Search This Blog

Monday 31 May, 2010

హృదయం ప్రేమిస్తానంటే...విధి విడదీస్తానంటే !! - 7


దివ్య చెప్పిన విషయం కార్తీక్ కి చాలా షాకింగ్ గా.. నమ్మలేనట్లుగా అనిపించింది ...
"అతను ఎక్కడ కనిపించాడు నీకు?" అడిగాడు కార్తీక్
"గీతం కాంపస్ మెయిన్ గేటు దెగ్గర... నేను లోపలికి ఎంటర్ అవ్వబోతుండగా దివ్యా అంటూ గట్టిగా పిలిస్తూ పరిగెత్తుకుంటూ వచ్చాడు నా దెగ్గరికి..." అంది దివ్య..
"అలాగా!!...ఇంకేమన్నా చెప్పాడా నీతో.." అడిగాడు..
"ఇంకానా...ఆ ..మర్చిపోయాను చెప్పడం...సంహితని కలిశాడట..మాట్లాడాడట..ఎందుకో సంహిత నేనెవరో ఎరుగనట్లు ప్రవర్తించింది..'నాపైన ఉన్న ప్రేమంతా కరిగిపోయిందా, చివరిదాకా నాతోనే ఉంటాను అని చేసిన ప్రమాణం మరచిపోయావా' అని సంహితని అడిగాను కానీ ఆమె ఎవరో పిచ్చివాడిని చూసినట్లు చూసి వెళ్ళిపోయింది అని చెప్పాడు నాతో.." అంది దివ్య
"నిజమా... ఓ గాడ్ " అలాగే తలపట్టుకొని కూర్చున్నాడు కార్తీక్.. 'ఎవరో ఆమెకి గతాన్ని గుర్తుచేసే ప్రయత్నం చేసారు' అని డాక్టర్ అభిరాం చెప్పిన  మాటలు గుర్తుకు వచ్చాయి కార్తీక్ కి..
"అదే...నాకూ అర్థం కావడం లేదు... సుదీర్ అన్నయ్య లాగానే చెప్తున్నాడు అన్నీను..." అంది దివ్య అతని ప్రక్కనే కూర్చుంటూ ..
"సరే...మనం అతన్ని కలవాలి..." అన్నాడు అప్పుడే నిర్ణయించుకున్నవాడిలా..
"అతను ప్రతి రోజూ కాలేజీకి వచ్చి నన్ను లోపలి వెళ్ళనివ్వండి, నేను ఈ కాలేజీ స్టుడెంటునే..సంహితని పిలవండి అని అడుగుతాడట, సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు...సో రేపు నువ్వు నాతో పాటు కాలేజీకి వస్తే అతన్ని మనం కలవొచ్చు.." అంది దివ్య
"సరే...రేపు నేను నీతో పాటు వస్తాను..." అన్నాడు కార్తీక్ .

                                           ***  
                                                      
"డాడీ...." అంది సంహిత రూంలోకి అప్పుడే వచ్చిన ఆమె తండ్రిని చూసి ..
"చెప్పమ్మా...ఇప్పుడెలా ఉంది...ఆర్ యు ఆల్ రైట్ " అడిగాడు ఆమెని..
"ఫైన్ డాడీ...నాకోసం చంటి ఏమైనా కాల్ చేసాడా? " అడిగింది
బిత్తరపోయాడు ఆమె తండ్రి...."చంటి..ఎవరమ్మా??" అడిగాడు తడబడుతూ ...
"చంటి !!...అవును చంటి ఎవరు ??...అతని పేరు కార్తీక్ కదా...నేనేంటి చంటి అన్నాను...మొన్న హాస్పిటల్లో కూడా అంతే పిలిచాను అతన్ని..." అంది తండ్రి వైపు ఆశ్చర్యంగా చూస్తూ...
"నీ చిన్నప్పటి చంటి గుర్తొచ్చి ఉంటాడు లేమ్మా..అందుకే అలా పిలిచి ఉంటావ్..." అన్నాడు..
"ఏమో...ఎనీవే, ఆ కార్తీక్ ఏమన్నా కాల్ చేసాడా..?" అడిగింది
"లేదు...ఎందుకమ్మా? " అతనిలో ఏదో భయం మళ్ళీ తన కూతురు తనకి కాకుండా పోతుందేమో అని..
"ఏం లేదు...." సుధీర్ ఆఖరి చూపు కూడా ఆమె దక్కించుకోలేక పోయినందుకు బాధగా ఉంది ఆమెకు..
"సరే...రెస్ట్ తీసుకో..." అంటూ వెళ్ళిపోయాడు
"నాన్నా..." పిలిచింది... గుమ్మం దెగ్గరికి వెళ్ళిన అతను తిరిగి చూశాడు ..
"మీకో విషయం చెప్పాలి...నేనొకతన్ని ప్రేమించాను..."
ఆశ్చర్యంగా చూసాడు ఆమె వైపు....
"అతనికీ నాకూ పెద్ద పరిచయం లేదు..కానీ అతన్ని చూడకపోతే ఉండలేకపోయేదాన్ని.. పిచ్చేక్కినట్లు ఉండేది..ఎందుకో నాకే తెలీదు.. ఈ విషయం ఇంతవరకు సుధకి కూడా చెప్పలేదు నాన్న...మీకే చెప్తున్నాను... ఎందుకంటే నాకు మనసారా ఏడవాలనుంది నాన్నా మీ భుజాన్ని ఆనుకొని... అతను నాకిక లేడు నాన్నా...ఆక్సిడెంట్ లో చనిపోయాడు...అది నేను చూశాను.. " ఆమె కళ్ళలో కన్నీరు ...
ఆ విషయం విన్న ఆతనికి చెమటలు పట్టాయి ఒక్కసారిగా...
"ఎవరతను ?" అడిగాడు ఏదో ఒక ట్రాన్స్ లో ఉన్నవాడిలా ...
"సుధీర్...." చెప్పిందామె ..
అతని కాళ్ళ క్రింద భూమి కంపించింది... నిశ్చేష్టుడై తన కూతురి వైపే చూస్తున్నాడు... ఏమవుతుంది తన కూతురికి .. సుధీర్ గురుంచి ఎలా తెలిసింది .. ఆతనికి కార్తీక్ మీద అనుమానం కలిగింది..

                                            *** 
                                         
కార్తీక్ తో కలిసి కాంపస్ కి వచ్చింది దివ్య... అతని కోసం చుట్టూ చూస్తుండగా బస్సు స్టాప్ లో కూర్చొని ఒకతను కనిపించాడు దివ్యకి...
"అదిగో బస్సు స్టాప్ లో ఉన్నాడే...అతనే .." అంది దివ్య..
అతనివైపు పరీక్షగా చూసి ." పదా ..." అంటూ వెళ్ళాడు దివ్యతో కలిసి అతని దెగ్గరికి
కాళ్ళు ముడుచుకొని కూర్చొని మోకాళ్ళలో తల దాచుకున్నాడు అతను ...
"హలో...." పిలిచాడు కార్తీక్..
తలెత్తి చూసిన తన కళ్ళలో ఒక్కసారిగా ఆశ్చర్యం...వెనువెంటనే ఆకాశమంత ఆనందం...
"కా...ర్తీ...క్..." అన్నాడు లేచి నిలబడుతూ నమ్మలేనట్లుగా..
షాక్ తిన్నాడు కార్తీక్ ఒక్కసారిగా...'ఇతను నన్నెలా గుర్తుపట్టాడు...ఇతను ఎవరో కూడా నాకు తెలీదే...కానీ ఇతని కళ్ళలో నన్ను చూడగానే ఆ మెరుపేంటి??..ఎవరితను..' ఎన్నో ఆలోచనలు కార్తీక్ లో సుడులు తిరుగుతుండగా మెల్లిగా అన్నాడు ..." ఎవరు నువ్వు ?" అని ..
సంతోషంగా కార్తీక్ దెగ్గరికి రాబోతున్నవాడల్లా ఒక్కసారిగా ఆగిపోయాడు...అతని కళ్ళలో తీవ్రమైన బాధ.. ద్రవించిన ఆ బాధ కళ్ళ వెంబడి నీరై కారుతుండగా చలించిపోయాడు కార్తీక్ ...

"నేను నీ బెస్ట్ ఫ్రెండ్ సుధీర్ ని కార్తీక్...ఎందుకు నన్నిలా దూరం చేస్తున్నారు అందరూ..నేనెవరో తెలియనట్లు ఎందుకు ఉండిపోతున్నారు...ఏం కార్తీక్ నేను అప్పుడే నీకు అంత కాని వాడిని అయిపోయానా..ఈ స్నేహితుడితో ఋణం తీరిపోయిందా..." అంటున్న ఆ వ్యక్తి ఇంకేవరో కాబట్టి తన గుండె ఇంకా ఆగిపోలేదు...అదే నిజంగా సుధీర్ నోటివెంట ఆ మాట వచ్చుంటే ఆ క్షణమే ప్రాణాలు విడిచేవాడు కార్తీక్..  

"నువ్వు మా అన్నయ్యవి కాదు...ఎవరు నువ్వు?" నిలదీసింది దివ్య..
హతాశుడయ్యాడు అతను ఆ మాటకి... అతన్ని చూస్తే కార్తీక్ కి ఏదో తెలియని బాధ..అతను అబద్దం చెపుతున్నట్లుగా అనిపించడం లేదు కార్తీక్ కి...కానీ అతను చెప్పేది నిజం అయ్యే అవకాశమే లేదు...అందుకే స్థిరంగా "సుధీర్ చనిపోయి ఆరునెలలు అయింది...ఆక్సిడెంట్ లో చనిపోయాడు...నువ్వు సుధీర్ ఎలా అవుతావు...మా సుధీర్ ఎలా ఉంటాడో మాకు తెలీదా??.. నువ్వెవరు?..మా గురుంచి మొత్తం తెలిసినట్లు ఎలా మాట్లాడగలుగుతున్నావు...సంహితకి ఏం చెప్పావ్ ??" అంటూ ప్రశ్నలు సందించాడు కార్తీక్ ...

అది విని కోయ్యబారిపోయాడు అతను... "నేను చనిపోవడం ఏంటి...అంటే మీ ముందు ఉన్నది నేను కాదా... ఇంతకన్నా ఇక్కడే నా గొంతు నులిమి చంపెయ్యి కార్తీక్ .." ఆవేశంగా అన్నాడతను...
దివ్య వైపు చూసాడు కార్తీక్...ఆమె తన హ్యాండ్ బ్యాగ్ లోంచి ఒక ఫోటో తీసి కార్తీక్ కి ఇచ్చింది...

"ఇదిగో చూడు...బాగా చూడు...ఇతను సుధీర్.. సంహితని ప్రాణంగా ప్రేమించిన సుధీర్...మా ఇద్దరికీ ప్రాణ స్నేహితుడైన సుధీర్.." అంటూ సుధీర్ ఫోటో అతనికి చూపించాడు...
సుధీర్  ఫోటో చూడగానే... ఒక్కసారిగా అతనిలో ప్రకంపనలు.. ఫోటో క్రింద పడేసి అలాగే తల పట్టుకున్నాడు..అతని తల తిరిగిపోతుంది... వళ్ళంతా వణుకు పుట్టింది... వెయ్యి ఏనుగులు ఒకేసారి అరుస్తున్నట్లు భరించలేని శబ్దం అతని చెవుల్లో... ఇనుప రాడ్లతో అతని తల మీద బలంగా మోదుతున్నట్లు అనిపిస్తుంది అతనికి..అలాగే తల పట్టుకొని క్రింద పడిపోయాడు ....

                                               ***

"డాక్టర్ ఇక భార్గవ్ పరిస్థితిలో ఎటువంటి మార్పు రాదంటారా ?" అడిగింది ఆ తల్లి ...
"అది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి...కానీ కష్టమే.." అన్నాడు డాక్టర్ 
"మీరు చెప్పమన్నట్లుగానే నేను తనని భార్గవ్ అని కాకుండా సుధీర్ అనే పిలుస్తున్నాను..సంహిత నీకోసం ఎదురు చూస్తుంది అని అతన్ని మాయలోనే ఉంచుతున్నాను...కానీ, వాడు చిన్నపిల్లాడు కాదు, సంహిత తనకు కనిపించకపోయేసరికి నా దెగ్గరికి వచ్చి అమ్మా నన్నెందుకు మాయ చేస్తున్నావ్ అని నన్ను అడుగుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను డాక్టర్...." అంది ఆ తల్లి ఆవేదనగా.. 

"నేను అర్థం చేసుకోగలను... కానీ హీ లాస్ట్ హిస్ ఐడింటిటి యాస్ భార్గవ్.. సుధీర్ ఐడింటిటి మాత్రమె అతని మెంటల్ ఫాకల్టీస్ లో రిజిస్టర్ అయి ఉంది... నేను రిగ్రేషన్ థెరపీ, సైకో-అనలిటిక్ థెరపీ ద్వారా తిరిగి అతని ఐడింటిటి తీసుకురావచ్చు అనుకున్నాను..కానీ ఆ థెరపీలు ఏవీ ఫలించలేదు.. ఇప్పుడు అతని కాన్షియస్ ని డామినేట్ చేస్తున్న సుధీర్ ఐడెంటిటీ ఈ థెరపీలను చాలా సమర్ధంగా అడ్డుకుంటుంది.. ఇలాంటి సైకలాజికల్ థెరపీలు విజయవంతం కావాలంటే పేషంట్ కూడా అందుకు సానుకూలంగా స్పందించాలి.. సైకలాజికల్ థియరీ ప్రకారం ఒక మనిషికి కాన్షియస్, సబ్-కాన్షియస్, సూపర్-కాన్షియస్ మెంటల్ స్టేట్స్ ఉంటాయి.. ఈ మూడు మానసిక స్థితులని డైరెక్ట్ చేసేది సూపర్-కాన్షియస్.. భార్గవ్ సూపర్-కాన్షియస్ మొత్తం సుధీర్ ఐడింటిటితో నిండిపోయింది.. అది కూడా చాలా స్థిరంగా.. ఆ స్థితిని నేను ఈ థెరపీల ద్వారా కూడా మార్చలేకపోయినందు వల్లనే, మిమ్మల్ని తన ప్రస్తుత ఐడింటిటినే గుర్తించమని చెప్పాను..అందుకే అతన్ని సుధీర్ అనే పిలవమని చెప్పాను... అతను సంహిత గురుంచి మిమ్మల్ని పదే పదే అడుగుతుంటే ఆమె మీకు తెలిసినట్లే ప్రవర్తించమని చెప్పాను.. ప్రస్తుతం నేను చేయ్యగలిగింది కూడా ఏమీ లేదు ..."అన్నాడు డాక్టర్ 

ఆమె భారంగా నిట్టూర్చింది....
"కానీ తను కాని తను ఎన్నాళ్ళిలా ... ఏదో ఒక రోజు సంహిత అనే అమ్మాయి తన సొంతం కాదని తెలిస్తే ఏమైపోతాడు నా కొడుకు..." అందామె వాపోతూ 
"మీరొక విషయం మరచిపోతున్నారు...అసలు ఈ రోజు మీ భార్గవ్ బ్రతికి ఉండటమే గొప్ప... అందరం ఆశలు వదిలేసుకున్నాం అతని మీద... ఆరునెలల క్రితం ఆ రోజున జరిగిన విషయం మీరు మరచిపోలేదు కదా ..." అడిగాడు డాక్టర్ 

"ఎంత మాట డాక్టర్...ఎలా మరచిపోగలను...అందుకే, భార్గవ్ అయితే ఏంటి సుధీర్ అయితే ఏంటి నా కొడుకు నా కళ్ళ ముందు ఉన్నాడు నాకదే చాలు అని సంతోషపడుతున్నా డాక్టర్ .." అందామె కళ్ళలో నీలు ఒత్తుకుంటూ ...

             ******** ఆరు నెలల క్రితం ఒక రోజు ********

"నొ హోప్.....ఇతను బ్రతకడం కష్టం...ఒక ఇరవై గంటలు అబ్జర్వేషన్ లో ఉంచుతాం..తరువాత మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు...యాం శారీ" అని చెప్పాడు డాక్టర్ ఆమెకు ...గుండెలు అవిసేలా ఏడుస్తుంది ఆమె .. 'లేక లేక పుట్టిన కొడుకుని అప్పుడే తీసుకెళ్ళిపోతున్నావా...ఏడుకొండలవాడా...ఆడు పుట్టగానే నీ కొండకి వచ్చాను కదయ్యా...కనికరం లేదా నా మీదా.. కొడుకు పోయిన కడుపుకోత ఎలా ఉంటుందో నీకేం తెలుసు ఒక తల్లి మనసుకి తప్ప..' ఆమెలో దుక్కం కట్టలు తెంచుకుంటుంది...
దేవుడికి తప్ప ఎవరికి తెలుసు ... ఆ ఎడుకొండలవాడికి అన్నీ తెలుసు.... అందుకేనేమో .....
"డాక్టర్ ......డాక్టర్ ...ఆక్సిడెంట్ కేస్ ...." అరుస్తూ వచ్చింది నర్స్ 
"ఈజ్ హీ డెడ్ ...ఆర్.. అలైవ్?.." అడిగాడు డాక్టర్ 
"బ్రెయిన్ డెడ్ ...బట్ ప్రాక్టికల్లీ మెనీ బాడిలీ ఫంక్షన్స్ స్టిల్ వర్కింగ్..." అంది నర్స్ ...
"వాట్....రియల్లీ ...కమాన్ ఫాస్ట్...లెట్స్ గో చెక్ దట్ బాడీ ..." అంటూ నర్స్ తో పాటు పరుగుతీసాడు డాక్టర్ ....


[To be continued in the eighth part................. Kishen Reddy]

24 comments:

manasa said...

బాగుంది ఎప్పటిలాగే :)..నెక్స్ట్ పార్ట్ కోసం వెయిటింగ్

కవిత said...

Very nice....So at last you came into our line sir...without twists...u gave us a hint.....keep it up.
BTW,meeru emina scince Group related ahh??mothani ki me story kosam oka doctor ni appoint chesi unnattunnaru...oka amma ni,oka nanna ni,oka lover ni,oka sister ni,oka friend ni and Oka Doctor ni...abbbooo enni charectors ni create cheserooo...."anduke meeru creative kurradu " ani pilavabaddaru....he he he

చెప్పాలంటే...... said...

okka saare mottam chadiveyaalani vundi baagundi

3g said...

ఇప్పుడు కొంచం స్పష్టంగా.....ప్రశాంతంగా....ఉందండి.లేకపోతే క్రిందటి పార్ట్ లో దిమ్మతిరిగి మైండు బ్లాక్ అయింది.
చాలా పరిశోధిస్తున్నట్టున్నారు.... ఆశక్తికరంగా సాగుతోంది..... కొనసాగించండి.

..nagarjuna.. said...

ఒకే కథలో ఇన్ని సైకలాజికల్‌ ట్విస్టులా!! నో..నో నా వల్లకాదు..తొందరగా తరువాయి భాగం అచ్చెసెయ్ బాబోయ్...
కవితగారన్నట్టు "క్రియేటివ్ కుర్రాడు" కాదుగాని "క్రియేటివ్ కిషెన్ (టైటిలు)- ఈ అబ్బాయి మాం...చి కథకుడు(క్యాప్షను)" పేరు ఎలాఉందంటారు ?

కవిత said...

@chari garu,Peru Super and the caption too.
Kishan garu...memithe alage Fix avuthunnam...me istam ika...thondara ga story muginchesthe ilanti maaru perlu pettam!!! ...nirnainchukondi mari...maru pera????story climax ahh???

Raj said...

నాకు సీన్ అర్థం అయింది...యాక్సిడెంట్ లో సుధీర్ చనిపోతే అతని పనిచేసే ఆర్గాన్స్ భార్గవ్ కి పెట్టి ..వీడిని వాడిని చేసారన్న మాట..

నాకు చిన్నప్పుడు చూసిన "కోకిల" అనే సినెమా గుర్తొస్తుంది

..nagarjuna.. said...

@కవిత గారు : పేరు accept చేసినందుకు కృతజ్ఞతలు.
@రాజ్ : అంటే ఇప్పుడు బ్రెయిన్ transplant చేసారంటారా, గుండెను మార్చారంటారా ...

Raaga said...

Wow, fantastic job. Finally leading to a conclusion, and its interesting to see people jumping to conclusions thinking what kind of transplant it would be, ha ha :-).

But i will wait till your next part to know whats actually going to be. Anyhow this story is really awesome and left me awestruck. Good job dude.

Super Sisters said...

బాగుందండి ,మీ ట్విస్ట్ లతో నాకు టెన్షన్ వస్తుంది .ఇకనైనా కధ సుకాంతం చేయండి .పాపం సుధీర్ ,సంహితలను కలిపేయండి .అసలే వాళ్ళు రకరకాల జబ్బులు తో బాధ పడుతున్నారు .వాళ్ళను విడదీసి మీరు ఇంకా బాధపెట్టకండి .సంహిత ,సుధీర్ లను మా ఫ్రెండ్స్ లా ఫీల్ అవుతున్నాం .అంతలా లినమైపోయము మీ.............. కధ లో .బాగా ఆలోచించండి వాళ్ళని విడతీసి పాపం ముటకట్టుకుంతర ,కలిపి పుణ్యం పుటకట్టుకుంతార.ఎందుకంటే ముగింపు మీ చేతుల్లో వుంది కదా ...............అందుకన్న మాట .హ హ హ హ ...........................................

ప్రణీత స్వాతి said...

ఇన్ని ఇన్స్టాల్ మెంట్సా...అన్యాయం.

Ram Krish Reddy Kotla said...

@ మానస : థాంక్స్..త్వరలోనే రాస్తాను

@ కవిత : కావాలనే హింట్ ఇచ్చాను..లేకపోతే ఇక్కడ నన్నందరూ మూకుమ్మడిగా దాడి చేసేలా ఉన్నారు.. నేను "క్క్రియేటివ్ కుర్రాడా.." హి హి..ఇది అపహాస్యం కాదు కదా, ఆంజనేయులు సినిమాలో క్రియేటివ్ ప్రభాకర్ పాత్రా పోషించిన బ్రహ్మానందం టైపు లో జోక్ చెయ్యడం లేదు కదా !!

@ చెప్పాలంటే : చెప్పాలంటే నాకు మీ వ్యాక్య చాలా నచ్చింది :-)

Ram Krish Reddy Kotla said...

@ త్రీజీ : నిజమే కొంత పరిశోధన చేసాను..కనీ చాలా వరకు నేను ఐ.ఏ.ఎస్ ప్రేపరే అయ్యేప్పుడు చదివిన సైకాలజీ థీరీస్ ఉపయోగించాను..అంతే

@ చారి గారు : త్వరగానే రాస్తాను.. "క్రియేటివ్ కిషెన్ ....ఈ అబ్బాయి మాం...చి కథకుడు" అబ్బో...మీ మాటకి నేను మునగ చెట్టు ఎక్కేసి, దాని చిటారి కొమ్మ విరగడంతో క్రింద పడ్డాను :-(

@ కవిత : స్టొరీ ముగించేస్తే ఇలాంటి పేర్లు పెట్టారా..భలేవారే నాకిలాంటి పేర్లే కావలి ..అందుకే స్టొరీని ఇంకొక ఇరవై ఎపిసోడ్స్ పెంచుతున్నట్లుగా సవినయంగా...అదనమాట

Ram Krish Reddy Kotla said...

@ రాజ్ : హా హా...మీరు చాలా ఇంటలిజంట్ సుమీ.. అలా అందరికీ కథ ముందే చెప్పేస్తే ఎలాగండీ.. మీకు కోకిల ఒక్కటే గుర్తొచ్చిందా ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ మీద చాలా చిత్రాలు ఉన్నాయి...

@ చారి గారు : ఆ విషయం తెలుకునేందుకు తరువాతి ఎపిసోడ్ దాక ఆగండి :-)

@ రాగ : థాంక్స్ ..నీ కామెంట్ నన్ను ఎప్పుడూ ఉత్సాహపరుస్తూనే ఉంటుంది ... :-)

Ram Krish Reddy Kotla said...

@ అనిత : ఆల్రడీ సుధీర్ చనిపోయాడు కదా...సో కలిపెయ్యడం అంటే, సంహితని కూడా చంపేద్దామా..హాయిగా ఇద్దరు కలిసి స్వర్గం/నరకం లో డ్యూయట్స్ పాడుకుంటారు...సరే మీ మాట మీద సంహితని చంపేస్తా తరువాతి పార్ట్ లో...సరేనా అనితా :-)...నిజమే ముగింపు నా చేతుల్లోనే ఉంది

@ ప్రణీత : మరి కొన్ని ఇన్స్టాల్ మెంట్స్ ఉన్నాయ్..తప్పదు :-)... అన్ని ఇన్స్టాల్ మెంట్స్ చక్కగా కడితేనే కదా నిజంగా ప్రోడక్ట మన సొంతం అయ్యేది

శివరంజని said...

ఇదేమిటండి??అడిగేవారు లేరనా?? "18"పర్వాలుతో ముగించేస్తారనుకుంటే ఇంకా పెంచేసారేమిటండి??. "క్రియేటివ్ కుర్రాడు"అనే పేరు కోసం మీరు స్టొరీ ని పెంచేస్తారా??
మీ నేరేషన్ కి "క్రియేటివ్ కుర్రాడు", డాక్టర్ , పద్మభూషణ్ ఇలాంటి అవార్డ్స్ ఎప్పుడో ఇచ్చేసాము (ఇంతలా పొగిడినందుకైన ఎపిసోడ్స్ తగ్గిస్తారు నాకు తెలుసు U r basically good. )

ఇంతకి సంహిత ని చంపేస్తారా?(అయినా సంహిత బ్రతికి ఉండి ఎన్ని విజయాలుసాధించినా ఉపయోగమేముంది సుధీరే లేనప్పుడు)
మీరెంత మంచివారు, మీదెంత విశాల హృదయమండి భూమి మీద ఎలాగా కలపలేదు... ఏ అబ్జక్సన్స్ ఉండవని" అకాశవీధిలో" కలుపుతారా వారిద్దరిని. కిషెన్ గారు పైన బెదిరింపులు చూసారా యాంటి క్లైమాక్ష్ వచ్చిందో కామెంట్లు కాదు రంగు పడుతుందేమో అని నా అనుమానం . ఆ తరువాత నాకేం తెలియదు.నన్నేమి అడగొద్దు.నేనస్సలు చెప్పను సాక్ష్యం:):)

Ram Krish Reddy Kotla said...

@ రంజని : అంతే అంటారా, అలాగలాగే , ఒక మూడు నాలుగు ఎపిసోడ్స్ లో పూర్తి చేస్తానులెండి... ఇకపోతే క్లైమాక్స్ అప్పుడే ఎలా ఉంటుందో చెప్పలేను, రంగు పడినా..రసం సాంబార్ పడినా, ఏమీ చెయ్యలేను :-)...

కవిత said...

సంహిత ని చంపేస్తారా?????????నా చేతిలో అయిపోయారు...రంగు కాదు ఏకంగా పయికి పంపే ఆలోచనలో ఉన్నాను నేను...
స్నేహితులారా...ఈ అన్యాయాన్ని ఆపడం మన తక్షణ కర్తవ్యం ...రండి నాతో జత కట్టండి ...అందరం ముఉకుమ్మడి గా దాడి జరుపుదాం...లేకుంటే ఇలా ప్రేమ జంటని చంపేస్తారా???కళ్ళు పోతాయి...
కిషన్ గారు,తద్వారా మీకు మనవి చేయడం ఏమిటంటే...మా కంమెంట్లు మైండ్ లో పెట్టుకొని క్లయిమక్ష్ రాయగలరు...మీ బంగారు బావిష్యత్తును మీరు నిర్ణయించుకోండి....అనవసరం గా మా చేతులకు పని చెప్పకండి..అసలే మాకు బోలెడు పనులాయే....

శివరంజని said...

@కవిత:గారు సంహితని చంపేయడం లేదు.సుధీర్ దగ్గరికి పంపిస్తున్నారు అంతే... ఇద్దరిని ఆకాశవీధిలో కలుపుతారు లే...(ఎంతైనా కిషెన్ గారిది పెద్దమనసు కదా) ...

ఇకపోతే కిషెన్ గారిని ఏమిచేయకండి బాబు. అసలే ఈయనకి బెట్టు ఎక్కువ.మిగతా స్టొరీ కావాలంటే మీరు కూడా నాతోపాటు పైకి వచ్చి వినాల్సిందే అంటారు. మనకెందుకీ టెన్సన్:):) స్టొరీ మధ్యలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే అసలుకే మోసం వస్తుంది.(వేరే మార్గంలో పని పడదాములేండీ) ఏమంటారు ?

@కిషెన్:గారు చూసారా కవిత గారికి ఐస్ పెట్టి ఎలా కాంప్రమైజ్ చేసానో:)(సో మిగతా స్టొరీ అందరికన్నా ముందు నాకు చెప్పాలి.లేకపోతే....అదన్నమాట) మిమ్మల్ని బోల్డు సపోర్ట్ చేసేసాను కదా

Ram Krish Reddy Kotla said...

కవిత & రంజని : నా పట్ల మీకు ఉన్న అపరిమితమైన (పైకి పంపించేంత... వేరే మార్గాల్లో పని పట్టేంత) అభిమానానికి సంతోషం పట్టలేక.. ఏం చెయ్యాలో తోచక మంచినీళ్ళు అనుకొని కాఫీ ఎత్తి నోట్లోపోసుకుంటే నా మూతి కాలింది.. మీ అభిమానం నన్ను గంగ వేర్రులు తోక్కిస్తుందంటే నమ్మండి... ఇలాగే కంటిన్యూ చెయ్యండి.. ఆయుష్మాన్ భవ :-)

ఆ.సౌమ్య said...

ఓ రెండు వారాలు ఊర్లో లేకపోయేసరికి, 7 భాగాలు రాసేసారని చూసి హమ్మయ్య అన్ని ఒకేసారి చదివేసి టెన్షన్ లేకుండా ఉండొచ్చని తెగ హేపీ అయిపోయి అన్నీ పార్టులు ఒకేసారి చదివేసరికి కథ మళ్ళీ మొదటికొచ్చింది....అదే టెన్షన్, 7 భాగాలు చదివిన తరువాత కూడా సస్పెన్స్ తగ్గలేదు. 7 వ భాగం తరువాత కాస్త కథ ఊహించగలుగుతున్నాను, కానీ మీ టేలంట్ తెలుసుకాబట్టి ఇంకేం ట్విస్ట్ ఇస్తారో అని కాస్త జంకుగానే ఉంది. ఏది ఏమైనా మిగత భాగాలు త్వరత్వరగా రాసేయండి.

Raj said...

HI kishen...

nenu kavalane mi blog ni oka 2 weeks avoid chesa ledante tension tho emoutundo ani bayam tho....
okka sari 4 parts chadiva prasantham ga vundi... 7 th part lo twists lu tension pette visayalu evi lekapovadam tho kasta relief feel ayya...

naku chinna doubt... miru ee story start cheinappude 7th part lo bhargav entry ni drusti lo vunchukunnara or...flow lo kotha twist iddam ani ila kotha character ni enter chesara....

ika pai raboye episodes gurinchi kuda edaina kachitamaina nirnayam vunda or comments chusi mi imagination ki pani cheppi rayabotunnara ......


fan follwing keka...............

Ram Krish Reddy Kotla said...

@ సౌమ్య : ఇక పెద్దగా ట్విస్టులు ఉండవు లెండి...సాఫీ గానే సాగుతుంది ..మరొక రెండు లేక మూడు ఎపిసోడ్స్ లో కథ పూర్తవుతుంది :-)

@ రాజ్ : థాంక్స్...ఇక పోతే కథా గమనాన్ని కామెంట్స్ లో చెప్పారని మార్చే ప్రసక్తే లేదు , నేను ఏదైతే అనుకున్నానో అదే రాస్తున్నాను..రాస్తాను... నేను మొదటి రెండు పార్టులు తరువాతే కథ మొత్తం ఎలా ఉండబోతుందో నిర్ణయించుకున్నాను...అసలు మొదటి పార్ట్ రాసినప్పుడు నేను అనుకున్న కథ ఇది కాదు... అందుకే తర్వాతా టైటిల్ కూడా మార్చాను ...అదనమాట

HarshaBharatiya said...

కిషన్ గారు చాలా బావుంది స్టొరీ ....
నెక్స్ట్ పార్ట్ కోసం టెన్షన్ గా వెయిటింగ్..........
అసలు ఇన్ని రోజులు మీ బ్లాగ్ నేను ఎలా మిస్ అయ్యాను.....................
గ్రేట్ వర్క్ సర్ మీ పోస్టింగ్స్ అన్ని బావున్నాయ్ ............