Search This Blog

Sunday, 23 May, 2010

హృదయం ప్రేమిస్తానంటే...విధి విడదీస్తానంటే !! - 4 [100% Love... 0% Twists]

సంహిత బస్సు స్టాపులో కాలేజీకి వెళ్ళడానికి బస్సు కోసం ఎదురు చూస్తుండగా వచ్చాడు సుధీర్ బైక్ మీద..
"కాలేజీ కా...." అడిగాడు బైక్ ఆమె ముందు ఆపి..
"కాదు కైలాసానికి...తీసుకెళ్తావా.."
"రండి..." అంటూ బైక్ స్టార్ట్ చేశాడు..
"ఆఁ...@#%$$#@ " సుర సురా చూస్తూ " నే రాను..." అంటూ పోజ్ కొట్టబోయింది..
"అలాగే...సి యు లేటర్.." అంటూ వెళ్ళిపోయాడు...
'హుఫ్....ఏంటో ఈ వ్యక్తి...కొంచెం కూడా సెన్సిటివిటీ లేని మనిషి...ఒక అమ్మాయి కోసం రమ్మని ఇంకోక్కసారి అడగలేడా' అనుకుని బస్సులో కాలేజీకి చేరింది...

"ఏంటి ఒక్కదానివే కూర్చున్నావ్ ...కార్తీక్ రాలేదా కాలేజీకి?.." అంటూ వచ్చాడు సుధీర్ సంహిత కాంటీన్ లో ఉండగా..
"లేదు..ఏదో పనుందట..."
"లవర్ తో సినిమా ప్రోగ్రాం వేసుకున్నాడేమో..." అన్నాడు చిన్నగా నవ్వుతూ..
'కఠిన హృదయమయినా...కామెడి ఉంది అబ్బాయిలో..' అనుకుంది ప్రొద్దుటి ఇన్సిడెంట్ గుర్తొచ్చి
"మా చంటికి అలాంటివేమీ లేవులే...నీలా కాదు.." అంది మూతి బిగిస్తూ..
"నాకు లవర్ ఉంటే కదా నేను ప్రోగ్రాం వేసుకోడానికి...ఆ రోజు నువ్వేదో అనుకోమన్నావ్...అనుకోనా??" అన్నాడు
"ఏంటి అనుకునేది ఆవకాయ దబ్బ...ఆశలేం పెట్టుకోకు.."
ఏదో సైలెంట్ అనుకుంటే ఎక్స్ ట్రాలు బాగానే చేస్తున్నాడే అనుకుంది...
చిన్నాగా  నవ్వాడు ఆ మాటకి....ఎందుకో ఆ అరనవ్వు బాణంలా నేరుగా సర్ ర్ ర్ మని వచ్చి ఆమె హృదయంలో ఇరుక్కు పోయింది...తియ్యని బాధ ఆమెలో...

"నీకు నిజంగా లవర్ లేదా?..ఎవరినీ ప్రేమించలేదా?" అడిగిందామె
"లేదు..."
"ఏం ?"
"నీలాంటి అందమైన అమ్మాయి దొరక్క..."
"ఛా...."
"హ్మం...విషయం ఏమిటంటే...చిన్నప్పుడే అమ్మానాన్నా పోయారు ...అప్పటినుంచి మామయ్యే చదివించాడు నన్ను.. వాళ్ళ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చేయాలని ఆయన ఆశ...సో ఎవరినీ ప్రేమించాలనే ఆలోచన నాకు రాలేదు.." చెప్పాడతను
"ఓహ్...." బాధగా అనిపించింది ఆమెకు....నిజానికి ఆమెకి తెలియకుండానే సుధీర్ అంటే ఇష్టం పెంచుకుంది సంహిత...అమ్మాయిలంటే గౌరవం, ఎవ్వరికీ భయపడని అతని గుండె ధైర్యం, తలవంచని వ్యక్తిత్వం ఆమెకి చాలా నచ్చాయి...

"ఒకవేళ నిన్ను తన ప్రాణంగా ప్రేమించే అమ్మాయి నీకు ఎదురయితే ??" అడిగింది ఆశగా ..
"నాలో ఏముందని నన్ను అంత ప్రాణంగా ప్రేమించే అమ్మాయి దొరకడానికి...అమ్మాయిలు పడి చచ్చే మాగ్నెటిజం నా దెగ్గర లేదు..పైగా మై ఆటిట్యూడ్ ఈజ్ ఎ బిగ్ టర్న్ ఆఫ్ టు గాళ్స్...." అన్నాడు నిర్లిప్తంగా..
"అమ్మాయిలకు కావలసింది మాగ్నెటిజం కాదు, మంచి మనసు...నీకోసం నేను ఉన్నాను అనే చెప్పే ధైర్యం..నీకోసం నా ప్రాణం అడ్దేస్తాను అని ఇచ్చే హామీ..." చెప్పింది చిన్నపాటి ఉద్వేగంతో...
"చెప్పడానికి బాగానే ఉంటాయి...తన దాకా వస్తేనే తెలుస్తుంది..అంతెందుకు, నువ్వే ఉన్నావ్..మీ నాన్న తెచ్చే అమెరికా ఎన్నారైని చేసుకుంటావ్ కానీ, నాలాంటి వాడిని కనీసం కలలో అయినా భర్తగా ఊహించగాలవా?" అతని ప్రశ్నకు ఆమెలో మౌనం...ఏమి చెప్పాలో తెలియని ఆవేదన..ఎన్నో చెప్పాలని పెదవులు ఉబలాటపడుతున్నా, మనసు ఆంక్షలు విధిస్తుంది ... వణుకుతున్న పెదాలతో అతని కళ్ళలోకి సూటిగా చూస్తుంది...భాష పలకలేక నిస్సహాయంగా ఉన్న పెదవులకి, మేమున్నామంటూ కళ్ళు పలికించే భావాన్ని అతను అర్థం చేసుకుంటాడేమో అన్న విఫలయత్నం ఆమెది...
"నాకు తెలుసు...అది నీ కల్లో కూడా జరగదు...మనసు, హృదయం లాంటివి గొప్ప కావ్యాలకే బాగా పనికొస్తాయి...." అని లేచి వెళ్ళిపోతున్నాడు అతను...ఆమె హృదయంలో వెయ్యి అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి..నా మనసు ఈ క్షణం అతనికి తెలియాలి..లేకపోతే అతను అన్న మాటలే నిజం చేసిన దాన్ని అవుతాను..చెప్పాలి, తన మీద నాకు ఎంత ప్రేమ ఉందొ చెప్పాలి...ఆ మాట చెప్పి ఈ క్షణం నేను చనిపోయినా పర్వాలేదు..ఆమెలో అంతకంతకు పెరుగుతున్న సంఘర్షణ...

"నువ్వంటే నాకిష్టం...జీవితాంతం నువ్వు నాకు తోడుగా ఉంటావా..ఒక స్నేహితుడిగా...ఒక ప్రేమికుడిగా..." ఆ మాటలు అతని చెవిని తాకాయో లేదో ...చివాలున ఆమె వైపు తిరిగి చూసాడు...నిశ్చేష్టుడయ్యాడు...
ఆమె కళ్ళనిండా కన్నీరు... ఆ కళ్ళు పలికించే ప్రేమని కన్నీటిపొర అడ్డుకోలేకపోయింది, ఆ ప్రేమ అతన్ని నిలువునా చలింపజేసింది..ఆమె వైపే చూస్తూ నడుచుకుంటూ ఆమె దెగ్గరికి వచ్చాడు..
మాటలు తడబడుతుండగా అడిగాడు "నువ్వు....నన్ను...ఆటపట్టించడం లేదు కదా..."..
సమాధానంగా ఆమె అతని గుండెలో ఒదిగిపోయింది..
అతను  అంత అదృష్టవంతుడు కాదు...అది అతనికీ తెలుసు...అందుకే "నేను నీ ప్రేమకి అనర్హుడిని..." అంటూ అతను ఆమె నుంచి విడిపోయి దూరంగా వెళ్ళిపోయాడు...అమెలాగే నిస్సహాయంగా చూస్తూ నిల్చుంది..

కాలేజీ  నుంచి ఇంటికి ఆలస్యంగా బయలుదేరిన సంహితకి బస్సు స్టాప్ లో సుధీర్ కనిపించాడు...ఒక్కడే..తనకోసమే చూస్తున్నట్లున్నాడు..ఆమె నిదానంగా వెళ్లి అతని ప్రక్కన నిల్చుంది..కాసేపు ఇద్దరి మధ్యా మౌనం..
"ఇంకా ఇంటికి వెళ్ళలేదే..." అడిగిందామె ఆ నిశ్శబ్దాన్ని చేదిస్తూ 
"నీకోసమే...."
అతని వైపు చూసిందామె....
"ఆ మాట జీవితాంతం అనగలవా....నాకోసం..." ఆమెకి అతను కావాలి...ఆమె అతన్ని వదులుకోలేదు...అన్ని రోజులు అతని పైన కొద్దికొద్దిగా పెంచుకున్న ఇష్టం ఈ రోజు ఒక అగ్నిపర్వతంలా బద్దలయి లావా లా బైటకి వచ్చింది ఆమె ప్రేమంతా...
"బుజ్జి బంగారం..." ఎంతో ప్రేమగా అతను పిలిచిన మాట విని ఆశ్చర్యంగా అతని వైపే చూస్తుంది..."ఇలా నిన్ను పిలవాలని ఎప్పటినుంచో అనిపించేది..నువ్వు నన్ను ఆటపట్టించిన ప్రతి సారీ, నిన్ను దెగ్గరకు తీసుకోవాలని అనిపించేది..ఆ మరుక్షణమే నా పిచ్చి ఊహకు నాలో నేనే నవ్వుకునే వాడిని...నువ్వంటే.." అతని మాటలు మధ్యలోనే ఆగోపోయాయి...ఆమె వచ్చి అతన్ని గట్టిగా హత్తుకుంది...ఆమె కన్నీళ్ళతో అతని గుండె తడిచింది.

"కానీ ఇది జరుగుతుందా?..మీ నాన్న పెద్ద బిజినెస్ మాగ్నెట్..నాకేమో ఎవరూ లేరు...మా మామయ్యను నేను ఒప్పించగలనేమో కాని మీ నాన్నని ఒప్పించగలనా...మన ప్రేమ గెలుస్తుందా? " అతనిలో భయం మొదటిసారిగా చూసింది సంహిత...
"ఇంత పిరికిగా ఎలా మాట్లాడుతున్నావ్...వద్దు, ఒక పిరివాడిలా మారి నన్ను ప్రేమించొద్దు...దైర్యంగా నా చేయి అందుకునే తెగింపు నీలో ఉంటేనే ప్రేమించు...పదిమంది నిన్నుకొట్టినా తలవంచని నీ మొండితనం, వెయ్యి మంది ముందు ఒక అమ్మాయి పరువు కాపాడిన నీ తెగింపు...మన ప్రేమకి పనికిరావా??" చివాలున కొరడాతో కొట్టినట్లు అనిపించింది అతనికి...

ఏదో సంకల్పించుకున్న వాడిలా బండి స్టార్ట్ చేసి, "ఎక్కు" అన్నాడు ..
ఆమె అతనివైపే చూస్తూ ఎక్కి కూర్చుంది...బండిని వంద కె/హెచ్ లో బీచ్ రోడ్ పై దూకించాడు....అలా వెళ్తూ రుషికొండ దాటి వెళ్లి..ఒక చిన్న గుడి దెగ్గర ఆపాడు..అక్కడ ఉన్న అమ్మవారి రాతి విగ్రహంకి ఉన్న బొట్టుని వేలితో తీసి సంహిత నుదిటి మీద పెట్టి "ఈ జన్మలో నే కాదు...మరో జన్మంటూ ఉన్నా నువ్వే నా భార్యవి.."..అంతే ఉద్వేగంతో అతన్ని అల్లుకుపోయింది సంహిత...

మరుసటి రోజు విషయం తెల్సుకున్న నేను(కార్తీక్..ఇదంతా కార్తీక్ సుధకి చెప్తున్నాడు..ఇక్కడ నేరేటర్ కార్తీక్ ) చాలా సంతోషించాను...నేను ఎపుడో అనుకున్నాను సంహితకి సుధీర్ మంచి జోడి అని..అతను నిస్వార్ధమైన వ్యక్తి..ప్రేమిస్తే ప్రాణాలు ఇస్తాడు..

ఆరోజు నుంచి కాంపస్ లో ఎక్కడ చూసినా మేమే...( ఆఫ్ కోర్స్ ప్రేమికులకి కావాల్సిన ప్రైవసీ ఇస్తున్నాను అనుకోండి )..మా ముగ్గురి స్నేహం మరింత బలపడింది...ఆ తరువాత సుధీర్ చాలా మారాడు..అందరితో బాగా కలిసిపోతున్నాడు..కానీ మొండితనం, కోపం మాత్రం అస్సలు తగ్గలేదు..రోజూ సంహితే సొంతంగా లంచ్ ప్రేపర్ చేసి సుధీర్ కోసం బాక్స్ తెచ్చేది..పాపం అంతకముందు వంట రాదంట..ఏదో మాటల్లో సుధీర్ ఓ సారి నీ చేతి వంట తినాలని ఉంది అన్నాడట...పాపం చాలా కష్టపడి నేర్చుకోవడమే కాదు..రోజూ బాక్స్ లో తీసుకొచ్చి తనే తినిపించేది...ఈ తినిపించే సన్నివేశంలో నేను పని ఉందంటూ అలా బైటకి వెళ్లి వచ్చేవాడిని...

ఓ రోజు సుధీర్ కోసం కాలేజీలో ఎంత వెతికినా కనిపించలేదు...ఎవ్వరిని అడిగినా తెలీదు అన్నారు...దివ్య కూడా లేదు..మూడు రోజులు అయింది, అయినా వాళ్ళిద్దరూ కనిపించలేదు...సంహిత ఒకటే ఏడుపు...అన్నం తినడం మానేసింది..నేను ఎంత చెప్పినా వినిపించుకోలేదు..."చంటీ తనకి ఏదన్నా అయితే నేను తట్టుకోలేను రా..." అంది ఏడుస్తూ...నాకు దాన్ని చూసి చాలా జాలేసింది...

మరుసటి రోజు కాలేజీలో ఇద్దరూ కనిపించారు...సంహిత సుధీర్ ని చూస్తూనే వెళ్లి "ఎక్కడికెళ్ళావ్ ఇన్ని రోజులు...నువ్ లేకుండా నేను ఉండగలనా.." అంటూ ఏడ్చింది...
"బుజ్జి...దివ్య వాళ్ళ నాన్న చనిపోయార్రా .." చెప్పాడు బాధగా
ప్రక్కనే దివ్య కూర్చొని ఉంది...ఆమెకు అంతా సూన్యంగా ఉంది పరిస్థితి...
వెంటనే  సంహిత వెళ్లి దివ్యని ఓదార్చింది...
"ఇప్పుడు దివ్యకి ఎవరూ లేరు..వాళ్ళమ్మ చిన్నప్పుడే పోయింది ...రాబందుల్లా పీక్కుతినే బందువులు కొంతమంది ఉన్నారు, కానీ నేను దివ్యని ఎవ్వరికీ అప్పజెప్పను...తను నాతోనే ఉంటుంది..తన భారం నాదే...నేనే పెళ్లి చేస్తాను..." ఉద్వేగంగా చెప్పాడు సుధీర్...సుధీర్ ని పట్టుకొని "అన్నయ్యా..." అంటూ ఏడుస్తుంది ఆ పిల్ల..
నిర్ణయం తీసుకున్నవాడిలా "దివ్యకి ఇష్టం అయితే తనని నేను పెళ్లి చేసుకుంటాను..." అన్నాను 
ముగ్గురూ చివ్వల్న తలెత్తి చూసారు నా వైపు...సుధీర్ నా దెగ్గరికి వచ్చి.."కార్తీక్...." అన్నాడు ...
"నేను ఆలోచించే చెప్తున్నా...తనంటే నాకిష్టమే..." అన్నాను...
ఉబుకుతున్న కన్నీరు కంటి నుండి జారుతుండగా నన్ను గట్టిగా తన భుజానికి హత్తుకున్నాడు సుధీర్...

ఆ  తరువాత దివ్య నాకు చాలా దెగ్గరైంది...ఎంతగా అంటే సంహీని చూసి తను కూడా నాకు లంచ్ బాక్స్ తీసుకురావడం మొదలెట్టింది...కానీ తినిపించాలంటేనే కొంచెం సిగ్గు అడ్డొస్తుంది పాపం దివ్యకి..ఎంతైనా పల్లెటూరి పిల్ల కదా..."సంహిత అంటే ఇంట్లో ఉంటుంది కాబట్టి ప్రిపేర్ చేసుకొని వస్తుంది, నువ్వు హాస్టల్ లో ఉంటున్నావ్...వద్దులే...వండుకొని తీసుకోస్తేనే ప్రేమ ఉన్నట్లా.." అన్నాను...తనకు ఏం అర్థం అయిందో మరి, కొంచెం కళ్ళలో నీళ్ళు వచ్చాయి..."తీసుకురానులే..." అంటూ వెళ్ళిపోయింది...అమ్మాయిలను అర్థం చేసుకోడం చాలా కష్టమే...

ఫైనల్ ఇయర్ కి వచ్చాం...దివ్యని మా ఇంట్లో పరిచయం చేశా.. అందరికీ నచ్చింది..కొంచెం విశాల భావాలు ఉన్న ఫామిలీ కాబట్టి పెద్దగా ప్రాబ్లం లేకుండా మా పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ దొరికింది...ఎటొచ్చి సంహితకే ప్రాబ్లం...వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మాగ్నెట్..సంహిత విషయం ఇంట్లో చెప్పేయాలని నిర్ణయించుకుంది..ఓ రోజు సుధీర్ ని లంచ్ కి పిలిచి వాళ్ళ నాన్నకి పరిచయం చేసింది..కానీ సుధీర్ పట్ల వాళ్ళ నాన్న తీరు ఆమెకి ఏమాత్రం నచ్చలేదు...సుధీర్ అంటే ఏదో చిన్న చూపు చూసినట్లు మాట్లాడటం ఆమెకు మింగుడు పడలేదు...

చివరికి సుధీర్ ని తను ప్రేమిస్తున్నట్లు చెప్పింది..సరేమిరా అన్నాడు వాళ్ళ నాన్న...ఈ విషయం సంహిత మాకు చెప్పింది..."డబ్బున్న అహంకారం అతనిది...కూతురి పెళ్లి కూడా బిజినెస్ అనుకుంటున్న అతను నా తండ్రి" అంటూ మా దెగ్గర పెదవి విరిచింది...
"నే వెళ్లి మాట్లాడుతాను..." అన్నాడు సుధీర్...
"వద్దు...అది కరెక్ట్ గా ఉండదు....నే మాట్లాడుతాను" అని చెప్పి తరువాతి రోజు వాళ్ళింటికి వెళ్లాను...

"అంకుల్...వాళ్ళిద్దరూ ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు...వాళ్ళని దీవించండి.." అన్నాను 
"ఈ కాలం  ప్రేమల  గురుంచి నాకు చెప్పొద్దు...అన్యాయంగా అందమైన భవిష్యత్తుని పాడుచేసుకోవద్దని తన మంచి కోరే స్నేహితుడిగా నువ్వే చెప్పు .." అన్నాడు 
"ఈ కాలం ప్రేమల గురుంచి మీకేం తెలుసో నాకు తెలీదు..కానీ సంహిత సుధీర్ ల ప్రేమ గురుంచి నాకు తెలుసు..అందుకే మిమ్మల్ని వాళ్ళ ప్రేమని అంగీకరించమని చెప్దామని వచ్చాను....లేకపోతే మీరు ఏం కోల్పోతారో మీకు ఇప్పుడు తెలీదు..." అని చెప్పి వచ్చేసాను...

ఇంజనీరింగ్ పూర్తయింది...కాంపస్ సెలెక్షన్స్ లో మా నలుగురికీ జాబ్స్ వచ్చాయి..సంహిత ఈ లోపు వాళ్ళ నాన్నని ఎన్ని సార్లు అడిగినా లాభం లేకపోయింది...ఇక ఆమెలో సహనం నశించింది..ఆమెకు తెలుసు తండ్రి ఒప్పుకోడు అని, అందుకే ఆమె ఇల్లు వదిలి రావడానికే నిర్ణయించుకుంది..., చివరి ప్రయత్నం చేద్దమనుకొని ఇంటికి వెళ్ళింది...

"నాన్న...నేను తనని పెళ్లి చేసుకొని జీవించడంలో నాకు ఎంతో సంతోషం ఉంది...మీ కూతురి సంతోషం మీకు ముఖ్యం కాదా ?" అడిగిందామె ఆవేదనగా 
"నీకు నీ ప్రేమ ఒక్కటే కనిపిస్తుంది...నువ్వే ఎవడో అనామకుడిని చేసుకుంటే నా పరువేం కాను...నా బిజినెస్ పార్టనర్ కొడుకుని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను...అదే నీకు కూడా మంచి లైఫ్ ఇస్తుంది..." అన్నాడు
"సుధీర్ ని తప్ప నేను ఎవరినీ పెళ్ళిచేసుకోను...." తెగేసి చెప్పించి ఆమె..
"నా మాట గౌరవించని వాళ్లకు ఈ ఇంట్లో స్థానం లేదు..అది కూతురైనా సరే.." స్థిరంగా చెప్పసాగాడు ఆ తండ్రి "కూతురిగా నా గౌరవం నిలబెట్టాలి అనుకుంటే నేను చెప్పిన వాడినే పెళ్ళిచేసుకో..."
"నల్ల కోట్లు వేసుకునే వాళ్ళముందు మీ పరువు కాపాడటానికి, జీవితాంతం నా మనసుకి నేను నల్ల ముసుగు వేసుకొని జీవించలేను నాన్నా.." అంతే స్థిరంగా చెప్పింది ఆమె కూడా..
"అదే నీ నిర్ణయమయితే..." అని వాకిలికేసి వేలు చూపించాడు ఆమెకి..
అంతే ఆమె విసురుగా లోపలి వెళ్లి ఒక సూట్ కేసుతో బైటకి వచ్చి అతని వైపు ఓసారి చూసింది.
"వెళ్ళదల్చుకున్నవాళ్ళు ఆగడం దేనికి..." చేతులు వెనక్కి కట్టుకొని పక్కకి చూస్తూ అడిగాడు
"ఇదే చివరిసారి మీ కూతురు మిమ్మల్ని చూడటం అని తెలియజేయడానికి.." అని గుమ్మం దాటి వెళ్లిపోయిందామె


     [To be continued in the fifth part........Next part would be probably on Thursday... Best Regards - Kishen Reddy ]

18 comments:

ప్రణీత స్వాతి said...

నాకేదో అనుమానంగా ఉందండోయ్..ఇది నిజంగా కధేనా...?

priya... said...

oi...chala baga vrasaru its really very nice...u kno samhitha lanti nature unna ammai ki sudheer lanti vare correct...nen chepedi real life lo kuda...its a good pair..alanti valakosam elanti tandrini i mean kuturi manasu artam chesukoni tandri ni valalatam kastam ina bt correct anipistundi adi e blog chadivina tarvata...anyways nijanga flow chaala bagundi ram....plz cary on

సతీష్ said...

వావ్..ఏంటండీ బాబూ..what an excellent story telling...ఫుల్ గా ఇంవాల్వ్ అయ్యాను, అప్పుడే అయిపోయిందా అనిపించింది. Really felt that 100% LOVE. ఇంకో విషయం ఏమిటంటే, ఫస్ట్ పార్ట్ ఎలా మొదలైందో (తండ్రీ కూతుళ్ళ సీన్) మళ్లీ సేం టు సేం సీన్ తో ఈ పార్ట్ ముగించారు. నెక్స్ట్ ఏమిటా అని చాల ఆత్రుతగా ఉందది. త్వరగా రాయండి.

3g said...

లవ్ ఫీలింగ్స్ బాగా డీల్ చేస్తున్నారు ముఖ్యంగా ఇవి super expressions

"ఆ కళ్ళు పలికించే ప్రేమని కన్నీటిపొర అడ్డుకోలేకపోయింది"
"ఎందుకో ఆ అరనవ్వు బాణంలా నేరుగా సర్ ర్ ర్ మని వచ్చి ఆమె హృదయంలో ఇరుక్కు పోయింది..."

నేస్తం said...

:)

శివరంజని said...

(కార్తీక్..ఇదంతా కార్తీక్ సుధకి చెప్తున్నాడు..ఇక్కడ నేరేటర్ కార్తీక్ ) -----------------------------------------------
అదేమిటి...... మీకు తెలియదా? ఇక్కడ నేరేటర్ కిషన్ :):):) !నోరు జారిపోతే ఇలాగే దొరికిపోతారు ...మీ లవ్ స్టోరీ చక్కగా క్రియేట్ చేసుకుని మీ ఫ్రెండ్ కి మాత్రం అన్ని రిస్కులు సృష్టించారేమిటీ..... తప్పు కదా......ఓహొ పేరు మార్చినంత మాత్రాన దొరక్కపోతారా ఏమిటి? నేనప్పుడే అనుకున్నా ... కార్తీక్ మీరేనని!(కార్తీక్ మీరు కాదని చెబుతారు నాకు తెలుసులే :):):)

కవిత said...

కిషన్ జీ,నాకు పెద్ద అనుమానం...ఇది నిజం గా స్టొరీ ఏ నా?ఎవరిదియినా నిజం స్టొరీ అహ్హ??చాలా బాగా రాసారు అండి...అమ్మాయి ఫీలింగ్స్ చెప్పారు చూడండి...కేఎక.ఒక అబ్బాయి ,అమ్మాయి ఫీలింగ్స్ ఇంత బాగా చెప్పగలరా అని అనుమానం వాచేలా ఉంది....పాత్రలు అన్ని రియలేస్టిక్ గా ఉన్నాయి...దానికి తోడు కాలేజి బాక్గ్రౌండ్ తోడయింది కదా...కళ్ళముందు జరుగుతున్నట్లు ఉంది...తొందరగా ముగించండి బాసు...ఎన్ని పార్ట్లు ఉన్నాయి ఇంకా???
మీరు బాగా పుస్తకాలు చదువుతారు అనుకుంట....dilogues పంచ్ లో తెలుస్తుంది.

poorna said...

chaala baagundi... taka taka katha cheppestunaru ,twist lu pettestunaru...bavundi...cha appude ayipoyinda ani anipinchindi...mee narration too good...next post kosam eduru choosela undi....

Raaga said...

I have read all the parts and the story is really interesting, many unanswered questions and wanna see how you are gonna tie up the ends. Mainly whats amusing me is your presentation and excellent script. Characterization of Samhitha is marvellous. Awaiting next part.

Kishen Reddy said...

@ ప్రణీత : నిజంగా కథే..మీకెందుకు అంత అనుమానం..ప్రతి ఎపిసోడ్ ఇలా ఉండాలి అని అప్పటికప్పుడు ఆలోచించి..చించి..రాస్తున్న...హి హి :-)

@ ప్రియ : థాంక్స్...నైస్ కామెంట్

@ సతీష్ : 100% love feel అయ్యారా...హమ్మయా థాంక్స్...అదే నా ఉద్దేశం కూడా..అందరినీ ప్రేమ ఫీల్ లో కాసేపు అలా ఓలలాడించాలనే...

Kishen Reddy said...

@ త్రీజీ : ధన్యవాదాలు...ఆ లవ్ ఫీల్ ఎప్పుడూ హాయిగానే ఉంటుందండీ..

@ నేస్తం : నిజం చెప్పండి, మీరు నా మీద అలిగారా...లేక కోపమా..లేక ఈ టపా నచ్చలేదా?..కేవలం రెండు చుక్కలు పెట్టి ఒక స్మిలీ ఇస్తే ఏమనుకోవాలి :-(...మీరు నాకొక రెండు లైన్ల కామెంట్ ఇచ్చే దాక మీ మీద నేను అలిగాను అంతే :(

Kishen Reddy said...

@ రంజని (మిమ్మల్ని రంజనీ అనే పిలుస్తాను..తప్పదు) : మీరు మరీను అందరి ముందు అలా అనేస్తే ఎలా చెప్పండి..మనం మనం మళ్లీ మాట్లాడుకుందాం...ఇకపోతే కార్తీక్ ఎవరంటే...దివ్య లవర్, సంహిత కి చంటి..అంతే..అంతకన్నా నాకేం తెలీదు..నన్నేం అడగొద్దు.. :)..మర్చిపోయా, మీ బ్లాగ్ ఇంకా నిద్రపోతూనే ఉందా..త్వరగా లేపండి ప్లీజ్..మీ నుంచి ఒక మంచి టపా కావలి..

Kishen Reddy said...

@ కవిత : ధన్యవాదాలు..ఇది పూర్తి నా ఊహాజనిత కథ..ఈ కథ గానీ, ఇందులో పాత్రలు కానీ ఎవరినీ ఉద్దేశించినవి కావని నా మనవి :)..నేను పుస్తకాలు పెద్దగా చదవను..బద్దకస్తుల జాబితాలో మొదటి వరుసలో ఉంటా నేను

@ పూర్ణా : ధన్యవాదాలు :)

@ రాగ : మీ కామెంట్ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది...థాంక్స్ :)

nagarjuna చారి said...

ఆఆఆ....ఒకటి రెండు చోట్ల డైలాగులు కాస్త సినిమాటిక్‌గా అనిపించాయ్ బాస్. అంటే పాత్రలేమో కాలేజీ వయసువాళ్ళు అంటున్నారు కదా... బహుశా నాకు మాత్రమే ఇలా అనిపిస్తూవుండొచ్చు, ఏమైనా discouragingగా వుంటే మన్నించండి.

script, screenplay మాత్రం రచ్చ...

nagarjuna చారి said...

ఆర్కుట్ ప్రొఫైల్‌ను ఇక్కడ ఎలా display చేయగలిగారో చెప్తారా బాస్.

తృప్తి said...

మీరు ఎప్పుడు పోస్ట్ చేస్తరి చెప్పినా కూడా రోజు రెండు సార్లు ఓపెన్ చేసిచూస్తున్న మీ బ్లాగ్...లేట్ చెయ్యకుండా త్వరగా పోస్ట్ చెయ్యండి...అన్నట్టు స్టొరీ కాపీ రైట్ తీసి పెట్టుకోండి అసలే సినిమా వాళ్ళకి కథలు దొరకట్లేదు ఈ మధ్య..

నేస్తం said...

మొత్తం స్టోరీ అయిపోయాకా చెప్తా ఎలా ఉందో :)

Kishen Reddy said...

@ చారి గారు : కొన్ని డైలాగ్స్ సినిమాటిక్ గా అనిపించి ఉండొచ్చు లెండి...ఏదో అలవాటు లో పొరపాటు...హి హి...ఇకమీదట జాగ్రత్త పడతాను...ఆర్కుట్ విడ్జట్ ని బ్లాగ్ లో పెట్టడం సులభమే...గూగుల్ లోకి వెళ్లి "Orkut badge widget for blogger" అని టైపు చేస్తే, మీకు చాల హిట్స్ వస్తాయి...మొదటి మూడిట్లో ప్రయత్నించండి, వాటిలోనే విడ్జట్ కి కావలసిన కోడ్ దొరుకుతుంది...

@ త్రుప్తి : మీ కామెంట్ నాకు చాలా త్రుప్తిని కలిగించిందంటే నమ్మండి...ఇకపోతే కాపిరైట్ చేసేసాను ఆన్ లైన్ లో...అంటే అక్కడేదో నా ఆణిముత్యం లాంటి కథని ఎవరో దోచేస్తారు అని కాదు...మీరు చెప్పారని చేసాను అంతే :)

@ నేస్తం : అంతే అంటారా...అలాగే కానియ్యండి :-)