనిపిస్తుంది..ఒకప్పుడు సూపర్ బ్రాండ్..కానీ ఇపుడు క్వాలిటీ తగ్గిందేమో అనిపిస్తుంది...కానీ ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయ్...ఆ బ్రాండ్ చూసి వస్తున్నారు జనాలు అంతే..దాన్ని మించిన మంచి రెస్టారెంట్స్ చాలా ఉన్నాయ్ చెన్నైలో....

priya said...

shoban babu gara ayanante ma ammaku tega istamandi.ayana maraninchi nappudu ma amma 3 days intlo vantaki namam pettindanta edchukuntu...ayana chanipoina vishayam ma chelli chepinte chepa ku phedel mani okkatichindanta...anta istam eka meru navvaru ani telisindo memalni vadalakunda matladestundi meto...

priya said...

ram emannaru o maha gnani chepara a theory abba melanti valakosame chepintaru..anduke kabolu memalni anta andamina pradeshaniki pamparu hahah...

Ram Krish Reddy Kotla said...

priya garu, even i like sobhan babu...a very good actor n human being....Thanks for ur comments.

Yohanth said...

Enti boss chennai ammayila gurinchi nijam alaa cheppesaavu?

Anonymous said...

సరేలెండి...అయింది ఏదో అయ్యిపోయింది కాని హైదరాబాద్ వచ్చేయండి!!

Ram Krish Reddy Kotla said...

యోహాంత్, తప్పదు కొన్ని కొన్ని సార్లు అలా నిజాలు చెప్పాల్సి ఉంటుంది...

పద్మ గారు...హైదరాబాద్ వచ్చేయాలనే నా ప్రయత్నమంతా...త్వరలోనే భాగ్యనగరంలో అడుగుపెడతా ఇక్కడ తట్ట బుట్ట అన్ని సర్దేసి.. :)

నిజం said...

chala baga chepparandi Chennai gurinchi.....vammo endakalam.....antene Bayam

వీరుభొట్ల వెంకట గణేష్ said...

నేను చెన్నై వచ్చినప్పుడు మెహతా నగర్ మా అడ్డ. మా ఆఫీసు Nelson Manickam రోడ్ లోనే ఉండేది. సాయి మెస్ ఓనరు మా నాన్న గారి ఫ్రెండ్!

Bhãskar Rãmarãju said...

లేటుగా సూసా మీ పోస్టు!!ఏంపర్లేదు, ఇదిగో నా కామెంటు -
మౌంట్ రోడ్డుకి ఇటైపు అటైపు అని ఓ కాన్సెప్టు.
ఇటౌపు - అనగా గోపలపురం, పోయిస్ గార్డెన్, ఆళ్వార్పేట, అభిరామపురం, మందవేలి, రాజా అన్నామలైపురం, అడయార్, మైలాపురం ఇలాంటివి అత్భుతంగా ఉంటాయి. కంపు ఎక్కువే కానీ ఈ ఏరియాలల్లో కొంచెం తక్కువ.
ఇక కళ్ళకు కావాల్సిన గిలిగింతలు - ఇటువైపే ఎక్కువ. :):)

కొత్త పాళీ said...

ఈ టపా ఇప్పుడే చూశాను. అక్కడే నివాసం ఉండే వాళ్ళకీ, ఒక వెకేషనర్‌గా చూసేవాళ్ళకీ ఆ చూడ్డంలో తేడా ఉంటుందనుకుంటా. అఫ్కోర్సు నా అనుభవం ఎనిందేళ్ళకిందటిది లేండి. అప్పటికీ ఇప్పటికీ చాలా మారి ఉండొచ్చు. అదీకాక నేను చెన్నైలో గడిపింది డిసెంబర్ జనవరి నెలల్లో.

rākeśvara said...

నేను చిన్నప్పుడు తెలియని గూదరికంలోఁ, నగరాలంటే పడిసచ్చేవాడిని, ఎప్పుడూ అదే రాజమండ్రి వెళ్ళీ వచ్చీ వెళ్ళీ వచ్చీ, అదే కొవ్వూరు బిజ్జీ దాటి విసిగి పోయి, ఎవరైనా హైదరాబాదు తీసుకెళతానంటే పడిసచ్చేవాడిని।

అలాంటిది నిన్న హైదరాబాదు పనివుండి రావలసివస్తే, వారం రోజుల ముందుగానే తెలియకుండానే ఆందోళన మొదలయ్యింది। పైపెచ్చు మావాళ్ళు కూకటపల్లిలో వుంటారు కోస్తాంధ్రావారందరిలా। ఈ కూకటపల్లి ప్రాంత రోడ్లూ రద్దీ తలచుకుంటేనే భయం॥

నేను నాలుగేండ్లు బెంగుళూరిలో వున్నాను, అన్నీ పాష్ ప్రాంతాలే, కానీ ఇక తట్టుకోలేక తిఱిగి మా కొబ్బిరితోటలకు వచ్చేశా। భారతదేశ నగరాలంటేనే భూమాత మొముపై పుండ్లని లెక్క, బెంగుళూరో భాగ్యనగరో వస్తే మీ పరిస్థితి మారుతుందనుకోవడం కల్ల॥ మద్రాసు అక్కడి గిండిలో చుట్టాలింటికి వెళ్లడమే తేలికనిపిస్తుంది॥ తమిళం శ్రద్ధగా నేర్చుకోకపోవడం మీ తప్పే, నేర్చుకోవడం తేలికే నేనే నాలుగైదు సార్లు తిరిగినందుకే మీరు చెప్పినంతా ఇంకా ఎక్కువే అబ్బింది ।

నాలా మీరు కూడా పెళ్ళి అయ్యే వఱకూ షో చేయడానికి అమెరికా వీసా అర్జించండి :D। అమెరికా వెళ్ళి రెండేళ్ళు వుండి వచ్చిన పిదపనే నాకు అర్థమయ్యింది మన భారతనగరాలు ఎంత అనాగరికారణ్యాలోనని॥

వైరాగ్యాన్ని సానుకూలంగా మలచుకోవడానికి మీకునా నుండి శుభాకాంక్షలు॥