Search This Blog

Friday, 21 May, 2010

హృదయం ప్రేమిస్తానంటే...విధి విడదీస్తానంటే !! - 3


"సంహిత, నేను ఒకే రోజు గీతం కాలేజీలో జాయిన్ అయ్యాము...అదే రోజు ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అయ్యాం..." కార్తీక్ చెప్తున్నాడు, సుధ అలాగే అతని వైపు చూస్తూ వింటుంది...

***********************************************************

"కాలేజీలో చేరాలి అంటేనే భయం వేసింది నాకు...రాగింగ్, గొడవలు..ఇలా ఏవేవో నన్ను చాలా భయపెట్టాయి...మొదటి రోజే నీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది.." అని చెప్తున్న సంహిత వైపు అలానే చూస్తున్నాను...
"చిన్నపటినుండి ఎప్పుడూ సెకండ్ అనే మాట నాకు తెలీదు...అన్నిటిలో నేనే ఫస్ట్...ఇక్కడ కూడా కష్టపడి కాలేజీ ఫస్ట్ తెచ్చుకోవాలి..." అంటూ పట్టుదలగా చెప్తున్న సంహీని చూసి ముచ్చటేసింది...
"యు విల్...అల్ ద బెస్ట్..." అంటూ విష్ చేసాను..
"థాంక్స్...నిన్ను నేను చంటి అని పిలవోచ్చా?.." అని అడిగింది సంహిత...
"నీ ఇష్టం...కానీ చంటీ అనే ఎందుకు?" అడిగాను
"ఆ పేరు అంటే నాకు చాలా ఇష్టం...చిన్నప్పుడు నేను మొదటిసారిగా స్కూల్ లో చేరినప్పుడు, నాకు మొదటి రోజే పరిచాయం అయ్యాడు చంటి...నాకు చాలా మంచి ఫ్రెండ్ అయ్యాడు ..మేమిద్దరం రోజూ బాగా ఆడుకునేవాళ్ళం...అతను నాతో ఆడుకోడానికి రాకపోతే ఇక ఆ రోజంతా నేను అన్నం తినే దాన్ని కాదు..అలాంటిది సడన్ గా చంటిని స్కూల్ మన్పించేసారు...తర్వాత తెలిసింది చంటికి అంత చిన్నతనంలోనే బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని..అతను ఎక్కువ కాలం బ్రతకడని..తనని చూడటానికి ఓ రోజు వెళ్ళినప్పుడు 'సమ్మి నేను నీతో అడుకోలేను ఇంకెప్పుడూ...నాకు వొంట్లో బాగోలేదు..నువ్వు ఏడవకు, నీకు ఇంకో చంటి దొరుకుతాడు..' అన్న చంటిని పట్టుకొని బాగా ఏడ్చేసాను...చంటి కొన్ని రోజులకి చనిపోయాడు...ఆ తర్వాత ఇన్నేళ్ళకి నాకు మొదటి రోజే ఫ్రెండ్ అయిన నిన్ను చూసి చంటి గుర్తొచ్చాడు...అందుకే నిన్ను చంటి అని పిలుస్తా.." అని చెప్పిన సంహిత వైపు చూసాను...'నేను నీకు అంత గొప్ప స్నేహితుడిని అవ్వగాలనా..?' అంటూ నా మనసు ఆమెకు వేసిన ప్రశ్నకి బదులుగా ఆమె రువ్విన చిరునవ్వు నాకు సమాధానం తెలిపింది...

ఓ రోజు సన్నగా చినుకులు మొదలవ్వగా, మేమిద్దరం కాలేజీ బస్సు స్టాప్ షెల్టర్ కింద ఉన్నాం...ఇద్దరు సీనియర్లు ఒక జూనియర్ ని రాగింగ్ మొదలెట్టారు అక్కడ...
"రేయ్...సెల్యూట్ చెయ్యి భే..." 
"...."
"ఏందిరా చెవుటోడివా??..."
"...."
"నీ పేరేంట్రా??"
"....."
"బట్టలు ఊడదీసి పరిగేత్తిస్తా కాంపస్ మొత్తం...నాకు గురుంచి తెలీదేమో...ఏం జూస్కోనిరా ఈ పొగరు...చెయ్ సెల్యూట్..."
"....."
సీనియర్ గాడికి తిక్కరేగి..'నీ యబ్బా..' అంటూ కాలర్ పట్టుకున్నాడు..
తలెత్తి సీనియర్ వైపు చూసాడు అతను...అప్పుడు చుశాను అతని కళ్ళ వైపు...ఒక్కసారిగా మండుతున్న అగ్నిగోళంలా మారాయి..'ఏంట్రా ఆ చూపు...' సీనియర్ మాటలు పూర్తి కాలేదు, ఎప్పుడు ముడిచాడో ఆ పిడికిలి, ఆ నరాల శబ్దం వినిపించి అటుచూసే లోపే అతగాడి పిడికిలి సీనియర్ పొత్తికడుపులో పిడిబాకులా దిగింది...
కిందబడి దొర్లుతున్న సీనియర్ ని చూస్తూ..." సుధీర్....సుధీర్ నా పేరు.." అంటూ వెళ్ళిపోయాడు ఆ జూనియర్....

ఇదంతా చూసిన సంహిత "ఛ..ఇలాంటి వాళ్ళు గొడవలు పెట్టుకోడానికే కాలేజీకి వస్తారేమో...సగం ఇలాంటి వాళ్ళ వల్లే కాలేజీ చేరాలంటేనే నాలాంటి వాళ్ళు భయపడుతున్నారు.." అంది..నేను మాత్రం అలా నడిచి వెళ్తున్న సుధీర్ అనబడే జూనియర్ వైపే చూస్తున్నా...

ఆ తర్వాత చాలా రోజులు సుధీర్ ని గమనించాను..ఏదో వచ్చి తన పని చూసుకొని వెళ్లి పోయేవాడు, పెద్దగా ఎవరితోనూ కలిసేవాడు కాదు..నేను, సంహిత అనుకున్నట్లు అతను గొడవలకి పోయే రకం ఏమీ కాదు.కానీ తనని అనోసరంగా కదిలిస్తే, ఇక అదొక పెద్ద గొడవ అవుతుంది అని మాత్రం అర్థం అయింది...సుధీర్ ఆ రోజు సీనియర్ ని కొట్టిన ఇన్సిడెంట్ పెద్ద దుమారమే లేపింది..సీనియర్స్ ఒక బాచ్ కలిసి సుధీర్ని బాగా కొట్టారు..కాంపస్ ముందు మోకాళ్ళ మీద నిల్చుని సీనియర్స్ కి సారి చెప్పమన్నారు వాళ్ళు సుధీర్ని...ఊహూ అలా చెప్తే వాడు సుధీర్ ఎందుకు అవుతాడు.."నా ప్రాణం పోయినా అది జరగదు అన్నాడు.." చివరికి ఈ విషయం ప్రిన్సిపాల్ కి తెలిసి ఎలాగో రాజీ కుదిర్చాడు...

సుధీర్ చాలా మొండొడు...అస్సలు దేనికీ భయపడడు...సంహితకి మాత్రం అతనంటే కోపం..అతనికి అంత మొండితనం పనికిరాదు అంటుండేది...

ఓ రోజు కాలేజీ అయిపోయాక, బస్సు స్టాప్ కి వచ్చాను ఒక్కడినే ఆ రోజు సంహిత కాలేజీకి రాలేదు..సుధీర్ ఒక్కడే ఉన్నాడు బస్సు స్టాప్ లో..
"హాయ్ సుధీర్..." మాట కలిపాను అతన్ని చూస్తూనే...
"హాయ్.." చాలా ముక్తసరిగా చెప్పాడు 
"నా పేరు కార్తీక్...కంప్యూటర్స్..." అన్నాను చేయి కలుపుతూ 
"ఓహ్..."
అతను పెద్దగా మాట్లాడడు అని తెలిసీ నేనే సంభాషణ కొనసాగించాను 
"ఎవరికోసం అయినా ఎదురు చూస్తున్నావా?" అంటూ అడిగాను 
"ఆ..అవును..." మళ్లీ మౌనం..
ఇంతలో ఒక అమ్మాయి వచ్చింది..."సారి అన్నయ్య కొంచెం లేట్ అయింది...అయినా నువ్వెళ్ళిపోవాల్సింది కదా..." అందామె వస్తూనే...
"నిన్ను ఒంటరిగా వదిలా??..అదెప్పుడైనా జరుగుతుందా!!" అన్నాడతను పక్కనే పార్క్ చేసిన ఉన్న బైక్ స్టార్ట్ చేస్తూ...
వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు...ఆ అమ్మాయి పేరు దివ్య...తరువాత నాకు తెలిసిందేమిటంటే...వాళ్లేమీ రక్తం పంచుకుపుట్టిన అన్నాచెల్లెళ్ళు కాదు..దివ్య తండ్రి ఆ అమ్మాయిని కాలేజీలో జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు, వాళ్ళు పల్లెటూరు నుంచి వచ్చారు అని తెలుసుకొని, సుధీర్ ఫార్మాలిటీస్ పూర్తిచేయడంలో సహాయం చేసాడు వాళ్లకి..దివ్యని వైజాగ్ లో దెగ్గరుండి హాస్టల్ లో చేర్పించాడు..'బొత్తిగా లోకం తెలీని పిల్ల, అప్పుడప్పుడు కొంచెం కనిపెట్టుకొని ఉండు బాబు..' అని ఆమె తండ్రి చెప్పినపుడు 'అలాగే..' అని ఇచ్చిన మాట కోసం రోజూ దివ్యని కాలేజీలో దింపడం, మళ్లీ తిరిగి హాస్టల్ లో దింపడం అతని దినచర్యలో భాగం...

ఓ రోజు దివ్య క్లాసులో ఎవడో "అయాం అవైలబుల్ టునైట్" అని ఒక పేపర్ మీది రాసి దివ్య జడకి తగిలించాడు ఆమెకి తెలియకుండా...అది చూసి కాంపస్ లో వాళ్ళందరూ ఒకటే నవ్వు...అది చదివిన ప్రతి పోకిరి వెధవ ఆమె దెగ్గరికొచ్చి "నేను కూడా అవైలబుల్...నేను రావచ్చా" అంటూ ఒక వెకిలి నవ్వు వదులుతుంటే అర్థంకాక ఆ తరువాత ఎవరో ఒక అమ్మాయి ఆ పేపర్ తీసి ఆమెకి చూపిస్తే ఒక్క క్షణం ఖంగుతిని వెంటనే సిగ్గుతో చచ్చిపోవాలని అనిపించింది దివ్యకి. ఈ విషయం తెలిసిన సుధీర్, అలా రాసినవాడెవడో కనుక్కొని కోపంతో రగిలిపోతూ దివ్య క్లాసుకి వెళ్లాడు..క్లాసు మధ్యలో ఉందనే విషయం కూడా అతనికి కనిపించలేదు..అతనికి కనిపించింది ఒక్కటే దివ్యని ఎడిపించినవాడు, వాడి కాలర్...విసురుగా వెళ్లి వాడి కాలర్ పట్టుకొని బెంచ్ పైనుంచి లాగి ఈడ్చుకుంటూ వాడిని తీసుకెళ్తుంటే క్లాసులో అందరూ కోయ్యబోమ్మల్లా చూస్తుండిపోయారు....వాడిని అలాగే కాలర్ పట్టుకొని ఈడ్చుకుంటూ కాంపస్ మధ్యకి తీసుకొచ్చి..."నువ్వు రేపు మళ్లీ కాలేజీకి రావాలంటే నేను చెప్పమన్నది చెప్పు..కాలేజీ మొత్తం వినాలి నువ్వు చెప్పేది " అన్నాడు వాడి వైపు చూస్తూ..వాడు వణుకుతూ ఉన్నాడు..."చెప్తావా...లేక .." అతను పిడికిళ్ళు ముడవడం చూసి...గట్టిగా సుధీర్ చెప్పమన్నట్లు చెప్పాడు...కాలేజీ మొత్తం వినేలా..ఇలా .."రమేష్ అనబడే నేను...మొగాడిని కాదు...అటూ ఇటూ కాని జాతికి చెందిన వాడిని...అందుకే మా.డా గాడిలా దివ్యని ఎడిపించాను...నన్ను రేపటినుంచి అందరూ అలానే పిలవోచ్చు.." అన్నాడు..అదే మాట పది సార్లు గట్టిగా కాంపస్ అంటా వినేలా చెప్పించాడు సుధీర్....ఆ తరువాతి రోజు నుంచి రమేష్ అనబడే ఆ అటూ ఇటూ కాని జాతికి చెందిన వాడు కాలేజీకి రావడం మానేసాడు...ఆ తరువాత దివ్యని ఏడిపించడం మాట అటుంచితే, కనీసం మాట్లాడటానికి కూడా భయపడేవారు...

అదిగో...సరిగ్గా ఆ ఇన్సిడెంట్ తో సంహిత దెగ్గర నూటికి ఒక యాభై మార్కులు కొట్టేసాడు మన సుధీర్...
"కుర్రాడు మంచోడే చంటి...కాకపోతే కాస్త వెర్రి...కాస్త తింగరి తనం...బోలెడంత మొండితనం...అంత కన్నా ఎక్కువ పొగరుబోతుతనం ఉన్నాయి..." అంటూ సుధీర్ పై తన అనాలిసిస్ చెప్పింది సంహిత ఓ రోజు సడన్ గా నాతో...
"ఓహో...మొత్తానికి అతనిమీద ఒక ఒపినియన్ కి వచ్చావనమాట..." అన్నాను నవ్వుతూ 
"ఆ..ఏదో..పర్లేదు...కానీ ఒక అమ్మాయి పరువుని అందరిముందు ఎలా కాపాడేడో చూసావు కదా...కొంచెం వైలెంట్ గా అనిపించినా, ఒక అమ్మాయికి ఒక అబ్బాయి దెగ్గరనుంచి అంత కన్నా హామీ ఏం కావాలి...నీ కోసం నా ప్రాణం అడ్డేస్తా అనే హామీ.." అంది కొంచెం ఎమోషనల్ గా...
"హ్మం ...నిజమే" అన్నాను...ఇంతలో ఎప్పుడు వచ్చాడో తెలీదు, మా మాటలు విన్నవాడిలా మా ప్రక్కనుంచి చిన్న స్మైల్ తో వెళ్తూ కనిపించాడు సుధీర్...
"నవ్వడం కూడా వచ్చే అబ్బాయికి..." అంది మెల్లిగా నవ్వుతూ సంహిత...
"పోగిడావు కదా అబ్బాయిని మరి.." అన్నాను ఆమెతో కలిసి నవ్వుతూ 

ఆ తరువాత దివ్యకి సంహిత మంచి ఫ్రెండ్ అయింది...తద్వారా సుధీర్ కూడా మాతో మాట్లాడుతూ ఉండేవాడు..కానీ ఎంత వరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడేవాడు.."ఓ ముక్క ఎక్కువ మాట్లడిదే..తమరిని అమ్మాయిలు లవ్ లో పడేస్తారని భయమా??" సంహిత డైరెక్ట్ గానే అడిగేసింది ఓ సారి...ఓ నవ్వు నవ్వి అక్కడనుంచి పరార్ మనోడు...

ఓ రోజు అందరం కలిసి కూర్చొని మాట్లాడుతుండగా సంహిత సడన్ గా అడిగింది సుధీర్ ని " ఆ రోజు దివ్య స్థానంలో నేను ఉంటె...నువ్వు అలా రియాక్ట్ అయ్యేవాడివా??" అని...
"అయ్యుండేవాడిని కాదు..." చెప్పాడతను
"ఏం ?...ఎందుకని?.." కొంచెం రోషం సంహిత గొంతులో 
"అప్పుడు నువ్వెవరో నాకు తెలీదుగా..." అన్నాడతను స్థిరంగా 
"ఓహో తెలిస్తేనే కాపాడుతావా...సరే ఫర్ ఎక్సాంపుల్ నేను నీ లవర్ అని అనుకో...మరి అప్పుడు.." అందామె...ఏదో తెలుసుకోవాలనే తపన ఆమెలో...
"అప్పుడు....అప్పుడు...." అతనేమి చెప్తాడో అనే ఎదురుచూపు తాలూకు మెరుపు చూశాడతను ఆమె కళ్ళలో ...
"ఏమో...నువ్ నా లవర్ అయితే గాని చెప్పలేను." అన్నాడతను.
"అబ్బో...ఏదో ఎక్సాంపుల్ కి అడిగాను బాబూ..అంత దూరం వెళ్ళకు..." అంది సంహిత
"నేను వెళ్ళానా??.." అంటూ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు..
"అంటే ఏంటి...నేను వెళ్ళాననా??...ఏంటి చంటి అతని భావం...అసలు ఆ పొగరు ఏంటి మనిషికి...అలా మధ్యలో వెళ్లిపోతాడేంటి??.." అంటున్న సంహిత రోషం వెనుక ఏమి దాగుందో తెలుసుకోవాలనిపించింది నాకు...


 [ To be continued in the 4th part...I will publish the 4th part on Sunday probably :-) ]

24 comments:

manasa said...

బాగుంది...ఈ ట్విస్టులు...పోనీ ఎన్ని భాగాలో చెప్పి పుణ్యం కట్టుకోండి

adi seshu said...

Hi,
did you change the title of your post from "Aadapillaki eedostE" to the new one ??

any way the story is very interesting.

keep going

adi seshu said...

Hello,
Did you change the title of the post.

The story is very intersting.
Can't wait till Sunday

నేస్తం said...

కిషన్ మరీ 'పల్లె టూరి మొద్దు' అని అన్న చిన్న పదానికే అంతలేసి మాటలు అనిపిస్తాడా హీరో ?? ఇక్కడ అనవసరంగా ఎదుటి వాడిపై సానుభూతి వచ్చేసింది నాకైతే .. హూం .. ఇలా కుర్చుని సుత్తి అభిప్రాయాలు చెప్పడం కంటే కధ రాస్తే తెలుస్తుంది అని అంటావా .. :P అయితే ఓకే :) ..

స్ఫురిత said...

నా request మన్నించి, next part date చెప్పినందుకు ఒక థాంక్యు...

ఈ part లో పేద్ద twist లు ఇవ్వనందుకు ఇంకొన్ని థాంక్యూలు...:)

కవిత said...

అమ్మా....ఫ్లాష్ బ్యాక్ అన్నమాట..కానీవ్వండి కానివ్వండి .....రాగిఇంగ్ సన్నివేశం బాగా Natural గా ఉంది అండి.మంచి స్టొరీ రయిటర్ లక్షణాలు బోలెడు ఉన్నాయి మీలో..

sowmya said...

మీరెక్కడ దొరికారండీ బాబూ మా ప్రాణాలకి, ఎందుకండీ మాకీ సీరియళ్ళు....బాబ్బాబ్బు మీకు పుణ్యం ఉంటుంది, ఆ కథేదో తొందరగా రాసిపాడేయండీ....ఏమిటో ఈ వెధవ బాధ, తరువాతి టపా ఎప్పుడొస్తుందా అని ఎన్నాళ్ళని ఎదురుచూస్తూ కూర్చోవడం....ఇదేం బాలేదండీ, మా మీద కక్షసాధింపులా ఉంది.

ఏదో మా మీద దయ తలిచి ఈ ఎపిసోడ్ లో కాస్త ట్విస్టులు తగ్గించినట్టున్నారు :)

శివరంజని said...

ఈ పార్ట్ లో స్టోరీ ట్విస్ట్ లు లేకుండా ఉంది... స్టోరీ ఎంత బాగుందంటే అంతా ఒకేసారి చదవాలనిపిస్తుంది మీరేమో పార్ట్ ల మీద పార్ట్ లు కంటిన్యూ చేసి టెన్సన్ పెడుతున్నారు ........... కొంపదీసి ఆ ప్రొఫైల్ లో బాబు కి బాబు పుట్టే వరకు ఈ స్టోరీ రాస్తునే ఉంటానని మొక్కుకున్నారా ? ............ ఏది ఏమైనా లవ్ స్టోరీస్ రాయడం లో బాగా పండిపోయారు సార్!
A small request:
రంజని అనే I.D తో బ్లాగ్ లో ఇంకెవెరో ఉండడం చూసాను. అందుకే పూర్తి పేరుతో సంభోదించండి plz

Sathish said...

After some suspense twists, here started a neat love story..the powerful characterization of sudheer is good..but we need more twists, hope to get some in future parts :-)

hanu said...

bagumdi anDi, wat neXt

Raj said...

bagundi .....

nenu inka em cheppanu nenu cheppalanukunnavi anni vere vallandaru cheppesaru

స్ఫురిత said...

అన్నట్టు ఆ raging scene లో మీరు మీ senior ని కొట్టాలనుకుని కొట్టలేకపోయారు అందుకే నా ఇక్కడ సుధీర్ చేత కొట్టించేసారు...కనిపెట్టేసా చూసారా :D

nagarjuna చారి said...

ఇంతకు మునుపు సినిమాల్లో గట్రా పనిచేశావేమిటొయ్, భలే బాగా నడుపుతున్నావ్ కథని. సస్పెన్స్ నుండి రొమాన్స్ లోకి తీసుకెల్లావ్.., వచ్చే భాగంలో సస్పెన్సా డ్రామానా?

Kishen Reddy said...

@ మానస : ఎన్ని భాగలో ఇప్పుడే చెప్పడం కష్టం అక్కా :-)

@ శేషు : అవును టైటిల్ మార్చాను..థాంక్స్

@ నేస్తం : సరి చేసాను...మీరు కామెంట్ చూసుకోండి మీ బ్లాగ్లో...అంతా వివరంగా చెప్పాను :-)

Kishen Reddy said...

@ స్ఫురిత : ధన్యవాదాలు..రిక్వెస్ట్ లు సిరసావహించడమే మా కర్తవ్యం :-)..ఈ పార్ట్, తరువాతి పార్ట్ కూడా ట్విస్ట్ లు లేకుండా ప్రేమ కథతో సాగుతాయి

@ కవిత : ధన్యవాదాలు

@ సౌమ్య : ఎంత మాటా..ఎంత మాటా..మీ మీద కక్ష సాధింపా..మిమ్మల్ని అలరిద్దామనే నా ప్రయత్నం..ఎక్కువ భాగాలు ఉండవులెండి..ముగించేస్తా...మీరు అట్టే బాధపడకండి...ప్లీజ్ :-(

Kishen Reddy said...

@ శివరంజని : థాంక్స్ మీ అభిమానానికి..మరీ ఎక్కువ భాగాలు ఉండవులెండి..మీరు భయపడకండి...ఇకపోతే ఎందుకో రంజనీ అనే పేరు నాకు నచ్చి మిమ్మల్ని అలా పిలిచాను..ఎవరికో ఐ.డీ ఉంటె మీకేంటి చెప్పండి...మీరు రంజనీ అంతే ..అదన్నమాట :-)

@ హను : థాంక్స్ :)

@ సతీష్ : థాంక్స్...ట్విస్టులు త్వరలో ప్రారంభం అవుతాయి :)

Kishen Reddy said...

@ రాజ్ : ధన్యవాదాలు ..stay tuned.

@ స్పురిత : భలే కనిపెట్టారండి :)...మీరు మహా తెలివైన వారు సుమండీ..నిజమే నేను అలానే కసితీరా మా సీనియర్ ని కొట్టాలనుకున్నాను...అది కుదర్లా..ఇప్పుడు ఇలా ఆ కసి తీర్చుకున్నాను అనమాట :)

@ చారి గారు, ఎంతమాట ..తదుపరి పార్ట్ డ్రామా తో కూడుకున్న రొమాన్స్ అనుకోండి..అడనమాట :)

Keerthi said...

Nice story. keep it up, waiting for the next part

Kishen Reddy said...

Keerthi, thanks a lot :-)

ప్రణీత స్వాతి said...

బాగుందండీ.

3g said...

నన్ను నిరాశపర్చారండి........ ఈ పార్ట్ లో ఏదో సైకలాజికల్ ట్విస్ట్ ఇస్తారేమో అనుకున్నా....... పెద్దగా ట్విస్టులేమీ ఇవ్వలేదు. నెక్స్ట్ పార్ట్ లో న్యాయంచేస్తారనుకుంట.

Kishen Reddy said...

ప్రణీత గారు...థాంక్స్ :-)

priya... said...

hey i loved it...chala bagundi blog...chala pleasant ga...knchm...nak baga telisina valato jarugutunnatundi...nice blog...inka megata parts chadavali k ...

Kishen Reddy said...

ప్రియ థాంక్స్ :-)..మిగతా పార్ట్స్ కూడా చదవండి మరి