Search This Blog

Tuesday 25 May, 2010

హృదయం ప్రేమిస్తానంటే...విధి విడదీస్తానంటే !! - 5


ఇంట్లో నుంచి వచ్చేసిన సంహిత దివ్య ఉన్న హాస్టల్ లో జాయిన్ అయింది...కొద్దిరోజుల్లోనే మేమందరం ఉద్యోగాల్లో చేరాము..కొత్త జీవితం చాలా ఆనందంగా..సరదాగా..ఉత్సాహంగా గడిచిపోతుంది..సంహిత సుదీర్లు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు...సింపుల్ గా రిజిష్టర్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకోవడంతో, మరుసటి రోజు రిజిష్టర్ ఆఫీసుకి వెళ్లాలని డిసైడ్ అయ్యాం...మనమొకటి తలిస్తే విధి ఇంకొకటి తలుస్తుంది..

"మామయ్య వాళ్ళు సిరిపురంలో ఉంటారు..నేను వెళ్లి వాళ్ళని తీసుకొని డైరెక్ట్ గా రిజిష్టర్ ఆఫీస్ కి వస్తాను, నువ్వెళ్ళి సంహీని దివ్యని తీసుకొని వచ్చేసెయ్"  అంటూ నన్నువాళ్ళ హాస్టల్ కి పంపించాడు సుధీర్...
నేను సరేనని, దివ్య వాళ్ళ హాస్టల్ కి వెళ్లి వాళ్ళిద్దరిని తీసుకొని రిజిష్టర్ ఆఫీస్ కి వచ్చేసాను...సుధీర్ కోసం చూస్తూ నిలబడ్డాం ముగ్గురం...
తన సెల్ కి కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్...వాళ్ళ మామయ్య నంబర్ నా దెగ్గర లేదు...
 ఎంతసేపు చూసినా తను రాకపోవడంతో "నేను సిరిపురం దాకా వెళ్ళొస్తా...మీరు ఇక్కడే ఉండండి.." అని వెళ్లబోతుంటే, సంహిత కూడా నాతో వస్తానని చెప్పడంతో ఇద్దరం వెళ్ళాం...

సిరిపురం సిగ్నల్స్ దెగ్గరికి చేరుకున్నాం...పెద్ద ట్రాఫిక్ లా ఉంది...వరుసగా వాహనాలు ఆగిపోయి ఉన్నాయి...
"ఆక్సిడెంట్ అంట...పాపం ప్రాణంపోయే ఉంటుంది ..." ప్రక్కన ఎవరో మాట్లాడుకోవడం మాకు వినిపించింది...
"ఏమయింది..." అడిగాను ఆ మాట్లాడిన వ్యక్తిని
"ఎవరో స్టూడెంట్ పాపం...లారీ గుద్దేసింది...లారీ ఓడిదె తప్పు మొత్తం..." చెప్పాడతను...నాకు గుండె వేగం పెరిగింది...ఏవేవో ఆలోచనలు క్షణాల్లో నా చుట్టుముట్టాయి....వళ్ళంతా చెమటలు...
బైక్ వెనుక చూస్తె సంహిత లేదు...ముందుకు చూస్తే అందరినీ దాటుకుంటూ నడుచుకుంటూ సిగ్నల్స్ దెగ్గరికి వెళ్తుంది ఏదో ఒక ట్రాన్స్ లో ఉన్నదానిలా ...నాకు టెన్షన్ మొదలైంది..

నేను బండి అక్కడే పడేసి ఆమె వెనుకాలే పరిగెత్తాను...జనం చుట్టూ మూగి ఉన్నారు..వాళ్ళని దాటుకుంటూ వెళ్లాను సిగ్నల్స్ దెగ్గరికి...సంహిత అక్కడే నిల్చుని ఉంది..ఆమె వదనంలో ఏ భావమూ నాకు కనిపించట్లేదు...నేను ఆమె ప్రక్కకి వెళ్లి చెయ్యి పట్టుకున్నాను...నా వైపు చూసింది చాలా బ్లాంక్ గా...మళ్లీ అటువైపు చూసింది...బాడీ మీద తెల్లని ముసుగు కప్పి ఉంచారు..చుట్టూ రక్తం...

ఇంతలో అంబులెన్స్ రావడంతో, ఆ బాడీ అందులో ఎక్కించడానికి పైకి లేపారు, అప్పుడు..ఆ క్షణం ..అతని ముఖాన్ని కప్పి ఉన్న ఆ ముసుగు తొలగింది...అతని రూపం ఆమె కంట పడింది...ఆమె గుండె ఒక్క క్షణం ఆగింది..ఆమె కాళ్ళ క్రింద భూమి కంపించింది...షాక్ తిన్నదానిలా అలానే చూస్తుంది..నాకు చేతులూ కాళ్ళు ఆడటం లేదు....అసలు ఏం చెయ్యాలో అర్థంకాలేదు నాకు ఒక్క క్షణంలో అంతా సూన్యం... నా జీవితంలో ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని ముందే తెలిస్తే ఇప్పటిదాకా బ్రతికి ఉండే వాడిని కాదేమో..

బాడీని అంబులెన్స్ లో తీసువెళ్తున్నారు..తన ప్రాణం..తన జీవితం..తన సర్వస్వం ఇక ఆమెకి లేదన్న నిజం ఆమె గుండెని తాకడంతో ఒక్కసారిగా...గుండెలు అవిసేలా..ప్రాణం పోయేలా.."సుధీర్..." అంటూ అరిచి అక్కడే కుప్పకూలిపోయింది...

నేను వెంటనే హాస్పిటల్ లో చేర్పించాను సంహితని...ఆమెకి స్పృహ రాలేదు..డాక్టర్లు ఏవేవో టెస్టులు చేస్తున్నారు సంహితకి...సుధీర్ చనిపోయాడన్న విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను..ఇదంతా కల అయితే ఎంత బాగుండు..సుధీర్....ఆ పిచ్చి దాన్ని వదిలేసి నువ్వు హాయిగా వెళ్లిపోయావా...ఇక దాని జీవితం ఏం కాను..నీమీదే దాని ఆశలన్నీ...సర్వస్వం నీకోసం వదిలి వచ్చేసింది ఇక నువ్వు లేకుండా అది బ్రతకగాలదా..దేవుడా ఎందుకు ఇంత శిక్ష విధించావ్ మా జీవితాల్లో..ఏమిటీ గాలిలేని తుఫాను...వెక్కి వెక్కి ఏడ్చాను..నేను సంహిత దెగ్గరే  ఉండటంతో సుధీర్ ఆఖరి చూపుకు కూడా నోచుకోలేదు...

మరుసటి రోజు హెడ్ డాక్టర్ వచ్చి "పేషెంట్ తల్లిదండ్రులతో మాట్లాడాలి నేను.." అని చెప్పగా సంహిత వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పాను...ఎంతైనా కన్నా తండ్రి..ఏదో కోపంలో పోమ్మన్నాడే కానీ మమకారం తెంచుకోలేదు ఆమెపై...అందుకే వచ్చాడు...డాక్టర్ సంహిత వాళ్ళ నాన్నని తన రూంకి తీసుకెళ్ళాడు

"ఆక్సిడెంట్ స్పాట్ లో చనిపోయిన వ్యక్తిని చూసి ఇంత డీప్ షాక్ లోకి వెళ్లిందంటే.....అతను??" ప్రశ్నార్ధకంగా చూసాడు సంహిత తండ్రి వైపు...
"అతను...సంహిత ప్రేమించిన వాడు.."
"మామూలుగా ప్రేమించిన వారు చనిపోయినప్పుడు షాక్ లోకి వెళ్ళడం సహజమే కానీ...ఆక్సిడెంట్ జరిగి రెండు రోజులు కావస్తున్నా ఆమె ఇంకా షాక్ లోనే ఉంది...ఇది సహజమైన పరిస్థితి కాదు..మేము అన్ని రకాల పరీక్షలు చేసి ఆమె మానసిక పరిస్థితిని అంచనావేయగలిగాము..." అంటూ డాక్టర్ చెప్తుండగా కొంచెం ఆందోళనగా చూస్తున్నాడు ఆ తండ్రి ..
"ఆమె మానసకి పరిస్థితి "సైకోజెనిక్ అమ్నీషియా". మామూలుగా తలకి పెద్ద గాయం అవ్వడం ద్వారా అమ్నీషియా అనే మానసిక పరిస్తితి సంభవిస్తుంది, కానీ కొన్ని సైకలాజికల్ కారణాలు, ఉదాహరణకి రేప్, డోమాస్టిక్ వయలెన్స్ , లైంగిక దాడుల వల్ల కూడా అమ్నీషియా వస్తుంది, అలా వచ్చేదే సైకోజెనిక్ అమ్నీషియా. కానీ ప్రియుడి మరణం చూసి డీప్ షాక్ లోకి వెళ్ళిన సంహితకి సైకోజెనిక్ అమ్నీషియా రావడం నాకు ఆశ్చర్యంగా అనిపించినా..నిజం. అతను చనిపోయిన నిజాన్ని ఆమె ఒప్పుకోలేకపోవడమే ఇంకా షాక్ లో ఉండటానికి కారణం..ఆమెలో ఉన్న "మెంటల్ ఫాకల్టీస్" ఈ నిజాన్ని ఆమె మెదడుకి చేరవెయ్యడంలో విఫలం అయ్యాయి, తద్వారా సృష్టించబడ్డ అన్-స్టేబుల్ మెంటల్ కండిషన్ ఈ అమ్నీషియాకి కారణం అయిఉండొచ్చు అని నా విశ్వాసం..." చెప్పడా డాక్టర్ అతని వైపు చూస్తూ..

"అంటే డాక్టర్ ఇప్పుడు సంహిత మమ్మల్ని గుర్తుపట్టలేదా??.." అడిగాడు 
"గుర్తుపడుతుంది...ఇది మామూలుగా వచ్చే అమ్నీషియా అంత ప్రమాదకరమైనది కాదు. సైకోజెనిక్ అమ్నీషియా చాలా వరకు సిట్యువేషన్ స్పెసిఫిక్, అంటే ఆ మానసిక పరిస్థితికి కారణమైన ఇన్సిడెంట్ కి సంబంధించిన వ్యక్తులు, సంఘటనలు ఆమె మనోఫలకం నుండి చెరిపివేయబడతాయి...ఇప్పుడు సంహిత విషయంలో చనిపోయిన తన ప్రియుడికి సంబంధిన వ్యక్తులను, సంఘటనలను పూర్తిగా మర్చిపోతుంది...ఆమె ప్రవర్తనలో ఎటువంటి మార్పు ఉండదు..నిజానికి చెప్పాలంటే ఇదొక వరం..ఆమె మళ్లీ క్రొత్త జీవితం ప్రారంభిస్తుంది..కానీ..." ఒక్క క్షణం ఆగాడు డాక్టర్...

"చెప్పండి డాక్టర్..." అడిగాడు సంహిత తండ్రి ఆత్రుతగా 
"ఆమె ప్రియుడికి సంబంధిన వ్యక్తులని ఈమె ఎప్పటికీ కలవకూడదు...ఎందుకంటే, వాళ్ళని చూడటం వల్ల కానీ లేక వాళ్ళు ఈమెకు అతని జ్ఞాపకాలను జ్ఞప్తికి తెచ్చే ప్రయత్నం చేసినా కానీ ఆమెకు అంతా గుర్తుకువచ్చే ప్రమాదం ఉంది...అతని జ్ఞాపకాలు ఆమె నుంచి పూర్తిగా తుడుచుపెట్టుకొని పోలేదు...అవి రిప్రెస్ అయ్యాయి.. కనుక, ఆమె ప్రియుడు జ్ఞాపకాలు కానీ, అతనికి సంబంధిన వ్యక్తులు కానీ ఈ భూమి మీద ఉన్నట్లు ఈమెకి తెలియకూడదు...ఇది మినహా, ఈమె నడవడికలో కానీ ప్రవర్తనలో కానీ ఎటువంటి తేడా ఉండదు.." చెప్పాడు డాక్టర్.
తన కూతురి పరిస్థితి ముందు కొంచెం బాధ కలిగించినా, ఆమె మళ్లీ ఇకనుంచి తన కూతురిగా తన దెగ్గరే ఉంటుంది అన్న ఆలోచన అతనికి కొంచెం సంతోషం కలిగించింది...

"కార్తీక్...నువ్వు నాకొక సాయం చెయ్యగలవా?" అడిగాడు సంహిత తండ్రి 
"చెప్పండి అంకుల్.." అన్నాను 
"నువ్విక సంహితతో మాట్లాడకూడదు...తనని కలవకూడదు..నాకీ సాయం చెయ్యగలవా?"అంటూ అడిగాడు...అతని మాటలు శాసిస్తున్నట్లుగా లేవు..అర్తిస్తున్నట్లు ఉన్నాయి...
"మీరు ఎందుకు ఇలా అడుగుతున్నారో నాకు అర్థం కావడంలేదు...ఈ సమయంలో నాతోడు తనకి చాలా అవసరం.." అన్నాను 
"ఇప్పుడు నువ్వు తనకి కనిపించకుండా ఉంటేనే...తను మామూలు మనిషిలా ఉండగలదు..."
అర్తంకానట్లు చూసాను అతని వైపు...
డాక్టర్ చెప్పిన విషయం మొత్తం నాకు చెప్పాడు...తన మానసిక పరిస్థితికి బాధపడాలో లేక ఆమె జీవితంలో అనుకోకుండా బ్రద్దలైన అగ్నిపర్వతం ఆమెను నిలువునా దాహించివేయకుండా కొత్త జీవితం ప్రసాదించినందుకు ఆనందపడాలో నాకు అర్థం కాలేదు...మొత్తానికి ఆమె ఇప్పుడు మామూలు సంహిత....సంహిత మైనస్ సుధీర్, చంటి, దివ్యా, గీతం కాంపస్....

****************************************************************

కార్తీక్ చెప్తుండగా నమ్మలేనట్లుగా చూస్తుంది సుధ...
"తను ఇంజనీరింగ్ పూర్తి చేసినా ఆ విషయం ఆమెకి తెలీదు...ఎందుకంటే, ఆమె ఇంజనీరింగ్ మొత్తం మేమే ఉంటాం...ఆ జ్ఞాపకాలన్నీ పూర్తిగా ఆమె మనోఫలకం నుండి చెరిగిపోవడంతో, ఆమె తండ్రి ఆమెని మళ్లీ డిగ్రీలో చేర్పించాడు...తను నీకు అక్కడ క్లాస్ మేట్ అయింది...ఆ తర్వాత నేను కానీ దివ్య కానీ ఎప్పుడూ ఆమె కంట పడలేదు...ఓ రోజు యాదృచ్చికంగా తను నాకు బస్సులో కనిపించింది...చాలా కాలం తరువాత తనని చూసేసరికి నా ఆనందం మాటల్లో చెప్పలేనిది..తరువాత చాలా సార్లు ఆమె అదే స్టాప్ లో బస్సు ఎక్కడం గమనించిన నేను ఆమెకి తెలియకుండా నేను కూడా అదే బస్సు ఎక్కేవాడిని...సంహీని దూరం నుంచే చూసి చాలా సంతోషించే వాడిని...చంటీ అని ఎంతో ముద్దుగా పిలిచే నా సంహిత నాకు లేదు అని తెలిసిన ప్రతిసారి నా కళ్ళు చెమ్మగిల్లుతాయి...కానీ మొన్న సంహిత ప్రవర్తన నాకు మళ్లీ భయాన్ని కలిగించింది...సుధీర్ చనిపోయిన అదే సిరిపురం సిగ్నల్స్ దెగ్గర తను....ఆ విధంగా..." తడబడుతున్నాయి కార్తీక్ మాటలు...
"అంటే ఆ సిగ్నల్స్ ని చూసిన ఆమెకి సుధీర్ చనిపోయిన ఇన్సిడెంట్ గుర్తొచ్చిందంటావా...." అడిగింది సుధ 
"అవును...సుధీర్ చనిపోయినప్పుడు సంహిత ముఖంలో సర్వస్వం కోల్పోయిన బాధ కనిపించింది ..అదే ముఖం ఆమెలో మళ్లీ చూసాను మొన్న..అదే బాధ...అదే ఆక్రోశం...అదే గుండెకోత..'సుధీర్' అని గట్టిగా అరచి పడిపోయింది...ఆమె హృదయాంతరాలల్లో సుధీర్ ఇంకా ఉన్నాడు...మొన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల మళ్లీ ఆమెకి మొత్తం గుర్తుకోస్తుందేమో అని భయపడ్డాను...అలా జరగలేదు...కానీ.." ఆగిపోయాడు అతను...
"కానీ..." రెట్టించిందామె

"తను నన్ను చంటీ అని పిలిచింది..." అన్నాడు కార్తీక్...అతని కళ్ళు చెమ్మగిల్లాయి..
"అవునా...ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు గుర్తుకొస్తుంది...ఓ రోజు తనకి ఒక కల వచ్చినట్లు చెప్పింది సంహిత...ఆ కలలో తను ఒక అబ్బాయి కోసం తన తండ్రినే కాదనుకొని ఇంట్లో నుంచి బయటకి వచ్చేసాను అని చెప్పింది...అతని పేరు ఏమిటని నేను అడిగాను...ఆమె వెంటనే సుధీర్ అంది" అని సుధ చెప్తుండగా నిశ్చేష్టుడై ఆమెనే చూస్తూ ఉన్నాడు కార్తీక్

"అంతే కాదు...ఈ రోజు ఉదయం నేను తనని చూడటానికి వెళ్ళినప్పుడు మన కాలేజీ టాపర్ సుధీర్ చనిపోయాడట కదా అని అడిగింది...నాకేం అర్థం కాలేదు...అసలు మాకు తెలిసీ సుధీర్ అనే అతను ఎవరూ మాకు పరిచయం లేదు...తను అలా ఎందుకు అడిగిందో అర్థం కాలేదు.." అంది సుధ...
"నీకో విషయం చెప్పలేదు ఇందాక...మొదటి రెండు సెమ్స్ లో సంహితే కాలేజీ టాపర్, కనీ థర్డ్ సెంలో మాత్రం సుధీర్ టాప్ చేసాడు... సుధీర్ ని సంహిత ఇష్టపడటానికి అదికూడా ఓ కారణం..తనని బీట్ చేసి టాప్ వచ్చినవాడి మీద కోపం పెంచుకొని, మరింత కసిగా చదువుతుందనుకున్నాను ...కానీ రిజల్స్ అనౌన్స్ చేసినప్పుడు, అతను డయాస్ పైకి వస్తుంటే సంహిత కళ్ళలోకి చూసాను..ఎంత కోపంగా చూస్తుందా అని...కానీ ఆమె కళ్ళు ఆనందంతో వర్షిస్తున్నాయి...ఆ కన్నీరు వెనుక ఆమె కళ్ళలో అతని పై ఉన్న ఆరాధనతో మెరిసిన మెరుపు అతని మీద ఆమె పెంచుకున్న ప్రేమను చూపించింది.." అన్నాడు కార్తీక్ గుర్తుతెచ్చుకుంటూ...

"కానీ మీరు ఎవరూ ఆమెకి సుదీర్ చనిపోయిన తరువాత కనపడలేదు...కానీ సుధీర్ విషయాలు ఆమెకి గుర్తుకు వచ్చాయి...అదెలా??..

"అదే అర్థం కావడం లేదు..." అన్నాడు కార్తీక్ 
"సుధీర్ చనిపోయినప్పుడు సంహితని ట్రీట్ చేసిన డాక్టర్ పేరు?" అడిగింది సుధ
"డాక్టర్ అభిరాం..."
"రేపు మనిద్దరం ఆయన్ని కలుస్తున్నాం...అప్పాయింటుమెంట్ తీసుకో..." 

*******************************************************

"సుధీర్....సుధీర్....లే నాన్నా బారెడు పోద్దేకింది...ఇంకా పడుకున్నావేంటి..కాలేజీ ఉంది మర్చిపోయావా?...అసలే గీతం కాలేజీ టాపర్ వి ఇలా పడుకుంటే ఎలా... " అది ఆమె అతని దుప్పటి లాగుతూ 
"ఒక ఫైవ్ మినిట్స్ అమ్మా ప్లీజ్..." 
"సరే త్వరగాలే....ఇందాకే సంహిత కాల్ చేసింది...నీకోసం కాలేజీలో వెయిట్ చేస్తా అని చెప్పింది .." అందామె అతన్నే గమనిస్తూ...
"నిజమా...." ఉలిక్కి పడి లేచాడు.."మరి ఇప్పటిదాకా చెప్పవేంటమ్మా..." అంటూ పరుగున బాత్రూంలోకి దూరాడు సుధీర్ రెడీ అవ్వడానికి....


[ You have to wait till next part to know what is going on....till then, see u...bye...take good care of yourself - Kishen Reddy ]

20 comments:

sphurita mylavarapu said...

చెప్పిన Date కన్నా ముందు వచ్చేసారు అని సంబరపడుతూ చదవటం మొదలు పెట్టి చివరికి వెళ్ళేసరికి పేద్ద twist, వచ్చేభాగం ఎప్పుడో కూడా చెప్పలేదు...ఇక్కడ కోపం smiley ఎలా పెట్టాలబ్బా...

మధురవాణి said...

Cann't wait for the next part!

వాత్సల్య said...

:) నెక్స్ట్ పార్ట్ ఎప్పుడు? ఒక మాంచి సినిమా చూపించెస్తున్నారు మాకు

Manasa said...

ఈరోజు గురువారమా అనుకున్నా ఈ పోస్టు చూడగానే :) బాగుంది ఇంట్రెస్టింగ్ గా

అనామిక said...

హ్మ్మ్ హమ్మయ్య త్వరగా పోస్ట్ చేసారండి వెయిట్ చేయించకుండా ...కానీ ఇంత ట్విస్ట్ ఇచ్చారెంటండి.. ఒక్క స్టొరీ తో మీ ఫ్యాన్ చేసేసుకున్నారు..నా టెన్షన్ కన్నా ఈ స్టొరీ టెన్షన్ ఎక్కువైంది...

కవిత said...

బాబోయి ...ఎంటండి మీరు మరి నూ....అసలే ఈ ఆఫీసు,ఇంటి tensions అనుకుంటే...ఇప్పుడు కొత్తగా మీ ట్విస్ట్ ల టెన్షన్....చదివెంత సేపు ఒకరకమైన టెన్షన్.....ట్విస్ట్లు ఇస్తూ ఇంకా ఆ టెన్షన్ ని పెంచేస్తున్నారు కదా అండి...నాది స్పురిత ఇచిన కామెంట్ లో లాస్ట్ లినే ఈ.....కోపం n tensed స్మిలీ ఎలా పెట్టాలో ఎవరినా చెప్పి కొంచం పుణ్యం కట్టుకోండి బాబు...కిషన్ చెపుతా అని చెప్పి వెయిట్ చేయించాకే మల్లి నెక్స్ట్ టపా వరకు...
సూపర్ స్టొరీ .....చాలా బాగా రాస్తున్నారు అండి......మద్యలో మెడికల్ టచ్ ఇచ్చారు చుడండి ....awesome

3g said...

ఆహా.... ఇప్పుడు అదిరింది స్టోరీ. నాకైతే అసలు కథ ఇప్పుడే మొదలైందనిపిస్తుంది.

Raaga said...

Well, that was really Brilliant story telling. The way you are presenting the story is really exceptional. Twsits at the end are making us wait for more :)

The explanation of Psychogenic amnesia is brilliant. Well, its one of the forms of Reterograde amnesia, Where ar Anterograde amnesia is much dangerous.

శివరంజని said...

[ You have to wait till next part to know what is going on....till then, see u...bye...take good care of yourself - Kishen Reddy]
-----------------------------------
ఈ ట్విస్ట్ లు ఈ సస్పెన్సెలు తో మా కేర్ మేమే మర్చిపోయాము......నెక్స్ట్ పోస్ట్ ఎప్పుడో చెప్పనే లేదు మరలా ఇదో ట్విస్టా, ఔను చివరిలో ఈ ట్విస్టేమిటండి బాబు.......
నన్ను చిన్నపిల్లని చేసి ఇలా అయోమయంలో పడేస్తారా!
మద్యలో మెడికల్ టచ్(డాక్టర్ సారీ రైటర్ కిషన్ గారు) ఎక్కడికో ఎదిగిపోయారు
అన్నట్టు స్పురిత,కవిత గారు కోపం smiley రాకపోతే ---> లు వేయండి కిషన్ గారి మీద అలాగైన కోపం తీర్చుకుందురుగాని

ప్రణీత స్వాతి said...

మంచి సస్పెన్స్ లో నడిపించేస్తున్నారు కధని. ఇదివరకు ఏమైనా నవలలు రాసిన ఎక్స్పీరియన్స్ వుందాండీ..? త్వరగా రాసేద్దురూ ఆరవ భాగం..

Unknown said...

Kishen Reddy గారూ...,

నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

- హారం ప్రచారకులు.

priya... said...

oi nu chepte ne nen chala feel ipoya...samhita ki vachinanta kastam paga vadiki kuda rakudadu...tanu karthik lanti frnd,sudheer lanti lover unanduku chala lucky bt ela jaragatam chala unlucky...tanu maraninchatam samhitane kaadu nen kuda jeerninchukolekunna..coz u kno it wel...k le adinattu malli sudheer ni bratiskiste bagundu.... hey amnesia gurinchi chala baaga rasav...really chala clear ga anta gurtupettukoni rasav its really great...avnu malli e sudheer twist enti babu...tvaraga blog rai waiting 4 dat k na...

Ram Krish Reddy Kotla said...

@ స్ఫురిత : కోపం స్మైలీ ఇలా పెట్టాలి X-( ... ఇక వచ్చే భాగం ఎందుకు చెప్పలేదంటే, ఇదిగో ఇలానే ముందో..వెనుకే వచ్చేస్తానేమో..ముందే కమిట్ అవ్వడం ఎందుకని చెప్పలేదు :-)....

@ మధురవాణి : రేపే రాస్తాను నెక్స్ట్ పార్ట్

@ రిషి : థాంక్స్..సినిమా నా సీరియలా...హి హి..ఏదో నా పరిధిలో మిమ్మల్ని అలరిద్దమనే నా ప్రయత్నం

Ram Krish Reddy Kotla said...

@ మానస : థాంక్స్...చూసారా నా వల్ల మీరు ఏ వారమో మర్చిపోయారు నేను ముందే రాయడం వల్ల, అందుకే నెక్స్ట్ పార్ట్ ఎప్పుడో చెప్పలేదు...ఆ రోజుకి రాస్తానో లేక ముందే రాస్తానో తెలీక

@ త్రుప్తి : మీ కామెంట్ ఎప్పుడూ నాకు చాలా తృప్తిని ఇస్తూనే ఉంటుంది :)...పర్లేదు నాకొక ఫాన్ ఉన్నారంటే, కొంచెం కాలర్ ఎగరేయ్యోచ్చు...హి హి..(నాకు అంత లేదంటారా...హి హి..:) )

@ కవిత : స్పురిత గారికి చెప్పాను కోపం స్మైలీ ఎలా పెట్టాలో...చూడండి మీరు కూడా..మీ అభిమానానికి థాంక్స్

Ram Krish Reddy Kotla said...

@ త్రీజీ : ధన్యవాదాలు..అవును ఇప్పుడే మొదలైంది...ఈ విషయం మన మధ్యనే ఉంచండి..స్పురిత, సౌమ్య, రంజని, కవిత లాంటి వాళ్ళు విన్నారంటే నన్ను చంపేస్తారు..ఇన్ని ఎపిసోడ్స్ రాసి..తొక్కలో టెన్షన్ పెట్టి, మళ్లీ ఇప్పుడే మొదలైంది అంటావా అని చంపేస్తారు..సో అదన్నమాట

@ రాగా : ధన్యవాదాలు

@ రంజని : ఎక్కడికి ఎదిగిపోయాను అంటారు..అంటే ఏ డైరెక్షన్ లో కొంచెం కాంఫాం చెయ్యండి...మీరు చిన్నపిల్లా..అలా అయితే నేనూ చిన్నపిల్లాడినే..ఒక చిన్నపిల్లాడు ఇంకో చిన్న పిల్లని (?) అయోమయంలో పడేసే సీన్ ఎక్కడికి..ఇంకా చెప్పాలంటే, చిన్నపిల్లే ఇంకో చిన్న పిల్లాదినే మాయ చేసి..మసిబూసి..జేబులో చాక్లెట్లు..బాగ్ లో బలపాలు కొట్టేస్తారు :(...సో ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా .... హుఫ్...అర్థమైందిగా...అదన్నమాట

Ram Krish Reddy Kotla said...

@ ప్రణీత : నవలలా??..మనకంత బొమ్మ లేదండి బాబూ...ఏదో నా పరిధిలో ఇలా బరుకుతున్నా అంతే..నవలలు కూడా పెద్దగా చదవను, తెగ బద్ధకం మనకి..

@ హారం : నేను ఇంతక ముందు ఎప్పుడో హారంలో చేరాను అంది...థాంక్స్

@ ప్రియా : థాంక్స్. సుధీర్ ని మళ్లీ బ్రతికిస్తే కుదరదండీ..ఇదేమన్నా బాలకృష్ణ సినిమా అనుకున్నారా, మైండ్ బ్లాక్ అయ్యే పనులు జరగడానికి :)

Super Sisters said...

హాయ్ కిషెన్ గారు,
నేను మీ బ్లాగ్ చదవడం ఇదే మొదటిసారి .చాలా బాగుందండి .ప్రతి పోస్ట్ చదివినప్పుడు టెన్షన్ నే ఏమవుతుందో అని .అంత బాగానేవుంది కాని నామీద నాకే డౌట్ వస్తుంది .ఆ అమ్నిషియ నాకుకాని వచ్చిందేమో అని .ఎందుకంటే మీ పోస్ట్ తప్ప ఏమిగుర్తు ఉండటంలేదు .నెక్స్ట్ పోస్ట్ ఎప్పుడా అని వెయిట్ చేయడమే సరిపోతుంది .నా చుట్టువున్నవల్లని మరచిపోతున్న మీ పోస్ట్ చదువుతున్న అంతసేపు .నాకు బాగా నచ్చిందండి .

Ram Krish Reddy Kotla said...

అనిత గారు, నా బ్లాగ్ మీకు అంతగా నచ్చినందుకు చాలా థాంక్స్ అండి. మీ కామెంట్ నాకు చాలా సంతోషం కలిగించింది. ఆకాశవీధిలో మిమ్మల్ని ఇంకా అలరిస్తుంది.

శివరంజని said...

ఎక్కడికో ఎదిగిపోవటం అంటే ఇన్నాళ్ళు (కార్తీక్, సంహిత, సుధీర్ క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్ అయ్యి స్టొరీ రాసారు . ఇప్పుడు కొత్తగా డాక్టర్ క్యారెక్టర్ అదన్నమాట).
ప్లాష్ న్యూస్.... ఇప్పుడే మొదలయ్యింది స్టోరీ (...సో ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా చాక్లెట్లు, బలపాలు కొట్టేయడం, మసి,మాయ (దేవుడా చిన్న పిల్ల అన్నదానికి ఇన్ని మాటలా చివరికి తింగరి పిల్లని చేసేసారు ఈ రైటర్) ... అర్థమైంది..అర్థమైంది.. కర్ర విరగదు పాము చావదు ..... ఇదన్నమాట)

Ram Krish Reddy Kotla said...

రంజని...హ హ..మొత్తానికి నా లక్ష్యం నెరవేరినట్లే...[ అయ్యో అలా అనుకునేసారా..అదే మిమ్మల్ని తింగరి పిల్లని చెయ్యడమే నా లక్ష్యం అనుకున్నారా?..హి హి ..కాదు లెండి :-) ]