Search This Blog

Thursday, 13 May, 2010

హృదయం ప్రేమిస్తానంటే...విధి విడదీస్తానంటే !! - 1


"సుధీర్ ని తప్ప నేను ఎవరినీ పెళ్ళిచేసుకోను...." తెగేసి చెప్పించి ఆమె..
"నా మాట గౌరవించని వాళ్లకు ఈ ఇంట్లో స్థానం లేదు..అది కూతురైనా సరే.." స్థిరంగా చెప్పసాగాడు ఆ తండ్రి "కూతురిగా నా గౌరవం నిలబెట్టాలి అనుకుంటే నేను చెప్పిన వాడినే పెళ్ళిచేసుకో..."
"నల్ల కోట్లు వేసుకునే వాళ్ళముందు మీ పరువు కాపాడటానికి, జీవితాంతం నా మనసుకి నేను నల్ల ముసుగు వేసుకొని జీవించలేను నాన్నా.." అంతే స్థిరంగా చెప్పింది ఆమె కూడా..
"అదే నీ నిర్ణయమయితే..." అని వాకిలికేసి వేలు చూపించాడు ఆమెకి..
అంతే ఆమె విసురుగా లోపలి వెళ్లి ఒక సూట్ కేసుతో బైటకి వచ్చి అతని వైపు ఓసారి చూసింది.
"వెళ్ళదల్చుకున్నవాళ్ళు ఆగడం దేనికి..." చేతులు వెనక్కి కట్టుకొని పక్కకి చూస్తూ అడిగాడు
"ఇదే చివరిసారి మీ కూతురు మిమ్మల్ని చూడటం అని తెలియజేయడానికి.." అని గుమ్మం దాటి వెళ్లిపోయిందామె

****************************************************

ఉలిక్కిపడి లేచిన సంహితకి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు, మరుక్షణం అదంతా కల అని తెలిసి ఊపిరి పీల్చుకుంది..
"మార్నింగ్ బంగారం..." తన రూంకి అప్పుడే వచ్చిన ఆమె తండ్రి నవ్వుతూ పలకరించాడు...
సంహిత వింతగా చూస్తుంది తండ్రి వైపు..."అదే నీ నిర్ణయమయితే..." అని కలలో వాకిలికేసి వేలు చూపించిన తండ్రి ముఖమే ఆమెకి ఇంకా కనిపిస్తుంది...

వెంటనే తన తండ్రి దెగ్గరకు వచ్చి ఆయన చేతులని తన చేతుల్లోకి తీసుకొని "క్షమించు నాన్నా..." అని అక్కడినుంచి వెళ్ళిపోయింది...అతను ఏమీ అర్థం కానట్లు అలాగే నిల్చున్నాడు..

"అసలు ఆ కల నాకెందుకు వచ్చిందో అస్సలు అర్థం కావడంలేదే..." స్నేహితురాలు సుధతో రాత్రి కల గురుంచి చెప్పింది సంహిత కాలేజీకి వస్తూనే....
"అర్థం అవ్వడానికి ఏముంది...తొందరలోనే ఎవడితోనో నువ్వు జుంపు జోగినాధం అనమాట...నాకు చెప్పకుండా గ్రంథం ఎమన్నా నడుపుతున్నావా.." అడిగింది ఆమె నవ్వుతూ..
"నీ మొహం...ఈ ప్రేమలు దోమలు అంటేనే నాకు టెన్షన్..దానికి తోడు నాన్నని ఎదిరించి ఇంట్లోనుంచి వెళ్ళిపోవడమా!!..." అంది సంహిత క్లాస్ రూం వైపు నడుస్తూ...
"అబ్బో...సరేలే...నీ కలలో వచ్చిన ఆ హీరో ఎవరో ?" అడిగింది సుధ..
"నాకేం తెలుసు...పేరు మాత్రం గుర్తుంది...సుధీర్.." 

కాలేజీ నుంచి బస్సు స్టాపుకి వస్తుంటే సంహిత పుస్తకాలు జారి క్రింద పడ్డాయి...ఆమె తీసుకోనేలోపు, అటు ప్రక్కగా వెళ్తున్న ఆ యువకుడు వడివడిగా వచ్చి ఆమె పుస్తకాలు తీసి చేతికీ అందించాడు..
"థాంక్స్.." అందామె అతని వైపు చూస్తూ...
అతనిలో ఏదో తెలియని ఆకర్షణ మొదటిచూపులోనే ...
పర్వాలేదు అన్నట్లుగా చూసి చిన్నగా నవ్వి వెళ్ళిపోయాడు అతను...
అతని చూపులోని చురుకుదనం...అతని అమాయక మోములో నుంచి జారిన ఆ అరనవ్వు ఆమెని ఒక్క క్షణం కట్టిపడేసాయి...కొద్దిగా గుండె వేగం పెరిగింది...అతను వెళ్తున్న వైపు అలానే చూస్తూ శిలాప్రతిమలా నిలబడిన ఆమె, అంతలోనే తేరుకొని క్షణక్రితం తన చర్యని తలచుకొని బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కగా తనలో తానే చిన్నగా నవ్వుకొని వెళ్ళిపోయింది...

"సంహీ....సంహీ..." అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది సుధ సంహిత లైబ్రరీలో ఉండటం చూసి...
"సైలెన్స్..." అంటూ బల్ల మీద సుత్తితో కొట్టాడు లైబ్రేరియన్ సుధ వైపు చూసి..
'వీడొకడు...వీడి చేతికి సుత్తి ఇచ్చిన వాడిని, బాలయ్య దెగ్గర గొడ్డలి అప్పు తీసుకొని మరీ నరికేయ్యాలి...' అనుకుంటూ సంహిత కూర్చున్న బెంచ్ దెగ్గరికి వచ్చింది...
"ఏంటే ఆ కంగారు..." అంది సుధని చూస్తూ..
"థర్డ్ సెం రిజల్ట్స్ వచ్చేసాయి...నేను ఒక సబ్జెక్టులో డింకీ కొట్టా....అది పెద్ద విషయం కాదు, గత రెండు సెమిస్టర్స్ నువ్వే కదా కాలేజీ ఫస్ట్, ఇపుడు నిన్ను ఒకడు దాటేసాడు..." అంది గుక్క తిప్పుకోకుండా...
"అవునా??..ఎవరు అతను.." అడిగింది కొంచెం దిగాలుగా...
"ఏమో..పేరు తెలీదు..మాత్స్ గ్రూప్ అనుకుంటా..రేపు అసెంబ్లీలో అనౌన్స్ చేస్తారట టాప్ రిజల్ట్స్..." 

అందరూ ఓపెన్ ఎయిర్ ధియేటర్ లో అసంబుల్ అవ్వగా, ప్రిన్సిపాల్ రిజల్ట్స్ చదివాడు...
"మీ బాచ్ లో ఈసారి మొదటిసారిగా ఒక అబ్బాయి కాలేజీ ఫస్ట్ వచ్చాడు...హి ఈజ్ ఫ్రం మాత్స్ గ్రూప్ " అని అతను అనౌన్స్ చెయ్యగానే మాత్స్ గ్రూప్ అబ్బాయిలు ఈలలు..కేకలు మొదలెట్టారు..సంహితకి ఇక అక్కడ ఉండాలని అనిపించలేదు...వెళ్ళిపోవడానికి లేచిన ఆమె "ప్లీజ్ గివ్ అ బిగ్ హాండ్ టూ మిస్టర్ సుధీర్..." అన్న మాటలు విని చప్పున వెనక్కి తిరిగింది...

డయాస్ మీదకి అతను వస్తుండగా అందరూ చప్పట్లు కొడుతున్నారు...
కొన్ని వందల కళ్ళు అతన్ని చూస్తున్నాయి...కానీ ఆమె రెండు కళ్ళు మాత్రం అతన్ని చూస్తూ వర్షిస్తున్నాయి ...అది ఆనందమో ... దుక్కమో ... ఆశ్చర్యమో...ఆవేదనో...ఆమెకే అర్థం కావడం లేదు.. అప్పటిదాకా పరిచయం లేని పరవశం ఏదో ఆమెని ఆవహించగా..ఆమె ఎద బరువెక్కింది, ఆ బరువు తాళలేనన్నట్లు అక్కడే..అలాగే కుర్చీలో కూలబడింది...ఆమె ఎదసవ్వడి ఆమెకి స్పష్టంగా వినిపిస్తుంది...ఏంటో అతని నుండి చూపు మరల్చుకుంటే ప్రాణం పోతుందేమో అనిపిస్తుంది ఆమెకు...రెప్ప వేయకుండా అతన్నే చూస్తుంది..అతను విసిరే చిరునవ్వు ఆమెని నిలువెల్లా వివసురాలుని చేస్తుంది..'రెండు రోజుల క్రితం చుసిన ఇతని గురుంచి నేను ఎందుకు ఇలా అవుతున్నాను...ఏమయింది నాకు..' ఆమెకి ఏడుపు వస్తుంది..


మరుసటి రోజు కాలేజీ బస్సు స్టాప్ లో బస్సు కోసం చూస్తున్న ఆమెకి ఏ బస్సు వచ్చినా ఎక్కాలని అనిపించడంలేదు..'ఒక్కసారి అతను కనిపిస్తే బాగుండు..' అంటూ ఆమె గుండె పదే పదే కొట్టుకుంటుంది... కోరుకుంటుంది...ఆ విషయం ఒప్పుకోవడానికి ఆమె మనసు మాత్రం సందేహిస్తుంది...తనది అంత చంచల మనస్తత్వం కాదని ఆమెకి తెలుసు..కానీ ఇతని విషయంలో తను ఎందుకు ఇలా అవుతుంది...ఆతను ఎవరో కుడా తెలియదు, కానీ కనిపిస్తే ప్రాణం పోతునట్లు అనిపిస్తుంది...వెళ్లి అతని కాలర్ పట్టుకొని ఎవరు నువ్వు..నన్నేం చేస్తున్నావ్ అని గట్టిగా అడగాలని అనిపిస్తుంది ఆమెకు...

"హలో..." అంటూ ఓ మృదువైన కంఠం ఆమెని పలుకరించగా..ఎప్పుడొచ్చాడో పక్కకి తిరిగి చూడగా అతనే...
చూస్తేనే ప్రాణం పోయేలా ఉంది ఆమెకి, ఇక దెగ్గరికి వచ్చి ఇలా మాట్లాడితే ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి...గుటకలు మింగుతూ అలానే చూస్తుంది అతని వైపు...స్వేద బిందువులు ఆమె చెక్కిళ్ళు తాకి ఎరుపు రంగులో మెరుస్తున్నాయి...గుండె వేగం కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ని మించిపోయింది...

"గత రెండు సెమ్స్ లో మీరే టాప్...కాని ఈసారి నేను పోటి వచ్చానని కోపం లేదు కదా..." చిన్నగా నవ్వాడు..
చివాల్న మొహం తిప్పుకుంది...ఆమె అతని చిరునవ్వు తట్టుకోలేదు...తట్టుకొని అతన్ని కళ్ళలోకి చూడలేదు...చుస్తే ఆమె వశం తప్పి ఏం చేస్తుందో అన్న భయం..ఎంత నిగ్రహించుకోవలాన్నా ఆమె వల్ల కాకపోవడం ఆమెకి ఏడుపు తెప్పిస్తుంది...

"ఎనీ ప్రాబ్లెం..." అడిగాడు అతను 
'ఎస్...యు ఆర్ మై ప్రాబ్లం...హూ ఆర్ యు?..హూ యాం ఐ టూ యు?..' ఆమె మనసులోనే ఆగిపోయింది ఆమె ఆవేశం...ఆక్రోశం..
మెల్లిగా అతని వైపు తిరిగి "కంగ్రాట్స్ .." అని చెప్పగలిగింది...
"థాంక్స్...నేను ఈ సెమిస్టరు నుంచే ఈ కాలేజీలో జాయిన్ అయ్యాను..." అన్నాడు..
"ఓ అలాగా..." అని 'ఎందుకు జాయిన్ అయ్యవురా బాబూ....నీవల్ల ఇక నేను అసలు చదువుతానా??..' అనుకొని దీనంగా పెట్టింది ముఖం 
ఇంతలో బస్సు రావడంతో "వస్తున్నారా మీరు కూడా .." అని అడిగాడు తను బస్సు ఎక్కబోతూ...
"లేదు...ఈ బస్సు మా ఏరియా వెళ్ళదు.." అంది 
"ఓకే...బాయ్ సంహిత..." అని చెప్పి అతను ఎక్కాడు...బస్సు కదిలింది...
అతను అలా దూరం అవుతున్న కొద్ది ఆమెలో తెలియని అలజడి ...ఆమె వెళ్ళాల్సిన బస్సు కూడా అదే అయినా నిగ్రహించుకొని అతని ఆహ్వానాన్ని తిరస్కరించినందుకు ఆమె మనసు ఆమెని ఛీత్కరించింది...పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ బస్సుని అందుకోవాలన్న ఆవేశం వచ్చింది ఆమెలో..అంతలోనే ఏమీ చెయ్యలేని నిస్సహాయత..కళ్ళ వెంబడి జారి చెక్కిళ్ళు తడుపుతూ తడుముతున్న కన్నీళ్ళను తుడిచే వృధా ప్రయత్నం చేస్తుందామె...

తన కలలో వచ్చిన అతని పేరు సుధీర్...కాలేజీలో కలిసిన అతని పేరు కూడా సుధీర్..కలలో సుధీర్ కోసం తండ్రినే ఎదిరించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది..ఆమెకి ఆ కల మళ్లీ గుర్తుకు రాగానే ఏదో తెలియని భయం...అది కలే అని సర్దిపెట్టుకున్నా ఆమె మామూలుగా ఉండలేకపోతుంది...కాలేజీ సుధీర్ పై తనకి ఉన్నదీ కచ్చితంగా ఆకర్షణే..కానీ ఆ ఆకర్షణ ఇంత బలీయంగా ఉంటుందా అనేదే ఆమె నమ్మలేకపోతుంది...అతను దూరంగా వెళ్తున్నప్పుడు ఆమె పడ్డ మానసిక వేదన, ప్రియుడు ప్రియురాలు నుంచి శాశ్వతంగా విడిపోయినప్పుడు కలిగే వేదన కన్నా పదింతలు ఎక్కువ..నిలువునా దాహించివేసే బాధ ఆమెకి అనుభవంలోకి వచ్చిన క్షణం అది...అప్పటిదాకా ఎంతో మంది అందమైన అబ్బాయిలు కనిపించినా ఏనాడూ కనీసం ఎవరి గురుంచీ ఒక్క క్షణం కూడా ఆలోచించని ఆమె, ఇతని కోసం ఎందుకు ఇంతగా ఇదై పోతుంది...అతను కనిపించినపుడే...తొలిచూపులోనే..తొలినవ్వులోనే ఆమెని అంతగా ఎందుకు దోచుకున్నాడు...

తన బెస్ట్ ఫ్రెండ్ సుధాకి చెప్పాలనుకుంది ఈ విషయం...కానీ చెప్పలేకపోయింది...చెప్పాక ఆమె దెగ్గర తను అల్లరిపాలు అవుతానేమో అన్న భయం..సుధీర్ విషయం తేలికగా తీసుకుందాం అని ఆమెని ఆమె ఎంత సముదాయించుకున్నా, అది కేవలం అతను కనిపించే వరకు మాత్రమే..అతను తనకు కనిపించకూడదు అని మనసులో దేవుడిని కోరుకుంటూనే, ఆమె కళ్ళు అతని కోసం నలువైపులా వెతుకుతూనే ఉంటాయి అలుపెరగని సంద్రపు అలలులా..  ఒక్కసారి అతను ఎప్పుడైతే కనిపించాడో ఇక తను తను కాదు..అతని దెగ్గరికి వెళ్లి కనీసం హలో అయినా చెప్పకపోతే తను చచ్చిపోతుందేమో అన్న భయం..

ఓ రోజు ఆమె కాలేజీకి బస్సులో వస్తుండగా..ఒక నాలుగు రోడ్ల కూడలి వద్ద ట్రాఫిక్ జాం...ఎంతసేపయినా బస్సు కదలడం లేదు...కాలేజీ కి లేట్ గా వెళ్తే అతను కనిపించడేమో..ప్రతి విషయంలోనూ అతని ఆలోచనలే..తన మీద తనకే జాలి కలిగింది...తన బుజ్జి మనసు అతన్ని అంతగా ఎందుకు కోరుకుంటుందో తెలియక ఒక నిస్సహాయపు నవ్వు విరిసింది ఆమె పెదవుల పైన...

"ఆక్సిడెంట్ అంట...పాపం స్పాట్ డెడ్ అంట ఎవరో..." పక్క సీట్ వాళ్ళు మాట్లాడుకోవడం వినపడ్డాయి ఆమెకు...
ఆమె కిటికీ లోనుంచి చూసింది..ఆ కూడలి వద్ద జనాలు గుమ్ము గూడి ఉన్నారు...
ఆమె కొద్ది సేపు చూసి...క్రిందకి దిగి, ఆ కూడలి వైపు నడుచుకుంటూ వెళ్ళింది..
జనాలు గుంపుగా ఉండటం వల్ల ఆమెకి ఎవరో కనపడలేదు....
కొద్దిగా జనాలని నెట్టుకుంటూ ముందుకు వెళ్ళింది...మోటార్ సైకిల్ ఒక లారీకి గుద్దుకున్నట్లు తెలుస్తుంది...
రక్తపు మడుగులో పడివున్న ఆ వ్యక్తిపై ఒక తెల్లటి దుప్పటి కప్పారు...
ఇంతలో అంబులెన్స్ రావడంతో, ఆ బాడీ అందులో ఎక్కించడానికి పైకి లేపారు, అప్పుడు..ఆ క్షణం ..అతని ముఖాన్ని కప్పి ఉన్న ఆ ముసుగు తొలగింది...అతని రూపం ఆమె కంట పడింది...ఆమె గుండె ఒక్క క్షణం ఆగింది..ఆమె కాళ్ళ క్రింద భూమి కంపించింది.."సుధీర్...." అంటూ ఆమె నోటి నుండి ఒక వెర్రి కేక...గుండెలు అవిసేలా...ప్రాణం పోయేలా...దిక్కులు పిక్కటిల్లేలా...చావుకే భయం పుట్టేలా...అతను విగత జీవుడై అంబులెన్స్ లో వెళ్తూ దూరం అవుతుండగా....ఆమె అక్కడే కుప్పకూలిపోయింది....


           [................ To be continued in the next part]25 comments:

మధురవాణి said...

ఎంత రాతి హృదయమండీ మీది..ఎంతటి కరుకైన హృదయం (ఇలాంటి సినిమా డైలాగ్స్ అన్నీ గుర్తు తెచ్చుకోండి.)ఎంత మీరు సృష్టించే పాత్రలయితే మాత్రం ఇలా చంపేస్తారా? ప్చ్.. :-( మళ్ళీ బ్రతికిన్చేద్దురూ ;-)

Praveena said...

Good narration.

3g said...

Good One & Good narration

Bangaram said...

Kanisam "i love you" cheppe varaku ina brathakanivvalindhi andi...ila vidadhisesara...paapam kadhu....Thandri,kuthurla relationship baga rasaru.asalu end ki vachinde theliyaledhu sumandi...ayyooo ipoyindha?? ane doubt vachindhi....alantha intresting ga undhi story.

Bangaram said...

Next part thondharaga Post cheyandi Sir..eagar ga wait chetshunnam.....

Rishi said...

ఏంటండీ మీరు,టపాలు,కధలు ఇలా సడెన్ గా ముగించెస్తారు..రాంగోపాల్ వర్మ శిష్యులా ఏమిటి?

నేస్తం said...

లాభం లేదు కిషన్ నీకు పెళ్ళి చేసేయాలి..లేకపోతే ఇలా జంటలను విడకొట్టేసి నీ బాధ అందులో చూసేసుకుంటావ్ :)

Anonymous said...

Outstanding Narration and excellent portrayal of girl's sensitive feelings.
some dialogues are really worth noting:
>>నల్ల కోట్లు వేసుకునే వాళ్ళముందు మీ పరువు కాపాడటానికి, జీవితాంతం నా మనసుకి నేను నల్ల ముసుగు వేసుకొని జీవించలేను నాన్నా
>>కొన్ని వందల కళ్ళు అతన్ని చూస్తున్నాయి...కానీ ఆమె రెండు కళ్ళు మాత్రం అతన్ని చూస్తూ వర్షిస్తున్నాయి
>>వెళ్లి అతని కాలర్ పట్టుకొని ఎవరు నువ్వు..నన్నేం చేస్తున్నావ్ అని గట్టిగా అడగాలని అనిపిస్తుంది ఆమెకు...
>>శ్వేత బిందువులు ఆమె చెక్కిళ్ళు తాకి ఎరుపు రంగులో మెరుస్తున్నాయి (awesome, aa ammai chekillu erupu rangulo marayi ani adbhutamga chepparu)
>>అతను దూరంగా వెళ్తున్నప్పుడు ఆమె పడ్డ మానసిక వేదన, ప్రియుడు ప్రియురాలు నుంచి శాశ్వతంగా విడిపోయినప్పుడు కలిగే వేదన కన్నా పదింతలు ఎక్కువ..నిలువునా దాహించివేసే బాధ ఆమెకి అనుభవంలోకి వచ్చిన క్షణం అది
>>..ప్రతి విషయంలోనూ అతని ఆలోచనలే..తన మీద తనకే జాలి కలిగింది...తన బుజ్జి మనసు అతన్ని అంతగా ఎందుకు కోరుకుంటుందో తెలియక ఒక నిస్సహాయపు నవ్వు విరిసింది ఆమె పెదవుల పైన...
Hats off Kishen to such a wonderful narration and outstanding script..

Raj said...

Kishen Reddy

vallu jaladarinchindi ane mata ki ardam telusukunna mi story chadivaka..

edo fantasy chaduvutunnattu ledu. na kantiki eduruga jarugutunnadi chustunnattu feeling..

ending em chestaro telidu kani.... miru starting lo tandri kuturlla madhya jarigina incident rakunda chudandi pls

naku prema anna parents anna chala istam...kani renditilo parents ke ekkuva importance ista

sowmya said...

ఇలాంటి కథ నేను ఇంతకుముందు ఎక్కాడో చదివాను. ఇంచుమించు ఇలంటిదే, ఎక్కడబ్బా???????

'Padmarpita' said...

నాకు తెలుసు మీరు నెక్ట్స్ పార్ట్ లో సుధీర్ ని బ్రతికిస్తారు...

Sathish said...

సూపర్ ఉంది కిషెన్ గారు, చాలా అద్భుతంగా రాసారు మీరు. చక్కని శైలి, గుండెకి హత్తుకొనేలా చెప్పగలిగే టాలెంట్ ఉంది మీకు. సంహిత క్యారెక్టర్ చక్కగా వర్ణించారు. సుస్పెన్సు లో ఆపారు కథని, మిగతా భాగం కూడా త్వరగా రాసెయ్యండి ఎదురుచూస్తూ ఉంటా

Kishen Reddy said...

@ మధురవాణి : ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా ఎలా బ్రతికించమంటారు చెప్పండి..అయినా ఇకపైనే అసలు కథ ఉండబోతుంది.. :)

@ ప్రవీణ : ధన్యవాదాలు

@ గలాగలా గోదారి గారు, థాంక్స్ అండి

Kishen Reddy said...

@ బంగారం : ప్రతి కథలు చూసుకోడం, ప్రేమించేసుకోడం తర్వాత ఐ లవ్ యు చెప్పుకోడం...అంతా రొటీన్ గా ఎందుకండీ..సో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తున్న ఇక్కడ. తరువాయి భాగం త్వరలోనే రాస్తాను. మీ అభిమానానికి థాంక్స్

@ రిషి : నేను కథని ముగించలేదండి..ఆపాను, తరువాయి భాగం త్వరలోనే రాస్తాను..కొంచెం సుస్పెన్స్ లో ఆపితే బాగుంటుంది అలా ఆపేసాను..

Kishen Reddy said...

@ నేస్తం : అంతే అంటారా?..ఇంకెందుకు ఆలస్యం మంచి గోదావరి అమ్మాయిని నాకోసం చూసెయ్యండి మరి...అయాం రెడీ..

@ Anonymous : Your comment really made me so happy. Thanks a lot for the affection and i promise will live upto it. stay tuned to Akasaveedhilo.

@ soumya : ఇప్పటిదాకా నేను రాసింది దాదాపు చాలా కథల్లో ఉండేదే లెండి..ఒక అమ్మాయి ప్రేమించడం, ఆ అబ్బాయి అనుకొని పరిస్థితుల్లో ప్రమాదంలో చనిపోవడం...నేను అనుకోబోయే అసలైన కథ ఇంకా మొదలు కాలేదు,అసలు కథ రాబోయే భాగం నుండి మొదలవుతుంది..కొంచెం డిఫరెంట్ గా ట్రై చెయ్యబోతున్న..ఆదరిస్తారు అనే నమ్మకం ఉన్నా కొంచెం భయంగా ఉంది...మీ అభిమానానికి థాంక్స్ :)

Kishen Reddy said...

@ రాజ్ : మీ వ్యాక్య నాకు చాలా ఆనందం కలిగించింది..మిమ్మల్ని ప్రభావితం చేయగలిగినందుకు నేను ధన్యుడిని..ఇకపోతే పేరెంట్స్ అంటే నాకు కూడా గౌరవమే...ఈ కథలో అనుకొని పరిస్థితుల వల్ల అటువంటి సీన్ వస్తుంది...కానీ దానికి తగిన కారణాలు ఉంటాయి..తరువాతి భాగం నుంచే అసలు కథ మొదలవుతుంది.

@ పద్మ : మీరు భలే తెలివైన వారు సుమా :)...

@ సతీష్ : ధన్యవాదాలు, త్వరలోనే రాస్తాను

Mahi said...

బాగా రాసారు.నెరేషన్ స్టైల్ బాగుంది

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

కథనం చాలా బావుంది

Kishen Reddy said...

@ మహి : థాంక్స్ అండి

@ శ్రీకాంత్ : ధన్యవాదాలు, మీ బ్లాగ్ ఇప్పుడే చూసాను..చాలా బాగా రాస్తున్నారు :)

శివరంజని said...

కధ అని తెలిసిన ఎందుకో జాలేసింది. ఎంత మీరు సృష్టించే పాత్రలయితే మాత్రం ఇలా చంపేస్తారా? పాపం సంహిత ని బాధ పెడతారా? తప్పేనా! తప్పని ఒప్పుకోండి.. సడన్ గా కామెడీ స్టోరీలు వదిలేసి ట్రాజెడీ స్టోరీలు కి వెళ్ళిపోయారేమిటి. ఏ విషయం ఆదారంగా తీసుకుని రాసారో తెలియదు కాని నిజానికి కల్పితానికి తేడా తెలియనంత దగ్గరగా రాసారు.నాకు మాత్రం మీలో మంచి రచయిత కనిపిస్తున్నారు

poorna said...

chala bavundi mee blog...chala baaga rastaru kuda..edina vaara pathrika ku pampinchandi nalanti vallu chala mandi chaduvutharu..

Kishen Reddy said...

రంజని నీ కామెంట్ చూసి చాలా సంతోషాన్ కలిగింది..నీ అభిమానానికి థాంక్స్..ఇకపోతే, సంహీని బాధపెట్టాను నిజమే..కాని మీరు రెండో పార్ట్ చదవాలి..అప్పటికి గాని మీకు విషయం అర్థంకాదు..

పూర్ణ : థాంక్స్ అండి..వార పత్రికల వారు వేసుకునే అంత కథలు కావులెండి నావి..ఏదో నాకు తోచిన విధంగా రాస్తున్నా, అందరికి నచ్చాలని లేదు :)

priya... said...

hey baboi...enti nu...asalu....chala chala bagundi story...enti lovestories pina emina research chestunnava enti...a feelings anta achuguddela...avanni neeku nuvvu ga xperience inatuu...even ammai lavi kuda...baboi...ramu...u r genius...chala nachesindi blog...very nice sir...keep it up...

Ananya Reddy said...

amma baboy..tragic end in the final..whatcha suspense??iz makin us 2 read other parts 2..niz narration

Kishen Reddy said...

@ ప్రియ : ఒక పాత్రని నేరాట్ చేసేప్పుడు ఆ పాత్రలో దూరిపోయి..వాళ్ళెలా ప్రవర్తిస్తారో ఊహించగాలిగితే చాలు..నేనదే చేస్తున్నాను...థాంక్స్

@ అనన్య : థాంక్స్ ఏ లాట్ :-)