Search This Blog

Thursday, 6 May, 2010

షార్ట్ కట్ టు గోపాలపురం - 2


ఇంతలోనే.....
పెద్ద కేక...
వాళ్ళ గుండెలు ఆగినంత పని అయ్యింది..
వెనక్కి తిరిగి చూసారు..అంతే కోయ్యబోమ్మల్లా నిల్చుండిపోయారు ముగ్గురూ.......


ఇంతలోనే తేరుకొని ఒక్క ఉదుటున ముందుకుదూకి పరిగెత్తడం మొదలెట్టారు...వెనుక ఉన్న ఆ ఆకారం వాళ్ళని అంతే వేగంగా వెంబడించసాగింది...ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఎటు దొరికితే అటు పరిగెత్తసాగారు ముగ్గురు..కాసేపు పరిగెత్తిన తరువాత..ఆ ఆకారం వాళ్ళని వెంబడించడం లేదు అని నిర్ధారించుకున్న తరువాత..ఒకొక్కడు ఆగి వెనక్కి చూసుకున్నారు...అంతే అంత అర్థరాత్రిలోనూ అంత చలిలోనూ ఒక్కొక్కడికీ చొక్కాలు తడిసిపోయాయి...సురేష్ గాడికి అయితే రెండో సారి పాంట్ తడిసింది...!!

ఎందుకంటే ఎవడికి వాడు ఒంటరిగా మిగిపోయాడు...ఒకడికి ఇంకొకడు ఎటువైపు వెళ్ళాడో కూడా తెలియదు..సురేష్ గాడికి ఇక ఇంటికి క్షేమంగా వెళ్తానన్న ఆశ చచ్చిపోయింది..చుట్టూ చిక్కని చీకటి...ఎటువైపు నుంచి ఏం వస్తుందో అన్న భయంతో వాడికి నూటనాలుగు కొట్టింది...


గిరిగాడికి ఏం చెయ్యాలో అర్థంకావట్లేదు..సురేష్ గాడి పరిస్థితి తలచుకుంటేనే వాడికి దడ పుడుతుంది..వద్దన్నా తనే లాక్కొచ్చాడు, ఇప్పుడు వాడికి ఏమైనా అయితే  వీడిని కుమ్మేయ్యడం ఖాయం..టార్చ్ లైట్ పట్టుకొని వెతుకుతూ సురేష్ అని గట్టిగా అరస్తున్నాడు...

రవి గాడు పరిగెత్తుతూ ఏదో చెట్టుకు డీ కొట్టి పడిపోయి..లేచి..చుట్టూ చూసి మళ్లీ పడిపోయాడు..


సురేష్ గాడు ఆ చీకట్లో కళ్ళజోడు పోగొట్టుకున్న గుడ్డివాడిలా తడుముకుంటూ... పాకుతూ డేకుతూ కిందా మీదా పడి వెళ్తున్నాడు గమ్యం తెలియని బాటసారిలా...అలా వెళ్తుంటే ఒక చిన్న అరుగు లాంటిది కనిపించింది మసక మసకగా తెల్లగా..వెంటనే దాని మీద సెటిల్ అయిపోయాడు..కరెక్ట్ గా ఒక మనిషి పడుకోడానికి సరిపోయేలా ఉంది ఆ అరుగు..'ఇక్కడ అరుగు ఎవడు కట్టుంటాడో...' అనుకొని మెల్లిగా దాని మీద పడుకున్నాడు...టైం రెండు అయ్యుంటుంది..ఇంకొక మూడు గంటలు గడిస్తే తెల్లవారుతుంది..అప్పటిదాకా ఈ ప్రాణం పోకుండా చూసుకోవాలి..సంకల్పించుకున్నాడు మనోడు...

ఆ అరుగు మీద పడుకొని 'ఈ ఎదవ నాకొడుకులు ఎక్కడ సచ్చారో...' అనుకొని చుట్టూ చూసాడు..అప్పటిదాకా భయంకరంగా తోచిన ప్రదేశం ఇప్పుడు కొంచెం పర్వాలేదనిపించింది..ఎలాగోలా ఇక్కడే మూడు గంటలు టైం పాస్ చెయ్యాలి..ఈ చీకట్లో తడుముకుంటూ వెళ్ళడంకంటే ఇదే ఉత్తమం అనుకొని, తను చిన్నప్పుడు తన బామ్మ చెప్పిన "అక్బర్ బీర్బల్" కథలు గుర్తుకుతెచ్చుకుంటున్నాడు..అప్పుడే ..సరిగ్గా అప్పుడే తనకు వినిపించింది ఆ స్వరం...చాల దెగ్గరిగా..పక్కనే మాట్లాడినట్లు...ఇలా.. "ఒరేయ్ బైరిగా...నా ఆస్తి మొత్తం ఆ సానిదానికి తగలబెతావా...నీ ఆటలు సాగానివ్వను రా.." అని...

అప్పటిదాకా అక్బర్ బీర్బల్ కథలో బీర్బల్ యొక్క సమయస్పూర్తిని చాకచక్యాన్ని మనసులోనే మెచ్చుకుంటూ..ఆ కథలో పూర్తిగా లీనం అయిన సురేష్ గాడు దెబ్బకి డుసుకొని లేచి కూర్చుకున్నాడు...చుట్టూ చూసాడు...ఎవరూ లేరు..ఆ గొంతుక ఎవరో ముసలావిడది..తను స్పష్టంగా విన్నాడు..తను కలగనలేదు..మూడోసారి ప్యాంటు తడిసిపోడానికి రెడీ గా ఉంది....

"సురేష్...." అని కేక వినబడేసరికి మనోడికి ప్రాణం లేసోచ్చి "గిరిగా..." అని గట్టిగా అరిచాడు...గిరి గాడు టార్చ్ వేసి చూడగా సురేష్ గాడు దూరంగా కనిపించాడు..హమ్మయ్యా అనుకుంటూ మెల్లిగా సురేష్ గాడిని చేరుకొని...నోరువెళ్ళబెట్టి అలానే చూస్తున్నాడు వాడి వైపు.."ఏమైంది రా..." అడిగాడు సురేష్...

"నువ్వేంటి ఇక్కడ కూర్చున్నావ్??" అడిగాడు అయోమయంగా 
"ఈ చీకట్లో గుడ్దోడిలా ఎటువైపని వెళ్ళను చెప్పు...అందుకే ఈ అరుగు మీద ఓ మూడు గంటలు టైం పాస్ చేద్దామని పడుకొన్నా...ఈ ప్లేస్ లో అరుగు ఎవడు కట్టించాడో.." అన్నాడు తనకు కాసేపు ఆశ్రయం ఇచ్చిన అరుగుని ప్రేమతో పాముతూ...
"ఎవడైనా కట్టిస్తాడు..ఊరిలో కాదు, ఇలాంటి ప్రదేశాల్లోనే కట్టిస్తాడు...కాకపోతే ఈ ప్రదేశంలో దీన్ని అరుగు అనకూడదు....సమాధి అనాలి..." అన్నాడు గిరిగాడు...తనేం వింటున్నాడో తెలిసేలోపే ఒక్క ఉదుటున ఆ సమాధి మీద నుంచి దూకేసాడు సురేష్ ..గిరి గాడు ఆ సమాధి మీదకి టార్చ్ ఫోకస్ చేసాడు 

కీ.శే. శ్రీమతి ఎర్రంశెట్టి వీరవెంకట సుకుమార లక్ష్మి
జననం : 1932
మరణం : 1995

అని ఉంది...
అది చూడగానే మనోడికి గండి కొట్టేసింది...ముచ్చటగా మూడోసారి...
రినాయినో ఇప్పటిదాకా సమాధి మీద పడుకోవడమే కాక చిన్నప్పుడు బామ్మ చెప్పిన బీర్బల్ కథలు నెమరు వేసుకున్నానా??...అమ్మో ఆ ఆలోచన ఇప్పుడు ఎంత భయంకరంగా ఉంది అనుకున్నాడు సురేష్...
మొత్తానికి ఎలాగో గిరి గాడు కనిపించినందుకు కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు సురేష్..


"గిరిగా నాకు ఇందాక ఒక ముసలావిడ గొంతు క్లియర్ గా వినిపించిందిరా..చాలా  భయమేసింది...ఇక్కడ దెయ్యాలు ఉన్నాయంటావా?" అడిగాడు మెల్లిగా..
"ఆడవన్నాక జంతువులు..స్మశానం అన్నాక దెయ్యాలు ఉండక ఏం చేస్తాయి...వాటి అడ్డాకే వచ్చి వాటి ఉనికినే ప్రశ్నిస్తే ఎలా చెప్పు?" అన్నాడు సీరియస్ గా..
"ఒరేయ్ అలా భయపెట్టకు రా..." అన్నాడు భయంగా
"సరేలే ముందు ఇక్కడనుంచి వెళ్దాం పదా...రవి గాడు ఎక్కడున్నాడో .." అనుకొని నెమ్మదిగా టార్చ్ సహాయంతో నడుస్తూ 'రవీ...' అని గట్టిగా కేకలు వేసుకుంటూ వెళ్తున్నారు ఇద్దరు...


"పాపం రవి గాడు ఏమైపోయాడో...ఈడికేదన్నా అయితే ఆ పిల్ల గతేం కాను..." అన్నాడు గిరిగాడు...
"ఏ పిల్లా..??" అడిగాడు సురేష్ 
"అదేనేహే..సర్పంచ్ కూతురు...జామపండురా...వీడు బ్రిడ్జి కడుతున్నాడుగా దానికి..."
"ఈడు కడితే సరిపోద్దా??..ఆ పిల్ల బ్రిడ్జి ఓపెనింగ్ సెయ్యోద్దూ...ఎనకటికి ఏదో సామెత ఉందిలే...అలా ఉంది నువ్వు చెప్పేది.." అన్నాడు సురేష్ టాపిక్ మారనివ్వకుండా...దెయ్యాల టాపిక్ కంటే ఇది బెటర్ కదా...
"ఎల్లేహే...ఈడి కంటే పోటుగాడు వస్తాడా దానికి...దాని బాబు గురుంచి తెలిసినోడు ఎవ్వడూ దీన్ని చేసుకోడు..."
"అలాగే చూస్తూ ఉండండి మీ ఇద్దరు...దాని బాబు అమెరికా ఇంజనీర్ ని తెచ్చి పెళ్లి చేస్తాడు...అప్పుడు మన రవిగాడు ఆళ్ళ ఫస్ట్ నైట్ కి 'ఇది తోలి రాత్రి...కదలని రాత్రి..' అని మజ్నులా పాటలు పాడుకుంటాడు.." అని సురేష్ అంటుండగా వినిపించాయి వాళ్లకి ఆ మాటలు...ఇలా .."అదే నిజం అయితే...మీ పక్కన ఉన్న సమాధి మీద ఒట్టు, దాన్ని లేపుకెళ్తా..." అని...

సురేష్ గాడికి వణుకుడు మొదలైంది.."నేను ఇందాక చెప్పాకదరా...ఏవో మాటలు విపించాయి అని..ఇదిగో మళ్లీ ఎవరో మాట్లాడారు..." అన్నాడు చుట్టూ చూసి ఎవరూ లేకపోవడంతో....

"రవి గాడ్రా...!!" అన్నాడు టార్చ్ లైట్ వేసి చూపిస్తూ... ఆళ్ళకి పక్కగా ఉన్న మర్రిచెట్టు కింద పడుకొని ఉన్నాడు రవి గాడు...
"ఇక్కడ పడుకున్నావెంట్రా??..." అడిగాడు గిరి
"ఏముంది...చెట్టుకు గుద్దుకున్నాను..మైండ్ బ్లాక్ అయ్యి షట్ డౌన్ అయింది..అది మళ్లీ రీస్టార్ట్ అయ్యి చూసేసరికి...అంతా చీకటి..ఎవరూ కనిపించకపోయేసరికి మళ్లీ షట్ డౌన్ అయింది..ఇక్కడే కొంచెం మెత్తగా ఉండేసరికి పడుకొనిపోయానురా...ఇదిగో ఈనాకొడుకు మళ్లీ నా లవర్ పెళ్లి గురుంచి మాట్లాడుతుంటే, నా మైండ్ మళ్లీ రీస్టార్ట్ అయింది.." చెప్పాడు మెల్లిగా లేస్తూ..
"ఏమయ్యిందిరా మీకు....ఆడేమో సమాధి మీద పడుకొని అరుగు అంటాడు...నువ్వేమో మర్రిచెట్టు కింద పడుకొని మెత్తగా ఉంది అంటావ్...పిచ్చానాయాల్లారా..పదండి..." అంటూ బైల్దేరదీసాడు గిరిగాడు...

"అవునోరే...అసలు మనల్ని అంత స్పీడుగా తరుముకోచ్చింది...ఏంట్రా అది.." అడిగాడు రవిగాడు...
"అదా...కుక్క రా..." చెప్పాడు గిరిగాడు..
"కుక్కా ...!!!" నోరేళ్ళబెట్టారు  ఇద్దరూ...
"అవునెహే...సూపర్ ఫాస్ట్ అనుకుంట...బొంచేసి ఎన్నిరోజులయిందో పాపం పిచ్చిముండ...దొరికుంటే ఒకొక్కడి కండలు ఊబీకి, ఆకలితో అలమటించే దాని మిత్రులతో మిడ్ నైట్ పార్టీ చేసుకునేది..." చెప్పాడు గిరిగాడు...


"కుక్కలు మనిషి మాంసం తింటాయా ?? " సందేహం వదిలాడు సురేష్ 
"మాములుగా తినవేమో...కానీ ఇవి దెయ్యపు కుక్కలు కదా..మనిషి మాంసం తప్ప పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టవ్??.." చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు గిరిగాడు
"దెయ్యపు కుక్కలా ?? !!" మళ్లీ నోరేళ్ళబెట్టారు  ఇద్దరూ..
"మీరు ఇంకా ఎదగాలిరా...అంటే త్రిష చెప్పినట్లు ఈ డైరెక్షన్ లో కాదు..చెప్తా వినండి..అర్థరాత్రి స్మశానంలో తిరిగే కుక్కల్లో దెయ్యాలు పూని మనిషి మాంసాన్ని వేటాడి తింటాయి..ఈ దెయ్యపు కుక్కకి చాలా రోజులుగా మనిషి మాంసం దొరకలేదేమో మనల్ని చూసి 'వీళ్ళని ఈరోజు డిన్నర్ లో తినకపోతే నా జన్మే వేస్ట్' అన్న రేంజ్ లో మనల్ని వెంటాడింది...చూసారుగా దాని స్పీడ్...మామూలు కుక్కలకి ఆ స్పీడ్ ఉండదు..."చెప్పాడు దెయ్యాలజీ సబ్జెక్టుని కాచివపోసిన శాస్త్రవేత్తలా..


సురేష్ గాడికి నూనాలుగు నుంచి నూటేడు కొట్టింది...
"మరి మనకు వినిపించిన అరుపు కుక్క అరుపు కాదె ??" శాస్త్రవేత్తనే తప్పు పట్టిన విద్యార్ధి మెరుపు తోకిసలాడింది రవి గాడిలో..
"తోక్కలా ఉంది నీ డౌట్...అది దెయ్యపు కుక్క, అది ఎట్లా అయినా   అరుస్తాది...కేకలెతాది..కుక్కాలాగానే మొరగాలని లేదు.." విద్యార్ధి మెరుపుని అణగదొక్కే శాస్త్రవేత్త గర్వం ఉట్టిపడింది గిరిగాడిలో...
ఇవన్నీ వింటూ సురేష్ గాడికి నాలుగోసారి గండి కొట్టేలా ఉంది పరిస్థితి...

**************************************

ఉదయం ఆరింటి కల్లా గోపాలపురం పడమటి వీధికి చేరుకున్నారు ముగ్గురూ..అక్కడే దెగ్గరిలో ఉన్న రామాలయం గుడి ప్రక్కన ఉన్న సురేష్ గాడి ఇంటికి చేరుకున్నారు ...రాత్రి అక్కడ నుంచే ముగ్గురు సినిమాకి బైల్దేరారు...

సురేష్ వాళ్ళమ్మ కంగారుగా అటూ ఇటూ తిరుగుతుంది...
వాళ్ళని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి "ఏరా సినిమాకి వెళ్ళారంటా..ఇందాకే సర్పంచ్ గారు వచ్చి చెప్పారు..మీ నాన్నకి తెలిస్తే ఇంకేమన్నా ఉందా...అది సరే రాత్రంతా ఎక్కడ ఉన్నార్రా??" చాలా కంగారు పడుతూ అడిగారు వాళ్ళమ్మ సురేష్ ని..

"అమ్మ అదొక పెద్ద కథ..." అంటూ మొదలెట్టి వాడు నాలుగోసారి గండికోట్టడం వరకు చెప్పి..అంటే ఆ విషయం ఒక్కటి తప్పించి..."ఆ తర్వాతా అలా నడిచి కొంత దూరం వెళ్ళాక ఒక గుడిసె కనిపించింది...అందులో ఇంకా లాంతరు వెలుగుతూ ఉండేసరికి..మేము అక్కడికి వెళ్లి చూస్తె ఒక బామ్మ కర్ర పట్టుకొని కూర్చొని ఉంది...మేము ఆమెని ఎందుకు ఇంత రాత్రి వేళ ఇలా కూర్చొని ఉన్నావు అని అడిగితె...ఆమె పొలం అక్కడ ఉందని దాన్ని రాత్రి పూట నక్కలు రాకుండా ఇలా కాపలా కాస్తున్నాను అని చెప్పింది...మేము ఆమెకి ఎవరూ లేరా అని అడిగితె..ఒక పనికిమాలిన కొడుకు ఉన్నాడని చెప్పింది...అంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నారు అని మమ్మల్ని అడిగింది..మేము ఆమెకి మొత్తం చెప్పాము..ఆమె చాలా మంచిదమ్మ..రాత్రి పూట వెళ్ళడం ఆ దారిలో అంత మంచిది కాదు...ప్రొద్దుటి వరకు అక్కడే ఆమె గుడిసెలోనే ఉండమని చెప్పిందమ్మా...ఇంకా బోలెడు కబుర్లు చెప్పింది..మంచి మంచి కథలు కూడా చెప్పింది...అక్కడే మూడు గంటలు ఎలా గడిచిపోయాయో తేలీదు...ఈసారి ప్రొద్దున పూట అటువైపు వెళ్లి రాములోరి ప్రసాదం ఇస్తాను ఆమెకి.." చెప్పాడు సురేష్ గాడు..

"అవునా...చాలా మంచి బామ్మలా ఉంది..పాపం పనికిమాలిన కొడుకు ఉండటం వల్ల రాత్రిపూట ఆ వయసులో ఎక్కడో పొలంలో కాపు కాయాల్సిన అగత్యం పట్టింది ఆమెకు.." అంటూ వాళ్ళమ్మ ఆ బామ్మా మీద కాసేపు సానుభూతి ప్రకటించి..."బాబూ రవి..సర్పంచ్ గారు నిన్ను ఓ సారి ఆయనను కలవమన్నారు..ఇందాక చెప్పారు..." అంటూ లోపలి వెళ్తూ "నాయనలారా పళ్ళు తోముకోండి...వేడి వేడి కాఫీ తీసుకొస్తాను .." అంది..

కాఫీలు టిపినీలు అయ్యాకా ముగ్గురూ సర్పంచ గారి ఇంటి వైపు దారితీశారు...
"ఒరేయ్ నీ జామపండు ఏం చేస్తుందో..." కెలికాడు గిరిగాడు
"ఉండేహే...నా టెన్షన్ లో నేనుంటే .." చిరాగ్గా అన్నాడు రవి గాడు..
"అయినా ఒరే...ఆడి జామపండు మీద నీ ఇంట్రెస్ట్ ఏంట్రా...నిన్నటి చూస్తున్నా జామపండు జామపండు అని తెగ నీలుగుతున్నావ్..." చురకిచ్చాడు సురేష్ గాడు..

సర్పంచ్ ఇంటికి చేరుకున్నారు ముగ్గురు...జామపండు వరండాలో కూర్చొని చదువుకుంటుంది...'కనీసం పాస్ అవుద్దా ఇది' అనుకున్నాడు గిరిగాడు...  లోపలి నుంచి సర్పంచ్ మాటలు వినిపిస్తున్నాయి ...
"ఆపవే నీదొక గోల...మా అమ్మ పోయాక నువ్వు తగులుకున్నావా...ఆస్తి మొత్తం దేనికో సానికి దోసి పెడుతున్నాని ఓ తెగ ఇదైపోయేది..ఇప్పుడు నువ్వు కూడా అదే గోలా..నీ బాబు సొమ్మేం లేదిక్కడ.." అరుస్తున్నాడు వాళ్ళ ఆవిడతో...
ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లు అనిపించింది సురేష్ గాడికి...
ఎక్కడా అని ఆలోచిస్తుండగా రాత్రి అరుగు మీద..ఓ సారీ ..సమాధి మీద శయనించినప్పుడు వినిపించిన మాటలు గుర్తుకువచ్చాయి... 

సర్పంచ్ గారు బైటకి వచ్చి "ఏరా రాత్రంతా ఎక్కడున్నారు??...గోపాలపురం పరువు తీస్తున్నారు ఎదవల్లారా.." అన్నాడు.. 'నువ్వు సర్పంచ్ అయినప్పుడే పోయిందిలే గోపాలపురం పరువు..' పటపటా పళ్ళు కొరికాడు గిరిగాడు...
'నువ్ లోపలి ఎళ్ళి సదువుకోవే...బైట కూకుంటే ప్రతి నాకొడుకు ఎజ్జిబిన్ సూసినట్టు సూడ్డమే' అన్నాడు కూతురిని చూసి రవి గాడిని ఉద్దేసించి...
ఇంతలో వరండా గోడకి వేలాడదీసిన ఫోటో వైపు చూసి దిమ్మతిరిగింది గిరిగాడికి...ఏదో ట్రాన్స్ లో ఉన్నవాడిలా అయిపోయి మిగతా ఇద్దరికీ ఆ ఫోటో చూపించాడు గిరి..వాళ్ళిద్దరూ ఆ ఫోటో చూసి మళ్లీ కోయ్యబోమ్మల్లా అయిపోయారు...

"సర్పంచ్ గారు ఆ ఫోటో ఉన్న ఆవిడ...??" గొంతులో తడి ఆరిపోతుండగా అడిగాడు గిరి గాడు...
"ఎవరేట్రా....మా అమ్మ..." చెప్పాడు సర్పంచ్...
"మేము ఈమె గుడిసెలోనే ఈమె తోనే రాత్రి మొత్తం......కథలు......కబుర్లు... ." అంటూ లీలగా వస్తున్న గిరిగాడి మాటలు గొంతుకలోనే ఆగిపోయాయి, ఆ ఫోటోలో క్రింద వ్రాసి ఉన్న అక్షరాలపై వాడి దృష్టి పడి...వాడు అక్కడే స్థాణువు అయ్యాడు..ఆ ఫోటో క్రింద ఇలా వ్రాసి ఉంది...

కీ.శే. శ్రీమతి ఎర్రంశెట్టి వీరవెంకట సుకుమార లక్ష్మి
జననం : 1932
మరణం : 1995

అది చూడగానే అయిదోసారి గండి కొట్టేసింది సురేష్ గాడికి...
ఆడు గండి కొట్టడం చూసి "ఛీ...ఛీ.." అంటూ పరిగెత్తిన జామపండు అరుపు లీలగా వినిపించింది మాకు...


******************సమాప్తం *****  జైహొ ******************

17 comments:

నేస్తం said...

ఈ జైహో ఏంటి మద్యలో..కొంపదీసి అయిపోయిందా కధ??

Anonymous said...

రవి గాడు పరిగెత్తుతూ ఏదో చెట్టుకు డీ కొట్టి పడిపోయి..లేచి..చుట్టూ చూసి మళ్లీ పడిపోయాడు..అదుర్స్ .గమ్యం తెలియని బాటసారి .....కూడా సూపర్.Timing అండ్ humor బాగుంది.ఐన అంత టెన్షన్ , బయం లో కూడా అమ్మాయి గురించి మాట్లాడుకుంటున్నారు చూడు మీ ఫ్రండ్స్.....ఏంటో వాళ్ళ దేర్యం .నాకసలే దయ్యాలు అంటే భయం ,నువ్విల అచ్హం ధ్యల్లనే target చేసి కదా చెపితే ఎలా??మల్లేశ్వరి మూవీ లో సునీల్ ల ఉంది నా పరిస్థితి ఇప్పుడు.

by,
బంగారం

divya vani said...

కిషన్ గారు నాకెందుకో మీరె దయ్యాలజి మీద రీసెర్చ్ చెస్తున్నరెమొ అనిపిస్తోందండి ... మొన్న మి "నిను వీడని నీడను నేనే" అని దయ్యాల పొస్టుకే నాకు నైటు నిద్ర పట్టలేదు. . .మి దయ్యలజి రీసర్చ్ కి ఈ పొస్టు ప్రాజెక్టు వర్కా అండి

priya... said...

hey mr. comedy oriented horror blog..yah its cool..baga kathanu kudurcharu chivaraki...k waithing 4 still more amazing, comedy, horror blogs...

Rishi said...

1st part chadivina daggara nundi im waiting...
enatandi,ayipoyindaa kadha?inkaaaaa aa pillalani 10th class pass cheyinchi Inter,Degree stories kooda cheptaaranukunte madhyalo kaasta romance mix chesi :)

Kishen Reddy said...

@నేస్తం, అవునండి అయిపొయింది...ముడింజాచ్చి..ఇట్స్ ఓవర్..హోగయా..

@బంగారం, థాంక్స్..ఆ టైం లో అమ్మయిల గురుంచి మాట్లాడుకొంటే కొంచెం ఇంటరెస్టింగ్ ఉండి..టాపిక్ మారి..దయ్యాల భయాన్ని పోగొట్టుకోవాలని అలా మాట్లాడుకున్నారు అనమాట

@దివ్య, అవునండి భలే కనిపెట్టారే...మీరు మహా తెలివిగల అమ్మాయి సుమ..

Kishen Reddy said...

@ప్రియ, తప్పకుండ మీరు కోరినవి రాస్తాను

@రిషి, అవునండి అయిపొయింది...ఏంటో అందరు అయిపోయిందా అని ఇలా అడిగేస్తుంటే నేనేమన్నా అర్ధాంతరంగా ముగించాన అన్న అనుమానం నాకే కలుగుతుంది...వాళ్ళని ఇంటర్ చేయించి, డిగ్రీ కూడా చేయిద్దామని నాకూ ఉంది..కాని ఈ కథ స్కోప్ కేవలం ఒక రాత్రి వాళ్ళు అలా షార్ట్ కట్ ఎంచుకున్న పరిణామక్రమాన్ని మాత్రం రాయడమే..కాని ఇవే పాత్రలను పెట్టి వీరి మధ్య జరిగే ఒక కథను రాస్తాను విత్ నైస్ రోమాన్స్...Stay Tuned brother

sowmya said...

భలే రాసారండీ, చాలాసేపు కథ అనిపించలేదు సుమండీ, నిజంగా జరిగినదే ఏదో చెప్తున్నారనుకున్నాను. కొని చమక్కులు బాగా మెరిసాయి. మీలో మంచు కథకుడున్నాడు,ఇలాగే రాస్తూ ఉండండి.

sowmya said...

నా కామెంటెందుకు రాలేదూ??????

Kishen Reddy said...

సౌమ్య, మీ కామెంట్ ఇప్పుడు వచ్చింది చూడండి.. :) కామెంట్స్ నేను ఆమోదించే వరకు బ్లాగ్ లో కనిపించవు, ఇప్పుడే మీ కామెంట్ చూసి ఆమోదించాను...మీ కామెంట్ చాలా సంతోషాన్ని ఇచ్చిందండీ..మీ అభిమానంతో ఇలాగే ఇంకా ఎన్నో రాస్తాను.. :)

3g said...

అరుగు ఎపిసోడ్ సూపరండి. మీ నవల ఎంతవరకూ వచ్చిందండీ.

Naresh said...

"గండి కొట్టింది".. LOL, ఏమి పద ప్రయోగం..
నవ్వలేక చచ్చాను.. అంత హార్రర్ లో కూడా
చాలా బాగుంది. ఇంక వీటి సీక్వెల్స్ కోసం ఎదురుచూస్తుంటా

శివరంజని said...

దెయ్యాల కధల్లో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించేసారు . ఈ దెయ్యాల కధలో రాకుమారుడు మీరే అని చెబుతారనుకున్నాను , ఇంతకి ఈ కధలో సురేష్ మీరేనా!

Kishen Reddy said...

@3g, ధన్యవాదాలు..నా నవలా???..నేను ఇప్పుడు నవల ఏమి రాయడం లేదండి.

@ నరేష్, థాంక్స్..సీక్వెల్స్ త్వరలోనే రాస్తాను..మీ అబిమాననికి కృతజ్ఞుడిని

Kishen Reddy said...

రంజని, నేను రాసింది పూర్తి హారర్ కాదు..దాంట్లో చాలా కామెడి మిళితం అయింది...త్వరలోనే పూర్తి స్థాయి హారర్ కథ రాస్తాను..ఇకపోతే, ఈ రాకుమారుడు ఎవరు??..ఈ కథలో పాత్రలకు నాకు ఎటువంటి సంబంధం లేదు...నేను సురేష్ అనడం ఎమన్నా బావ్యంగా ఉందా??.

శివరంజని said...

sorry sir ఇది ఊహించి రాసిన కధ అని అనుకోలేదు అందుకే సురేష్ మీరా అని అడిగాను. ఇకపోతే ప్రతి దెయ్యాల కధలో రాకుమారుడు ఉండాలేమో అనుకున్నా చిన్న మెదడు కదా అంత తొందరగా అర్ధం చేసుకోలేక పోయాను అందులోను దెయ్యాల కధ భయం వల్లనేమో

Kishen Reddy said...

రంజని సారీ దేనికి...భలేదానివే..దెయ్యాల కథలో రాకుమారుడు ఉండేది విటలాచార్య టైంలో...ఇది కిషెన్ టైం..మా దెయ్యాల కథలు వెరైటీ గా ఉంటాయి...మీకు దెయ్యాల కథ అంటే భయం పోగొట్టే పూచీ నాది..ఎలా అంటారా..మరో మాంచి దెయ్యాల కథ రాసి మీ చేత చదివించడమే...