Search This Blog

Thursday 24 June, 2010

నేడే... ఈనాడే ....నా బ్లాగు పుట్టినరోజు...కావాలి మీ ఆశీస్సులు


మన బ్లాగ్లోకంలో బ్లాగు పెట్టిన సంవత్సరానికి ఇలా బ్లాగు పుట్టిన రోజు టపా రాయడం ఈ మధ్య సంప్రదాయంగా వస్తున్న దృష్ట్యా నేను కూడా ఇలా నా బ్లాగు పుట్టిన రోజు టపాని మీ ముందుకు తీసుకు వస్తున్నా ...

సరిగ్గా సంవత్సరం క్రితం తెలుగులో బ్లాగులు ఉన్నాయనే విషయం నాకు నిజ్జంగా తెలియదు.. కానీ కేవలం బ్లాగులు ఉండటమే కాదు... ఎన్నో బ్లా.స లు రూపుదిద్దుకోవడాలు .. ఒక బ్లా.స ని తొక్కడానికి మరొక బ్లా.స లు పుట్టడాలు.. ఎన్నో బ్లాగు పరిచయాలు.. ఎందరో మేధావుల గొప్ప టపాలు .. అదొక ప్రపంచంగా కలిగియున్నదని తెలిసి... ఔరా ఏమి నా వెనకబాటుతనము అని చింతించితిని...

కనుక  నేను బ్లాగు మొదలెట్టిన విధంబెట్టిదనిన అంటూ నేను నా బ్లాగు ప్రస్తానం చెప్పాల్సిందే మీరు వినాల్సిందే...

ఓ రోజు ఆఫీసు లో పనిచేస్తున్నట్లు నటిస్తూ సీరియస్ గా  జీ-టాక్ చాట్ చేస్తుండగా.. సందీప్ ఆన్లయిన్ వచ్చాడు .. ఏవో కాసేపు కష్టసుఖాలు మాట్లడుకుంటూ "లైఫ్ చాలా బోర్ గా ఉందిరా ..." అన్నాను ... 
"నువ్వు స్టోరీస్ అవీ రాసి మాకు చుపించేవాడివి వాడివి కదా, అవి ఒక బ్లాగు పెట్టి వాటిలో రాయి సరదాగా.. చాలా మంది చూస్తారు .. నీకు కామెంట్స్ ఇస్తారు ..." అన్నాడు 
"నేను తెలుగు స్టోరీస్ కదరా రాసింది ... అవి బ్లాగులో ఎలా రాస్తాం .." అన్నాను..
"తెలుగులో కూడా రాయచ్చు బ్లాగ్... తెలుగులో చాలా బ్లాగులు ఉన్నాయి ...కూడలి.ఆర్గ్ లో చూడు కావాలంటే" అన్నాడు ...
"అవునా... అయితే నేను కూడా రాసేస్తా ...కొంచెం ప్రాసెస్ చెప్పి పుణ్యం కట్టుకో .."
"చెప్తాలే కాని ...కొన్ని బ్లాగులు చూడు ముందు ..." అని ఒక బ్లాగు లింక్ ఇచ్చాడు ...
ఆ లింక్ పేరు చూసి ... "ఈ బ్లాగేదో పూల బ్లాగులా ఉంది ... పూల గురుంచి పండ్ల గురుంచి ఏం చదవమంటావు ... ఏదన్నా మాంఛి ఇంటరెస్టింగ్ బ్లాగు ఇవ్వు.." అన్నాను 
"నీ మొహం ..ఆవిడేదో పాపం ఇష్టమైన పూలు కాబోలు ఆ పేరు పెట్టుకుంది ... లేకపోతే ఆడువారికి జనరల్ గా పూలంటే ఇష్టం కాబట్టి అలా పెట్టుకుందేమో ...అంతమాత్రాన ఆమె పూల గురుంచి వాటి పుట్టు పూర్వోత్తరాల గురుంచి రాస్తుందనుకున్నావా .. ఈమె చాలా బాగా రాస్తుందిరా ...అందుకే ఈ లింక్ ఇచ్చా ... చదువు .." అన్నాడు 
"సరేలే ...రూంకి వెళ్లి నింపాదిగా చదువుతా ..." అన్నాను 

సాయంత్రం రూంకి వెళ్లి తీరిగ్గా బ్లాగు ఓపెన్ చేశాను... ఆమె రాసిన టపాలు ఒక్కోటీ చదువుతుంటే నాకు ఏంటో తెలియని ఆనందం కలిగింది .. అప్పటికి ఆమె రాసిన ఇరవై నాలుగు టపాలు చదివేశా ఏకబిగిన .. అప్పటి ఆమె లేటెస్ట్ టపాకి కామెంట్ పెట్టి ఆమె రిప్లై ఎప్పుడు ఇస్తుందా అని గంటకి ఓ సారీ ఆమె బ్లాగు చూడటం చేసేవాడిని ... తరువాతి రోజు ఆమె రిప్లై చూసి చాలా చాలా ఆనందం వేసింది ... నేను బ్లాగ్ మొదలెట్టడానికి నాకు చాలా స్ఫూర్తిని కలిగించారు ఆవిడ ...ఆవిడే మన నేస్తం... జాజిపూల నేస్తం :-)...నా మొదటి బ్లాగు నేస్తం... అప్పటినుంచి నేను రాసిన ప్రతి టపాకి ఆమె కామెంట్ ఉంటుంది, నేస్తం అందించిన ప్రోత్సాహం మరువలేనిది...

ఇంకా నా బ్లాగు ప్రస్తానంలో నాకు ఎందరో మంచి ప్రోత్సాహం అందించిన స్నేహితులు ఉన్నారు  ... శివరంజని - నా ప్రతి టపాలో మంచి ప్రోత్సాహం అందించే స్నేహితురాలు, అలాగే స్పురిత, సౌమ్య, భాస్కర రామిరెడ్డి, పద్మార్పిత, సుభద్ర, మధురవాణి, మోహన్ (అమ్మాయికళలు), ప్రణీత, మానస, ప్రియ, దివ్యవాణి, నరేష్, రిషి  ఇలా ఇంకా చాలా మంది... అందరికి పేరు పేరునా నా ధన్యవాదాలు ...నన్ను ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను.

బ్లాగు మొదలెట్టాక మొదటి టపా ఏమి రాయాలా అని అందరి లాగానే చాలా ఆలోచించాను ... ఆలోచించగా చించగా నా ఇంటర్ అనుభవాలు రాయాలనిపించి రాసేశాను .. రెండు భాగాలుగా రాసిన నా ఇంటర్ అనుభవాల టపా "కళాశాలలో ...కళాశాలలో ...ఓ ఓ ఓ " కి మంచి స్పందన వచ్చింది బ్లాగ్మిత్రుల దెగ్గరినుంచి ...  ఇంక అంతే రెచ్చిపోయా... జూలైలో  ఏడు టపాలు రాశాను ... ఆ తరువాత జోరు కొంచెం తగ్గినా అడపాదడపా రాస్తూనే ఉన్నాను, ఆ ఏడాది(2009) చివరికల్లా పదిహేను టపాలు మాత్రమే రాయగలిగాను ... ఆ సంవత్సరంలో నా పదిహేను టపాలలో స్క్రిప్ట్ పరంగా నాకు చాలా సంతృప్తిని కలిగించిన టపాలు "నిను వీడని నీదని నేనే", "ఊహలు నిజమైన వేళ", "ఆఖరి మజిలీ", "A క్యూట్ లవ్ స్టోరీ with బటర్ స్కాచ్ topping...", "పిచ్చికాక లవ్ స్టోరీ..నగాదేవిలో నువ్వునాకునచ్చావ్..డ్రైవర్ అన్నయ్యకు యాభై..".

2010లో ఇప్పటిదాకా రాసినవి పదహారు టపాలు..వీటిలో తొమ్మిది టపాలు ఎపిసోడ్స్ గా రాసిన నా మొదటి సీరియల్ ప్రయత్నం "హృదయంప్రేమిస్తానంటే..విధి విడదీస్తానంటే!!" లోనివే .. ఈ సీరియల్ ని నేను అనుకున్న దాని కన్నా బాగానే రిసీవ్ చేసుకున్నారు.. అందుకు నాకు చాలా సంతోషం కలిగింది.. ఈ సీరియల్ లో నేను చేసిన చిన్న చిన్న తప్పిదాలని నాకు ఓపికగా వివరించి చెప్పిన నేస్తం గారు నాకు నిజమైన క్రిటిక్ ... ఆమె క్రిటిక్స్ నన్ను నేను ఉన్నతంగా నిలుపుకోవడానికి ఎప్పుడూ ఉపయోగపడతాయి... ఇంకా ఈ సీరియల్ లో రంజని ప్రోత్సాహాన్ని మరువలేను..తన కామెంట్స్ నాకు పాజిటివ్ ఎనర్జీ అందించేవి.... ఇంకా నా ఇంటర్ స్నేహితురాలు కవిత కూడా నాకు మంచి సపోర్ట్ మరియు క్రిటిక్...

2010లో నేను నా శైలిలో చాలా మార్పులు తీసుకొచ్చాను... కొంచెం కొత్తగా రాయడానికి కొన్ని ప్రయోగాలు చేశాను.. కొన్ని బాగున్నాయి... మరి కొన్ని బెడిసికొట్టాయి.. "షార్టుకట్ టు గోపాలపురం" నేను చేసిన శైలి ప్రయోగంలో ఒకటి...నాకు మాత్రం పూర్తి సంతృప్తిని మిగిల్చింది ఈ కథ... అలాగే "ఆపరేషన్ ఆరువేల కోట్లు వయా నడిమంత్రపు సిరి పాలసీ"..ఇది కూడా శైలిలో కొద్ది మార్పులు చేసి వ్రాసిన కథే...

ఇలా  సంవత్సరం పూర్తి చేసుకుంది నా "ఆకాశవీధిలో..." బ్లాగు...ఈ ప్రయాణంలో నన్ను ఆదరించి, అభిమానం చూపించి, స్ఫూర్తిని అందించి, ప్రోత్సాహం కలిగించిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు... ఈ కిషన్ ఎప్పుడూ మిమ్మల్ని మరచిపోడు....

"ఆకాశవీధిలో..." బ్లాగులో త్వరలో మరొక చిన్న సీరియల్ ప్లాన్ చేస్తున్నా... పూర్తి లవ్ స్టోరీ... చూద్దాం అదెలా వర్కవుట్ అవుద్దో... 

అదీ మరి సంగతి... ఒక సంవత్సరం ఎంత ఫాస్టుగా గిర్రున తిరిగిపోయిందో... సరే నా బ్లాగు రెండో సంవత్సరంలో అడుగుపెట్టేసింది.. ఈ సంవత్సరంలో నా బ్లాగు మిమ్మల్ని ఇంకా ఎంతో అలరించాలని...నాకు ఎందరో మంచి స్నేహితులు దొరకాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను... నాకు తెలుసు నివ్విస్తావ్..ఖచ్చితంగా ఇస్తావ్..బికాస్ యు ఆర్ బెసికల్లీ గాడ్...ఎ వెరీ గుడ్ గాడ్ .. :-)


Have a wonderful day ----------------------------------  Yours  K R K Reddy

60 comments:

మంచు said...

కంగ్రాట్స్ KRKR .. ఇలాగే దూసుకుపొ.. :-))

---------

ఇంతమంది అభిమానాన్ని సంపాదిస్తూ.. ఎంతొ మందికి ఇన్స్పిరెషన్ గా నిలిచిన మన నేస్తం గారు ఇప్పటికయినా మనందరికి ఒక మంచి పార్టి ఇవ్వాల్సిందే.. మీరు రాలేనంటే చెప్పండి.. వచ్చే నెల్లొ సింగపూర్ వెళ్ళినప్పుడు మీ అందరి తరపున నేను తీసుకుంటా.. :-))

చిలమకూరు విజయమోహన్ said...

మీ బ్లాగు జన్మదిన శుభాకాంక్షలు.ఎల్లప్పుడూ మీరు హాయిగా ఆకాశవీధిలో విహరిస్తూ ఉండాలని కోరుకుంటూ....

..nagarjuna.. said...

Happy Birthday to your blog...

అనామిక said...

కిషన్ గారు....కంగ్రాట్స్ అండి :)
మొదలు పెట్టిన కొద్ది కాలం లోనే మా లాంటి వాళ్ళకి స్పూర్తినిచ్చారు .మీలాంటి వాళ్ళ స్ఫూర్తి తో నేను కూడా మొదలు పెట్టాను.
మీరిలాగే మంచి కథలు ,సీరియల్స్ రాయాలని కోరుకుంటూ...
హ్యాపీ బర్త్ డే టు యువర్ బ్లాగ్ ..

అనామిక said...

కిషన్ గారు....కంగ్రాట్స్ అండి :)
మొదలు పెట్టిన కొద్ది కాలం లోనే మా లాంటి వాళ్ళకి స్పూర్తినిచ్చారు .మీలాంటి వాళ్ళ స్ఫూర్తి తో నేను కూడా మొదలు పెట్టాను.
మీరిలాగే మంచి కథలు ,సీరియల్స్ రాయాలని కోరుకుంటూ...
హ్యాపీ బర్త్ డే టు యువర్ బ్లాగ్ ..

suvarna said...

Hello KIshan garu,
My name is suvarna
iam tyred this routene life.
i want to start a blog
how can i write in telugu
please give me the some information

thanks

భాస్కర రామిరెడ్డి said...

బుడిబుడి అడుగుల బుడతడు
వడివడి రువ్వెను వలపుల వ్యాసపు రచనల్
కడివెడు నవ్వుల కృష్ణుడు
అడుగక విందును నిడువడ అన్నకు ముదమున్

కిషన్.. మరి ఎక్కడ ఎప్పుడు పార్టీ ఇస్తావో ఏమో :)

జ్యోతి said...

బ్లాగు వార్షికోత్సవ శుభాకాంక్షలు ...

Saahitya Abhimaani said...

అభినందనలు

కోడీహళ్ళి మురళీ మోహన్ said...

అభినందనలు!

divya vani said...

కిషన్ గారు ముందు మీ బ్లాగు పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు మీకు శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు అండి . మీరు మి బ్లాగు సంవత్సర కాల ప్రయాణం లో నన్ను కూడా చేరుస్తారని నేను ఊహించలేదు అండి, ఇంతకి అది నా పేరే నా అండి ,అయితే ధన్యవాదాలు కిషన్ గారు

divya vani said...

కిషన్ గారు ముందు మీ బ్లాగు పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు మీకు శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు అండి . మీరు మి బ్లాగు సంవత్సర కాల ప్రయాణం లో నన్ను కూడా చేరుస్తారని నేను ఊహించలేదు అండి, ఇంతకి అది నా పేరే నా అండి ,అయితే ధన్యవాదాలు కిషన్ గారు

divya vani said...

నేను కూడా మీలాగే జాజిపూలు నేస్తం గారికి కామెంట్ రాసి మీలాగే రిప్లే కోసం యెదురుచూసాను.మీరు యిలాగె మంచి సీరియల్స్ మంచి మంచి టపాలు రాసేయండి

చెప్పాలంటే...... said...

Congrats kishan gaaru.....me blog ki puttina roju subhakankshalu...chalaa chakka gaa rastunnaru...marinni manchi manchi kadhalu, serials mee nunchi raavaalani manaspurti gaa korukuntu....

Ai said...

Congrats Dear

Ali

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

శుభాకాంక్షలు.
మీరిలాగే మునుముందు ఇంకా మంచి టపాలు వ్రాసి అందరి ఆదరాభిమానాలు పొందాలని ఆశిస్తూ

శివరంజని said...

మీ బ్లాగ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు.
మీ బ్లాగ్ ప్రయాణం లో ఎన్నో విజయ శిఖరాలని అధిరోహించాలని..., ఇంక ఎక్కడానికి కూడా అక్కడ శిఖరాలేమి లేవే అన్నంత ఎత్తుకు ఎదగాలని..., మీ మంచి మనసుకి ఇలాంటి మంచి స్నేహితులు ఇంకా దొరకాలని..., మీ బ్లాగ్ ఇలాగే పుట్టిన రోజులు చేసుకుంటూ షష్టిపూర్తి కూడా జరుపుకునేంతా దిగ్విజయంగా ముందుకు సాగాలని (బాగా ఎక్కువ ప్రోత్సాహించినట్టున్నాను)..... మనస్పూర్తిగా కోరుకుంటున్నాను......
ఇకపోతే wishes చెప్పే వాల్లందరికి Birthday party...... at least chocolates ..

నేస్తం said...

అప్పుడే సంవత్సరం అయిపోయిందా.. రొజులు గిర్రున తిరుగుతున్నాయేం..ఇంకా నాకు నిన్నగాక మొన్న ' మా ఫ్రెండ్ చెప్పాడు మీ బ్లాగ్ గురించి ..చాలా బాగా రాసారు 'అని కిషన్ అన్నట్లుగానే ఉంది .. :) అప్పట్లో అడుగుదాం అనుకున్నా ఎవరా ఫ్రెండ్ ?నా బ్లాగ్ గురించి చెప్పినవారు అని :)నేను కామెంటితే తన గురించి అడుగుతుందేమిటి ?అని అనుకుంటారని ఆగిపోయానన్నమాట ..ముఖ్యం గా ఇంత తక్కువ కాలం లో ఇంత చక్కని గుర్తుపు తెచ్చుకున్నందుకు శుభాకాంక్షలు బోలెడు అభినందనలు కిషన్ :) ముఖ్యం గా మీ అందరి మీదా కోపం ఎక్కడంటే నేనేదో సూపర్ రాసేసినట్లు పొగిడేస్తుంటే నిజమే కాబోలు అనేసుకుని తెగ ఫీల్ అయిపోయేదాన్ని..ఒక్కోక్కరూ బ్లాగులు మొదలెట్టాకా (మంచుపల్లకి.3g,మీరు ఇంకా అందరును ) అప్పుడు నేల మీద నిలబడ్డాను అన్నమాట...:)....

durgeswara said...

digvijayostu

ఆ.సౌమ్య said...

పుట్టినరోజు జేజేలు చిట్టి బ్లాగాయి(పాపయిలాగన్నమాట)...మీ బ్లాగు మొదటిసారి చూసింది 'షార్టుకట్ టు గోపాలపురం' కథతోనే....చాలా బాగా రాస్తున్నారు. ఇలాగే దినదినాభివృధి సాధించాలని కోరుకుంటున్నాను.

All the best!

మధురవాణి said...

Happy birthday to 'Aakaasha veedhilo' :-) మీ నెక్స్ట్ సీరియల్ కోసం ఎదురు చూస్తుంటాం.. మీరిలాగే సూపర్ డూపర్ కథలూ, సీరియల్సూ రాసేసి యండమూరి, మల్లాది లెవెల్ కి ఎదిగిపోవాలనీ, అప్పుడు మేమందరం ఆ ఫేమస్ రచయిత కిషన్ గారు మాకు కొత్తలోనే పరిచయం తెలుసా.. అని గొప్పగా చెప్పుకోవాలనీ..మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ..Happy Birthday! :-)

రాధిక(నాని ) said...

కిషన్ గారు, మీ బ్లాగ్ ని బ్లాగ్ పుట్టినరోజు నాడె చూడడం యాదృచ్చికం,మీటేంప్లేట్ బాగుంది.మీటపాలన్ని బాగున్నాయి.ఇన్ని రోజులూ మీబ్లాగ్ చూడలేదేమిటా అనుకున్నాను.
మీబ్లాగ్ పుట్టినరోజు శుభాకాంక్షలు.

కృష్ణప్రియ said...

కిషన్ రెడ్డి గారూ,

కంగ్రాట్స్! మీరు నా బ్లాగులో కామెంట్లు పెట్టినప్పుడు నేనూ, అబ్బో..ఒక రచయిత నా చిన్న బ్లాగ్ కి అని మురిసిపోయాను.

కృష్ణప్రియ/

జయ said...

Kishan gaaru, యెస్, మీ వెరీ గుడ్ గాడ్ తప్పకుండా మీ కోరిక తీరుస్తాడు. చాలా మంది కొత్త, మంచి స్నేహితులు లభించుగాక! I wish you all the best and a very happy birth day.

మాలా కుమార్ said...

బ్లాగ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు .

కవిత said...

@ కిషన్ గారు,మొదటగా మీ బ్లాగ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు ...ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్న...
ఇంకో విషయం మీరు నేస్తం గారిని చూసి ఎలా బ్లాగ్ రాయటం మొదలు పెట్టారో ...నేను మిమ్ముల్ని చూసి బ్లాగ్ రాయాలి(రాయాల్సిందే) అని నిర్ణయం తీసుకున్నాను....నాకు బ్లాగ్ లోకం లో బ్లాగడం గురించిన ఓనమాలు నేర్పిన గురువు గారు కిషనేనందోయ్...ఇది ఎవ్వరికి(కిషన్ కి ) కూడా తెలియని సత్యం.తను రాసిన మా ఇంటర్ కళాశాల కబుర్లు చూసి నేను ఒక పది సంవత్సరాలు వెనకకి వెళ్ళాను అంటే చూసుకోండి తనలోని గొప్పతనం.కిషన్ చాలా చాలా పొగిడా కదా.....సరే మరి మన మిత్రులందరూ పార్టీ అడుగుతున్నారు...అందరి తరఫున నాకు ఇవ్వండి మరి .
భాస్కర రెడ్డి గారు,శివరంజని గారు ...మీకేండుకులెండి శ్రమ అని నేనే మీ తరఫున తీసుకుందాం అని డిసైడ్ అయ్యా...ఏమంటారు మరి?

sivaprasad said...

congrats boss

హను said...

మీ బ్లాగ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు ..

Ram Krish Reddy Kotla said...

@మంచు: థాంక్స్ బ్రదర్.. అలాగే దూసుకుపోతాను ... :-) నేస్తం గారూ మంచు గారు పార్టీ అడుగుతున్నారు...అదేంటో చూడండి ;-)

@విజయమోహన్: ధన్యవాదాలు మీ అభిమానానికి.

@చారిగారు: థాంక్స్ ఎ లాట్ బ్రో :-)

@ త్రుప్తి: మీ కామెంట్ ఎప్పుడూ నాకు త్రుప్తిని ఇస్తుంటుంది. మీ అభిమానానికి ధన్యుడిని.. మీకు నేను స్ఫూర్తి కలిగించడం నిజంగా చాలా ఆనందం కలిగిస్తుంది.. మీరు కూడా ఇరగదియ్యండి ..మేమంతా ఉన్నాం మీకు :-)

Ram Krish Reddy Kotla said...

@Suvarna: After you create a blog in www.blogger.com, u can directly post in telugu language. In blogger settings, click on "basic" tab and in the end of the page just enable 'transliteration in telugu'. If you enable this, while ur composing a post in composer, u will find an option to write in telugu in the toolbar. just click on that language tool and write in telugu. There is another option, download telugu transliteration tool bar to your computer and write in telugu this is purely hassle-free. You can download this by googling as "google indic transliteration download". If u got any doubt, ask me.. or mail me ...happy blogging in telugu :-)

జ్యోతి: ధన్యవాదాలు :)

భాస్కరా: అన్నా నేను రెడీ...మే ఇష్టం ఎప్పుడు కావాలన్నా...ఎక్కడ కావాలన్నా ఇస్తాను ..:-)

శివ: థాంక్స్

Ram Krish Reddy Kotla said...

@మురళీమోహన్: థాంక్స్ ఎ లాట్ సర్ :)

@దివ్య: మీకు అంత డౌట్ ఎందుకు వచ్చింది.. అది మీ పేరే.. మీ అభిమానానికి థాంక్స్ :-)..ఓకే మీరు కూడా నాలాగే నేస్తం గారి రిప్లై కోసం చూసేవారా..:-)

మంజు: మీ అభిమానానికి వెయ్యి థాంక్స్ లు ..:-)

అలీ: థాంక్స్

Ram Krish Reddy Kotla said...

@శ్రీకాంత్: ధన్యవాదాలు .. మీలాంటి వారి ప్రోత్సాహం నన్ను ముందు నడిపిస్తుంది

రంజని: నీకు కోటి థాంక్స్ లు ... చాలా బాగా ప్రోత్సహించారు :-)... ఇక పోతే ఆకాశవీధిలో బ్లాగు పుట్టినరోజు తరపున తూ.గో జిల్లాలో ఉన్న అమ్మాయిలందరికీ నా తరపున డైరీ మిల్కు చాక్లెట్స్ పంచి పెట్టు ..సరేనా ...నువ్వు చేస్తావ్ నాకు తెలుసు :)

నేస్తం: నిజం నేస్తం రోజులు ఎలా గిర్రున తిరుగుతున్నాయో తలచుకుంటుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది.. మీ అభిమానానికి నేను ఎప్పుడూ ధన్యుడినే.. మీరు అలా ఫీల్ అవ్వడం కరెక్టే..యు డిజర్వ్ ఇట్ ఇండీడ్.. ఇకపోతే, సింగపూర్ లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఆకాశవీదిలో బ్లాగు పుట్టినరోజు సందర్భంగా కిట్-కాట్ లు పంచిపెట్టండి :-)

దుర్గేస్వరా: థాంక్స్ అండి

Ram Krish Reddy Kotla said...

సౌమ్య: నా బ్లాగాయికి మీ శుభాకాంక్షలు తెలిపినందుకు చాలా థాంక్స్.. మీ అభిమానానికి ధన్యుడిని :-)

మధురవాణి: మీరు మరీ ఎక్కువ పొగిడేసారండీ.. నేను ఆ రేంజ్ కి వస్తానో లేదో కాని, మీ వ్యాక్య ఎంతో ఆనందం కలిగించింది.. మీ అభిమానానికి నేను కృతజ్ఞుడిని :-)

రాధిక(నాని): మీరు యాదృచ్చికంగా నా బ్లాగు పుట్టినరోజే చూశారానమాట.. మీ అభిమానానికి థాంక్స్.

కృష్ణప్రియ: థాంక్స్ అంది.. నేనేదో పిల్ల రచయితని లెండి :-)

Ram Krish Reddy Kotla said...

జయ: థాంక్స్ ఎ లాట్ అండి..

మాలాకుమార్: ధన్యవాదాలు :-)

కవిత: అబ్బో చాలా పోగిడేసావు...ఇంకా తట్టుకోవడం నా వల్ల కాదు :-)... సరే ఎప్పుడు కావాలో చెప్పండి పార్టీ :)

శివప్రసాద్: థాంక్స్ బాస్

హను: థాంక్స్ అండి.

భావన said...

congratulation Kishan. బాగుంది మీ బ్లాగ్. ఇలానే రాసి రాసి.... రాస్తూ రాస్తూ పేద్ద రచయత ఐపోవాలని ఆశీర్వదిస్తూ..

Ram Krish Reddy Kotla said...

భావన గారు.. ధన్యవాదాలు..మీ అభిమానం అండగా ఉండగా నాకేంటి చెప్పండి.. మీలాంటి వారి ఆశిస్సులు చాలు నాకు :-)

సతీష్ said...

బ్లాగు జన్మదిన శుభాకాంక్షలు, మీరు ఇలాగే మంచి మంచి స్టోరీలు, సీరియళ్ళు రాయాలని కోరుకుంటున్నాను.

Ram Krish Reddy Kotla said...

సతీష్, థాంక్స్ మీ అభిమానానికి :-)

పానీపూరి123 said...

congrats,
సీ-రియల్ : lets సీ your రియల్ things :-)

Ram Krish Reddy Kotla said...

పానీపూరి గారు... ధన్యవాదాలు..చూడండి మరి సి-రియల్ :-)

ప్రణీత స్వాతి said...

పుట్టినరోజు శుభాకంక్షలండీ.."ఆకాశవీధిలో"..

Ram Krish Reddy Kotla said...

థాంక్స్ ఎ లాట్ అండి ప్రణీత గారు :-)

Super Sisters said...

మీ బ్లాగ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు .మీ బ్లాగ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్న .

Lakshmi said...

Happy first blogoversary...

రాధిక said...

Happy B'day 2 ur blog...Keep going
all the best :-))

Ram Krish Reddy Kotla said...

అనిత: మీ అభిమానానికి థాంక్స్ అండి..

లక్ష్మి: ధన్యవాదాలు..

రాధిక: థాంక్స్ ఎ లాట్

priya.... said...

hey yep....ninna intlo cheptunna..eroj edo undi ani...i stil remember last year u told me nyt chala late varaku blog rasav around 5.am emo nidrapoyav annatu gurtu....bt u kno nu cheptunte really chala happy ga undi...last story posts ki comments evvalekapoya bt u kno chala chala njoy chesa...very nice climax...malli mothaniki sudher characteristics bratikinchav...ade nen kuda adigindi....u kno nestam gari gurinchi chepalsina pani ledu...really she is inspiration 2 many...really im very glad 2 see d birthday of ur blog...keep going ram...i wish u all d success comes in ur way...nd inko vishyam marichipoya...research institute modalapettu ani cheppa kada...ne prayogalu anta na meeda chupinchuko anna kada...eppudu star chestunnav chepu k na...heheh unta...awaiting 4 ur nxr xcellent story....k

మధురవాణి said...

@ సువర్ణ,
మీకు తెలుగులో బ్లాగ్ ఎలా రాయాలి అని తెల్సుకోడానికి ఈ బ్లాగ్ బాగా ఉపయోగపడుతుంది. ఓసారి చూడండి. http://telugublogtutorial.blogspot.com/

Ram Krish Reddy Kotla said...

ప్రియ మీ అభిమానానికి...చాలా థాంక్స్.. కొత్త స్టోరీ త్వరలోనే రాస్తాను :-)

Ram Krish Reddy Kotla said...

మధురవాణి గారు ...థాంక్స్.. ఆ లింక్ నాకు సడన్ గా గుర్తురాకా సువర్ణగారికి ఇవ్వలేకపోయా..

RaaGa said...

మీ ఆకాశవీధిలో బ్లాగు ఇంకా ఎన్నో పుట్టినరోజులు దిగ్విజయంగా జరుపుకోవాలని ఆశిస్తూ ...మీ అభిమాని రాగ. మీ కొత్త సీరియల్ కోసం ఎదురు చూస్తుంటా :-)

Ram Krish Reddy Kotla said...

రాగ థాంక్స్ ఎ లాట్ మీ అభిమానానికి.. త్వరలోనే రాయడానికి ప్రయత్నిస్తాను :-)

సుమిత్ర said...

కిషన్ గారు, మొదటగా మీ బ్లాగుకు జన్మదిన శుభాకాంక్షలు(కాస్త ఆలస్యంగా). నేనూ భ్లాగు లోకానికి కొత్తే. మొదట్లో మీలాగే నేను బోలెడు ఆశ్చర్య పోయానండి.

Ram Krish Reddy Kotla said...

సుమిత్ర గారు ధన్యవాదాలు :-)

Sai Praveen said...

కొంచెం ఆలస్యంగా చెప్తున్నానని ఏమి అనుకోవద్దు. మీ బ్లాగుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.
మీ కథ 'హృదయం ప్రేమిస్తానంటే... ' మొత్తం అన్ని ఎపిసోడ్ లు రాసేసాక మొదటి నుంచి చదివాను. చాలా బాగుంది.

Ram Krish Reddy Kotla said...

Thanks a lot Sai Praveen.

sunita said...

belated బ్లాగ్ పుట్టినరోజు శుభాకాంక్షలు .

Ram Krish Reddy Kotla said...

Sunitha garu, thanks a lot andi :-)

K SURENDRA BABU said...

మీ బ్లాగ్ చాల బాగున్నది. మీలా నాకు వ్రాయాలని ఉంది, కాని మీ అంత చదువు నాకు లేదు. దయ చేసి కొన్ని చిట్కాలు చెప్పి పుణ్యం కట్టుకోరు?

Ram Krish Reddy Kotla said...

సూరి గారి ధన్యవాదాలు..చిట్కాలు అంటూ ఏమీ ప్రత్యేకంగా ఉండవండీ...ప్రతి ఒక్కరికీ ఒక శైలి ఉంటుంది, ఆ శైలి ని ఎప్పటికప్పుడు డవలప్ చేసుకుంటూ ఉండటమే.. ఎవరినీ అనుకరించకుండా మన శైలిలో మెప్పించే విధంగా రాయగలగాలి..ఇది సాధనతోనే సాధ్యం.