Search This Blog

Sunday 6 June, 2010

హృదయం ప్రేమిస్తానంటే...విధి విడదీస్తానంటే !! - 8


"ఎస్...హీ ఈజ్ పెర్ఫెక్ట్ ఫర్ ద ట్రాన్స్ ప్లాంట్స్ ...." సుధీర్ బాడీని, అతని ముఖ్య అవయవాలని పరీక్షించి నిర్ధారించాడు డాక్టర్... "గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలు మార్పిడి చెయ్యడానికి అనుగుణంగానే ఉన్నాయి ..."
"కానీ డాక్టర్...అతని బంధువులు దీనికి సమ్మతించాలి..." అన్నాడు అక్కడున్న మరో డాక్టర్
"నిజమే ... ఇతనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చారా..." అడిగాడు నర్స్ ని ..
"లేదు డాక్టర్..." అందామె ..
"బ్రెయిన్ డెడ్ వ్యక్తి అవయవాలు కొన్ని గంటలలోనే మనం ట్రాన్స్ ప్లాంట్ చెయ్యాలి ... ఈ లోపు ఇతనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వస్తే బాగుండు ..." అన్నాడు డాక్టర్

కొన్ని గంటలు గడిచాయి ... సుధీర్ బాడీని చూడటానికి ఎవరూ రాలేదు.. ఈ విషయమై మాట్లాడేందుకు డాక్టర్స్ సమావేశమయ్యారు ...
"డాక్టర్ ఇక మనం చెయ్యగలిగింది ఏమీ లేదు ..." అన్నాడు ఒక డాక్టర్
"నిజమే ... అప్రూవల్ లేకుండా మనం ఈ ట్రాన్స్ ప్లాంట్ చెయ్యలేము ... మన చేతుల్లో ఒక గంట కూడా లేదు ...ఈలోపు అతని ఆర్గన్స్ ని వేరు చేసి భద్రపరచాలి ..లేకపోతే వాటి ఫంక్షనింగ్ ఆగిపోతుంది ... చూడబోతే అతని కోసం ఎవరూ వచ్చేలా లేరు " అన్నాడు మరో డాక్టర్
"ఇక్కడ మనం మానవతా దృష్టితో ఆలోచించాలి ... అతను ఎలాగూ బ్రెయిన్ డెడ్.. అంటే ఈక్వల్ టు డెడ్, కాని అతని అవయవాలు మరో వ్యక్తికి జీవితాన్ని అందించగలవు అని తెలిసాక ఉపేక్షించి, పరిస్థితి చెయ్యి జారాక మధనపడటం అవివేకం... ఐ వాన్నా గో విత్ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ ..." అన్నాడు భార్గవ్ కి ట్రీట్ చేస్తున్న డాక్టర్ రామకృష్ణ.
"రామకృష్ణ గారు .. నిజమే..కానీ రేపు అతనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చి మన మీద గొడవ చేసి... కేస్ పెట్టే వరకు వెళ్తే ?" అంటూ సందేహాన్ని వెలిబుచ్చాడు మరో డాక్టర్
"ఐ విల్ టేక్ ద బ్లేమ్... ఏదైనా దానికి బాధ్యత నేనే వహిస్తాను ..." అన్నాడు డాక్టర్ రామకృష్ణ ధృడంగా ..
"కానీ ...." అంటూ అందరూ మళ్లీ ముఖ్తకంఠంతో ఏదో చెప్పబోతుండగా ...అక్కడ ఇక సమయాన్ని వృధా చెయ్యడం ఇష్టం లేక లేచి వెళ్ళబోతూ అందరినీ చూసి "ఒక్క సారి ఈ యాదృచ్చిక పరిస్థితిని గమనించండి .. భార్గవ్ కి ప్రాణం ఉంది, కానీ వైటల్ ఆర్గన్స్ పనిచెయ్యడం లేదు ...సుధీర్ కి ప్రాణం లేదు కానీ వైటల్ ఆర్గన్స్ ఇంకా పని చేస్తున్నాయి ... మరికొద్ది గంటల్లో చనిపోబోయే భార్గవ్ కి, మనమందరం ఆశలు వదిలేసుకున్న భార్గవ్ కి, సరిగ్గా కంపాటిబుల్ ఉన్న బ్రెయిన్ డెడ్ డోనర్ దొరకడం ఆశ్చరంగా లేదూ.. సుధీర్ మరణానికి ఓ అర్థం కల్పించడం దైవేచ్ఛ కావచ్చు ... ఇది జరుగుతుంది .."అంటూ వెళ్ళిపోయాడు డాక్టర్ రామకృష్ణ.

అవయవాల మార్పిడి ఆపరేషన్ విజవంతంగా పూర్తిచేశాడు డాక్టర్ రామకృష్ణ...
డాక్టర్  రామకృష్ణకి చేతులెత్తి నమస్కరించింది భార్గవ్ తల్లి ..
"నా వృత్తి ధర్మం నేను నిర్వహించాను .. కానీ ఇదొక మిరకిల్, అంత అరుదైన డోనర్ సరిగ్గా టైంకి దొరకడం నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది .. అతని చావు ఇంకొక వ్యక్తికి జీవితం ప్రసాదించిందని తెలిస్తే, సుధీర్ ఆత్మ తప్పక శాంతిస్తుంది .. అందుకే నేను ధైర్యంగా ముందడుకు వేశా.. చెప్పాలంటే ఓ రకంగా నీ కొడుకులో సుధీర్ జీవిస్తున్నాడు ...శరీరమే నీ కొడుకుది, కాని అందులో ఉన్న గుండె, కాలేయం, ఊపిరి తిత్తులు, కిడ్నీలు, స్పైనల్ కార్డ్ ...ఇవన్నీ సుధీర్ వి.." అన్నాడు డాక్టర్ రామకృష్ణ ..

ఓ నెల హాస్పిటల్ లో ఉన్న భార్గవ్ ని డిస్చార్జ్ చేసారు ...ఇంటికి వెళ్ళిన కొద్ది రోజుల తర్వాత డాక్టర్ ని కలవడానికి వచ్చింది భార్గవ్ తల్లి ...
"డాక్టర్ గారు, నా కొడుకు చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు ..." అందామె..
"ఏమైంది ?" అడిగాడు డాక్టర్ రామకృష్ణ 
"ప్రొద్దున్నే లేచాక ... తను కాలేజీకి వెళ్ళాలి అనేవాడు ... 'కాలేజీ ఎంటిరా? షాప్ కి వెళ్ళడం లేదా' అని అడిగాను ..వాడు కంప్యూటర్ సేల్స్ చేస్తుంటాడు.. 'ఏంటమ్మా...ఏం మాట్లాడుతున్నావ్.. షాప్ ఏంటి, నేను గీతంలో ఇంజనీరింగ్ చేస్తుంటే' అని అనేవాడు ...నాకు ఏమీ అర్థం కాలేదు ..వాడు కాలేజీకి అని వెళ్ళేవాడు ..సాయంత్రం వచ్చేవాడు..రాగానే చాలా దిగులుగా ఉండేవాడు ..ఏమైంది కన్నా అని అడిగితే 'సంహిత కనిపించడం లేదమ్మా... నన్ను మర్చిపోయిందేమో అని భయంగా ఉందమ్మా.. తను నా కోసమే ఎదురుచూస్తుంటుంది అని చెప్పవా?' అని వాడు అడుగుతుంటే నాకేమి చెప్పాలో అర్థం అయ్యేది కాదు ...రోజూ ఇదే తంతు...వాడి ప్రవర్తనలో కూడా ఎన్నో మార్పులు .." అంటూ చెప్పుకొచ్చింది భార్గవ్ తల్లి ..
డాక్టర్ కొద్దిసేపు ఆలోచించి ... ఒక ఫైల్ ఓపెన్ చేశాడు..అది సుధీర్ బ్రెయిన్ డెడ్ & ఆర్గన్ ట్రాన్స్ ప్లాంట్ కి సంబంధిన ఫైల్... అందులో సబ్జక్ట్ హిస్టరీ కూడా రాసుంటుంది .. అతను అదంతా మళ్లీ ఓ సారి చదివి ...ఆమెతో " నేను చెప్పేది జాగ్రత్తగా వినండి .. ఒక వ్యక్తి వైటల్ ఆర్గన్స్ ఇంకొక వ్యక్తికి డొనేట్ చెయ్యడం వల్ల, డొనర్ కి ఉన్న కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ట్రాన్స్ ప్లాంట్ చెయ్యబడ్డ పేషంట్ కి వస్తాయి ..ఇవి కేవలం వైటల్ ఆర్గన్స్ - గుండె, కాలేయం, ఊపిరి తిత్తులు, కళ్ళు  మొదలైనవి ట్రాన్స్ ప్లాంట్ చెయ్యడం మూలాన మాత్రమె వస్తాయి .. ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్.. కానీ అన్ని కేసెస్ లో రావాలని లేదు ... అందుకే నేను మొదట మీకు ఎటువంటి హెచ్చరికా చెయ్యలేదు... మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే, సుధీర్ క్యారెక్టరిస్టిక్స్ భార్గవ్ లో చాలా స్థిరంగా నాటుకున్నాయేమో అనిపిస్తుంది .. సుధీర్ గీతం కాంపస్ స్టూడెంట్.. అతనికి కార్తీక్, సంహిత చాలా బెస్ట్ ఫ్రెండ్స్ .. ఈ విషయాలన్నీ మా టీం కేస్ స్టడీ కోసం కాలేజీకి వెళ్లి గేదర్ చేసింది  .. భార్గవ్ ఐడింటిటి కన్నా అతనిలో సుధీర్ ఐడింటిటి బలంగా ఉంది ..." అన్నాడు 
"ఇప్పుడు ఏం చెయ్యాలి డాక్టర్ ..." అడిగిందామె అయోమయంలో..
"మీరు అతన్ని సుధీర్ లాగానే గుర్తించండి ... సంహిత ఎవరో తెలిసినట్లే ప్రవర్తించండి.. అతని మనఃస్థితి అలాగే ఉండనివ్వండి...నేను దీనికి కొన్ని సైకలాజికల్ థెరపీలు రికమండ్ చేస్తాను... " అన్నాడు డాక్టర్ ...

************ ప్రస్తుతం ********************

అలా తలపట్టుకొని క్రింద పడిపోయిన భార్గవ్ ని హాస్పిటల్ లో చేర్చాడు కార్తీక్... అక్కడి డాక్టర్ భార్గవ్ కి ఏవో పరీక్షలు చెయ్యగా అతని వైటల్ ఆర్గన్స్ అన్నీ ట్రాన్స్ ప్లాంట్ చెయ్యబడ్డవే అని గుర్తించి కార్తీక్ కి చెప్తాడు అదే విషయం.. అది కార్తీక్ కి చాలా షాకింగ్ గా అనిపించింది .. 'ట్రాన్స్ ప్లాంట్ చెయ్యబడ్డ ఆర్గన్స్ ఎవరివో ట్రేస్ చెయ్యవచ్చా' అని కార్తీక్ డాక్టర్ ని అడిగాడు.. డాక్టర్ ప్రయత్నించవచ్చు అని చెప్పి, అన్ని మేజర్ హాస్పిటల్స్ కి కాల్ చేసి ఈమధ్య జరిగిన మేజర్ బాడిలీ ట్రాన్స్ ప్లాంట్స్ గురుంచి యంక్వయిరీ చేశాడు..

"మిస్టర్ కార్తీక్... ఈ మధ్య జరిగిన మేజర్ బాడిలీ ట్రాన్స్ ప్లాంట్ - ఆల్ వైటల్ ఆర్గన్స్ ట్రాన్స్ ప్లాంట్...ఇది చాలా అరుదు .. ఇతనికి కూడా అన్ని వైటల్ ఆర్గన్స్ ట్రాన్స్ ప్లాంట్ చెయ్యబడ్డాయి ...సో, ఇతనిదే ఆ మేజర్ ట్రాన్స్ ప్లాంట్ అయ్యుండొచ్చు ... ఆ పేషంట్ పేరు భార్గవ్ అని తెలిసింది ..." అన్నాడు డాక్టర్ 
"ఏ వ్యక్తి ఆర్గన్స్ ట్రాన్స్ ప్లాంట్ చేశారో మనం తెలుసుకోవచ్చా?" అడిగాడు కార్తీక్ 
"అది హాస్పిటల్ వాళ్ళు గోప్యంగా ఉంచుతారు...అయినా నేను ప్రయత్నిస్తాను .." చెప్పాడు డాక్టర్ 
"థాంక్ యు డాక్టర్ ...ఇది నా నెంబర్...మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ దొరికితే నాకు చెప్పండి " అని తన నెంబర్ ఇచ్చాడు కార్తీక్ ..

                                        ****
"వాట్?? ఏంటి నువ్వనేది ??" ఆశ్చర్యంగా చూసింది సుధ
"నిజం...అతను అచ్చు సుధీర్ లాగానే ప్రవర్తించడమే కాదు ...నన్ను, దివ్యని గుర్తుపట్టాడు .. సంహిత గురుంచీ అడిగాడు .. సంహితని కలిశాడట.." చెప్పాడు కార్తీక్ 
"అసలిదెలా సాధ్యం ..అయోమయంగా ఉంది " అంది సుధ ఆశ్చర్యపోతూ..
"అతని ముఖ్య అవయవాలు అన్నీ ట్రాన్స్ ప్లాంట్ చెయ్యబడ్డాయి ...అతని పేరు భార్గవ్ అట"..
ఇంతలో కార్తీక్ కి ఒక కాల్ వచ్చింది ...
"వాట్ ?" కార్తీక్ నోట మాట రాలేదు అవతలి వ్యక్తి చెప్పింది విని...
"ఏమయింది ?" అడిగింది సుధ
"భార్గవ్ అవయవాల డోనర్.........సుధీర్ " చెప్పాడు ఏదో ట్రాన్స్ లో ఉన్నవాడిలా..
"ఏంటి నువ్వు మాట్లాడేది ..." అందామె షాక్ తగిలిన దానిలా ...
"మనం వెంటనే భార్గవ్ ని కలవాలి .." అన్నాడు కార్తీక్....
"ఎందుకు .... అతనికి మొత్తం చెప్పేస్తావా ?" అడిగింది సుధ ...
"లేదు...అతను ఇప్పుడు తను సుధీర్ అనుకుంటున్నాడు ...అతన్ని సుధీర్ గానే మనమూ చూడాలి...నేను తన స్నేహితుడిగానే అతన్ని కలుస్తాను ... కానీ ...సంహితకి అన్ని విషయాలూ తెలియాలి ...సంహితకి తను ప్రేమించిన సుధీర్ గురుంచి తెలియాలి ... సుధీర్ అవయవాలతో బ్రతుకుతున్న భార్గవ్ గురుంచీ తెలియాలి .... ఇకనుంచి ఏమి చెయ్యాలో నాకు అర్థం అయింది ...." అన్నాడు కార్తీక్ ధృడంగా నిశ్చయించుకున్న వాడిలా ....

[To be continued in the 9th part...have a great day - Ramakrishna Reddy Kotla]

15 comments:

manasa said...

బావుంది.ఈసారయినా ముగిస్తారనుకున్నా...ఇంతకీ దీని తరువాత మరో సీరియల్ తయారయ్యిందా లేదా :)? నాకు మీ బ్లాగు లోడ్ చేస్తోంటే ఎందుకు సరిగ్గా అవ్వదు చాలా సేపు? మీ బ్లాగుతో ప్రతీ సారీ ఇలా అవుతోంది నాకు.మొదటి 2-3 పేరాలు చదవాగానే స్ట్రక్ అయిపోతుంది.మళ్ళీ మళ్ళీ రీఫ్రెష్ కొడితే కానీ మొత్తం అవ్వదు.

ఆ.సౌమ్య said...

హ్మ్ మళ్ళీ పెట్టారా ఫిట్టింగు...కానివ్వండి,కానివ్వండి ....తదుపరి ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తూ...

Malakpet Rowdy said...

Sorry to be a nitpicker -

కానీ నాకు అర్ధమైనంతవరకూ, మెదడుని మారిస్తే తప్ప వ్యక్తులు మారరు. ఇప్పటిదాకా మెదడుని మార్చిన దాఖలాలెక్కడా లేవు. గుండె, కళ్ళు, కాలేయం, పెద్ద ప్రేగు మార్చినంతమత్రాన వ్యక్తిత్వం మారదనే అనుకుంటున్నా.

Padmarpita said...

పూర్తైపోయాక నవలలా చదువుతాను:)

ప్రణీత స్వాతి said...

నెక్స్ట్ ఎపిసోడ్ ప్లీజ్ ..

కవిత said...

నెక్స్ట్ ఎపిసోడ్ ప్లీజ్ ..

So you gonna finish the story in the next part..am i rite??

..nagarjuna.. said...

అంతా అయిపోయింది, కన్నీళ్లు కార్చి, అవి తుడుచుకొని చప్పట్లు కొడదామనుకున్నా...ఇంతలో కనపడింది "to be continued" అని...ఎన్ని రోజులు నిరీక్షింపజేయిస్తావయ్యా....

రామాయణంలో పిడకలవేట: ఇప్పుడూ భార్గవ్ కు సుధీర్ గుండే,కాలెయం, వెన్ను, కళ్ళు ట్రాంన్స్‌ప్లాంట్ చేసారు అన్నారు... మరి ఇవేవి కూడ జ్ఞాపకాలను దాచుకోలేవుకదా!! జ్ఞాపకాలు ఉండేది మదడులో మత్రమేనే..spinal cord only takes decisions..

శివరంజని said...

ఊహించని మలుపులుతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ అందరి మన్ననలు పొందుతున్నఈ స్టోరీ ని ఆదరించిన బ్లాగర్ల కి కొన్ని ఊహించని బహుమతులు
మొదటి ప్రశ్న : ఈ స్టొరీ క్లైమాక్ష్ ఊహించి చెప్పగలరా ?
రెండవ ప్రశ్న : ఈ స్టొరీ లో ఇంకా ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి?
ఎ) ఒకటి బి) రెండు సి) మూడు డి) ఏమి కావు
మొదటి ప్రశ్న కి కరెక్ట్ సమధానం చెప్పిన విజేతలందరికి(all winners) రోల్ టాప్స్ , రెండవ ప్రశ్న కి కరెక్ట్ సమధానం చెప్పిన విజేతలందరికి(all winners) లాప్ టాప్స్ స్వయం గా కిషన్ గారే అందజేస్తారు.(ఇంత మంచి నిర్ణయం తీసుకొన్న కిషన్ గారికి ధన్యవాదములతో ... )

Sirisha said...

good going chala bagundh...medical background emanna unda...nadhi same question brain transplantation kadu ga jarigindhi?

Ram Krish Reddy Kotla said...

మానస : దీని తర్వాత ఇంకో సీరియలా .. ఈ మాట గట్టిగా అనకండి, కొంతమంది వింటే నా పని గోవిందా ... [మనలో మన మాట ...నెక్స్ట్ సీరియల్ రెడీ ]

సౌమ్య : త్వరలోనే !!

పద్మార్పిత : అలాగంటారా..సరే కానీండి :-)

Ram Krish Reddy Kotla said...

ప్రణీత : మరి కొద్ది రోజుల్లో ...

కవిత : హ్మం.. క్రింద రంజని ఏదో క్వస్చన్స్, దానికి బహుమతులు అంటూ పెట్టింది..కనుక మీ ప్రశ్నకు నేను జవాను ఇవ్వట్లేదు :-)

రంజని : వెరీ గుడ్ ..నువ్వెంత మంచి దానివి..ఎంతైనా గోదావరి అమ్మాయివి కదా [Other areas girls, no offense plz]..ఇకపోతే నేను కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి..నువ్వే రాజమండ్రి వెళ్లి, దానవాయిపేటలో ఓ కంప్యుటర్ షాప్ ఉంది..అక్కడ లాప్ టాప్స్ తర్వాత్ రోల్ టాప్స్(అవి ఎక్కడ దొరికితే అక్కడ) కొనుక్కోచ్చేసెయ్యి ...నేను నీకు బిల్ మనీ వీలున్నప్పుడు, ట్రాన్స్ ఫర్ చేస్తా ...డీల్ ఒక అయితే..కంపుటిషన్ మొదలెట్టేయ్యి...సరేనా :-)

Malakpet Rowdy said...

Well, well well ... Cellular Memory so far has been anecdotal.

http://en.wikipedia.org/wiki/Cellular_memory

It clearly says that "To date, no case where personality traits or memories have been passed from donor to recipient following an organ transplant has ever been recorded in a peer reviewed medical or scientific journal"

So, we never know!!

Ram Krish Reddy Kotla said...

బ్లాగ్మిత్రుల సందేహాన్ని నివృత్తి చెయ్యడానికి మరొక టపా రాస్తున్నా... కొంచెం క్లియర్ గా నా జవాబు చెప్దామని.

Raj said...

kishen reddy.....

serial name marchesaru bagundi but mi peru kuda marchesara leka idi mi original name na.....


fine...ee part ki vachesariki....

mi serial lo vunna vadi vedi intrest taggipoindi...comparing to the before episodes...first 4-5 episode aithe pichekinchinantha baga rasaru...mari endhuko...7,8th lo mi skill taggindi anipistundhi....

Ram Krish Reddy Kotla said...

Raj: Yes, this is my Original name...well, coming to ur comments on story progess, well i respect ur words..and take necessary care...thank you :-)