Search This Blog

Friday, 28 May, 2010

హృదయం ప్రేమిస్తానంటే...విధి విడదీస్తానంటే !! - 6


"ఎన్ని సార్లు చెప్పాలి నీకు ఇటు వైపు రావద్దని ....మళ్లీ వచ్చావంటే ఈ సారి నోటితో చెప్పను..." గదిమాడు ఆ సెక్యురిటీ గార్డ్...
"నేను కూడా ఇదే కాలేజీ అంటే ఎందుకు మీరు నమ్మడం లేదు...నన్ను లోపలి వెళ్ళనివ్వండి ప్లీజ్...సంహిత నాకోసం చూస్తుంటుంది.." చెప్పాడు ఆ అబ్బాయి
"నువ్వీ కాలేజీ అని చెప్పడానికి నీ దెగ్గర ఐ.డీ కార్డ్ లేదు...పేరు అడిగితే సుధీర్ అంటావ్..కావాలంటే సంహితని అడగండి అంటావ్...ఎన్నో సంవత్సరం అంటే తెల్ల మొహం వేస్తావ్ .. ఏం నీకు ఆటలుగా ఉందా .." అడిగాడు కోపంగా.
"ప్లీజ్..అలా అనకండి...ఒక్కసారి సంహిత ఎక్కడుందో కనుక్కొని పిలుస్తారా..తనే మీకు అన్నీ చెప్తుంది..." అన్నాడు 
"ఆ పని కూడా ఎప్పుడో చేశా..సంహిత అనే పేరున్న అమ్మాయి ఎవరూ ఈ కాలేజీలో లేరని తెల్సింది...సుదీర్లు అయితే ఇద్దరు ఉన్నారు..ఒకడు రెండో సంవత్సరం చదువుతున్నాడు, వాడిని నేను చూసాను కాబట్టి, నువ్వు వాడు అయ్యే అవకాశం లేదు..ఇక పోతే ఇంకొకడు ఆర్నెల్ల క్రింద ఆక్సిడెంట్ లో పోయాడట...ఆడిని నేను చూడలేదు..." అన్నాడు ఆ గార్డ్.... ఏదో ఆలోచిస్తున్నట్లు అక్కడే నిలబడ్డాడు ఆ అబ్బాయి....
"ఏంటి ఆలోచిస్తున్నావ్?...కొంపదీసి ఆ చచ్చిన సుధీర్ నేనే అంటావా?? ...నువ్వు అన్నా అంటావ్..వెళ్లిక్కడినుంచి.." అన్నాడు ఆ గార్డ్ చిరాగ్గా మొహం పెట్టి.

నిరుత్సాహంగా వెనక్కి మళ్ళాడు తనని తను సుధీర్ అని చెప్పుకుంటున్న ఆ యువకుడు...అతనికి బాగా నమ్మకం అతను ఈ కాలేజీ స్టూడెంట్ అని...'నన్ను ఎందుకు ఎవరూ నమ్మడంలేదు..అసలు సంహిత ఎక్కడికి వెళ్ళింది..ఎందుకు ఆ రోజు నన్ను చూసినా చూడనట్లు వెళ్ళిపోయింది...నేను వెళ్లి తనతో ఎంత మాట్లాడినా, ఎన్ని విషయాలు చెప్పినా ఎందుకు నన్నొక పరాయి  వ్యక్తిలా చూసింది...ఆ తరువాత ఎప్పుడూ నాకు ఎందుకు కనిపించలేదు ....కార్తీక్ ఏమయ్యాడు, దివ్య ఏమయింది...అందరూ నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారు.. నన్ను ఎందుకు ఒంటరి వాడిని చేసారు ...ఏమిటి నాకీ శిక్ష...చివరిదాకా నాతో ఉంటాను అని ప్రామిస్ చేసిన సంహిత ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది...ఎన్నో ప్రశ్నలు వేధిస్తుండగా అలసటగా ఆ బస్సు స్టాప్ లో కూర్చున్నాడు...ఒకప్పుడు అదే బస్సు స్టాప్ లో సంహితకి తన ప్రేమని వ్యక్తం చేసాడు...ఆ విషయం గుర్తుకురాగానే అప్రయత్నంగా అతని కళ్ళలో నీళ్ళు...

ఆ క్షణమే...అప్పుడే...అతని కంట పడిందామె...ఒక్కసారిగా అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి..ఆమె గేటు తీసుకొని లోపలి వెళ్ళబోతుంది..సెక్యురిటీ గార్డ్ ఆమెకి విష్ చేసాడు...ఆ యువకుడు ఆమె వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు "దివ్యా..." అని అరుస్తూ...ఆమె ఒక్కసారిగా వెనక్కి తిరిగిచూసింది...

****************************************************************

"గుడ్ మార్నింగ్ డాక్టర్.." విష్ చేసింది సుధ.. ఆమె ప్రక్కనే కార్తీక్ ఉన్నాడు
"వెరీ  గుడ్ మార్నింగ్...చెప్పండి " అన్నాడు డాక్టర్ అభిరాం 
"మేమిద్దరం మీరు ఆరు నెలల క్రితం ట్రీట్ చేసిన సంహిత అనే అమ్మాయికి స్నేహితులం..." చెప్పింది సుధ 
అతను ఒక్క నిముషం ఆలోచించి .."సంహిత...యా సైకోజెనిక్ అమ్నీషియా పేషంట్...గుర్తుంది..చెప్పండి, ఎలా ఉంది తను.." అడిగాడు అభిరాం 
"ఫైన్ సార్...కానీ..."
"కానీ...గో ఆన్..చెప్పండి .." అన్నాడు 
"తన ప్రవర్తనలో ఈ మధ్య చాలా మార్పులు వచ్చాయి డాక్టర్.." అంది సుధ కంగారుగా 
"ఈజ్ ఇట్....ఎలాంటి మార్పులు.. " అడిగాడు అభిరాం...అతని కళ్ళు చాలా ఆసక్తిగా గమనిస్తున్నాయి ఆమె ఏం చెబుతుందా అని..
"ఈ మధ్య ఓ సారి తన కలలో సుధీర్ అనే అబ్బాయి వచ్చాడు అని చెప్పింది...అతని కోసం వాళ్ళ నాన్నని ఎదిరించి ఇంట్లో నుంచి వచ్చేసాను అని చెప్పింది...కానీ అది నిజంగా తన జీవితంలో ఇది వరకు జరిగిన విషయమే...అంటే జరిగిన విషయాలు ఇలా కలలో రావడం ?? " ఆగిపోయింది సుధ 
"దీనికి భయపడాల్సిన పనేం లేదు...ఆమె ప్రియుడికి సంబంధిన విషయాలన్నీ ఆమెలో రిప్రెస్ అయ్యాయి..చేతన స్థితిలో అణగదొక్కబడి ఉన్న ఆ జ్ఞాపకాలు, అచేతన స్థితిలో తమ ఉనికిని చాటుతాయి ఒకోసారి...సంహితకి అతని ప్రియుడితో ఉన్నది చాలా అసాధారణమైన ఎమోషనల్ బాండ్...అసాధారణం అని ఎందుకన్నానంటే, కేవలం ప్రియుడు చావు చూసి అమ్నేషియా స్థితికి వెళ్ళడం నేను ఇంత వరకు వినలేదు...చూడలేదు...షాక్ లోకి వెళ్ళిన ఆమె అతను ఇక లేడన్న నిజాన్ని గట్టిగా అణిచివేసింది..అణగతొక్కింది..అదే క్రమంలో అతనికి సంబంధిన అన్ని విషయాలూ...వ్యక్తులూ...పరిసరాలూ... రిప్రెస్ చెయ్యబడ్డాయి...ఇట్ లెడ్ టు అమ్నేషియా...సైకోజెనిక్ అమ్నేషియా మీద ఇంకా పరిశోధన జరుగుతూనే ఉంది.. ఇదే దీనికి కారణం ఇది అని ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి...అలాగే, అణిచివేయబడ్డ జ్ఞాపకాలు ఎప్పుడు బైటకి వస్తాయో కూడా చెప్పలేము...పూర్తిగా అన్నీ బైటకి రావచ్చు...ఏవో కొన్ని విషయాలు మాత్రం లీలగా జరిగినట్లు తెలియవచ్చు..అసలు శాశ్వతంగా రాకపోనూ వచ్చు..ఏదీ ఖచ్చితంగా చెప్పలేము...అది పేషంట్ ప్రస్తుత మానసిక పరిస్థితి మరియు బైట వ్యక్తుల ఈమె పై చూపించే ప్రభావం మీద ఆధారపడి ఉంటుంది ..." చెప్పాడు డాక్టర్ అభిరాం 

"డాక్టర్ ఇంకొక విషయం ఏమిటంటే, ఆమె సుధీర్ చనిపోయిన స్పాట్ ని చూసి మళ్లీ దాదాపు నిజంగా చనిపోయినప్పుడు ఎలా రియాక్ట్ అయిందో  అలాగే రియాక్ట్ అయింది..అంతే కాదు "సుధీర్..." అని గట్టిగా అరిచి పడిపోయింది...నేను అప్పుడు ఆమె ప్రక్కనే ఉన్నాను.." చెప్పాడు కార్తీక్ 
"నిజమా ..." ఆశ్చర్యంగా చూశాడు  డాక్టర్ 
"అంతే కాదు డాక్టర్...అతను మా కాలేజీ టాపర్ అని చెప్తుంది నాతో...మన కాలేజీ టాపర్ సుధీర్ చనిపోయాడు తెలుసా అని అడిగింది...అతనితో ఏదో పరిచయం ఉన్నట్లే మాట్లాడింది.." చెప్పింది సుధ
"తనకి ఎవరన్నాజరిగిన విషయాలు గుర్తు చేసే ప్రయత్నం చేసారా ?" అడిగాడు డాక్టర్ అభిరాం
"లేదు..." చెప్పాడు కార్తీక్
"అంత ఖచ్చితంగా మీరెలా చెప్పగలరు ?" అడిగాడు
"ఎందుకంటే...తన విషయాలు మొత్తం నాకు, దివ్యకి మాత్రమె తెలుసు...ఇంకో వ్యక్తి ఆమెకి విషయాలు అన్నీ గుర్తుచేసే పరిస్థితి లేదనే అనుకుంటున్నా..." అన్నాడు కార్తీక్
"లేదు...తనకి ఎవరో..చాలా విషయాలు గుర్తుచేసారు...తద్వారా రిప్రెస్ అయిన జ్ఞాపకాలు బైటకి రావడానికి ఓ మార్గం చూపించినట్లు అయింది...ఆమె మనస్సులో చిన్న సంఘర్షణ మొదలైంది...అచేతనంలో అణగదోక్కబడిన జ్ఞాపకాలు  చేతన స్థితిలోనికి రావడానికి పడుతున్న సంఘర్షణ.. ఇవి హాలుసినేషన్స్ కి దారి తీస్తాయి...నాకు తెలిసీ ఆమెలో సుధీర్ అనే వ్యక్తి తనతో పాటే ఉన్నట్లు కొన్ని హాలుసినేషన్స్ మొదలై ఉండవచ్చు ...ఆ భ్రమలోనే, అతనంటే ఆమెకి ఎందుకు ఇష్టాన్ని పెంచుకుంటుందో తెలియకుండానే ఇష్టాన్ని పెంచుకొని ఉండవచ్చు....ఆ ఇష్టం పరిధులు దాటక ముందే, సుధీర్ చనిపోయిన స్పాట్ చూసిన సంహిత... తనతో పాటే ఉన్నట్లు భ్రమపడుతున్నసుధీర్, అప్పుడే..ఆ క్షణమే చనిపోయినట్లు భ్రమించింది ..అప్పటికే పెంచుకున్నఇష్టంతో ఆమె అలా రియాక్ట్ అయింది....కానీ ఆమె భ్రమలో సుధీర్ పై పెంచుకున్న ఇష్టం ఇంకా పరిధులు దాటలేదు కనుకే ఆమె వెంటనే షాక్ లోంచి బైటకి వచ్చింది..అతను చనిపోయాడని అనుకుంటుంది ...అతనితో కొన్ని రోజులు  హాలుసినేషన్స్ తో గడిపింది కాబట్టి అతను మీ కాలేజీ టాపర్ అని..చనిపోయాడు అని చెప్పి ఉండొచ్చు.." చెప్పాడు డాక్టర్ 
ఇదంతా విన్న సుధ కార్తీక్ లు నిశ్చేష్టులయ్యారు...
"ఇప్పుడు ఏం చెయ్యాలి డాక్టర్...." అడిగారు ఇద్దరు ఒకేసారి ..
కొద్దిసేపు ఆలోచించిన డాక్టర్ " ఒక పని చెయ్యండి ....." అన్నాడు 

 ************************************************

ఎన్నో ఆలోచనలు మనసులో సుళ్ళు తిరుగుతుండగా సోఫాలో కూలబడ్డాడు కార్తీక్ ..
"ఏమయిందండి...అలా ఉన్నారు " అడిగింది దివ్య ...
"సంహిత గురుంచే నా ఆలోచనంతా...తనేమైపోతుందో అని బాధగా ఉంది..." అన్నాడు కార్తీక్ ఆవేదనగా 
"డాక్టర్ ఏమన్నారు ?" అడిగింది దివ్య
మొత్తం చెప్పాడు కార్తీక్....
అదంతా విని, అప్పుడే ఏదో గుర్తుకువచ్చినదానిలా "ఏవండీ...ఈ రోజు ఒక అతను నన్ను దివ్యా...దివ్యా అని వెంట పడ్డాడు " అంది 

"అవునా !!..ఎవరు అతను...నీకు తెలుసా?" అడిగాడు 
"అసలు అతన్ని నేను ఇంతకముందెప్పుడూ చూడలేదు...ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే నన్ను చూసి ..దివ్యా నన్ను గుర్తుపట్టలేదా?...ఎందుకు అలా చూస్తున్నావ్?...నేను సుధీర్ ని...నీ అన్నయ్యని...సంహిత ఎక్కడుంది...కార్తీక్ ఏమయిపోయాడు..అసలు నన్నేదుకు మీరంతా విడిచి వెళ్లారు... అని అతను అడుగుతుంటే నాకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు...అంతా బ్లాంక్ గా అనిపించింది..అన్నయ్య చనిపోయాడు, కానీ ఇతను ఎవరు??...తనే నా అన్నయ్య అంటాడు..మన గురుంచి అంతా తెలిసినట్లే మాట్లాడుతున్నాడు...కార్తీక్ నిన్ను పెళ్లి చేసుకున్నాడా? లేదా? ...నువ్వు సంతోషంగా ఉన్నావా ? అని అతను అడుగుతుంటే నాకు నోట మాట రాలేదు ..." అని దివ్య చెప్తుంటే కార్తీక్ కి తనేం వింటున్నాడో అసలు అర్థం కావడం లేదు..... అది అర్థం అయ్యేలోపే కోయ్యబారిపోయాడు...  స్థాణువై అక్కడే నిలబడిపోయాడు... "ఏంటి నువ్వు మాట్లాడేది ???" అప్రయత్నంగా వస్తున్నాయి అతని నోటి నుండి ఆ మాటలు .....

*****************************************************
"అమ్మా....." గట్టిగా అరిచాడు అతను ఇంటికి వస్తూనే 
"సుధీర్ ....ఏమయింది " ఆందోళనగా అడిగిందామె 
"ఎన్ని రోజులు నన్నిలా మాయ చేస్తావ్...సంహిత నాకోసం కాలేజీ లో వెయిట్ చేస్తుంది అని చెప్పావ్...కానీ ...అంతా అబద్దం...సంహిత గురుంచి ఇలా ఎన్నోసార్లు నువ్వు అబద్దం చెప్పినా ,అది అబద్దం అని నా మనసు చెప్తున్నా... ఏదో మూలాన ఉన్న చిన్న ఆశ అది నిజమే అయ్యుంటుంది అని చెప్పేది ....ఎందుకమ్మా ఇలా??...సంహిత నన్ను వదిలి వెళ్ళిపోయింది కదా..తనిక నాకు ఎప్పటికీ దక్కదు కదా... నిజం చెప్పు..." అతని ఆవేదన...బాధ ...అతని కన్నీళ్ళు చూసి తట్టుకోలేక ఏడ్చింది ఆమె కూడా...

తన కొడుకుని తానెందుకు మాయ చేస్తుంది...తనకెందుకు దేవుడు ఈ పరీక్ష పెట్టాడు... తనకి మాత్రం తన కొడుకంటే ప్రేమ లేదా??..'దేవుడా ఎలా చెప్తే నా కొడుకుకి అర్థం అవుతుంది...అసలు తను ఎందుకు ఇలా అయ్యాడో...అసలు తనెవరో..ఈ విషయాలు అన్ని తెలుసుకొని తట్టుకోగలడా నా కొడుకు'

[To be continued in the seventh part ...........have a great day - Kishen Reddy]


25 comments:

Hanuman. said...

Buddy,

You are killing people with your damn story.
Man, I hate these twists. I cant take it any more. Fill in the gaps first, no more cooking please.

I dont want to guess the way it ends but let me tell you one thing.... It may be extraordinary or extremely stupid.

The first case, I will buy the story from you and pass it on to my cousin to make a movie( He is wannabe movie director).. and we will have a blast.. : )

The second case, I will KILL you for sure and I will be damn happy .... : )

BTW, honestly you GOT the thing dude, shine it. It will show you wonders in your life. You are doing a great job. Excellent narration.

Your story is better than so many stupids that are killing the telugu movie industry with cheap imitations.

Thanks for giving such a nice story.

Cheers.

ప్రణీత స్వాతి said...

కిషన్ గారూ..మీకు యండమూరి వీరేంద్రనాథ్ గారికి బంధుత్వమేమైనా వుందండీ..? సస్పెన్స్ భలే మైంటైన్ చేస్తున్నారు. కధ బాగుంది. తరువాయి భాగం విడుదల కోసం వెయిట్ చేస్తున్నా.

'Padmarpita' said...

మరీ ఇంత పెద్ద సీరియల్ అవసరమా...:):)

Manasa said...

Super.Way to go.Keep it up

aavakaya said...

చాలా బావుందండీ..ఈ వీకెండ్ రాసెద్దురూ తరువాయి భాగం

అమ్మాయి కళలు said...

కిషన్ గారూ, ఏంటి అండి బాబు ఎన్ని ట్విస్ట్లు ఇస్తున్నారు. ఆపకుండా 6 పర్త్స్ చదివాను. వాళ్ళకంటే నేను కొంచం పరవాలేదు. అంత బడ పడక్కరలేదు అనుకున్నాను. కానీ మీ లాస్ట్ పార్ట్ తో నన్నుపూర్తిగా పిచోదిని చేసేసారు "లేడీస్ స్పెషల్" లో Mr. Brammi లా, అయిన మీరు ప్రేమకధ రాస్తున్నారా. లేక దెయ్యాల కధ రాస్తున్నారా. తొందరగా రాయండి లేక పొతే నేను కూడా మి కద సంహిత లా అయిపోతాను.

మోహన్

శివరంజని said...

కిషన్ గారు నేనెవరో తెలియకపోయిన మీరు నా మొదటి పోస్ట్ లో నాకు కొన్ని సలహాలు ఇచ్చారు నా విష్ కోరి. గుర్తుందా మీకు? అఫ్ కోర్స్ ఆ తరువాత నేను రాయలేదనుకోండి .
మీరు క్యేరక్టర్ లో ఇన్వాల్వ్ అయి రాసే తీరు నాకైతే చాలా చాలా నచ్చుతుంది.లోపాలే కనిపించవు నాకస్సలు..కాని నేనేమి రచయిత్రిని కాదు అందుకే రాసే విధానంలో సలహాలు నాకేమో రావు.మీరు ఏమి అనుకోకపోతే మీ well wisher గా నేను కూడా ఒక చిన్ని సలహా .. కధ రాసే ముందు ఎవరి సలహాలు తీసుకోకుండా ఇప్పటిలాగే ఓన్ గా మీ పద్దతిలోనే రాసుకోండి కాని మీకధ మొత్తం కంప్లీట్ గా పోస్ట్ చేసేసిన తరువాత కధలు బాగా రాసే అనుభవం ఉన్నవారికి చూపించి వాళ్ళిచ్చే సూచనలు తీసుకున్నారంటే మీరిక వెనక్కి తిరిగి చూసుకునే అవసరమే ఉండదస్సలు.

చాల కష్టపడి టైప్ చేసాను సలహా నచ్చక పోతే వదిలేయండి.చీ తప్పుడు సలహా అని మాత్రం అనకండే

hanu said...

intresting ga vumdamDi

కవిత said...

అయ్య బాబోయి ,ఇన్ని ట్విస్టులు ఇస్తారా ఒకటే పార్ట్ లో ....టూ ముచ్ అండి...అసలు కథ ముగించే ఆలోచన ఉందా,లేదా???తొందర గ ముగించేయి గురూ...మరి ఇలా మా పయిన పగ తిర్చుకోవాల??లేదు అంటే నేను కూడా హనుమాన్ గారి తో జతకట్టి మిమ్ములని చంపేస్తాను ....ఆలోచించుకోండి మరి...

poorna said...

బాబూ ఇన్ని ట్విస్ట్ లా... మాంఛి పక్కా తెలుగు సినిమా చూస్తున్నట్టు ఉంది హాహాహాహాహాహా

Raaga said...

Kishen, wow..what a story!! and great execution of it with good suspense, wonderful narration, balanced characters and interesting script. You WILL really become a great writer, and very much needed forour film industry. Way to Go Sir!!

Hanuman said...

@Sivaranjani,

Ma'm, looks like your comment is aimed at me (?).

Actually I liked the story a lot.

If you ask me about my comment, the cooking line was a joke not intended to influence the flow of the story in any way.

Guys, be aware Kishen got fan base here...: ) Just kiddin..!!

Take care.

Kishen Reddy said...

@ హనుమాన్ : థాంక్స్ :-)..

@ ప్రణీత : ధన్యవాదాలు..యండమూరి వారితో నాకు భందుత్వం ఉందా అని మీరు అడగటమే పెద్ద కాంప్లిమెంట్...:-)

@ పద్మార్పిత : అవసరమే...థాంక్స్ :-)

Kishen Reddy said...

@ మానస : ధన్యవాదాలు :-)

@ ఆవకాయ : ప్రయత్నిస్తాను ఖచ్చితంగా ..థాంక్స్ :-)

@ అమ్మాయి కళలు : ఖచ్చితంగా ప్రేమ కథే...అందులో మీకు ఎలాంటి సందేహం అక్కర్లేదు..థాంక్స్ :-)

Kishen Reddy said...

రంజని, నీ కామెంట్ రావమే నాకు చాల సంతోషాన్ని ఇస్తుంది, అలాంటిది నువ్వు నాకు సూచన ఇస్తే అది తప్పుడు సలహా అని అంటానా??..అసలు అలా అనడానికి ఎన్ని గుండెలు నాకు.. I know u r my well wisher and my good friend in this blogger world..I always respect ur advice and will follow it religiously...no doubt..its a honour for me to have ur advice..will stick to it...హ్మం సారీ ఎమోషనల్ అయి ఇంగిలిపీసు వాడేసాను మేడం...నాకు ఇంకా ఎన్ని సలహాలు ఇస్తారని కోరుకుంటున్న... థాంక్స్ ఏ లాట్... :-)

Kishen Reddy said...

@ హను : థాంక్స్

@ కవితా : తొందరెండుకండి..ముగించేస్తాలే త్వరగా..థాంక్స్ :-)

@ పూర్ణ : థాంక్స్

@ రాగ : మీ కామెంట్ నాకు చాలా సంతోషాన్ని కలిగించిందండి..థాంక్స్ :-)

ananya reddy said...

hi ...
neva went thru ur blog so deeply..long back when i saw ur blog ,it was quite different from now,,so u ve got a gr8 stuff in u..@hanuman i 2 agree ..plz du nt include more suspenses,,coz when u r all ears to something and finally end up with suspense ,,u ll bcum frustrated..lol..anywaz.nicely done

nagarjuna చారి said...

మళ్ళి మొదటికొచ్చారన్నమాట...కథలొ సుధీర్ రీఎంట్రీ, ఆత్మలు ఆవాహనలు కాదు కదా....
As usually awesome...కానివ్వండి

Kishen Reddy said...

@ అనన్య : థాంక్స్...ఇంక పెద్దగా సస్పెన్స్ పెట్టను లెండి..I don't wanna make u frustrated..Thanks for vising my blog and keep visiting..

@ చారిగారు : భలేవారే ఆత్మలు, ఆవాహనలు పెట్టి స్టొరీని నాకు నేనే పాడుచేసుకుంటానా చెప్పండి..సైంటిఫిక్ గానే నడిపిస్తాను...థాంక్స్ :-)

Srinidhi said...

That was an outstanding script. You are amazing. Cant wait for the next part.

చెప్పాలంటే.... said...

andaru inni comments raasaka naku raayadaaniki eami vuntundi naakaite bhale nachesindi mee raase vidhaanam ksdha kudaa chala chalaa baagundi.....ilaage manchi manchi stories mee nunchi raavaalani ...

శివరంజని said...

Ma'm, looks like your comment is aimed at me (?).
------------------------------------
@Hanuman: గారు అలా ఎందుకు అనుకున్నారండి? నిజంగా మీకు అలా అనిపిస్తే క్షమించండి.(నిజానికి నేను కామెంట్ పెట్టె టైం కి మీ కామెంట్ చదవనే లేదు సార్) ఇకపోతే మీరైనా , నేనైనా కిషెన్ గారు బాగా రాయాలని కోరుకునేవాళ్ళమే కదా.
ఈ బ్లాగ్ రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాను కాని ఈ పోస్ట్ లో కిషెన్ గారిలో ఒక మంచి రైటర్ కనిపించారు . ఇంకా హోం వర్క్ చేస్తే గ్రేట్ రైటర్ అవుతారని సలహా ఇచ్చాను . ( సో ఇందుమూలంగా తెలిచేయునది ఏమనగా కిషెన్ గారు ఊరుకున్న ఆయన ఫాన్స్ ఊరుకోరు )

@ కిషెన్ గారు :భాష ముఖ్యం కాదు భావం ముఖ్యం. మద్యలో ఈ మేడం ఏమిటి (ఓహో సలహాలు ఇస్తున్నందుకా?)బాగుందండీ

Kishen Reddy said...

@ శ్రీనిధి : థాంక్స్

@ చెప్పాలంటే : మీ అభిమానంతో ఇలాగే ముందు సాగిపోతాను...థాంక్స్

@ రంజని : మేడం అని ఏదో సరదాగా అన్నాను అంతే...నీ అభిమానం నిజంగా నా అదృష్టం..అది ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా...థాంక్స్ :-)

anita said...

చాలా భాగుందండి ,మీరు డాక్టర్ ఆ, రైటర్ ఆ. నిజం చెప్పండి .

Kishen Reddy said...

@ అనిత : హా హా.. ఈ కథ కోసం డాక్టర్ అవతారం ఎత్తిన రైటర్ ని ... :-)