Search This Blog

Sunday 25 April, 2010

ప్రేమంటే....ఏమిటంటే.....???????


"నాకు బ్రతకాలని లేదు...." హారతి ఏడుస్తుంది ఫోన్ లో...."ప్రశాంత్ లేకుండా నేను ఉండలేను....మా ఇంట్లో నా పరిస్థితి నరకం కన్నా ఘోరంగా ఉంది..."
ఆమెకు ఏమి చెప్పి ఓదార్చాలో నాకు అర్థం కావడం లేదు...
"ఏమి కాదులే...బాధపడకు...everything will be fine.." అని మాత్రం చెప్పగలిగాను....

హారతి అతన్ని ప్రేమిస్తున్న సంగతి వాళ్ళ నాన్నకి తెలిసిపోయింది...వాళ్ళ నాన్న సి.బి.ఐ లో పనిచేస్తున్నాడు...అతనికి వాళ్ళ ప్రేమ విషయం తెలుసుకోవడం అంత కష్టమైన పని కాదు...


అతనికి తన కూతురి మీద ఉన్నది వల్లమాలిన ప్రేమా?? ..లేక తన కూతురు తను చూసిన వాడినే పెళ్లి చేసుకోవాలని అనుకొనే పెద్దరికంతో కూడా అహమా??...లేక తానింకా పసిపిల్లే తన గురుంచే తను చూసుకోలేదు, అలాంటిది తనకు కాబోయే వాడిని తనెలా ఎన్నుకోగలదు అనుకొనే పిచ్చితనమా??..ఏమిటి అతని మనసులో ఉన్నది...??
తన కూతురు ఎవరినో ప్రేమిస్తుందని తెలియగానే, ఆవేశంతో ఊగిపోయే తండ్రులు నూటికి..?? ..ఎంత మంది...??..నూరు ఉండొచ్చేమో...కాదంటారా?...అది వాళ్ళ తప్పు కాదు...తన కూతురు తప్పటడుగులు వేస్తుందేమో అన్న ఆందోళన కావచ్చు కదా??...తన కూతురి ప్రేమ నిజమే అయితే, అది ఆలస్యంగా అయినా అర్థం చేసుకోగలుగుతారు కొంత మంది...మరి కొంత మంది...పట్టిన పట్టు విడువరు...ఇదిగో మా హారతి వాళ్ళ నాన్న లాగా....కాని అతను ఆలోచించేది నిజమే అని నాకు అప్పుడు అనిపించలేదు...కారణాలు బోలెడు.....


"హరీష్ ని ఎంత ప్రేమించానో తెలుసా నీకు...తన ఆలోచనలు ఒక్క క్షణం కూడా నను వీడిపోయేవి కాదు..నా చిన్ని ప్రపంచంలో అతనే నిండిపోయాడు..తన సంతోషం కోసం ఏదైనా చేసేయ్యాలన్నంత ప్రేమ నాలో నిండిపోయింది తన కొరకు...తనతో గడిపిన ప్రతి క్షణం నాకొక వరం..తన పరిచయం నాకు క్రొత్త లోకం చూపించింది..ఆ లోకంలో సంతోషం తప్పఇంకేమీ లేదు..కాని...జీవితంలో చీకటి అంటే ఏమిటో నాకు ఆ తర్వాతనే తెలిసొచ్చింది...." ఆమె గొంతులో ఏదో అడ్డు పడ్డట్టు ఉంది ఆమె స్వరం..... 

"హారతి......" అంటూ ఏదో చెప్పబోయాను...మళ్ళీ ఆమె...
"పక్క షాప్ కి వెళ్ళినా నాకు మెసేజ్ ఇచ్చేవాడు...అలాంటిది...రెండు వారాలు తన దెగ్గర నుంచి కాల్స్ కాని మెసేజెస్ కాని లేవు...పిచ్చెక్కింది నాకు...ఏమి చెయ్యాలో అర్థం కాలేదు..ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు..వాళ్ళ ఇంటి ల్యాండ్ లైన్ కి కాల్ చేస్తే వాళ్ళ చెల్లి చెప్పింది తను నాగపూర్ వెళ్ళాడు అని...ఎందుకో తెలియలేదు..ఉండబట్టలేక ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని తన కాలేజీకి వెళ్లాను....తను అక్కడే ఉన్నాడు...." ఆమె చెప్పడం ఆపేసింది...కాసేపు ఇద్దరి మధ్యా నిశ్శబ్దం...అది భరించడానికే కష్టంగా ఉంది...


"అతని దెగ్గరికి వెళ్లి నేను చచ్చిపోయాను అనుకున్నావా అని అడిగాను కోపంగా...అతనేమో ఏంటి కాలేజీకి వచ్చి ఈ గోల ఇంటికి వెళ్ళు సాయంత్రం నేను ఫోన్ చేస్తాను అని చెప్పాడు...నాకెందుకో వెళ్ళ బుద్ది కాలేదు...చెప్పు ఏమైపోయావ్ ఇన్ని రోజులు...నువ్ ఒక్కరోజు నాతో మాట్లాడకపోతేనే నేను మనిషిని కాను అని తెలుసు కదా..ఇన్ని రోజులు నాతొ మాట్లాడకుండా ఎందుకు ఇలా చంపుతున్నావ్ నన్ను...ఏమైందో చెప్పురా...ప్లీజ్..అని బ్రతిమాలుకున్నాను...అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు...నేను కొయ్య బొమ్మలా అలానే నిల్చున్నాను...


అంతా తలకిందులు అవుతున్నట్లు..ఏదో బలంగా నన్ను కిందకి తోక్కేస్తున్నట్లు అనిపించిది...అక్కడే ఉన్నాను చాలాసేపు తను వస్తాడేమో అని...కాని తను రాలేదు...ఇంటికి వచ్చాను...కానీ ఏదో చిన్న ఆశ తను నాకు ఫోన్ చేస్తాడని...రెండు రోజుల తరువాత తన ఫోన్

'ఎలా ఉన్నావ్ హనీ' అన్నాడు.. .ఆ మాట వినగానే ఎక్కడలేని సంతోషం నాలో రెక్కలుకట్టుకు వాలింది..తన మాట నా గుండెని తాకి పెదవుల్లో చిరునవ్వై పూసింది..'నీకోసం పిచ్చిదానిలా ఎదురు చూస్తున్నాను రా...అన్నం తిని మూడు రోజులు అయింది కన్నా...నువ్వు తినిపిస్తేనే తింటాను లేకపోతే తినను...' గోముగా అన్నాను...'పిచ్చా నీకు...అలా తినకుండా ఉన్నావంటే నా మీద ఒట్టే చెప్తున్నా...నా బంగారం కదూ..వెళ్లి తిను ముందు..ఇప్పటికిప్పుడు నేను తినిపించలేను కదా.' అనేవాడు మాములుగా....కాని అతను అప్పుడన్న మాటకి నా గుండె పగిలిపోయింది...ఏడవడానికి కన్నీళ్ళు కూడా లేవు నా ఎండమావి ఎదలో..'ఇంకెప్పుడు నాకోసం ఎక్కడికీ రాకు...నేను నీతో మాట్లాడే ఆఖరి మాటలు ఇవే...నేను నీతో బ్రేక్ అప్ చేసుకుంటున్నా..అల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్..'అన్నాడు..అంత షాక్ లోనూ అడగగాలిగాను 'ఎందుకు' అని...'ఐ హావ్ గాట్ ఎ బెటర్ గర్ల్ ఫ్రెండ్' అన్నాడు...ఫోన్ పెట్టేసాడు.

ఒక్కసారిగా జీవితంలో చీకటి అంటే ఏమిటో తెలిసింది...అంత మాట అన్నాకూడా తన మీద నాకు ఎందుకో కోపం రావడం లేదు....నన్ను నేనే శిక్షించుకున్నాను..ప్రపంచంతో సంబంధాలు తెంపుకున్నట్లు నన్ను నేనే ఒక రూంలో బందించుకున్నాను..చావు కోసం ఎదురు చూస్తున్న దానిలా బ్రతికాను...మా నాన్న నన్ను ఎంతో ఓదార్చాడు...'నేను మీ అమ్మ చచ్చిపోయాం అనుకున్నావా తల్లి' అన్నాడు..నేను ఏడ్చేసాను  " అంది....
"మరి ప్రశాంత్..???" అడిగాను నేను....


***********************
'ఈ రోజు ప్రశాంత్ ఇంకా కాల్ చెయ్యలేదు రా..' అంటూనో లేక 'నేను ఎన్నిసార్లు కాల్ చేసినా ప్రశాంత్ కట్ చేస్తున్నాడు ఎందుకోరా..' అంటూనో బాధగా మెసేజెస్ ఇస్తుంటుంది హారతి..మళ్ళీ మరుక్షణమే 'ప్రశాంత్ కాల్ చేసాడురా..యాం సో హ్యాపీ' అని మెసేజ్ ఇస్తుంది...'ప్రశాంత్ ఊరికే తిడుతుంటాడురా..కానీ వాడంటే చాలా ఇష్టం ఏంటో...నేను ఈ రోజు బ్రతికి ఉన్నాను అంటే అది ప్రశాంత్ వల్లే' అంటుంది...'ప్రశాంత్ కి కాల్ వెయిట్ వస్తే నచ్చదురా...నిన్న నీతో ఫోనులో మాట్లాడుతున్నపుడు తన కాల్ వెయిట్ వచ్చింది..నైట్ తిట్టాడు ఎవరితో మాట్లాడుతున్నావ్ అని...నేను నీ గురించి చెప్పాను..నన్ను బాగా తిట్టాడు...ఇంకెప్పుడు నీతో టచ్ లో ఉండొద్దు అన్నాడురా...' అంది...'నీ మీద తనకు నమ్మకం లేదా ఆమాత్రం..'అన్నాను...'అలా అని కాదు వాడికి ఇలా నేను అబ్బాయిలతో మాట్లాడటం నచ్చదురా..ఏమనుకోకు రేపటి నుంచి నీకు కాల్ చెయ్యను...కానీ మెసేజెస్ ఇస్తుంటాను' అంది...నేను నీ ఇష్టం అని చిన్నగా నవ్వాను

హరీష్ తో బ్రేక్ అప్ అయ్యాక డిప్రషన్ లోకి వెళ్ళిన హరతికి ఏదో రాంగ్ కాల్ తో పరిచయం అయ్యాడు ఢిల్లీలో ఉండే ప్రశాంత్..మెల్లిగా తనతో మాట్లాడటం మొదలుపెట్టింది హారతి...తన కథ మొత్తం అతనికి చెప్పాక అతని వద్ద ఆమెకి కావలసిన ఓదార్పు లభించింది..రోజు అతనితో మాట్లాడటంతో ఆమెకి ఎంతో తేలికగా అనిపించేది...మెల్లి మెల్లిగా మామూలుగా అయింది హారతి..ప్రశాంత్ కాల్ కోసమే ఎదురు చూస్తూ అతను కాల్ చేసినప్పుడల్లా బోలెడు ముచ్చట్లు చెప్పేది అతనికి...ఒకానొకరోజు ఆమెకి ప్రోపోస్ చేసాడు ప్రశాంత్...ఎండమావిలో అమృతంలా దొరికిన అతని స్నేహాన్ని వదులుకోలేక అతనికి తన సమ్మతిని తెలియచేసింది....


ఒకసారి ప్రేమ విఫలం అయ్యి జీవచ్చవంలా బ్రతికిన తన కూతురు ఇప్పుడిప్పుడే మాములు మనిషి అవ్వడం అతనికి సంతోషం కలిగించింది...అలాంటి ప్రేమ జోలికి మరొకసారి తన కూతురిని వెళ్ళనివ్వకూడదు అని ధృడంగా నిశ్చయించుకున్నాడు ఆ తండ్రి...ఎందుకంటే ఆమెని ఆ విధంగా చూసిన ఆ తండ్రి గుండె ఆమె కంటే పది రెట్లు ఎక్కువ క్షోభ పడింది అనే విషయం వేరే చెప్పాలా ??

తదనుగుణంగానే ఆమె ప్రతి కదలిక ఎంతో శ్రద్దగా గమనించాడు ఆయన...అప్పటికే సమయం మించిపోయింది అని అతనికి తెలిసిపోయింది..తన కూతురు ఇంకొక వ్యక్తిని ప్రేమిస్తుంది అని తెలుసుకున్నాడు..తన కూతురు జీవితం ఎమైపోతుందా అనే భయం అతన్ని వెంటాడింది,..అతని పేరు ప్రశాంత్ అని..ఢిల్లీలో ఉంటాడు అని..ఇంతవరకు వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోలేదు అని తెలిసి తన కూతురు ఒకడిని ఇంత గుడ్డిగా ఎలా నమ్ముతుంది అని కంగారుపడ్డాడు.

అతని నెంబర్ కి కూతురికి తెలియకుండా కాల్ చేసి 'నా కూతురిని వదిలెయ్యి...ఇప్పటికే చచ్చిబ్రతికింది..వాడెవడో ప్రేమించాను అని చెప్పి వెంట తిప్పుకొని వదిలేసాడు..మళ్లీ అదే జరిగితే నా కూతురు గుండె కంటే ముందు నా గుండె ఆగిపోతుంది...నా కూతురి జీవితంలో నుంచి వెళ్ళిపో దయచేసి..' అని అతన్ని వేడుకున్నాడు..'మేము ప్రేమించుకుంటున్నాం...మమ్మల్ని ఎవరూ విడదీయలేరు'అంటూ అతను ఫోన్ పెట్టేసాడు..అదే విషయం హరతికి చెప్తూ 'మీ నాన్న ఇలా నాకు కాల్ చేసాడు..what kind of father do u have??..i wont tolerate these things anymore.."అన్నాడు..."ప్రశాంత్ అయాం సారీ రా..నాకు ఈ విషయం తెలీదు...అయన ఒక పాగల్ లా బిహేవ్ చేస్తాడు అనుకోలేదు..I will make sure these things will not repeat again, trust me darling"  అందామె...

"నాన్నా ప్రశాంత్ కి మీరు కాల్ చేసారా ?"
"అవును..."
"అలా చెయ్యడానికి మీకు ఏం హక్కు ఉంది..??"
"ఏ హక్కుతో నా కూతురిని ఇన్నాళ్ళూ పెంచానో..చదివించానో..అదే హక్కుతో..."
"నేను ఈ రోజు ఇలా బ్రతికి ఉన్నాను అంటే అది ప్రశాంత్ వల్లనే...ఇలా నేను ఉండాలి అని మీరు అనుకొంటే, ఇంకెప్పుడు తనకి కాల్ చేసి విసిగించకండి.."
"ఇంటర్ లో 96% వచ్చింది నీకు...కాలేజీ టాపర్ వి...కానీ ఇప్పుడు డిగ్రీ కూడా మానేసి ఇంట్లో కూర్చున్నావ్..ఫ్యూచర్ గురుంచి ఆలోచించావా??"
"ప్రశాంతే నా ఫ్యూచర్...."
"అడ్డదిడ్డంగా మాట్లాడితే కాళ్ళు విరగొట్టి ఇంట్లో కుర్చోబెడతా..."
"ఆ పని చెయ్యండి...అప్పుడే కదా మీకు మనశ్శాంతి...ఛీ ఈ ఇంట్లో నా బ్రతుకు హీనంగా తయారయ్యింది...ప్రశాంత్ కి జాబ్ వచ్చాక మీరు ఉండమన్నా నేను ఉండను ఈ ఇంట్లో..."

ఆ మాట ఆ తండ్రిని నిలువెల్లా కుదిపేసింది...

ఆ తర్వాత కొన్ని రోజులు హారతి దెగ్గర నుంచి నాకు ఎటువంటి మెసేజ్ రాలేదు...
సడన్ గా ఒక రోజు కాల్ చేసింది...
"ఏమైపోయావ్ ఇన్ని రోజులు...." అడిగాను
"ఒకటి చెప్తాను...ఏమనుకోవు కదా" అంది
"ఏంటి...."
"నేను ఢిల్లీ వెళ్లాను....ఈ రోజే వచ్చాను..." అంది...
"ఢిల్లీనా..??." ఆశ్చర్యంగా అడిగాను,,,
"సడన్ గా తను కాల్ చేసి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తున్నాఈవెనింగ్, ఢిల్లీ కి వచ్చేసెయ్యి అన్నాడు...అంతే...వెళ్లాను " అంటూ చాలా తేలికగా చెప్పింది..
"ఏమైనా పిచ్చెక్కిందా..అలా ఎలా వెళ్ళావ్??..కొంచెం కూడా ఆలోచించలేదా??...ఇంట్లో ఎలా ఒప్పుకున్నారు నువ్వు వెళ్ళడానికి.." అన్నాను
"అడిగితే కదా ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడంలాంటివి జరిగేది....చెప్పకుండా వెళ్లాను.." అంది
"చెప్పకుండా నాలుగు రోజులు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావా...మీ పేరెంట్స్ గురుంచి ఒక్క సెకండ్ ఆలోచించలేదా?" అన్నాను ఇంత తెగింపు ఎక్కడనుంచి వచ్చిందా అనుకుంటూ..
"పేరెంట్స్ లా బిహేవ్ చెయ్యని వాళ్ళ గురుంచి ఎందుకు ఆలోచించడం...ప్రశాంత్ కోసం నేను ఏమైనా చేస్తాను..." అంది
"మీ నాన్న ఏమన్నాడు ??.."
"కొట్టాడు...అంత కన్నా ఏం తెలుసు ఆ మనిషికి..."
"ఇలా వెళ్లావు అని నలుగురికీ తెలిస్తే పాపం మీ నాన్న పరువపోతుంది కదా??...కొంచెం ఆలోచించాల్సింది హారతి." అన్నాను
"ఏమోలే...అయిపొయింది కదా...బట్ యాం సో హ్యాపీ తనని కలసినందుకు..స్వీట్ మొమెంట్స్ విత్ హిం..." అంది...

తను ఢిల్లీ నుంచి వచ్చిన కొన్ని రోజుల దెగ్గర నుండి ప్రశాంత్ లో చాలా మార్పు గమనించింది హారతి...
"వాడేంటో ఇంతకముందులా లేడురా...ఊరికే చిరాకు పడుతున్నాడు..కాల్ చేస్తే చాలా సార్లు కట్ చేస్తున్నాడు...నైట్ టైమ్స్ తన సెల్ కి కాల్ వెయిట్ వస్తుందిరా..." అంటూ ఏడ్చింది...

అలా రోజూ ఏదోకటి చెప్తూనే ఉంది కాని తను ఒక రోజు చెప్పిన మాట నన్ను నిలువునా కృంగదీసింది...తన మీద జాలి..తను ఏమైపోతుంది అన్న భయం కలిగాయి నాకు...

************************ రెండేళ్ళ తరువాత ************

హరితి పెళ్లి మండపం వైభవంగా ఉంది...
వాళ్ళ నాన్న వచ్చే అతిథులను పలకరించడంలో బిజీగా ఉన్నాడు...తన ఒక్కగానొక్క కూతురికి పెళ్లి చేస్తున్న పెద్దరికం అతనిలో ఉట్టిపడుతుంది..అందుకేనేమో పెద్దలు తమ పిల్లల పెళ్ళిళ్ళు తమ చేతుల మీదనే జరిపించాలని ఆరాటపడుతుంటారు...అందరు పిల్లలు తమ పెద్దలకి ఆ గౌరవం అప్పజేపితే ఎంత బాగుంటుంది...అప్పుడిక ఈ 'ఆర్య సమాజ్' పెళ్ళిళ్ళు...రిజిస్టర్ పెళ్ళిళ్ళు ఉండవు...పెద్దలు తల ఎత్తుకొని పెళ్లి జరిపించే పెళ్లిళ్ళే ఉంటాయి..
హారతి ముస్తాబు అవుతుంది...రెండేళ్లలో ఎంత మార్పు...అన్ని రకాలుగా గొప్పగా పరిణతి చెందిన అమ్మాయిని ఆమెలో చూస్తున్నాను అప్పుడు నేను..
"హాయ్ కిషెన్...మొత్తానికి పెళ్ళికి వచ్చావ్...డుమ్మా కొడతావేమో నీ డ్రమ్ము పగలకొడదాం అనుకున్నా.." అంటూ గలగలా నవ్వుతున్న తను చూడ ముచ్చటగా ఉంది...
"మీ ఆయన ఎక్కడ?" అడిగాను
"అదిగో అక్కడ బ్లూ షర్టులో ఉన్నాడు కదా...తనే........ప్రశాంత్ " అంది
"మొత్తానికి పేరు మాత్రం మారలేదే....ప్రశాంత్ అగైన్...." అంటూ నవ్వాను
"ఒరేయ్ షట్ అప్...ఆ ప్రశాంత్ మాట ఎత్తకు....ఏం చేద్దాం ఈయన పేరు కూడా ప్రశాంత్ అయి కూర్చుంది...అందుకే పేరు మార్చుకుంటేనే ఫస్ట్ నైట్ అని చెప్పేసా.." అంది నవ్వుతూ.


***************************************************************

P.S : ఆ రోజు హారతి నా దెగ్గరికి వచ్చి "ప్రశాంత్ ఒక కండిషన్ పెట్టడురా..రెండేళ్ళు మేము మాట్లాడుకోకుండా ఉండాలంట..ఈ టైం లో కెరీర్ మీద ద్రుష్టి పెట్టాలంట..రెండేళ్ళ మన ప్రేమ తగ్గకుండా ఉంటేనే పెళ్లి చేసుకుందాం అన్నాడు రా " అంది..
హారతిని చూస్తె జాలి వేసింది..ఏదైనా ముఖం మీదే చెప్తుంది కాని చాలా అమాయకురాలు...వాడి దీన్ని వదిలించుకోవాలని చూస్తున్నాడని నాకు అర్థం అయింది...
"నువ్వేమన్నావ్ ?" అన్నాను
"నేనేమంటాను...వాడు ఏది ఆంటే నేను దానికి అభ్యంతరం చెప్పను...కాని రెండేళ్ళు నా వల్ల కాదురా.." అంటూ మళ్లీ ఏడుపు మొహం పెట్టింది...
ఈలోపు వాళ్ళ నాన్న ఊరుకుంటాడా దాన్ని బలవంతంగా ఆస్ట్రేలియా పంపాడు హయ్యర్ స్టడీస్ కి...
ఒక ఇయర్ దాకా నో కాంటాక్ట్ నాకు తనకి...
ఓ రోజు కాల్ చేసింది "నేను ఇండియా వస్తున్నా వచ్చే వారం...నిన్ను మీట్ అవుతాను.." అంది
"అది సరే...ప్రశాంత్ ఎమన్నా కాల్ చేసాడా నీకు మళ్ళీ " అడిగాను ఉండబట్టలేక
"లేదు...హి ఇస్ ఏ చీట్..పైగా నాకిప్పుడు వాడి మీద అలాంటి ఫీలింగ్స్ ఏమి లేవు...ఇక్కడి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా ...సరే వచ్చాక కలుస్తా " అంటూ పెట్టేసింది ...

అంతా బాగానే ఉంది కాని నాకు బేసిక్ కోస్చేన్ కి సమాధానం దొరకలేదు ...అదే..అసలు "ప్రేమంటే ఏంటి ??"..."ప్రేమంటే....ఏమిటంటే.....???????"

 

10 comments:

Padmarpita said...

ప్రేమంటే....ఏమిటంటే!!!అది తెలిస్తే ఎప్పుడో ప్రేమించేవారేమో కదా:)

Anonymous said...

prema ante mOham matram kaadu.Ee case lo mOhame(infatuation) tappa, prema ledu.

It needs 2 matured people to really fall in 'love'. In this case, the girl herself is v.immatured.It shows when she said to her husband that he needs to change his name for first-night and that sort of stupid joke, which will surely cause lot of probs in her married life too.

She bases all her life around 'love', she doesn't respect/care for herself during that process.When she/he doesn't care for herself, obviously no guy/girl will care for him/her.

Hope she gets some maturity atleast after marriage.Pelli aithe pichi kudurutundi ane sametha undi kadaa.

నేస్తం said...

hmm ఏంటొ అంతా భ్రమ... ఇలాంటి వేదాంతపు ప్రశ్నలు ఇప్పుడు అవసరం అంటావా నీకు కిషన్.... :)

Anonymous said...

Nee post chadivaka naku kuda prema ante enti ane doubt vasthundhi.Asalu "true love" undha???Kani Harathi dhi matram Love kadhu.Idhi chusi nuvvu confuse avvaku ,kishan.Kotha bangaru lokam movie lo dialogue undi chudu..."idi Love ah?Attarction ahh?"...thanu kuda ila okkasari alochisthe bagundedhi....ila pichi bramalo padi...future padu chesukune ammayi lu,abbayi lu chala mandhi unnaru samajam lo.Valla andhari ki ee blog dedicate cheyandi..appudina analize avutharu.

By,
Banagaram

Ram Krish Reddy Kotla said...

@ పద్మ, ప్రేమించడానికి కచ్చితంగా మీనింగ్ తెలియాలి అంటావా???

@ ఏదోలే నేస్తం, అపుడప్పుడు ఇలాంటి వెందాంత ప్రశ్నల మీద రీసర్చ్ చేస్తుంటాను :)

Ram Krish Reddy Kotla said...

@ Anonymous, well said. Thank you.

@ Bangaram, Yes, as u said am dedicating this blog to all of them :)

Deepthi Pemmaraju said...

idi real story na?

Kalyan Modugu said...

prema ante... enti.. ? bavundayya raamu ...
ne katha...

i think its time for you .........

Ram Krish Reddy Kotla said...

@ Deepti, Yes it is Real story happened to my friend...hmmm..vadhi vichitramainadi kada..hehe..howz ur life going :)

@ Kallu, Its not time for me yet...I dont go for things that confuse me..love is one such kinda abstract concept for me..hehe..by d way, Happy Birthday raa..enjoy ur day..tried to chat with u in skype, but ur not there...hmm

ఆదిత్య said...

ఇప్పుడు ఉన్న present day లవ్ లో ఒకరు ఎంతమందినైన ప్రేమించవచ్చు. ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి. ఈ అబ్బాయి కాకపోతే ఇంకో అబ్బాయి. ఎవరు దొరకలేదా ఇంట్లో వాళ్ళు చూపించిన సంబంధం చేసుకోవడం. If this is the way love is defined, ఎవరికైనా వచ్చే doubt ప్రేమంటే ఏంటి అనే? --- మీలాగే.

నేనొక example చెప్తాను boss -- "తన lover తో చిన్న misunderstanding వచ్చిందని వేరే అబ్బాయిని ఇష్టపడింది ఒక అమ్మాయి."

నా doubt ఏంటంటే ఆ అమ్మాయి నిజంగా ప్రేమించుంటే వేరే అబ్బాయితో అలా behave చేసేదా? తనకు ఆమాత్రం commitment లేదా?

"తన ఇష్టంను అర్థంచేసుకున్న ఆ అబ్బాయి తిరిగి ఆ అమ్మాయిని ఇష్టపడడం start చేశాడు. ఇప్పుడు ఆ అమ్మాయేమో అది తప్పు అని realize అయ్యి ఆ అబ్బాయిని వదిలేసింది."

ఇప్పుడు ఆ అబ్బాయి life ఎమవ్వాలి.

ఇది love ఆ? లేక ఒంట్లో కొవ్వా?

ప్రేమేమన్నది చెట్లో కాసే పండా - అందితే కోసుకొనేకి అందకపోతే వదిలేసేకి.

ప్రేమ అనేది అవకాశం కాదు. కుదిరితే చేసుకోనేకి కుదరకపోతే వదిలేసేకి. గొడవలు లేకపోతే బగుందేకి ఉంటే విదిపోయేకి.

ప్రేమ అనేది ఒక commitment, చచ్చిపోయే వరకు నువ్వు ఎలా ఉన్న నీతోనే ఉంటాను అని ఇచ్చే commitment. ఇప్పటి ప్రేమల్లో ఆ commitment లేదు. అందుకే త్వరగా విడిపోతున్నారు ఎంతమందినైన ప్రేమించగలుగుతున్నారు.

ఎంతమందినైన ప్రేమించగలిగితే అది ప్రేమ ఎలా అవుతుంది boss.

అసలు వాళ్ళు ప్రేమించనే లేదు అని ఎప్పుడు అర్థం చేసుకుంటారు boss.