Search This Blog

Saturday, 15 May, 2010

హృదయం ప్రేమిస్తానంటే...విధి విడదీస్తానంటే !! - 2


సంహిత కళ్ళు తెరిచే సరికి హాస్పిటల్ లో ఉంది. 
సుధీర్ చనిపోయాడన్న విషయం ఆమెకి గుర్తురాగానే దుఃఖం పొంగుకు వచ్చింది..తను ఇక లేడు అన్న నిజాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతుంది..అతను ఎవరో ఏమిటో, అసలు అతని గురుంచి ఏమీ తెలియదు..పరిచయం కూడా చాలా తక్కువ, కానీ సర్వస్వం కోల్పోయినట్లు అనిపిస్తుంది ఆమెకు..అతనితో మాట్లాడింది కొన్ని మాటలే కావచ్చు, కానీ ఆమె హృదయం అతని హృదయంతో అనుక్షణం సంభాషిస్తూనే ఉంది..ఊసులాడుతూనే ఉంది...

నర్స్ లోపలి వస్తూనే "మీ నాన్న గారు, అమ్మ గారు హాస్పిటల్ కి బైల్దేరారు..కొద్దిసేపట్లో వచ్చేస్తారు..ఈ రోజు సాయంత్రం మిమ్మల్నిడిశ్చార్జ్ చేస్తారు .." అంది..
"నన్ను హాస్పిటల్ లో ఎవరు చేర్చారు..." అంది సంహిత
"ఎవరో ఒక అబ్బాయి చేర్చాడు...అతను పేరు కార్తీక్ అంట.." అంది నర్స్ సంహితకి టాబ్లెట్ ఇస్తూ..
"అలాగా..." అంది 
"మీరు రెస్ట్ తీసుకోండి..." అంటూ నర్స్ వెళ్ళిపోతుండగా..."నేను ఆ అబ్బాయితో ఒక సారి మాట్లాడాలి...పిలుస్తారా?" అంది సంహిత...
"అలాగే..." అంటూ వెళ్ళిపోయిన నర్స్ కార్తీక్ ని సంహిత దెగ్గరకు తీసుకువచ్చి తను వెళ్ళిపోయింది...

పాతికేళ్ళు ఉంటాయి అతనికి..ఆరడుగుల ఎత్తు,కోల మొహం..లేత గడ్డం,నూనూగు మీసాలు..ఫుల్ హాండ్స్ చొక్కాని చేతులు సగం మడిచి, చక్కగా ఇన్షర్ట్ చేసుకోని ఉన్నాడు...
"థాంక్స్..." అంది సంహిత అతన్ని చూస్తూనే..
"పర్లేదు...మీతో పాటే బస్సులో ఉన్నాను నేను...మిమ్మల్ని చాలా సార్లు నేను ఎక్కిన బస్సులోనే చూశాను ..నేను దిగిన స్టాప్ లోనే మీరూ దిగారు...మీరు ఎప్పుడూ దిగే స్టాప్ అది కాదు...మిమ్మల్నే కొద్ది దూరం అనుసరించాను...కానీ ఆ క్షణం మీరు..." అంటూ అతను ఇంకా ఏదో చెప్పబోతుండగా
"మీరు నాకొక చిన్న మాట ఇవ్వగలరా?" అందామె అతన్ని సూటిగా చూస్తూ 
"చెప్పండి" అన్నాడు అతను స్థిరంగా 
"ఆ స్పాట్ లో ఏం జరిగిందో మా అమ్మానాన్నలకు తెలియకూడదు...ఏదో స్కూటర్ తగిలి నేను క్రింద పడిపోతే, మీరు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చారని చెప్పండి..ప్లీజ్.." అందామె బ్రతిమాలుతూ..
"నేను అర్థం చేసుకోగలను..." అన్నాడతను చిన్నగా తలాడిస్తూ..
"థాంక్స్...మీరు మరోలా అనుకోకపోతే ఇంకో సాయం చేస్తారా?.." అందామె
"చెప్పండి..."
"అక్కడ ఆక్సిడెంట్ లో చనిపోయిన అతన్ని ఏ హాస్పిటల్ మార్చురీలో ఉంచారో కొంచెం తెలుసుకొని చెప్తారా...నాకు అతని కడసారి చూపు దక్కాలి..." అందామె రాబోతున్న కన్నీటిని తుడుచుకుంటూ
"మీరు ఏం చెప్తున్నారో...." అంటూ అతను ఏదో చెప్తుండగా, సంహిత అమ్మానాన్నా వచ్చారు అక్కడికి...
"ఏమైంది తల్లీ..." అంటూ రాగానే కన్నీళ్ళు పెట్టుకుంది సంహిత తల్లి...
ఆమె కార్తీక్ వైపు చూసి చేతులు జోడించింది...
కార్తీక్ ఆమె చేతిని పట్టుకొని వద్దంటూ బైటకి వెళ్తూ...ఇక వస్తాను అన్నట్లుగా సంహిత వైపు చూసాడు..అతన్ని చూస్తుంటే ఎంతో దెగ్గరి ఆత్మీయుడిలా..ఓ గొప్ప స్నేహితుడిలా ...ఎప్పటి నుంచో తెలిసిన వాడిలా కనిపిస్తున్నాడు సంహితకి..
అతను వెళ్ళిపోతుండగా.."చంటి ...." అందామె..
చివాల్న వెనక్కి తిరిగి చూసాడు కార్తీక్...అతని కళ్ళలో నీళ్ళు..
ఇది కనిపెట్టిన సంహిత తండ్రి కార్తీక్ ని తీసుకోని రూం బయటి వెళ్లాడు..
"నా కూతురిని మళ్లీ నువ్వే కాపాడావు...నీ ఋణం ఎలా తీర్చుకోవాలి??" అన్నాడు ఆయన
"మీరు ఒక్కసారి చేసిన తప్పుకే పెద్ద శిక్ష అనుభవిస్తున్నారు...ఇంకా నా ఋణం గురుంచి ఎందుకులెండి.." అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు..తలదించుకున్న ఆ తండ్రి లోపలికి  వెళ్ళిపోయాడు

ఆ సాయంత్రం డిస్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక విషయం తెలిసి సంహితని చూడటానికి సుధ వచ్చింది
"ఎలా జరిగిందే..." అంది సుధ రాగానే కంగారుగా..
"స్కూటర్ గుద్దింది...తుళ్ళి క్రింద పడ్డాను..మరుక్షణమే సృహ కోల్పోయాను..కార్తీక్ అనే అబ్బాయి నన్ను హాస్పిటల్ లో జాయిన్ చేసాడు.." అంది 
"ఆ తెలుసు...కార్తీక్ ఎవరో కాదు, తను నా కజిన్....తనే నాకీ విషయం చెప్పాడు..నువ్వు కూడా నేను చదివే కాలేజీలోనే చదువుతున్నావ్ అని తెలుసుకున్నడేమో, సంహిత అనే అమ్మాయి నీకు తెలుసా అని అడిగాడు నన్ను...తెలియకపోవడం ఏమిటి తను నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసరికి మనోడికి షాక్..." అంటూ చిన్నగా నవ్వింది
"ఓ రియల్లీ...నేను కార్తీక్ తో ఓ సారి మాట్లాడాలి..." అంది సంహిత..
"అలాగే..తనని నీకు కాల్ చెయ్యమని చెప్తాలే.." అంది సుధ 
"ప్లీజ్ త్వరగా చెయ్యమని చెప్పు..." అంది సంహిత, ఆమెలో ఏదో తేడా కనిపిస్తుంది సుధకి..ఆమెలో ఏవో అంతర్లీనంగా ప్రకంపనలు..ఏదో బాధ కొట్టొచ్చినట్లు తెలుస్తుంది సుధకి...

"అలాగే...నువ్వు రెస్ట్ తీసుకో...నేను రేపు ప్రొద్దున్నే వస్తాను.." అంటూ లేచి వెళ్లబోతుండగా
"మన కాలేజ్ టాపర్ సుధీర్....తను...తను.." అంటున్న సంహిత వైపు తిరిగి వింతగా చూస్తుంది సుధ..
"తను....చనిపోయాడట కదా.." అంది సంహిత...ఆమె కనుసన్నల నుంచి ఉబుకుతున్న నీరు సుధ దృష్టి నుంచి తప్పించోకోలేదు...నమ్మలేనట్లుగా చూస్తుంది సంహిత వైపు...
"ఏం మాట్లాడుతున్నావ్...సుధీర్ ఎవరు??" అంది సుధ కంగారుగా...సంహితకి ఏమవుతుంది అన్న ఆందోళన కలుగుతుంది సుధకి..
"అదేంటే మాత్స్ గ్రూప్ టాపర్ సుధీర్..." అంది సంహిత
"సరే సరే...నువ్వు రెస్ట్ తీసుకో...నేను రేపు వస్తాను..." అంటూ వెళ్ళిపోయింది సుధ

"కార్తీక్ సంహిత నీతో మాట్లాడాలట....తనకు ఓ సారి ఫోన్ చెయ్యి .." చెప్పింది సుధ కార్తీక్ తో సంహిత నెంబర్ ఇచ్చి..
"తను ఏం అడుగుతుందో నాకు తెలుసు...కానీ నేను నిస్సహాయుడిని..." అన్నాడు కార్తీక్ 
"ఏం అడుగుతుంది తను ??"
"సుధా...నీకొక నిజం చెప్పాలి..."
"ఏంటది..." కొంచెం కంగారుగా అడిగింది
"సంహితను స్కూటర్ గుద్దడం అబద్దం...అలా అని తను చెప్పమంటే నేను చెప్పాను..."
"అవునా....మరి ఏం జరిగింది..."సుధకి అంతా అయోమయంగా ఉంది 
"తను నేను ఒకే బస్సులో వెళ్తున్నాం...నేను రోజు దిగే సిరిపురం సిగ్నల్ దెగ్గరే తనూ దిగింది..దిగడమే కంగారుగా దిగింది..నన్ను దాటుకుంటూ ముందుకు వెళ్ళింది...సిగ్నల్ దెగ్గరికి వెళ్లి అలాగే నిల్చుంది కాసేపు..నేను ఆమెనే అనుసరించాను...ఆమె వైపు చూసాను...వణుకుతూ ఉంది..కళ్ళ వెంబడి నీళ్ళు...ఇంతలోనే సుధీర్ అని గట్టిగా అరిచింది ఏడుస్తూ..ఆ అరుపుకు నాకే భయం వేసింది..ఆ క్షణం ఆమె కళ్ళలోకి చూస్తే...సర్వస్వం కోల్పోయిన బాధ, ఆక్రోశం ఆమెలో...అక్కడ వెళ్ళే వాళ్ళు ఆగి మరీ ఆమె వైపే చూస్తున్నారు...ఇంతలే ఉన్నట్లుండి అక్కడే కుప్పకూలిపోయింది..నేను వెంటనే ఆమెని హాస్పిటల్ కి తీసుకువచ్చాను..." అంటూ చెప్తున్న కార్తీక్ వైపు నిశ్చేష్టురాలై చూస్తుంది సుధ...సంహిత అలా ఎందుకు ప్రవర్తిస్తుంది..నో వే...ఏదో ఉంది ఇందులో...కానీ ఏమీ అర్థం కావడం లేదు సుధకి..."కాలేజీ టాపర్ సుధీర్ అని ఎందుకు చెప్పింది...టాపర్ పేరు కిరణ్ కదా.." అంతా అయోమయగా తోచింది సుధకి.

"సంహిత నన్ను ఒక సాయం అడిగింది...అక్కడ ఆక్సిడెంట్ లో చనిపోయిన వ్యక్తి బాడీ ఏ మర్చారీలో ఉందొ తెలుసుకొని చెప్పమంది...తను కడసారి చూడలట.." చెప్పాడు కార్తీక్ 
"అక్సిడెంటా?? ..అక్కడ ఆక్సిడెంట్ జరిగిందా?" అడిగింది సుధ విస్తుపోతూ
"లేదు...." 
"మరి...అలా ఎందుకు అడిగింది.." తలపట్టుకు కూర్చుంది సుధ 
"తెలియదు....ఒకటి కారణం అయి ఉండొచ్చు..." అని చెప్పాడు ఆలోచిస్తూ 
"ఏమిటది...." ఆమె గొంతు తడబడుతుండగా అడిగింది కార్తీక్ ని..
"చెప్తాను...నిజానికి సంహిత నాకు నాలుగేళ్ళుగా తెలుసు...తెలుసు అని చెప్పడం చాలా చిన్న పదం...తనకి ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ప్రాణ స్నేహితులు.. ఒకరు నేనైతే, ఇంకొకరు.......సుధీర్...."అంటూ  కార్తీక్ చెప్పిన విషయం విన్న సుధకి నోట మాట రాలేదు..ఆమె వళ్ళంతా చెమటలు పట్టాయి...ఆమె వింటున్న విషయం ఆమెని నిస్చేష్టురాలిని చేస్తుండగా చేష్టలుడిగి స్థాణువై అక్కడే నిలబడిపోయింది..అతను చెప్తున్న ఒకొక్క విషయం ఆమెలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి....

                                       [To be continued in the third part........]

31 comments:

Rishi said...

హ్మ్...మళ్ళీ వచ్చేసారు మొత్తానికి త్వరగా.గుడ్.ఈ సారి నుండీ నేను బాగుంది అనో,నెక్స్ట్ పొస్ట్ కోసం ఎదురుచూస్తున్నామనో రొటీన్ గా చెప్పను,ఇంకా ఏమయినా చెప్తా.పాతికెళ్ళ హీరో గారికి నూనుగు మీసాలు పెట్టారేంటండీ పాపం.
మన గంగూలీ లాగ గడ్డాలూ మీసాలు సరిగా రాలేదా ఏంటీ :)?

Badri said...

బాబోయ్ ఈ సస్పెన్స్ ఎంటి అన్నాయ్,
సచ్చిపోతున్నాం :( తరువాయి భాగం ఎప్పుడు. వెయిటింగ్ ఇక్కడ.

3g said...

waw....... wat a turn. looking like a psychological plot.

శేఖర్ పెద్దగోపు said...

Interesting...మొదటి భాగం కూడా చదివాను..నేరేషన్ బాగా చేస్తున్నారు..మీరు పుస్తకాలు బాగా చదువుతారా?

నేస్తం said...

పేరు మార్చేసారా ..'నాకు ఆడపిల్ల ప్రేమిస్తే 'పేరు నచ్చలేదు కధలో సీరియస్ నెస్ తగ్గించేసింది.. ఇది బాగుంది .

మానస said...

Nice one.Waiting for next post :))

సతీష్ said...

కిషెన్ గారు, రెండవ భాగం ఇంకా అద్భుతంగా రాసారు, సస్పెన్స్ లో పెట్టారుగా మమ్మల్ని. ఆసక్తి గొలిపేల మీరు చాలా బాగా రాస్తున్నారు. తరువాతి భాగం కోసం ఎదురు చూస్తున్నా.

Kishen Reddy said...

@ రిషి : అలాగే అనుకోండి రిషి గారు..పాతికేళ్ళకే అందరికీ దట్టమైన మీసాలు రావాలని లేదుగా..మా ఆఫీసులో ఒకతనికి ముప్ఫై ఏళ్ళు, కనీసం నూనోగు మీసాలు కూడా లేవు..కొంచెం మిల్క్ బాయ్ లుక్ ఇద్దామని అలా రాసాను

@ బద్రి : త్వరలోనే రాస్తాను అన్నాయ్..

@ త్రీజీ : Yes, it will be kinda psychological plot...U will see for urself in the upcoming parts

Kishen Reddy said...

@ శేఖర్ : ధన్యవాదాలు, నేను పుస్తకాలు అంతగా చదవనండి..మహా బద్ధకం..ఏవో చాన్నాళ్ళ క్రితం, బీ-టేక్ లో పెద్దగ పనీ పాటా లేక యండమూరి, యద్దనపూడి నవలలు కొన్ని చదివా..చాలా మటుకు సిడ్నీ షెల్డన్ నవలలు చదివాను :)

@ నేస్తం : అవును నేస్తం పేరు మార్చేసాను, నాకే ఎందుకు ఈ కథకి సరైన పేరు కాదేమో అనిపించింది. నిజానికి నేను అనుకున్న స్క్రిప్ట్ మారిపోయింది చెప్పాలంటే, నేను మొదట అనుకున్న స్క్రిప్ట్ కి నేను ముందు పెట్టిన పేరే కరెక్ట్..కనీ కథ మారేసరికి పేరు మార్చాల్సి వచ్చింది :-)

Kishen Reddy said...

@ మానస : ధన్యవాదాలు ..త్వరలోనే రాస్తాను :)

@ సతీష్ : ధన్యవాదాలు :)

ప్రణీత స్వాతి said...

కధ ( కదా..నవలా..?) బాగుందండీ..మరి మూడో భాగం రాయండి త్వరగా..

Kishen Reddy said...

ప్రణీత గారు, ధన్యవాదాలు..నవలలా సాగుతున్న కథ అనుకోండి :-)..త్వరలోనే మూడో భాగం రాస్తాను..మీ స్నిగ్ధకౌముది నాకు చాలా నచ్చింది..మీరు త్వరలో ఓ మంచి టపా రాస్తారని ఆశిస్తాను :)

sowmya said...

హమ్మో భలే సస్పెన్స్ పెట్టారు కదండీ......ట్విస్టుల మీద ట్విస్టులిస్తున్నరు....కానివ్వండి.
ఇదిగో ఇస్తే ఇచ్చారు కానీండి తరువాతి భాగం తొందరగా రాయండి. అనవసరంగ నేను బి.పి తెచ్చుకుని ఆస్పత్రిలో కూర్చోలేను, నాకసలే బొల్డు పనులు :)

శివరంజని said...

మీ మీద తెలుగు సీరియల్స్ ప్రభావం బాగా ఎక్కువైపోయిందండి ట్విస్ట్ ల మీద ట్విస్టులు ఇచ్చి సస్పెన్సె తో చంపేస్తున్నారండి. ఏ మాట కి ఆ మాట చాలా బాగా రాస్తున్నారు మీరు. ఇంతకి ప్రొఫైల్ లో ఉన్న చిన్న బాబు ఫొటో సస్పెన్సె స్టోరీ రైటర్ కిషన్ గారిదేనా

bangaram said...

బాబోయ్ ........ఈ విధం గ confuse చేస్తున్నారు ఏంటి అండి??మొత్తం స్టొరీ చెపితే కానీ,నాకు అర్థం అయ్యేట్లు ఉంది. ఎన్ని twists ఇస్తున్నారు అంటే.....!!!!అబ్బో ....సుదీర్ అంటారు,మల్లి సడన్ గ కార్తీక్ అంటున్నారు....జగమే మాయ .....సూపర్ narration . త్వరగా నెక్స్ట్ పార్ట్ లో స్టొరీ ముగించండి సర్...కొంచం lengthy అయిన పరవా లేదు....

BTW ..మీ కొత్త బ్లాగ్ కూడా చూసాను, చాల బాగా స్టొరీ చెప్పారు ...కీప్ ఇట్ అప్ ....

Kishen Reddy said...

@ సౌమ్య : హ హ ..మీరు భలే వారండి :-)...అలాగే త్వరాగా రాసి మీకు హాస్పిటల్ ఖర్చులు తగ్గిస్తాను లెండి..కానీ రాబోయే భాగం ఎండింగ్ కాదు మరి..

@ రంజని : థాంక్స్, నేను అసలు సీరియల్స్ చూడను రంజని..అవన్తేనే చిరాకు నాకు..వాటి ప్రభావం లేదు కాని, ఇలా సుస్పెన్స్ కథలు రాయడం అంటే ఇష్టం. ఇకపోతే ఆ ప్రొఫైల్ లో ఉన్న చిన్న బాబు..నేనే..బాగున్నాను కదా :-)

@ బంగారం : థాంక్స్..అయితే మీకు స్టొరీ అర్థం కావాలంటే మరి కొన్ని ఎపిసోడ్స్ ఆగాల్సిందే..తరువాతి పార్ట్ లో ముగించడం కష్టం అంది..అలా త్వరగా ముగించడం మా నేస్తం గారికి అస్సలు నచ్చదు...నే రాసిన ఓ టపాలో అలా చెప్పారు :-)

ప్రణీత స్వాతి said...

స్నిగ్ధ కౌముది నచ్చినందుకు ధన్యవాదాలండీ.

Kishen Reddy said...

ప్రణీత గారు, you are welcome :-)..మాకోసం తొందరగా ఒక టపా రాయండి మరి

'Padmarpita' said...

త్వరగా నెక్స్ట్ పార్ట్ లో స్టొరీ ముగించండి....ప్లీజ్:)

Kishen Reddy said...

నెక్స్ట్ పార్ట్ లో ముగించడం అంటే కొంచెం కష్టమే పద్మ గారు..ఏదో హటాత్తుగా ముగిచడం ఎందుకు..ఇంకా స్టొరీ కొంత ఉంది...ఒక రెండు మూడు ఎపిసొడ్స్ లో ముగిస్తాను తప్పకుండా..మరికొంత సుస్పెన్స్ పెట్టనివ్వండి, అప్పుడే అయిపోగోడితే ఎలా :-)....

bangaram said...

ఇంకా రెండు,మూడు episodes అహ్హ? కొంచం మీ ఇంటి అడ్రెస్స్ ఇస్తారా???నాకు తెలిసిన మంచి సీరియల్ డైరెక్టర్ ఒకరు ఉన్నారు ,వారి కి ఇస్తాను ....అల ఐన డైలీ కొంచం story తెలుస్తుంది .ఏమంటారు మరి??

Raj said...

wow....kotha twist...


edo goppa flash back ki rangam siddam avutundi

Raj said...

idi chadivaka next episode ila vuntundi anna chinna vuha vachidi kani na vuha kanna miru baga rastaru ani naku nammakam vundi....

Kishen Reddy said...

@ బంగారం : నిజం చెప్తున్నారా!!..అలా అయితే ఖచ్చితంగా ఇస్తాను లెండి ..ఎప్పుడు పంపిస్తున్నారు డిరెక్టర్ ని మరి :-)

@ రాజ్ : ధన్యవాదాలు, మీ నమ్మకం వమ్ము కాదు..కానివ్వను..తదుపరి ఎపిసోడ్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది :)

nagarjuna చారి said...

ఇంత త్విస్ట్ ఇచ్చాక వచ్చేపార్టు ఊహించనట్టే ఉండాలి, ఇరగదీసెయ్ బాసు.
waiting eagerly...

Bhavita said...

It's excellent script. Both parts are really gripping, and am eagerly waiting for the third part like others :-)

Kishen Reddy said...

చారి గారు, ధన్యవాదాలు...తప్పకుండ ఇరగాదీస్తాను..దేన్నీ అని అడగకండే :-)

భవిత గారు, ధన్యవాదాలు...త్వరలోనే రాస్తాను

స్ఫురిత said...

ఏంటండీ బాబూ, ఏ బ్లాగు చూసినా ఇలా part 1, part 2 అని తెగ suspense maintain చేసేస్తున్నారు. ఏదో ఇక్కడకి వచ్చి తెలుగు T V serials గోల లేకుండా, హాయిగా బ్లాగులు చదువుకుందాం అనుకుంటే....serial ఐతే మల్లీ రేపే next part అన్న భరోసా ఐనా వుంటుంది...బాబ్బాబు, ప్రతీ part కిందా next part రాబోయే తేదీ పెట్టి పుణ్యం కట్టుకోండి :)

Kishen Reddy said...

స్పురిత గారు..హ హ...అంతే అంటారా..మీరు ఎలాగంటే అలాగే..కాకపోతే ఎప్పుడు మూడ్ వచ్చి రాతనో ఓ పట్టాన తెలిసి చావట్లా..అక్కడోస్తుంది గొడవ..ఈ సరి నుంచి ప్రయత్నిస్తాను.. :-)...తదుపరి భాగం మాత్రం మరి కాసేపట్లో :)

Ananya Reddy said...

ammo next part ki vellalante bhayam vesthondi

Kishen Reddy said...

అనన్యా భయం లేకుండా వెళ్ళండి...నేనున్నాడు కదా... :-)